బాహుబలి 2 స్పెషల్‌ షో రద్దు | bahubali 2 special show canceled | Sakshi
Sakshi News home page

బాహుబలి 2 స్పెషల్‌ షో రద్దు

Apr 27 2017 1:48 PM | Updated on Sep 5 2017 9:50 AM

బాహుబలి 2 స్పెషల్‌ షో రద్దు

బాహుబలి 2 స్పెషల్‌ షో రద్దు

ముంబయిలో బాహుబలి-2 ప్రత్యేక ప్రదర్శనను రద్దు చేశారు. ఈ మేరకు బాహుబలి చిత్రం హిందీ హక్కులు తీసుకున్న ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత, దర్శకుడు కరణ్‌ జోహార్‌ ప్రకటించారు.

ముంబయి: ముంబయిలో బాహుబలి-2 ప్రత్యేక ప్రదర్శనను రద్దు చేశారు. ఈ మేరకు బాహుబలి చిత్రం హిందీ హక్కులు తీసుకున్న ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత, దర్శకుడు కరణ్‌ జోహార్‌ ప్రకటించారు. బాలీవుడ్‌ నటుడు వినోద్‌ ఖన్నా మృతి నేపథ్యంలో ఆయనకు సంతాపంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దీంతో బాలీవుడ్‌ సీని ప్రముఖులకు వేసే ప్రత్యేక ప్రదర్శన కూడా ఆగిపోయింది.

ప్రముఖ బాలీవుడ్ నటుడు 'వినోద్ ఖన్నా' గురువారం ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే. కొంత కాలంగా తీవ్ర అస్వస్థతతో బాధ పడుతున్న ఆయన ముంబైలోని హెచ్ ఎన్ రిలయెన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన బ్లాడర్‌ క్యాన్సర్ కారణంగా మృతి చెందారు. 1968లో సినీ రంగ ప్రవేశం చేసిన వినోద్ ఖన్నా తనదైన నటన..డైలాగ్స్ డెలివరీతో అభిమానులను ఆకట్టుకున్నాడు. విలన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆయన తరువాత హీరోగా మారి 141 చిత్రాల్లో నటించారు. ఆయన చివరి చిత్రం 'దిల్ వాలే'.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement