హైదరాబాద్, సాక్షి: తెలంగాణ ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఫుడ్‌పాయిజన్ ఘటనలను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం అప్రమత్తమైంది. పాఠశాలలు, గురుకులాలు, అంగన్‌వాడీలలో.. ఆహార నాణ్యత పర్యవేక్షణ కోసం ఫుడ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్ శాంతకుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
సంక్షేమ హాస్టల్లో ఫుడ్ సేఫ్టీ పై ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ త్రీమెన్ కమిటీలో ఫుడ్ సేఫ్టీ కమిషనర్, అడిషనల్ డైరెక్టర్, జిల్లాకు సంబంధించిన కలెక్టర్లు ఉండనున్నారు. ఈ కమిటీలు తమ పరిధిల్లోని గురుకులాలు, వెల్ఫేర్ మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ను పరిశీలిస్తారు. అలాగే.. విద్యా సంస్థల స్థాయిలో ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించేందుకు ఫుడ్ సేఫ్టీ పేరిట కమిటీలను ఏర్పాటు చేశారు.
ఈ కమిటీలో హెడ్‌మాస్టర్, స్కూల్ ప్రిన్సిపాల్స్‌తో పాటు మరో ఇద్దరు సిబ్బంది (టీచర్లు) సభ్యులుగా ఉంటారు. వీరు వంటకు ముందు స్టోర్ రూం, కిచెన్ పరిశీలించాల్సి ఉంటుంది. అలాగే. ఎప్పటికప్పుడు వండిన పదార్థాలను ఫొటోలు తీసి ఉన్నతాధికారులకు పంపించాలి. వండిన ఆ పదార్థాలను వాళ్లు రుచి చూశాకే.. పిల్లలకు వడ్డించాలి. ఇకనుంచి.. పాఠశాలల్లో ఫుడ్ ఏర్పాట్లు తదితర అంశాలపై సంబంధిత అధికారులు కచ్చితంగా సూపర్ వైజ్ చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment