
విద్యార్థిని వదిలేసిన మావోయిస్టులు
పాట్నా: మావోయిస్టులు కిడ్నాప్ చేసిన సిమ్లుతల ఆవస్య విద్యాలయం (రెసిడేన్షియల్ పాఠశాల) విద్యార్థిని బీహార్లోని జుమాయి జిల్లాలో గురువారం ఉదయం విడుదల చేశారు. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారులు పాట్నాలో వెల్లడించారు. ఈ భవనం నుంచి వెంటనే పాఠశాలను ఖాళీ చేయాలని మావోయిస్టులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారని చెప్పారు. అలా చేయకుంటే పాఠశాలపై దాడి తప్పదని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
గతనెలలో బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ నిర్వహించిన పరీక్షల్లో ఈ రెసిడేన్షియల్ పాఠశాలకు చెందిన దాదాపు 30 మంది విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. ఈ నేపథ్యంలో పాఠశాలను వెంటనే ఖాళీ చేయాలని మావోయిస్టులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ క్రమంలో బుధవారం రాత్రి సాయుధలైన కొంత మంది మావోయిస్టులు పాఠశాల విద్యార్థిని కిడ్నాప్ చేశారు.