ట్రాక్ పేల్చిన మావోలు: రైళ్ల రాకపోకలకు అంతరాయం | Maoists blast railway track in Bihar | Sakshi
Sakshi News home page

ట్రాక్ పేల్చిన మావోలు: రైళ్ల రాకపోకలకు అంతరాయం

Published Wed, Jul 23 2014 8:40 AM | Last Updated on Tue, Oct 9 2018 2:39 PM

Maoists blast railway track in Bihar

బీహార్: బీహార్లో మావోయిస్టులు మరోసారి చెలరేగిపోయారు. గత అర్థరాత్రి గయా వద్ద రైల్వే ట్రాక్ను పేల్చివేశారు. దాంతో హౌరా - ఢిల్లీ మధ్య రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

రైల్వే ట్రాక్ను పునరుద్దరించేందుకు ఆ శాఖ అధికారులు యుద్దప్రాతిపదిక చర్యలు చేపట్టారు. మావోయిస్టు కీలకనేతలలో ఒకరైన సవ్యసాచి పండాను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులు దాడికి పాల్పడ్డారని పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement