Video: Man Tries To Cross Track From Under Parked Train This Happens - Sakshi
Sakshi News home page

షాకింగ్‌ వీడియో: పట్టాలు దాటుతుండగా ఒక్కసారిగా కదిలిన ట్రైన్‌.. తర్వాత ఏం జరిగిందంటే..

Published Fri, Nov 11 2022 8:40 PM | Last Updated on Fri, Nov 11 2022 9:11 PM

Video: Man Tries To Cross Track From Under Parked Train This Happens - Sakshi

రైలు ప్రమాద ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. రైలు కిందపడి నిత్యం వందలాది మంది ప్రాణాలు విడుస్తున్న వార్తలు చూస్తూనే ఉన్నాం. వీరిలో కొందరు అత్యుత్సాహం ప్రదర్శించి ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి రైలు పట్టాలు దాటే క్రమంలో ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. ఈ షాకింగ్‌ ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. దీనికి చెందిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. వివరాలు.. భాగల్‌పూర్‌ స్టేషన్‌లో పట్టాలపై గూడ్స్‌ రైలు ఆగి ఉంది.

స్టేషన్‌లో ఓ వ్యక్తి ఒక ప్లాట్‌ఫాం నుంచి మరో ఫ్లాట్‌ఫామ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అందుకు ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి ఉన్నప్పటికీ షార్ట్‌కర్ట్‌ కోసం పట్టాలు దాటేందుకు ప్రయత్నించాడు. పట్టాలపై ఉన్న రైలు కిందకు దూరగానే ఉన్నట్టుండి ట్రైన్‌ కదిలింది. దీంతో రైలు కింద చిక్కుకుపోయాడు. భయంతో చప్పుడు చేయకుండా ఆ వ్యక్తి అలాగే పడుకొని ఉండిపోయాడు. ట్రైన్‌ కింద ఉన్న వ్యక్తికి ఏమైందో ఏమోనని చుట్టూ గుమిగూడిన భయంతో వణికిపోయారు. రైలు వెళ్లేంతవరకు కదలవద్దని కేకలు వేస్తూ హెచ్చరించారు.

రైలు పూర్తిగా వెళ్లిన తర్వాత  అదృష్టం బాగుండి క్షేమంగా బయటపడ్డాడు. ఎలాంటి గాయాలు అవ్వకుండా తృటిలో ప్రాణాలతో బయపడ్డాడు. రైలు వెళ్లగానే లేచి తన బ్యాగ్‌ తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ దృశ్యాలను అక్కడే ఉన్న మరికొందరు తమ సెల్‌ఫోన్‌లో రికార్డ్‌ చేశారు. ఈ దృశ్యాలు చూస్తుంటే వెన్నులో వణుకు పుట్టేలా ఉన్నాయి. అయితే ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే నిబంధనలు పాటించని సదరు వ్యక్తిని అరెస్ఠ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement