Woman Crossing Railway Track Seconds Before Train Arrival, Viral - Sakshi
Sakshi News home page

Viral Video: త్రుటిలో తప్పిన ప్రాణాపాయం.. మహిళ వీడియో వైరల్‌

Published Wed, Jul 20 2022 1:45 PM | Last Updated on Wed, Jul 20 2022 3:30 PM

Woman Crossing Railway Track Seconds Before Train Arrival Viral - Sakshi

రైలు పట్టాలు దాటుతున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కళ్లు మూసి తెరిచే లోపు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అలాంటి ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకుంది ఓ మహిళ. ట్రైన్‌ వచ్చేది గమనించక.. తన సామగ్రితో పట్టాలు దాటి మళ్లీ తిరిగి వచ్చేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలోనే ట్రైన్‌ దూసుకొచ్చింది. ప్రస్తుతం ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. 

ఐఏఎస్‌ అధికారి అవనీశ్‌ శరన్ ఈ దృశ్యాలను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు.‘ఈ జీవితం మీది.. నిర్ణయమూ మీదే’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. ఆ వీడియోలో.. స్టేషన్‌కు ముందే నిలిపేసిన ట్రైన్‌ నుంచి కొందరు ప్రయాణికులు దిగి వెళ్లేందుకు ప్రయత్నించారు. వీడియో తీస్తున్న వ్యక్తి పక్క ట్రాక్‌పై మరో ట్రైన్‌ వస్తుందని చెబుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే ఓ కుటుంబ సభ్యుల్లో భయాందోళన నెలకొంది. పట్టాలకు అవతలివైపు తమ లగేజీని పడేసిన ఓ మహిళ మళ్లీ తిరిగి ఈ వైపునకు వచ్చే ప్రయత్నం చేసింది. రెప్పపాటులో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. 

ఇలాంటి సాహసాలకు పాల్పొడొద్దని, అది అంత మంచిది కాదని ప్రజలకు సూచించారు ఐఏఎస్‌ అధికారి. నెటిజన్లు సైతం ఆ మహిళ చేసిన పనికి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలివితక్కువ ప్రయాణికులు అంటూ ఓ వ్యక్తి పేర్కొన్నారు. సొంత జీవితాన్ని ప్రమాదంలో పడేసే ఆత్రుత ఎందుకు? అంటూ మరో వ్యక్తి ప్రశ్నించాడు. మంగళవారం ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన ఆ వీడియో రెండు లక్షలకు పైగా మంది చూశారు. అయితే.. ఇది ఎక్కడ జరిగిందనే విషయం మాత్రం తెలియరాలేదు.

ఇదీ చదవండి: ఆసుపత్రి నిరాకరణ.. రోడ్డుపైనే బిడ్డకు జన్మనిచ్చిన మహిళ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement