పాట్నా: బిహార్ గయా జిల్లాలో ఓ మహిళ సమయస్ఫూర్తితో వ్యవహరించి తన ప్రాణాలు కాపాడుకుంది. టన్‌కుప్ప రైల్వే స్టేషన్‌లో ఆమె పట్టాలు దాటి మరో ప్లాట్‌ఫైంకి వెళ్తుండగా గూడ్స్ రైలు ఒక్కసారిగా కదిలింది. దీంతో ఆమె చాకచక్యంగా పట్టాలపైనే పడుకుంది. రైలు ఆమెపై నుంచి వెళ్లింది. ఈ ఘటనలో మహిళకు స్వల్పగాయాలై క్షేమంగా ప్రాణాలతో బయటపడింది. స్థానికులు వెంటన ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.
ఈ మహిళ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నట్లు సమాచారం. రైల్వే స్టేషన్‌లో ఓ ప్లాట్‌ఫాంపై గూడ్స్ రైలు, మరో ప్లాట్‌ఫాంపై ఆమె వెళ్లాల్సిన ప్యాసెంజర్ రైలు ఉన్నాయి. దీంతో ప్యాసెంజర్ రైలు ఎక్కేందుకు ఆమె పట్టాలు దాటే ప్రయత్నం చేసింది. ఈ సమయంలోనే గూడ్స్ రైలు కదలడంతో ఏం చేయాలో తెలియక పట్టాలపైనే పడుకుంది. ఫలితంగా తన ప్రాణాలు కాపాడుకుంది.
#Watch: Woman Falls Under Moving Train In Bihar#Bihar #railwaytrack #Gaya #Train #RailwayStation #injury #Accident #viral #Trending #news #LatestNews #IndianJourno pic.twitter.com/vxmvkvLKnY
— Indian Journo (@indianjournoapp) February 11, 2023
రైల్వే స్టేషన్లో ప్రయాణికులు పట్టాలపై నుంచి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఫుటోవర్ బ్రిడ్జ్‌లు నిర్మించారు. కానీ కొంతమంది ప్యాసెంజర్లు నిర్లక్ష‍్యంగా వ్యవహరిస్తూ ఒక్కోసారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. పట్టాలపైనుంచే అవతలి వైపు వెళ్తుంటారు. ఈ క్రమంలోనే ప్రమాదాల బారిన పడుతుంటారు.
చదవండి: నటికి రూ.100 కోట్ల పరువునష్టం నోటీసులు పంపిన సుఖేష్
Comments
Please login to add a commentAdd a comment