రైలుకు ప్లాట్‌ఫాంకు మధ్యలో ఇరుక్కున్న మహిళ.. వీడియో వైరల్ | Woman Falls Between Train And Platform Bihar Muzaffarpur | Sakshi
Sakshi News home page

రైలుకు ప్లాట్‌ఫాంకు మధ్యలో ఇరుక్కున్న మహిళ.. వీడియో వైరల్

Published Sun, Oct 23 2022 9:38 PM | Last Updated on Mon, Oct 24 2022 7:33 AM

Woman Falls Between Train And Platform Bihar Muzaffarpur - Sakshi

పాట్నా: కదులుతున్న రైలు నుంచి కిందకు దిగడానికి ప్రయత్నిస్తూ కాలుజారి పడిపోయింది ఓ మహిళ. రైలుకు, ప్లాట్‌ఫాంకు మధ్యల్లో ఇరుక్కుపోయింది. అక్కడున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారి తక్షణమే స్పందించి మహిళ ప్రాణాలు కాపాడాడు. తీవ్ర గాయాలపాలైన ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన బిహార్ ముజఫర్‌పుర్ రైల్వే స్టేషన్‌లో శనివారం జరిగింది. ప్రమాదానికి గురైన మహిళను అంబిషా ఖాతూన్‌గా గుర్తించారు. పోలీసులు చెప్పిన వివరాల ఈ మహిళ ప్లాట్‌ఫైం నంబర్ 3పై రైలు కోసం ఎదురుచూస్తోంది. అయితే అక్కడ వాష్‌రూంలు లేవు. దీంతో అప్పుడే స్టేషన్‌లో ఆగిన రైలులోకి ఎక్కి వాష్‌రూం వినియోగించుకుంది. ఆ తర్వాత  రైలు వెంటనే కదలడంతో త్వరగా కిందకు దిగేందుకు ప్రయత్నిస్తూ బ్యాలెన్స్ కోల్పోయి పడిపోయింది. రైలు కాసేపు ఆగుతుందని ఆమె భావించినప్పటికీ.. త్వరగా కదలడంతో ప్రమాదానికి గురైంది.
చదవండి: ఉచితాలని ప్రజలను అవమానించొద్దు.. మోదీకి కేజ్రీవాల్ కౌంటర్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement