పట్నా: అమ్మాయిలపై వేధింపులు రోజురోజూకి పెరిగిపోతున్నాయి. బిహార్‌లో అయితే ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కైమూర్ జిల్లాకు చెందిన కొంతమంది దుండగులు ఓ అమ్మాయిని లైంగికంగా వేధించారు. ఇంతటితో ఆగకుండా ఆ దారుణాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు.
కైమూర్ జిల్లాలోని భగవాన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మసాహి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకరం.. మసాహి గ్రామానికి చెందిన కొంతమంది యువకులు గత నెల 27న ఒక అమ్మాయిపై లైగింక వేధింపులకు పాల్పడ్డారు. అంతటి ఆగకుండా ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దుండగులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేశామని, త్వరలోనే మిగతా వారిని అరెస్ట్ చేస్తామని భగవాన్పూర్ పోలీసులు తెలిపారు.
కాగా, గత రెండు నెలల్లో ఇలాంటి ఘటనలు బిహార్‌లో అనేకం చోటు చేసుకున్నాయి. ఈ నెల 12న నలందా జిల్లాలో చెందిన కొంత మంది యువకులు, యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు వీడియోలో ఉన్న వారిని అరెస్ట్ చేశారు. గయా జిల్లాలో ఓ యువతిని వేధిస్తూ తీసిన వీడియో వైరల్ కావడంతో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. గయా జిల్లాలోని సోనిదిహ్ గ్రామంలో ఈనెల 13న ఓ వైద్యుడ్ని తుపాకితో బెదిరించి చెట్టుకు కట్టేసి.. అతడి భార్య, కూతురిపై 20 మంది సామూహిక అత్యాచారం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment