Gaya
-
గయతో పాటు ఈ ప్రాంతాల్లోనూ పిండ ప్రదానాలు
న్యూఢిల్లీ: పితృ పక్ష అమావాస్యనాడు పెద్దలకు పిండ ప్రదానం చేయడమనేది హిందువుల్లో ఆచారంగా వస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ 2న పితృపక్ష అమావాస్య. పెద్దలకు పిండ ప్రదానం చేయడం ద్వారా వారి ఆశీర్వాదాలు లభిస్తాయని చెబుతుంటారు. అలాగే పిత్ర దోషం కూడా తొలగిపోతుందని అంటారు. పిండ ప్రదానం చేసేందుకు దేశంలోని గయతో పాటు కొన్ని ప్రాంతాలు శ్రేష్టమైనవని చెబుతారు. అవి ఎక్కడెక్కడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.1. హరిద్వార్హరిద్వార్లోని నారాయణి శిల దగ్గర పూర్వీకులకు పిండ ప్రదానం చేస్తారు. ఇక్కడ పిండ ప్రదానం చేసేవారిపై పూర్వీకుల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందని, వారి జీవితంలో శాంతిసౌఖ్యాలు వెల్లివిరుస్తాయని చెబుతుంటారు.2.బుద్ధగయబీహార్లోని ఫల్గు నది ఒడ్డున ఉన్న బుద్ధగయ అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇక్కడ తమ పూర్వీకులకు పిండ ప్రదానం చేసేందుకు విదేశాల నుండి కూడా తరలివస్తారు. విష్ణుపురాణం, వాయుపురాణాలలో దీనిని మోక్షభూమి అని పేర్కొన్నారు. దీనిని విష్ణు నగరి అని కూడా అంటారు. విష్ణువు స్వయంగా పితృదేవత రూపంలో ఇక్కడ ఉన్నాడని, బ్రహ్మ స్వయంగా తమ పూర్వీకులకు ఇక్కడే పిండప్రదానాన్ని చేశారని చెబుతారు. Foreigners perform Pitru Paksha Tarpan rituals at GayaGaya is Mokshbhumi and it attracts sanatan dharma followers across the world Our rituals Our traditions 🔥🙏🏼 pic.twitter.com/Nru3esLfUo— Viक़as (@VlKAS_PR0NAM0) September 30, 20243. కురుక్షేత్రహర్యానాలోని కురుక్షేత్రలో పితృపక్ష అమావాస్య రోజున పిండ ప్రదానం చేయడం ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. మహాభారతంలోని వివరాల ప్రకారం ధర్మరాజు తన కుటుంబ సభ్యులకు ఇక్కడే పిండప్రదానం చేశాడు.4. కాశీకాశీలో పిండప్రదానం చేయడం శ్రేయస్కరమని పెద్దలు చెబుతుంటారు. కాశీలోని పిశాచ మోచన్ కుండ్ సమీపంలో మూడు మట్టి పాత్రలను ఉంచి, పిండ ప్రదానం చేస్తారు. ఆరోజున నలుపు, ఎరుపు, తెలుపు జెండాలను ఎగురవేస్తారు. ఇక్కడ పిండ ప్రదానం చేస్తే పూర్వీకులకు మోక్షప్రాప్తి కలుగుతుందంటారు. కాశీని మోక్షపురిగా కూడా పిలుస్తారు.ఇది కూడా చదవండి: 31నే దీపావళి.. తేల్చిచెప్పిన కాశీ పండితులు -
బుద్ధుని తపస్సు ఎలా సాగింది? బుద్ధగయలో నేడు ఏం చేస్తారు?
బుద్ధుడు మానవాళికి అమూల్యమైన జ్ఞానాన్ని అందించాడు. ఈ నాటికీ బుద్ధుని బోధనలు ఆచరణీయంగా నిలిచాయి. బుద్ధ పూర్ణిమను ప్రతి ఏటా వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈసారి ఈ పౌర్ణమిని మే 23న జరుపుకోనున్నారు. బుద్ధ పూర్ణిమ రోజున బుద్ధ భగవానుడు జ్ఞానోదయం పొందాడు.బీహార్‌లోని బుద్ధగయలో బుద్ధ పూర్ణిమ రోజున బుద్ధ భగవానుడు జ్ఞానోదయం పొందాడు. జ్ఞానోదయం కోసం బయలుదేరిన బుద్ధుడు గయలోని ధుంగేశ్వరి పర్వతంపై ఉన్న ప్రాగ్బోధి గుహకు చేరుకున్నాడని చరిత్ర చెబుతోంది. ఆ గుహలో కఠిన తపస్సు చేశాడు. ఆరు సంవత్సరాల పాటు సాగిన ఈ తపస్సు సమయంలో, ఆయన ఆహారంతో పాటు నీటిని కూడా స్వీకరించలేదని చెబుతారు. ఫలితంగా బుద్ధుని శరీరం అస్థిపంజరంలా మారింది. నేటికీ అస్థిపంజరం రూపంలో ఉన్న బుద్ధుని విగ్రహం బుద్ధగయలో కనిపిస్తుంది. దుంగేశ్వరిలో మాతా దుర్గేశ్వరి ఆలయం ఉంది. అక్కడే బుద్ధుని విగ్రహం కనిపిస్తుంది.బుద్ధుడు తన ధ్యాన సమయం ముగిశాక కాలినడకన ఇక్కడ నుండి బయలుదేరాడు. 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న బక్రౌర్ గ్రామానికి చేరుకుని, అక్కడి మర్రిచెట్టు కింద తిరిగి ధ్యానం చేయడం ప్రారంభించాడు. అదే సమయంలో అటుగా వచ్చిన సుజాత అనే మహిళ బుద్ధుని అస్థిపంజర రూపాన్ని చూసి, అతనికి ఒక కప్పు ఖీర్ అందించింది. దానిని స్వీకరించిన బుద్ధ భగవానుడు అక్కడ నుండి బుద్ధగయకు బయలుదేరాడని చెబుతారు.బుద్ధగయలోని ఒక బోధి చెట్టు కింద ధ్యానం చేశాక పూర్ణిమ రోజున బుద్ధుడు జ్ఞానోదయం పొందాడని చెబుతారు. బుద్ధగయలో బుద్ధ పూర్ణిమ రోజున బుద్ధునికి ప్రత్యేక పూజలు చేస్తారు. పలువురు బౌద్ధ అనుచరులు ఇక్కడికి తరలివస్తారు. బుద్ధ భగవానుడు ఇక్కడ నుండే ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించాడు. బుద్ధగయలోని మహాబోధి ఆలయం అంతర్జాతీయ వారసత్వ సంపదలో భాగంగా గుర్తింపు పొందింది. బుద్ధ పూర్ణిమ సందర్భంగా మహాబోధి ఆలయాన్ని అందంగా అలంకరించారు. ఆలయంలో ‘బుద్ధం శరణం గచ్ఛామి’ అనే శ్రావ్యమైన కీర్తన ప్రతిధ్వనిస్తోంది. -
చందాలతో నామినేషన్.. ఆటోలో తిరుగుతూ ప్రచారం!
దేశంలో లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల ప్రచారం ముమ్మరమయ్యింది. ఈ ఎన్నికల పోరులో నేతలంతా తమ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. అభివృద్దే తమ నినాదమంటూ ఎన్నికల సభల్లో ప్రజలకు పలు హామీలు గుప్పిస్తున్నారు. అయితే దీనికి భిన్నంగా ‘మిస్టర్ డొనేషన్’గా పేరు తెచ్చుకున్న ఒక అభ్యర్థి విచిత్ర రీతిలో తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నాడు. బీహార్‌లోని గయ లోక్‌సభ నియోజకవర్గం నుంచి అశోక్ కుమార్ పాశ్వాన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. అతని బ్యాంక్ బ్యాలెన్స్ సున్నా. అశోక్ ప్రభుత్వ భూమిలో ఇంటిని కట్టుకున్నాడు. తన ఎన్నికల నామినేషన్‌కు అయ్యే మొత్తాన్ని విరాళాల రూపంలో సేకరించాడు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో అభివృద్ధి నిధులను సేకరిస్తున్నాడు. ఈ నేపధ్యంలో స్థానికులు అతనికి ‘మిస్టర్ డొనేషన్’ అనే పేరు పెట్టారు. స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్ ప్రజల మధ్యకు వెళ్లి, వారికి వందనం చేస్తూ పది రూపాయల చందాతో పాటు తనకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నాడు. అశోక్ కుమార్ పాశ్వాన్ ఎన్నికల గుర్తు ఆటో. దీంతో అతనే స్వయంగా ఆటో నడుపుతూ ఊరూరా తిరుగుతూ ఎన్నికల ప్రచారం సాగిస్తున్నాడు. గతంలో గయ లోక్‌సభ ఎన్నికల్లో గెలిచినవారెవరూ ఈ ప్రాంతానికి ఒక్కసారైనా రాలేదని అశోక్ ఆరోపిస్తున్నాడు. తాను ఎంపీని అయ్యాక నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తానని అన్నాడు. ప్రజల నుంచి సేకరించిన విరాళాలను అభివృద్ధి పనులకు వెచ్చిస్తానని అశోక్ తెలిపాడు. బడా నేతల మాదిరిగా తాను ప్రచారం చేయలేనని, తోటి ఆటో డ్రైవర్లు తన కోసం ప్రచారం చేస్తున్నారని అశోక్ పేర్కొన్నాడు. -
బీహార్: పొలాల్లో కూలిన ఎయిర్‌క్రాఫ్ట్.. ఇద్దరు పైలట్లకు గాయాలు!
బీహార్‌లోని గయ జిల్లాలోని బుద్ధగయలో ఆర్మీ ఎయిర్‌క్రాఫ్ట్ కూలిపోయింది. బాగ్దాహాలోని కంచన్‌పూర్ గ్రామంలో శిక్షణ సమయంలో ఆర్మీ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో ఇద్దరు శిక్షణ పైలట్లకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన ఎయిర్‌క్రాఫ్ట్‌లో లేడీస్ పైలట్, జెంట్స్ ఆర్మీ పైలట్ ఉన్నట్లు సమాచారం. సాంకేతిక లోపం కారణంగా బాగ్దాహా, బోధ్ గయ సమీపంలోని కంచన్‌పూర్ పొలాల్లో ఎయిర్‌క్రాఫ్ట్ కూలిపోయింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఎయిర్‌క్రాఫ్ట్ ఫ్యాన్ అకస్మాత్తుగా ఆగిపోయింది. దీంతో అది మైదాన ప్రాంతంలో పడిపోయింది. శిక్షణలో ఉన్న పైలట్లిద్దరూ సురక్షితంగా ఉన్నారు. సమాచారం అందుకున్న ఆర్మీ సైనికులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఎయిర్‌క్రాఫ్ట్‌ను తమ వెంట తీసుకెళ్లారు. గయలోని ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీలో ఆర్మీ సైనికులకు శిక్షణ అందిస్తుంటారు. శిక్షణ విమానం 200 నుంచి 400 అడుగుల ఎత్తులో ఎగురుతుంది. అంతకుముందు 2022లో కూడా శిక్షణ సమయంలో సాంకేతిక లోపం కారణంగా ఒక ఎయిర్‌క్రాఫ్ట్ పొలంలో కూలిపోయింది. -
Viral Video: పట్టాలు దాటుతుండగా దూసుకొచ్చిన రైలు.. తర్వాత ఏం జరిగిందంటే?
పాట్నా: బిహార్ గయా జిల్లాలో ఓ మహిళ సమయస్ఫూర్తితో వ్యవహరించి తన ప్రాణాలు కాపాడుకుంది. టన్‌కుప్ప రైల్వే స్టేషన్లో ఆమె పట్టాలు దాటి మరో ప్లాట్‌ఫైంకి వెళ్తుండగా గూడ్స్ రైలు ఒక్కసారిగా కదిలింది. దీంతో ఆమె చాకచక్యంగా పట్టాలపైనే పడుకుంది. రైలు ఆమెపై నుంచి వెళ్లింది. ఈ ఘటనలో మహిళకు స్వల్పగాయాలై క్షేమంగా ప్రాణాలతో బయటపడింది. స్థానికులు వెంటన ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఈ మహిళ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నట్లు సమాచారం. రైల్వే స్టేషన్లో ఓ ప్లాట్‌ఫాంపై గూడ్స్ రైలు, మరో ప్లాట్‌ఫాంపై ఆమె వెళ్లాల్సిన ప్యాసెంజర్ రైలు ఉన్నాయి. దీంతో ప్యాసెంజర్ రైలు ఎక్కేందుకు ఆమె పట్టాలు దాటే ప్రయత్నం చేసింది. ఈ సమయంలోనే గూడ్స్ రైలు కదలడంతో ఏం చేయాలో తెలియక పట్టాలపైనే పడుకుంది. ఫలితంగా తన ప్రాణాలు కాపాడుకుంది. #Watch: Woman Falls Under Moving Train In Bihar#Bihar #railwaytrack #Gaya #Train #RailwayStation #injury #Accident #viral #Trending #news #LatestNews #IndianJourno pic.twitter.com/vxmvkvLKnY — Indian Journo (@indianjournoapp) February 11, 2023 రైల్వే స్టేషన్లో ప్రయాణికులు పట్టాలపై నుంచి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఫుటోవర్ బ్రిడ్జ్‌లు నిర్మించారు. కానీ కొంతమంది ప్యాసెంజర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఒక్కోసారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. పట్టాలపైనుంచే అవతలి వైపు వెళ్తుంటారు. ఈ క్రమంలోనే ప్రమాదాల బారిన పడుతుంటారు. చదవండి: నటికి రూ.100 కోట్ల పరువునష్టం నోటీసులు పంపిన సుఖేష్ -
గయ డిప్యూటీ మేయర్‌గా పారిశుద్ధ్య కార్మికురాలు
పట్నా: పారిశుద్ధ్య కార్మికురాలిని డిప్యూటీ మేయర్ పదవికి ఎన్నుకోవడం ద్వారా బిహార్‌లోని గయ మున్సిపాలిటీ ప్రజలు చరిత్ర సృష్టించారు. చింతాదేవి గత 40 ఏళ్లుగా మున్సిపాలిటీలో స్కావెంజర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈమె 16వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. 1996లో కూడా గయ ప్రజలు ముసాహిర్ వర్గానికి చెందిన రాళ్లు కొట్టుకునే భగవతీదేవి అనే సాధారణ మహిళను లోక్‌సభకు పంపారు. -
చరిత్ర సృష్టించిన చింతాదేవి.. డిప్యూటీ మేయర్‌గా..
ఒక సామాన్యురాలు అసామాన్య విజయం సాధిస్తే.. అది చరిత్ర సృష్టించినట్లే కదా!. పారిశుద్ధ్య కార్మికురాలు చింతాదేవి Chinta Devi ఆ జాబితాలోకి చేరిపోయారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో ఘన విజయం సాధించిన ఆమె.. ఇప్పుడు డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు. బీహార్ గయలో తాజాగా ఈ పరిణామం చోటు చేసుకుంది. నలభై ఏళ్ల చరిత్ర ఉన్న గయ మున్సిపాలిటీలో చింతాదేవి విజయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పబ్లిక్ టాయిలెట్లు తక్కువగా ఉండే ఆ ప్రాంతంలో ఒకప్పుడు బహిరంగ మలవిసర్జన అధికంగా ఉండేది. చింతాదేవి అదంతా ఊడ్చి శుభ్రం చేసి, ఎత్తి దూరంగా తీసుకెళ్లి పారబోసే పనిని చేశారు. ఆ తర్వాత రోడ్లు ఊడవడం, డ్రైనేజీలు, మ్యాన్‌హోల్స్‌కు శుభ్రం చేస్తూ వస్తున్నారు. అలాంటి చింతాదేవి ఎన్నికల్లో పోటీ చేసి.. ఘన విజయం సాధించారు. ప్రజలకు నిత్యం చేరువగా ఉండడంతోనే తనకు ఈ విజయం దక్కి ఉంటుందని ఆమె భావిస్తున్నారు. బహుశా ప్రపంచంలో ఇలాంటి విజయం ఎవరూ సాధించి ఉండబోరని, ఇది చారిత్రక ఘట్టమని గయ నూతన మేయర్ గణేష్ పాశ్వాన్ ఆమెను ఆశీర్వదించారు. అంతేకాదు.. మాజీ డిప్యూటీ మేయర్ మోహన్ శ్రీవాస్తవ సైతం ఆమె అభ్యర్థిత్వాన్ని బలపర్చడం గమనార్హం. పారిశుద్ధ్య కార్మికురాలిగానే కాదు.. మిగతా టైంలో ఆమె కూరగాయలు అమ్ముకుని జీవనం కొనసాగిస్తున్నారు. బుద్ధుడి జ్క్షానోదయ ప్రాంతంగా పేరున్న గయలో.. ఇలాంటి గెలుపు కొత్తేం కాదు. 1996 సార్వత్రిక ఎన్నికల్లో రాళ్లు కొట్టి జీవనం కొనసాగించే భగవతి దేవి ఏకంగా పార్లమెంట్‌కు ఎన్నికై చరిత్ర నెలకొల్పారు. అంటరాని కులంగా పేరున్న ముసహార్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కావడం గమనార్హం. జేడీయూ పార్టీ తరపున పోటీ చేసి ఆమె నెగ్గారు. -
బిహార్‌లో నలుగురు విదేశీయులకు కరోనా.. ‘దలైలామా’ ఈవెంట్ వేళ కలకలం
పట్నా: కోవిడ్ మరోమారు విజృంభిస్తూ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. చైనాలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఎఫ్.7 వేగంగా వ్యాప్తి చెందుతూ లక్షల మందికి సోకుతోంది. ఈ క్రమంలో విదేశాల నుంచి వచ్చే వారిపై నిఘా పెంచింది భారత్. ఎయిర్‌పోర్టుల్లోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో బిహార్‌లోని గయా అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం నలుగురు విదేశీయులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. అందులో ముగ్గురు ఇంగ్లాండ్, ఒకరు మయన్మార్‌కు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. కోవిడ్ పాజిటివ్‌గా తేలిన విదేశీయులను ఐసోలేషన్‌కు తరలించారు. వారికి ఎలాంటి లక్షణాలు లేవని గయా సివిల్ సర్జన్ రంజన్ కుమార్ సింగ్ తెలిపారు. ఎయిర్‌పోర్ట్‌లో మొత్తం 33 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా అందులో నలుగురికి పాజిటివ్‌గా తేలింది. డిసెంబర్ 20న వారంతా బ్యాంకాక్ నుంచి గయా ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు. ఇంగ్లాండ్ దేశీయులను బోధ్ గయాలోని హోటల్లో ఐసోలేషన్‌లో ఉంచగా.. మయన్మార్‌కు చెందిన వ్యక్తి ఢిల్లీకి వెళ్లారు. బోధ్ గయాలో డిసెంబర్ 29న బౌద్ధమత గురువు దలైలామా ప్రసంగం కోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి లక్ష మందికిపైగా విదేశీ భక్తులు హాజరవుతారని అంచనా. 50 దేశాలపైగా భక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు రిజిస్టర్ చేసుకున్నారు. ఈ ఈవెంట్‌కు మూడు రోజుల ముందు నలుగురు విదేశీయులకు కరోనా పాజిటివ్‌గా తేలడం కలకలం సృష్టిస్తోంది. ఇదీ చదవండి: కాంగ్రెస్ ఎమ్మెల్యే భవనంలో విద్యార్థి ఆత్మహత్య.. ఏం జరిగింది? -
బీహార్ సీఎం నితీష్‌కు బిగ్ షాక్.. తృటిలో పెను ప్రమాదం తప్పింది!
Bihar CM Nitish Kumar.. బీహార్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బీహార్ సీఎం నితీష్ కుమార్‌కు తృటిలో చేదు అనుభవం తప్పింది. సీఎం కాన్వాయ్‌పై దాడి జరిగిన ఘటన రాష్ట్రంలో హాట్‌టాపిక్ మారింది. ఈ ఘటనలో పోలీసులు 13 మందిని అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. బీహార్‌లో ఇటీవలే మహాఘట్ బంధన్ కూటమితో కొత్త ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. కాగా, సీఎం నితీష్ కుమార్ సోమవారం గయా పట్టణంలో పర్యటించాల్సి ఉంది. ఈ పర్యటనలో భాగంగా నితీష్ కుమార్.. గయాకు హెలీకాప్టర్‌లో వెళ్లగా.. లోకల్‌గా తిరిగేందుకు ఆయన కాన్వాయ్ అక్కడికి బయలుదేరింది. ఈ నేపథ్యంలో పట్నా-గయా హైవేపై సంచలన ఘటన చోటుచేసుకుంది. అక్కడ.. కొందరు వ్యక్తులు నిరసనలు తెలుపుతున్నారు. గౌరీచక్ ప్రాంతానికి చెందిన వ్యక్తి కొద్దిరోజులుగా తప్పిపోవడం ఆ తర్వాత శవమై కనిపించడంతో కలకలం మొదలైంది. ఈ ఘటనలో పోలీసుల వైఖరిని నిరససిస్తూ వారు ఆందోళనలు చేస్తున్నారు. ఇదే సమయంలో సీఎం కాన్వాయ్ అటుగా రావడంతో నిరసనకారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కోపోద్రిక్తులైన యువకులు కార్లపై రాళ్లు విసిరారు. దీంతో కాన్వాయ్‌లోని నాలుగు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. కాగా, వారి దాడి సందర్భంగా సీఎం కారులో లేకపోవడం, ఎవరికీ గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. Bihar | A total of 13 accused have been arrested in connection with stone-pelting at the convoy of Bihar CM Nitish Kumar yesterday: SSP Patna https://t.co/vPUyPwI32X — ANI (@ANI) August 22, 2022 కాన్వాయ్‌పై దాడికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిరసనకారులను చెదరగొట్టి కాన్వాయ్‌ను అక్కడి నుంచి పంపించారు. తాజాగా ఈ ఘటనతో సంబంధం ఉన్న 13 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఇక, సీఎం కాన్వాయ్‌పై దాడి ఘటన బీజేపీ అనుకూలంగా మారింది. ఈ క్రమంలో బీజేపీ నేతలు స్పందిస్తూ.. బీహార్‌లో మళ్లీ అక్రమార్కుల రోజులు వచ్చాయని చెప్పడానికి ఇదే నిదర్శనమని పలువురు పేర్కొన్నారు. #BreakingNews | #Bihar CM #NitishKumar's convoy attacked by an angry mob in Patna, 13 accused arrested. pic.twitter.com/74XgJsDFnT — Mirror Now (@MirrorNow) August 22, 2022 ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌లో కొత్త టెన్షన్ -
ఈ చిలుకను పట్టిస్తే రూ.5 వేలు.. ‘దయచేసి ఇచ్చేయండి ప్లీజ్’
చాలా మందికి పెంపెడు జంతువులు అంటే ప్రాణం. వాటిని ఇంట్లో పెంచుకోవడానికి తెగ ఇష్టపడతారు. వాటికి ఏలోటు రాకుండా మనుషులతో సమానంగా చూసుకుంటారు. ఎక్కువగా కుక్కలు, పిల్లలు, కొంతమంది చిలుకలు కూడా పెంచుకుంటారు. పెంపుడు జంతువులు కూడా తమ యజమానులపై ఎనలేని ప్రేమను చూపుతున్నాయి. తాజాగా ఓ కుటుంబం తాము ప్రేమగా పెంచుకుంటున్న చిలుక కనిపించకపోవడంతో ఊరంతా గోడలపై పోస్టర్లు అతికించారు. అంతేగాక చిలుకను పట్టించిన వారికి క్యాష్ రివార్డ్ కూడా ప్రకటించారు. ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. గయాకు చెందిన శామ్‌దేవ్ గుప్తా, సంగీత గుప్తా పిప్పరపాటి రోడ్డులో నివసిస్తున్నారు. వీరు గత 12 ఏళ్లుగా ‘పోపో’ అనే చిలుకను పెంచుకుంటున్నారు. అ క్రమంలో గత నెల ఏప్రిల్ 5న ఆ చిలుక తమ ఇంటి నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చిలుక ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. చెట్ల దగ్గరికి వెళ్లి, తాము రోజూ మాట్లాడుకునే భాషలో పిలుస్తున్నామని, అయినా అది దొరకడం లేదని వాపోయారు. ఎవ్వరికీ అయినా కనిపిస్తే తమకు అప్పగించాలని కోరుతున్నారు. చిలుకను ఆచూకీ తెలిపిన వారికి రూ.5,100 రివార్డు ప్రకటించారు. ఈ దంపతులు కేవలం పోస్టర్లకు మాత్రమే పరమితం కాలేదు. ఫేస్బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేస్తున్నారు. ఎవరైనా తన పక్షిని తీసుకెళ్తే దయచేసి తమకు అప్పగించాలని కోరారు. వారికి అదనంగా మూడు పక్షలు కొనిస్తానని ఆఫర్ ఇచ్చారు. అది కేవలం పక్షి మాత్రమే కాదని తమ కుటుంబంలో ఓ సభ్యడని తెలిపారు. -
బీహార్‌లో ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ ఆందోళనలు
గయ: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షల్లో అక్రమాలు జరిగాయని నిరసిస్తూ బీహార్ లో ఆందోళనలు మూడవ రోజు కూడా కొనసాగాయి. బుధవారం గయ నగరంలో ఉద్యోగార్థులు రైలుకు నిప్పు పెట్టారు. దాదాపు 200 మంది అభ్యర్థులు రైల్వే స్టేషన్ కు చేరుకొని ఆగి ఉన్న ఓ రైలును తగలబెట్టారు. దీంతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు, గయా జిల్లా పోలీస్ యంత్రాంగం, నిరసనకారులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులపై నిరసనకారులు రాళ్లు రువ్వారు. నిరసనకారులపై పోలీసులు బాష్పవాయువు, జలఫిరంగులు ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కొంతమంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నామని, విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని గయ ఎస్ఎస్పీ ఆదిత్యకుమార్ చెప్పారు. నిరసనకారులు నిప్పటించిన కోచ్ యార్డ్ లో ఖాళీగా నిలిపి ఉందని, అందుకే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తూర్పు మధ్య రైల్వే సీపీఆర్వో రాజేష్ కుమార్ తెలిపారు. బీహార్ లోని గయా, పాట్నా, నలంద, నవాదా, ఆరా, హాజిపూర్ ప్రాంతాల్లో వేలాది మంది నిరసనకారులు రైలు పట్టాలపై రైలు రోకో చేశారని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని తెలిపారు. నిరసనల కారణంగా అధికారులు కొన్ని రైళ్లు రద్దు చేశారు. మరికొన్నింటిని ప్రత్యామ్నాయ మార్గాల్లో నడిపారు. ఆర్‌ఆర్‌బిఎన్‌టిపిసి(నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ) మొదటి దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సిబిటి)లో ఉత్తీర్ణత సాధించిన వారికి మళ్లీ పరీక్షను నిర్వహించాలన్న రైల్వే నిర్ణయాన్ని అభ్యర్థులు వ్యతిరేకిస్తున్నారు. లెవల్ 2 నుండి లెవల్ 6 వరకు 35,000 పోస్ట్‌లకు పైగా ప్రకటనలు చేసిన పరీక్షలకు దాదాపు 1.25 కోట్ల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఎన్టిపిసి, లెవల్ 1 పరీక్షలను నిలిపివేత హింసాత్మక నిరసనల నేపథ్యంలో రైల్వే తన నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలు (ఎన్టిపిసి), లెవల్ 1 పరీక్షలను నిలిపివేసింది. వివిధ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుల (ఆర్ఆర్బి) కింద పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారు, ఫెయిల్ అయిన వారి ఫిర్యాదులను పరిశీలించేందుకు ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత కమిటీ రైల్వే మంత్రిత్వ శాఖకు నివేదిక అందజేయనుంది. అభ్యర్థులు తమ సమస్యలు మరియు సూచనలను సంబంధిత వెబ్సైట్లో కమిటీకి తెలియజేయవచ్చని రైల్వే తెలిపింది. అభ్యంతరాలను తెలపడానికి మూడు వారాల సమయం ఇచ్చింది. ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం కమిటీ మార్చి 4లోపు రైల్వే మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేస్తుంది. నిరసనల సమయంలో విధ్వంసానికి, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడిన వారిని రైల్వేలో ఎన్నటికీ రిక్రూట్ చేయకుండా నిషేధిస్తామని హెచ్చరిస్తూ రైల్వే ఒక సాధారణ నోటీసును జారీ చేసింది. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం వద్దు్ద అభ్యర్థులెవ్వరూ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయవద్దని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారు. రిక్రూట్మెంట్ పరీక్షలో అవకతవకలు జరిగాయన్న అభ్యర్థుల ఫిర్యాదులను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. కేంద్రం ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు. అభ్యర్థులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని, తమ ఫిర్యాదులను అధికారికంగా ఉన్నత కమిటీకి అందించాలని సూచించారు. చట్టవిరుద్ధంగా ప్రవర్తించినవారిపై చర్యలుంటాయని తెలిపారు. అణచివేత ధోరణి సరికాదు అభ్యర్థులపై ప్రభుత్వ అణచివేత ధోరణి సరికాదని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా అభిప్రాయపడ్డారు. చర్చల ద్వారా వారి సమస్యలకు పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరారు. ’సత్యాగ్రహ’ మార్గంలో చాలా శక్తి ఉందని, ఆందోళనలు శాంతియుత మార్గంలో చేయాలని ఉద్యోగార్థులకు ఆమె విజ్ఞప్తి చేశారు. -
అబ్బాయితో దోస్తీ: అమ్మాయికి చిత్రహింసలు
పాట్నా: అబ్బాయితో కనిపించిందని ఓ అమ్మాయిని వెంటపడి వేధించారు కొందరు దుండగులు. తాము స్నేహితులమే అని చెప్పినప్పటికీ వినిపించుకోకుండా బెదిరింపులతో పాటు దాడికి దిగారు. ఈ హేయమైన ఘటన బిహార్‌లోని గయాలో శనివారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం గయాలో స్కూల్ డ్రెస్‌లో ఉన్న ఓ అమ్మాయి తన స్నేహితుడితో కలిసి కబుర్లు చెప్పుకుంటోంది. ఇది చూసిన కొందరు దుండగులు వారిని తప్పుగా ఊహించుకున్నారు. వారిని సమీపించి ఇక్కడేం చేస్తున్నారని నిలదీశారు. దీంతో తత్తరపాటుకు లోనైన ఆ అమ్మాయి తాము స్నేహితులమని చెప్పగా వారు వినిపించుకోలేదు. ఫ్రెండ్స్ అయితే మీకు ఇక్కడేం పని అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూ చిత్రహింసలు పెట్టారు. మీ నిర్వాకాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరింపులకు దిగారు. మమ్మల్ని వదిలేయండి, వెళ్లిపోతాం.. అని దీనంగా ప్రార్థించినప్పటికీ వారు చెవికెక్కించుకోకుండా చివరికి అన్నంత పనే చేశారు. వీడియో తీయొద్దని ఆ బాలిక చేతులెత్తి వేడుకున్నా కనికరించలేదు. కనీసం ముఖం కప్పుకోవడానికి ప్రయత్నిస్తుంటే కూడా ఆమె దగ్గరున్న స్కార్ఫ్‌ను లాగేశారు. స్కార్ఫ్ ఇవ్వమని గింజుకున్నా పట్టించుకోకుండా శిలావిగ్రహాల్లా చూస్తూ నిలబడిపోయారు. ఆమె అక్కడ నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తే వెంటపడి మరీ లాక్కొచ్చారు. ఆమెతో పాటు ఆమె స్నేహితుడి మీద కూడా దాడికి దిగారు. పైగా ఆమె వివరాలు చెప్పమని బెదిరించడంతో ఆ బాలిక భయంభయంగానే తనది ఫతేపూర్ అని చెప్పుకొచ్చింది. ఇక ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారగా గయా ఎస్ఎస్పీ ఆదిత్య కుమార్ త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని తెలిపారు. చదవండి: దాబాకు వెళ్లి.. వెంటనే వచ్చేస్తామని చెప్పి తస్మాత్ జాగ్రత్త: స్కూటీ ఇచ్చాడు, జైలుకెళ్లాడు -
పనికిరాని ఇసుక దిబ్బలు.. 10 వేల చెట్లయ్యాయి!
పట్నా: విత్తనాన్ని పాతితే మొక్కై హామీ ఇస్తుంది. ఆ తరువాత చెట్టుగా ఎదిగి రక్షణ ఇస్తుంది. బిహార్‌లో గయ ప్రాంతంలోని బెలగాంజ్ ఇసుకతిప్పలతో ఉంటుంది. చెట్లేమీ ఉండవు. మొక్క నాటాలనే ఆలోచన పొరపాటున కూడా రాదు. ఆ ఎడారిలాంటి ప్రదేశంలో పదిహేను సంవత్సరాల కాలంలో పదివేల మొక్కలు నాటి రికార్డ్ సృష్టించాడు సత్యేంత్ర మంఝీ. ఎం.ఏ చేసిన ఇతడికి ‘మౌంటెన్ మ్యాన్’గా ప్రసిద్ధుడైన దశ్‌రథ్ మంఝీ ఆదర్శం. ఒకసారి దశరథ్ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ‘ఈ ఎడారిలో చెట్లు నాటవచ్చు కదా’ అన్నాడు. అదే సత్యేంద్రకు వేదవాక్కు అయింది. దశ్‌రథ్ ఒక్కడే 22 సంవత్సరాలు కష్టపడి కొండను తవ్వి, దారి వేసిన మహాకష్టంతో పోల్చితే తాను పడబోయే కష్టం ఎంత అనుకొని రంగంలోకి దిగాడు సత్యేంద్ర. ఆయన శ్రమ వృథా పోలేదు. ఇసుకదిబ్బలు ఇప్పుడు చెట్లయ్యాయి. మనిషి తలుచుకుంటే సాధ్యం కానిది లేదు... అని మరోసారి నిరూపించిన పచ్చటి సత్యం ఇది. చదవండి: ఆ పక్షులు మంటలో దూకి ప్రాణాలు విడుస్తాయి చదవండి: టూర్ ప్యాకేజీ: ఒక్కరికి 35 వేలవుతుంది! -
హాహాహా... ఊహించలేని సంఘటన ఇది!
సాక్షి, న్యూఢిల్లీ: గయా నుంచి న్యూఢిల్లీ వెళుతున్న విమానంలో ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళ పైలట్‌ను చూసి ఆశ్చర్యపోతూ చేసిన వ్యాఖ్యలు ప్యాసింజర్లను కడుబ్బా నవ్వించాయి. గత శనివారం జరిగిన సంఘటనను స్వయంగా సదరు మహిళ పైలట్ హనా ఖాన్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఈ రోజు ఢిల్లీ-గయా-ఢిల్లీ విమానంలో పనిచేశాను. ఈ క్రమంలో పెద్దావిడా గయా నుంచి ఢిల్లీ వెళుతోంది. ఈ సందర్భంగా ఆమె కాక్‌పిట్ చూడాలనుకుంది. ఇక అక్కడ నన్ను చూసి ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. (చదవండి: వైరల్ వీడియో: అసలు నిజం ఇదే..) Did a Delhi-Gaya-Delhi flight today. An elderly lady wanted to look into the cockpit & when she saw me, she exclaimed in an haryanvi accent “Oi yahan to chorri baithi!” Could not stop laughing!#aviationstories — Hana Khan (@girlpilot_) November 15, 2020 వెంటనే హర్యానీ బాషలో ‘‘ఈ అమ్మాయి ఏంటి ఇక్కడ కూర్చుంది’’ అని ఆశ్యర్యపోతూ చేసిన వ్యాఖ్యలు ఫ్లైట్‌లో అందరిని నవ్వించాయి’ అని హనా తనకు ఎదురైన సరదా సన్నివేశాన్ని ట్వీట్లో రాసుకొచ్చారు. ఇక తన ట్వీట్‌కు ఇప్పటి వరకు వేలల్లో లైక్‌లు వందల్లో కామెంట్స్ వచ్చాయి. అంతేగాక హనాపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆ వృద్ద మహిళ తనకు ఎదురైన ఆశ్చర్యకరమైన క్షణాన్ని తప్పకుండా అందరితో పంచుకుంటుంది. అందులో సందేహం లేదు. ఇది నిజం స్పూర్తిదాయకమైనది. హనా నువ్వు ఎంతోమందికి ఆదర్శం. హాహాహా ఇది ఆ వృద్ద మహిళ ఊహించలేని సంఘటన కాబోలు. తన జీవితకాలం దీన్ని మరిచిపోదు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. (చదవండి: భూమ్మీద నూకలుండాలి గానీ..) -
తప్పుపట్టడమే కాంగ్రెస్ నైజం
డెహ్రీ/గయ/భగల్పూర్: దేశ ప్రయోజనాల కోసం తీసుకున్న ఏ నిర్ణయాన్ని అయినా వ్యతిరేకించాలన్నది కాంగ్రెస్ పార్టీ విధానమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ విమర్శించారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా శుక్రవారం మూడు ప్రచార సభల్లో ప్రధాని పాల్గొన్నారు. రోహ్తస్, గయ, భగల్పూర్ సభల్లో పాల్గొని తన ప్రచారాన్ని మోదీ ప్రారంభించారు. ఈ సభల్లో ప్రధానితో పాటు బీజేపీ మిత్రపక్షం జేడీయూ నేత, ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ వేదికను పంచుకున్నారు. దాదాపు 15 ఏళ్ల పాటు ఆర్జేడీ ప్రభుత్వం రాష్ట్రంలో నేరమయ, దోపిడీ పాలన సాగించిందని ప్రధాని ఆరోపించారు. జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాఖ్‌పై నిషేధం, అయోధ్యలో రామాలయ నిర్మాణం, సరిహద్దుల్లో మిలటరీ ఆపరేషన్లు.. ఇలా తమ ప్రభుత్వం తీసుకున్న అన్ని జాతి ప్రయోజన నిర్ణయాలను కాంగ్రెస్ సహా విపక్షాలు వ్యతిరేకించాయని మోదీ పేర్కొన్నారు. ‘ఆర్టికల్ 370 రద్దు కోసం దేశమంతా ఎదురు చూడలేదా? ఇప్పుడు అధికారంలోకి వస్తే మళ్లీ ఆ అధికరణను అమల్లోకి తీసుకు వస్తామని కాంగ్రెస్ చెబుతోంది. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లోకి తన పిల్లలను పంపించిన బిహార్ ప్రజలను ఇది అవమానించడం కాదా? అయినా, ఓట్లు వేయండంటూ మీ దగ్గరకే రావడానికి వారికి ఎంత ధైర్యం?’ అని ప్రధాని మండిపడ్డారు. గల్వాన్ లోయలో చైనా దళాలతో జరిగిన ఘర్షణలను ప్రస్తావిస్తూ.. ‘దేశం కోసం బిహార్ బిడ్డలు ప్రాణాలర్పించారే కానీ.. దేశమాతను తలదించుకునేలా చేయలేదు’ అన్నారు. విపక్షాలు దళారుల తరఫున మాట్లాడుతూ వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్నాయని, రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు సమయంలోనూ అవి దళారులు, మధ్యవర్తుల తరఫుననే మాట్లాడాయని విమర్శించారు. మొదట పాల్గొన్న డెహ్రీ సభలో ఇటీవల మరణించిన ఎల్జేపీ నేత, కేబినెట్ సహచరుడు రామ్‌విలాస్ పాశ్వాన్, మాజీ కేంద్రమంత్రి రఘువంశ్ ప్రసాద్ సింగ్‌లకు నివాళులర్పిస్తూ ప్రధాని ప్రసంగాన్ని ప్రారంభించారు. లాలు నేతృత్వంలో ఆ చీకటి పాలనను బిహార్ ప్రజలు మర్చిపోలేరన్నారు. సైనికులను ప్రధాని అవమానించారు తూర్పు లద్దాఖ్‌లో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించలేదని చెప్పి ప్రధాని మోదీ సైనికులను అవమానించారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. భారత భూభాగంలోకి చైనా సైనికులు వచ్చారన్నది వాస్తమన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హిసువాలో జరిగిన ప్రచార సభలో శుక్రవారం రాహుల్ పాల్గొన్నారు. చైనా సైనికులను ఎప్పుడు వారి భూభాగంలోకి తరిమేస్తారో ప్రధాని చెప్పాలని డిమాండ్ చేశారు. లాక్డౌన్ సమయంలో బిహార్‌కు చెందిన వలస కార్మికులను ఇతర రాష్ట్రాల్లో తరిమేశారని, అయినా ప్రధాని ఏమీ మాట్లాడలేదని రాహుల్ గాంధీ విమర్శించారు. -
క్షణాల్లో కాపాడారు.. లేకపోతే
-
క్షణాల్లో కాపాడారు.. తృటిలో బయటపడ్డాడు
పట్నా : కదులుతున్న రైలును ఎక్కబోయి ప్రమాదవశాత్తు కిందపడిపోయిన ఓ 60 ఏళ్ల వృద్ధుడు తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. రైల్వేశాఖ అందించిన సమాచారం ప్రకారం.. బిహార్‌లోని గయా రైల్వే స్టేషన్లో ఫ్లాట్‌ఫామ్‌పై బండి ఆగి ఉంది. దీంతో ఓ వృద్ధుడు ఫ్లాట్ఫాంపైకి దిగాడు. కొద్ది సమయంలోని ఆ రైలు తిరిగి బయలుదేరింది. అయితే కదులుతున్న సమయంలో ట్రైన్ ఎక్కబోయిన ఆ వృద్ధుడు ఒక్కసారిగా కిందపడిపోయాడు. ఫ్లాట్‌ఫామ్‌కి, రైలుకి మధ్య సందులో ఇరుక్కుపోయాడు. దీంతో అక్కడే ఉన్న రైల్వే సిబ్బంది (ఆర్పీఎఫ్) క్షణాల్లో అతన్ని గమనించి వెంటనే వెనక్కి లాగా కాపాడింది. దీంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. రైల్వేగార్డ్ సహాయంతో ట్రైన్ ఆపి అతన్ని లోపలకి ఎక్కించారు. దీనికి సంబందించిన వీడియోను రైల్వేమంత్రిత్వ శాఖ ట్విటర్లో షేర్ చేసింది. ప్రయాణ సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. ఆర్పీఎఫ్ సిబ్బందికి అభినందనలు తెలిపింది. -
చైనా దగ్గర తుపాకులున్నాయి. కానీ.. : దలైలామా
పాట్నా: క్రిస్మస్ పర్వదినం సందర్భంగా బౌద్ధ గురువు దలైలామా బుధవారం చైనానుద్దేశించి సందేశం ఇచ్చారు. ‘మా వద్ద సత్యం ఉంది. కమ్యూనిస్టు చైనా వద్ద తుపాకులు, ఆయుధాలు ఉన్నాయి. కానీ దీర్ఘకాలంలో ఆయుధ శక్తి మీద సత్యమే గెలుస్తుంది. ప్రపంచంలోనే బౌద్ధులు ఎక్కువగా ఉన్న దేశాల్లో చైనా ఒకటి. అక్కడి బౌద్ధులు ఇప్పుడిప్పుడే నెమ్మదిగా తాము నమ్మే బౌద్ధమే నిజమైనదనే అభిప్రాయానికి వస్తున్నారని వ్యాఖ్యానించారు. దలైలామా ప్రస్తుతం బీహార్‌లోని బుద్ధగయలో ఉన్నారు. జనవరి 6న జరిగే బోధిసత్వునికి సంబంధించిన కార్యక్రమంలో దాదాపు 50వేల మంది బౌద్ధులనుద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. దలైలామాను అనుసరించే చైనా బౌద్ధుల్లో అధిక శాతం మంది చైనా వెలుపలే ఉన్నారు. కాగా, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన దలైలామా 1959లో భారతదేశానికి శరణార్థిగా వచ్చారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కొండ ప్రాంతమైన ధర్మశాలలో ఆయన నివాసముంటున్నారు. కానీ, చైనా మాత్రం దలైలామాను టిబెట్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న వ్యక్తిగా గుర్తిస్తోంది. మరోవైపు తదుపరి దలైలామా ఎవరనే విషయంలో సాంప్రదాయాన్ని కొనసాగించాలని చైనా పట్టుబడుతుండగా, టిబెట్లు మాత్రం చైనా చేస్తోన్న ఒత్తిడిని వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంపై దలైలామా స్పందిస్తూ.. తదుపరి దలైలామా ఎవరనే దానిపై బయట ఇప్పటికే చాలా చర్చ జరిగింది. ఈ విషయంపై అంత తొందర ఎందుకు? ఇప్పుడు నాకు 85 ఏళ్లయినా ఆరోగ్యంగానే ఉన్నాను కదా..అంటూ సమాధానమిచ్చారు. ఇదిలా ఉండగా, ప్రస్తుత దలైలామాను కనుగొనడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది. -
అత్యాచారం.. ఆపై ఆమెకే శిక్ష
గయా : బీహార్‌లోని గయా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అత్యాచార బాధితురాలికే శిక్ష విధించారు గ్రామ పెద్దలు. నిందితులను వదిలిపెట్టి, బాధితురాలికి శిక్షగా గుండు చేయించి ఊరేగించారు. ఈ దారుణ ఘటన ఈ నెల 14 న జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 14వ తేదీ సాయంత్రం కొంతమంది వ్యక్తులు కలిసి ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి వాహనంలో తీసుకువెళ్లారు. స్థానిక పంచాయతీ భవనంపైకి తీసుకెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. స్పృహా కోల్పోయిన బాలికను అక్కడే వదిలేసి పారిపోయారు. మరుసటి రోజు ఓ గ్రామస్తుడు చూసి బాలిక తల్లిదండ్రులు తెలపడంతో వారు వచ్చి ఇంటికి తీసుకువెళ్లారు. మరుసటి రోజు బాలిక తల్లిదండ్రులు గ్రామ పంచాయతీకి ఫిర్యాదు చేశారు. నిందితుల కుటుంబ సభ్యులు, బంధువులు గ్రామంలో పేరు, బలగం ఉన్నవారు కావడంతో బాధితురాలికి న్యాయం చేయాల్సిన పంచాయతీ తిరిగి సదరు మహిళనే దోషిగా తేల్చి శిక్ష విధించింది. బాలికకు గుండు చేయించి ఊరిలో ఊరేగించారు. దీంతో తమకు న్యాయం దక్కలేదని పోలీసులను ఆశ్రయించారు. అక్కడ కూడా ఫలితం లేకుండా పోయింది. దీంతో బాధిత కుటుంబం జిల్లా పోలీసు ఉన్నతాధికారులను కలిసి వేడుకోవడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. గ్రామ సభ నిర్వహించి బాలికకు శిక్షను ఖరారు చేసిన ఐదురుగు పంచాయతీ పెద్దలపై సైతం కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ ఘటనను సుమోటోగా తీసుకున్న బిహార్ మహిళా కమిషన్ చైర్పర్సన్ గయా సీనియర్ ఎస్పీకు లేఖ రాశారు. సెప్టెంబర్ 2వ తేదీన పంచాయతీ సభ్యులను తమ ఎదుట హాజరు పరచాలని ఆదేశించారు. -
బెడ్ కింద మృతదేహం.. తెలియక 5 రోజుల పాటు..
పట్నా : బీహార్‌లో దారుణం జరిగింది. భార్యను చంపి తన యజమాని ఇంట్లో ఉన్న బెడ్ బాక్స్‌లో దాచాడో కసాయి భర్త. బెడ్ కింద మృత దేహం ఉందని తెలియక దాదాపు ఐదు రోజుల పాటు ఆ బెడ్‌పైనే నిద్రించాడు ఆ ఇంటి యజమాని. భరించరాని దుర్వాసన రావడంతో అనుమానం వచ్చి చూడగా అసలు విషయం బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బీహార్‌లోని గయాకి చెందిన దినేష్ కుమార్ అనే టీ వ్యాపారి వద్ద రాజేష్ కుమార్ అనే వ్యక్తి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రాజేష్ తన భార్య బబితతో కలిసి యజమాని ఇంట్లోనే కిరాయికి ఉంటున్నాడు. కాగా ఇటీవల వ్యాపార నిమిత్తమై దినేష్ వేరే పట్టణానికి వెళుతూ ఇంటి తాళాలు రాజేష్‌కు ఇచ్చి వెళ్లాడు. వారం రోజుల తర్వాత తిరిగి వచ్చిన దినేష్‌కు తన బెడ్రూంలో ఏదో దుర్వాస వచ్చింది. ఎలుకలు చనిపోవడం వల్ల ఈ దుర్వాసన వస్తుందని భావించి దినేష్ అదే బెడ్‌పై పడుకున్నాడు. ఇలా రోజు రోజుకి దుర్వాసన పెరుగుతూ వచ్చింది. భరించరాని దుర్వాసన రావడంతో ఐదు రోజుల తర్వాత( శనివారం) దినేష్ తన బెడ్‌ను ఓపెన్ చేసి చూసి షాకయ్యాడు. బెడ్ కింద కుళ్లిపోయిన మహిళా మృతదేహం కనిపించింది. ఆ మృత దేహాన్ని తన డ్రైవర్ రాజేష్ భార్య బబితగా గుర్తించి.. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని మృత దేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. అయితే బబితను తన భర్త రాజేష్‌యే హత్య చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలి తండ్రి కూడా రాజేష్‌యే తన కూతురిని హత్య చేశాడని ఆరోస్తున్నారు. కాగా రాజేష్ పరారిలో ఉన్నాడని, త్వరలోనే అతన్ని పోలీసులు పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. -
బిహార్‌లో దారుణం..
పట్నా : బిహార్‌లో పదహారేళ్ల బాలిక దారుణ హత్యకు గురయ్యింది. దాంతో గయా పట్టణంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. వివరాలు.. గత ఆదివారం గయలో శరీరం నుంచి తలను వేరు చేయడమే కాకుండా ముఖంపై యాసిడ్‌తో కాల్చిన గాయాలు, ఛాతీపైనా తీవ్రమైన గాయాలతో అత్యంత దారుణ స్థితిలో ఓ పదాహారేళ్ల బాలిక మృతదేహం లభ్యమైంది. మరణించిన బాలిక డిసెంబరు 28న కనిపించకుండా పోగా, జనవరి 6న కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం లభ్యమైంది. తమ కూతురుపై అత్యాచారానికి పాల్పడి కిరాతకంగా చంపేశారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ సంఘటన పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. పోలీసుల దర్యాప్తు త్వరగా చేయాలని, దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ గయలో మంగళ, బుధ వారాల్లో క్యాండిల్ లైట్లతో ర్యాలీలు చేశారు. అయితే ఈ కేసు విషయంలో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తల్లిదండ్రులు దీన్ని అత్యాచారం, హత్యగా ఆరోపిస్తుండగా.. పోలీసులు మాత్రం పరువు హత్య కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం లభ్యమై అయిదు రోజులు గడుస్తున్నా పోలీసులు ఇప్పటి వరకు ఎవ్వరినీ అరెస్ట్ చెయ్యకపోవడంపై ప్రజలు పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారు. తమ కూతురు కనిపించట్లేదని ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు సరిగ్గా పట్టించుకోలేదని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే బాలిక కుటుంబ సభ్యుల చెప్పిన విషయాలు వేర్వేరుగా ఉన్నాయంటున్నారు పోలీసులు. పోస్ట్‌మార్టంలో బాలికపై అత్యాచారం జరిగిందా.. లేదా అని తెలుస్తుందని.. ప్రస్తుతం విచారణ చేస్తున్నామని తెలిపారు పోలీసులు. -
లైంగికంగా వేధిస్తూ.. వీడియో తీసి..
పట్నా: అమ్మాయిలపై వేధింపులు రోజురోజూకి పెరిగిపోతున్నాయి. బిహార్‌లో అయితే ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కైమూర్ జిల్లాకు చెందిన కొంతమంది దుండగులు ఓ అమ్మాయిని లైంగికంగా వేధించారు. ఇంతటితో ఆగకుండా ఆ దారుణాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు. కైమూర్ జిల్లాలోని భగవాన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మసాహి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకరం.. మసాహి గ్రామానికి చెందిన కొంతమంది యువకులు గత నెల 27న ఒక అమ్మాయిపై లైగింక వేధింపులకు పాల్పడ్డారు. అంతటి ఆగకుండా ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దుండగులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేశామని, త్వరలోనే మిగతా వారిని అరెస్ట్ చేస్తామని భగవాన్‌పూర్ పోలీసులు తెలిపారు. కాగా, గత రెండు నెలల్లో ఇలాంటి ఘటనలు బిహార్‌లో అనేకం చోటు చేసుకున్నాయి. ఈ నెల 12న నలందా జిల్లాలో చెందిన కొంత మంది యువకులు, యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు వీడియోలో ఉన్న వారిని అరెస్ట్ చేశారు. గయా జిల్లాలో ఓ యువతిని వేధిస్తూ తీసిన వీడియో వైరల్ కావడంతో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. గయా జిల్లాలోని సోనిదిహ్ గ్రామంలో ఈనెల 13న ఓ వైద్యుడ్ని తుపాకితో బెదిరించి చెట్టుకు కట్టేసి.. అతడి భార్య, కూతురిపై 20 మంది సామూహిక అత్యాచారం చేశారు. -
రేప్ ఎలా చేశారో చెప్పు...
మైనర్ బాలికపై జరిగిన అకృత్యాన్ని రాజకీయం చేద్దామనుకున్న నేతలు అడ్డంగా బుక్కైపోయారు. బిహార్‌లో సంచలనం సృష్టించిన గయ తల్లికూతుళ్ల సామూహిక అత్యాచారం కేసులో కొందరు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రేప్ ఎలా జరిగిందో? చెప్పాలంటూ బాధితురాలిని ఇబ్బందులకు గురి చేయటంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పట్నా: గయ జిల్లా సోనిదిహ్ గ్రామం సమీపంలో బుధవార రాత్రి ఓ వైద్యుడ్ని చితకబాది చెట్టుకు కట్టేసి, తుపాకీతో బెదిరించి అతని భార్య(35), కూతుళ్ల(15) 20 మంది గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఆపై రంగంలోకి దిగిన పోలీసులు గ్రామస్తుల సాయంతో మరుసటి రోజు ఉదయం(గురువారం) కల్లా నిందితులందరినీ అరెస్ట్ చేశారు. ఈ ఘటన బిహార్‌తోపాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ కేసులో బాధితురాలైన మైనర్ బాలికను శుక్రవారం వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్లారు. ఆ సమయంలో పోలీసుల వాహనాన్ని అడ్డుకున్న కొందరు ఆమెను బలవంతంగా కిందకి దించి పరామర్శించారు. ‘నీపై రేప్ ఎలా జరిగింది?.. ఎంత మంది అఘాయిత్యానికి పాల్పడ్డారు. మీ అమ్మ ఆ సమయంలో ఏం చేస్తోంది?... అంటూ ఇలా ప్రశ్నలు గుప్పించారు. అంతటితో ఆగకుండా ఆ బాలిక ఇష్టం లేకుండానే సెల్ఫీలు, వీడియోలు తీసుకున్నారు. అడొచ్చిన పోలీస్ సిబ్బందిని నెట్టేసి మరీ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆర్జేడీ నేతలపై కేసులు.. తొలుత ఆ వీడియోలు, ఫోటోలు ఆర్జేడీ నేతల ట్విటర్ అకౌంట్లలో, పార్టీ అధికారిక పేజీల్లో చక్కర్లు కొట్టాయి. ఆపై స్థానిక మీడియా ఛానెళ్లలో కూడా హల్ చల్ చేయటంతో పోలీసులు ఆర్జేడీ నేతలపై కేసు నమోదు చేశారు. ఆర్జేడీ జాతీయ కార్యదర్శి మెహతా, బెలగంజ్ ఎమ్మెల్యే సురేంద్ర ప్రసాద్ యాదవ్, మహిళా విభాగం ప్రెసిడెంట్ అభ్‌లతా, జిల్లా అధ్యక్షుడు ముర్షిద్ అలమ్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు సరస్వతి దేవీ.. తదితరుల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. పోలీసుల విధులకు విఘాతం కలిగించారన్న అభియోగాలను కూడా వారిపై నమోదు చేసినట్లు డీఐజీ ప్రకటించారు. తేజస్వి గుస్సా... అయితే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తమ పార్టీ నేతలపై కేసులు నమోదు చేయించిందని ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ చెబుతున్నారు. ఘటనపై నిజనిర్దారణ కమిటీ నియమించినట్లు, దానికి స్వయంగా తానే నేతృత్వం వహిస్తున్నట్లు తేజస్వి తెలిపారు. ఆరోపణలు రుజువైతే అందరిపై చర్యలుంటాయని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు మెహతా కూడా తమపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. ‘అత్యాచారం జరిగిన 24 గంటల్లోపు బాధితులకు వైద్య పరీక్షలకు పంపాలి. కానీ, ఆలస్యంగా పోలీసులు ఆమెను తీసుకెళ్లటంతో అనుమానం వచ్చి అడ్డుకున్నాం. ఆమెతో మాట్లాడుతున్న సమయంలో మీడియా అక్కడికి వచ్చింది. అందుకే బాధితురాలు మాపై అసహనం ప్రదర్శించింది. అంతేతప్ప మేమేం ఆమెను ఇబ్బంది పెట్టలేదు’ అని మెహతా మీడియాకు తెలిపారు. బాధితురాలి మాట్లలో.. నేను బతిమాలుతున్న నన్ను బలవంతంగా వాహనం నుంచి దించేశారు. నన్ను ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు. చాలా ఇబ్బందిగా అనిపించింది. అరిచేశా... ఆ మృగాళ్లకు ఉరి శిక్ష పడేదాక నా ముఖం ప్రపంచానికి చూపించకూడదనుకున్నా. కానీ, నేతల అత్యుత్సాహం నా ఉనికిని ప్రపంచానికి తెలియజేసింది. -
దారుణం: తల్లీకూతుళ్లపై గ్యాంగ్ రేప్
మానవ మృగాళ్లు మరోసారి రెచ్చిపోయాయి. ఓ వ్యక్తిని చితకబాది.. చెట్టుకు కట్టేసి... అతని కళ్లేదుటే భార్య, కూతుళ్లను అతిదారుణంగా చెరబట్టాయి. బిహార్‌లో సంచలనం సృష్టించిన గ్యాంగ్ రేప్ కేసు వివరాల్లోకి వెళ్తే... పట్న: గురౌరు బజార్లో క్లినిక్ నిర్వహిస్తున్న వైద్యుడు.. బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో క్లినిక్ మూసేసి, భార్య, కూతురితో మోటర్ బైక్‌పై ఇంటికి బయలుదేరారు. ఆ సమయంలో రఫిగంజ్-గయ రోడ్డులో ఓ నిర్మానుష్య ప్రాంతం వద్ద హఠాత్తుగా 20 మంది వారిని చుట్టు మూగారు. మహిళ, ఆమె కూతురిని వేధించటం ప్రారంభించారు. ప్రతిఘటించబోయిన ఆ వైద్యుడ్ని చితకబాది చెట్టుకు కట్టేశారు. తుపాకీతో భయపెట్టి ఆ బాలిక(15), మహిళ(35)పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అటుగా వెళ్తున్న గ్రామస్థుల సాయంతో బాధితులు.. కొంచ్ పోలీస్ స్టేషన్‌కు చేరి ఫిర్యాదు చేశారు. గంటల వ్యవధిలో అరెస్ట్... బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించిన కొంచ్ పోలీసులు కేసు నమోదు చేయటంలో జాప్యం చేశారు. దీంతో మీడియా ద్వారా విషయం తెలుసుకున్న సెంట్రల్ జోన్ ఐజీ నయ్యర్ హసనైన్ ఖాన్ స్వయంగా కేసును పర్యవేక్షించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారిని సస్పెండ్ చేశారు. కేసు నమోదైన గంటల వ్యవధిల్లోనే నిందితులందరినీ అరెస్ట్ చేయగలిగారు. అర్ధరాత్రే 11 మందిని.. మిగిలిన వారిని ఉదయం అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఊరు దాటకుండా నిలువరించటంలో సోనిదిహ్ గ్రామస్థులు సైతం పోలీసులకు సాయపడటం విశేషం. గ్రామ సరిహద్దుల్లో బారికేడ్లు అడ్డుపెట్టి, రాత్రంతా నిందితుల కోసం ఇంటింటికి తిరిగి గాలింపు చేపట్టగా.. చివరకు నిందితులందరినీ అరెస్ట్ చేయగలిగారు. ఇక ఈ కేసు దర్యాప్తులో ఆ బృందం చేసిన మరికొన్ని చర్యలు వెలుగు చూశాయి. స్థానికంగా వెళ్తున్న కొందరు మహిళలను కూడా వేధించారని, ఇద్దరు యువకుల దగ్గర ఫోన్లు, డబ్బు లాక్కున్నట్లు తేలింది. రాజకీయ విమర్శలు... తల్లీకూతుళ్లపై గ్యాంగ్ రేప్ ఘటన బిహార్‌ను కుదిపేసింది. గురువారం ఉదయం ఆర్జేడీ నేత, మాజీ మంత్రి తేజస్వి యాదవ్ బిహార్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ‘బీజేపీతో కలిసిపోయాక సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వం.. శాంతిభద్రతలను పట్టించుకోవటం పూర్తిగా మానేసిందని, మహిళలపై వరుసగా అఘాయిత్యాలు జరుగుతున్న ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని’ తేజస్వి విమర్శించారు. -
లైంగికంగా వేధిస్తూ... వీడియోలు వైరల్
పట్నా: బిహార్‌లో మానవమృగాళ్లు రెచ్చిపోయాయి. పైశాచికంగా ఇద్దరు యువతులపై కొందరు గ్రామస్తులు లైంగిక దాడులకు పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఈ ఘటనలు వీడియో తీసి ఇంటర్నెట్లో పెట్టగా.. అవి కాస్త వైరల్ అయ్యాయి. బిహార్‌లో సంచలనం సృష్టించిన ఈ ఘటనల వివరాల్లోకి వెళ్తే... గయలోని వాజిర్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో ఈ నెల 17, 18 తేదీల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. స్నేహితులతో వెళ్తున్న యువతులను అడ్డుకున్న కొందరు గ్రామస్థులు వారిని అడ్డుకున్నారు. వారితో ఉన్న వ్యక్తులను చితకబాది, ఆపై యువతుల దుస్తులను లాగి వారిని తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారు. కొందరు ఆ ఘటనలను వీడియో తీసి వాట్సాప్ గ్రూప్‌లలో వైరల్ చేశారు. చివరకు వీడియోలు మీడియాకు చేరటం ద్వారా ఈ దారుణాలు వెలుగులోకి వచ్చాయి. దర్యాప్తు చేపట్టాం... కాగా, ఘటనలపై గయ ఏఏస్పీ రాజీవ్ మిశ్రా స్పందించారు. ‘మీడియా ద్వారా ఈ విషయం తెలుసుకున్నాం. ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని సుధీర్, విజయ్ యాదవ్ అనే ఇద్దరిని అరెస్ట్ చేశాం. మిగతా వారి కోసం గాలింపు చేపట్టాం. బాధిత యువతులకు న్యాయం కలిగేలా చూస్తాం. నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదు’ అని ఆయన మీడియాతో చెప్పారు. ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రసారం చెయొద్దంటూ మీడియా ఛానెళ్లకు బాధిత యువతుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. కాగా, కొన్ని రోజుల క్రితం జహానాబాద్‌లో ఓ బాలికను అల్లరిమూక, దుస్తులు చించి లైంగికంగా వేధించిన వీడియో ఒకటి కలకలం రేపిన సంగతి తెలిసిందే. వరుసగా దుశాస్సన పర్వాలు వెలుగులోకి వస్తుండటంతో నితీశ్ సర్కార్‌పై విమర్శలు వినిపిస్తున్నాయి.