ఐదుగురు మైనర్ బాలికల హత్య; బీహార్లో దారుణం | Five minor girls killed in Bihar | Sakshi
Sakshi News home page

ఐదుగురు మైనర్ బాలికల హత్య; బీహార్లో దారుణం

Published Thu, Dec 5 2013 12:25 PM | Last Updated on Thu, Apr 4 2019 5:25 PM

ఐదుగురు మైనర్ బాలికల హత్య; బీహార్లో దారుణం - Sakshi

ఐదుగురు మైనర్ బాలికల హత్య; బీహార్లో దారుణం

బీహార్లో దారుణ సంఘటన జరిగింది. నిద్రమత్తులో ఉన్న ఐదుగురు మైనర్ బాలికల్ని గుర్తుతెలియని వ్యక్తులు కిరాతకంగా హత్య చేశారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

గయా జిల్లాలోని సొనాఫ్ గ్రామంలో మూడు కుటుంబాలకు ఇతరులతో వ్యక్తిగత విభేదాలు నెలకొన్నాయి. శంభు సింగ్ అనే వ్యక్తి వీరిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మూడు కుటుంబాల వారు తమ ఐదుగురు మైనర్ బాలికల్ని ఓ ఇంటిలో ఉంచి గ్రామం విడిచి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన గుర్తుతెలియని కిరాతకులు ఆ ఇంట్లోకి ప్రవేశించి, నిద్రిస్తున్న బాలికల్ని కాల్చిచంపారు. అమ్మాయిల వయసు 8-13 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరింత సమాచారం సేకరించేందుకు పోలీసులు మృతుల తల్లిదండ్రుల రాక కోసం ఎదురు చూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement