బీహార్లో మావోయిస్టులు రెచ్చిపోయారు. గయా జిల్లాలోని 32 వాహనాలకు తగులబెట్టారు. బారాచట్టిలో పోలీసుల ఎన్కౌంటర్కు నిరసనగా మావోయిస్టులు ఈ విధ్వంసకర చర్యకు పాల్పడ్డారు. సోమవారం తెల్లవారుజామున మావోయిస్టులు... వాహనాలను ఆపివేసి, అందులోని డ్రైవర్లను కిందకి దింపి అనంతరం వాటికి నిప్పు పెట్టారు. ఈ సంఘటనలో 31 లారీలు, ఓ ఇన్నోవా వాహనం పూర్తిగా దగ్దం అయింది. గత ఆరు నెలలుగా బీహార్లో మావోయిస్టుల కార్యకలపాలు ఊపందుకున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బీహార్లో రెచ్చిపోయిన మావోయిస్టులు
Published Mon, May 25 2015 9:32 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM
Advertisement
Advertisement