
పట్నా: పారిశుద్ధ్య కార్మికురాలిని డిప్యూటీ మేయర్ పదవికి ఎన్నుకోవడం ద్వారా బిహార్‌లోని గయ మున్సిపాలిటీ ప్రజలు చరిత్ర సృష్టించారు. చింతాదేవి గత 40 ఏళ్లుగా మున్సిపాలిటీలో స్కావెంజర్‌గా పనిచేస్తున్నారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈమె 16వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. 1996లో కూడా గయ ప్రజలు ముసాహిర్ వర్గానికి చెందిన రాళ్లు కొట్టుకునే భగవతీదేవి అనే సాధారణ మహిళను లోక్‌సభకు పంపారు.