Sanitation worker
-
Republic Day 2025: జయమ్మ విజయం
‘మన దేశంలో పేదలు కలలు కనగలరు. వాటిని నిజం చేసుకోగలరు’ అనే మాట ఎన్నో సందర్భాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నోటి నుంచి వినిపించింది. పేదరాలైన జయమ్మ కల కన్నది. ‘నా కష్టాన్ని చూసి నలుగురు మెచ్చుకుంటే చాలు’ నలుగురు ఏం ఖర్మ... సాక్షాత్తూ రాష్ట్రపతిభవన్ ఆమె కష్టాన్ని గుర్తించింది.‘నీ భర్త ఏం పనిచేస్తాడు?’ అనే ప్రశ్నకు... జయమ్మ చెప్పిన జవాబుకు అవతలి వ్యక్తి ముఖం అదోలా మారిపోయేది. మాటల్లో చిన్న చూపు కనిపించేది.నెల్లూరుకు చెందిన జయమ్మ ఔట్సోర్సింగ్ పారిశుధ్య కార్మికురాలు. దీంతోపాటు భర్తతో కలిసి సెప్టిక్ ట్యాంకు క్లీనింగ్ పనులు చేస్తుంది.‘చేయడానికి మీకు ఈ పనే దొరికిందా తల్లీ’ అని వెక్కిరించిన వాళ్లు ఎందరో! అయితే ఏ రోజూ చేస్తున్న పనిపట్ల నిర్లక్ష్యం, విముఖత జయమ్మలో కనిపించలేదు. ఆమె రెక్కల కష్టం వృథా పోలేదు. వృత్తి పట్ల జయమ్మ అంకితభావానికి గుర్తింపుగా దిల్లీలోని రాష్ట్రపతిభవన్‌లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి ఆహ్వానం అందింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇస్తున్న విందులో పాల్గొనబోతోంది జయమ్మ.‘పెద్దోళ్లకు అందరూ చుట్టాలే. పేదోళ్లకు కష్టాలే చుట్టాలు’ అంటుండేది జయమ్మ తల్లి రాజమ్మ.ఆ ఇంటికి కష్టాలు కొత్త కాదు. కష్టపడడం కొత్త కాదు. నెల్లూరు నగరంలోని ఉమ్మారెడ్డిగుంట ప్రాంతానికి చెందిన జయమ్మ తన తల్లిదండ్రులకు సాయంగా రోజువారీ కూలిపనులకు వెళ్తుండేది. ‘ఏ పనీ లేకుండా ఇంట్లో కూర్చోవడం కంటే పనికి పోవడమే నాకు ఇష్టం’ అంటున్న జయమ్మకు ‘శ్రమ’ అనేది చిన్నప్పటి నేస్తం.జయమ్మకు రమేష్‌తో వివాహం జరిగింది. రమేష్ మొదట్లో సెప్టిక్‌ట్యాంక్ వాహనానికి డ్రైవర్‌గా వెళ్తుండేవాడు. పదేళ్లపాటు డ్రైవర్‌గా పనిచేసిన అనుభవంతో తానే సొంతంగా ఓ సెప్టిక్ ట్యాంకర్ సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేసి క్లీనింగ్ పనులు చేసుకుంటూ కుటుంబ పోషణ చేసేవాడు. ఇద్దరు పిల్లలు స్కూల్‌కి వెళ్లే వయస్సు వచ్చేవరకు గృహిణిగా ఉన్న జయమ్మ ఆ తరువాత భర్త చేసే సెప్టిక్ ట్యాంకు క్లీనింగ్ పనులకు తాను కూడా తోడుగా వెళ్తుండేది.చిన్నచూపు చూసినా..భూగర్భ డ్రైనేజీ పారిశుధ్య పనులకు వెళ్లే జయమ్మను తోటివారే చిన్నచూపు చూసేవారు. అవేమీ పట్టించుకోకుండా భర్తకు చేదోడువాదోడుగా ఉండేది. క్లీనింగ్ సమయాల్లో చర్మవ్యాధుల బారిన పడేది. ఈ దంపతుల కష్టాన్ని చూసిన ‘నవజీవన్ ’ అనే స్వచ్ఛంద సంస్థ నాలుగేళ్ల క్రితం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ షూరిటీతోపాటు ఎన్ ఎస్కేఎఫ్డీ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకు రుణం మంజూరు చేయించింది. రూ.10 లక్షల సబ్సిడీతో రూ.32 లక్షలు విలువైన కొత్త సెప్టిక్ ట్యాంకర్ క్లీనింగ్ వాహనాన్ని మంజూరు చేయించడంతో వారికి సొంతవాహనం సమకూరింది. దీంతో దంపతులిద్దరూ సొంత వాహనంతో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కార్పొరేషన్ అధికారుల సహకారంతో నగరంలోని ఎన్నో నివాసాల్లో సెప్టిక్‌ట్యాంక్ క్లీనింగ్ పనులు చేస్తున్నారు.అన్ని అంశాల్లో మంచి మార్కులుకేంద్ర ప్రభుత్వ ఎన్ ఎస్కేఎఫ్డీసీ (నేషనల్ సఫాయి కర్మచారీస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పోరేషన్) పథకం లబ్ధిదారు అయిన జయమ్మ సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనానికి యజమాని అయింది. పథకాన్ని ఏ మేరకు సద్వినియోగం చేసుకున్నారు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా, సకాలంలో ఈఎంఐ కడుతున్నారా, లోడ్‌ను ఎక్కడంటే అక్కడ డంప్ చేస్తున్నారా లేక ప్రభుత్వం చూపిన పాయింట్లోనే డంప్ చేస్తున్నారా... ఇలాంటి అంశాలతో పాటు తగినవిధంగా జీవనోపాధి పొందుతున్నారా.. పోలీస్ స్టేషన్లో ఏమైనా కేసులు నమోదయ్యాయా... ఇలా ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు ఎన్ఎస్కేఎఫ్డీసీ అధికారులు. అన్నింట్లో మంచి మార్కులు రావడంతో జయమ్మ కృషికి గుర్తింపు లభించింది. రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనడానికి రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం వచ్చింది.ఆ నమ్మకంతోనే...‘నమ్మిన పని ఎప్పుడూ మోసం చేయదు అనే మాట ఎన్నోసార్లు విన్నాను. ఆ నమ్మకంతోనే ఎంతమంది వెక్కిరించినా పట్టించుకోలేదు. మా ఆర్థిక స్థాయికి సెఫ్టిక్ ట్యాంకర్ క్లీనింగ్ బండికి సొంతదారులమవుతామని అనుకోలేదు. కష్టపడితే ఆ కష్టమే మనల్ని ముందుకు తీసుకువెళుతుంది’ అంటూ ఆత్మవిశ్వాసం నిండిన గొంతుతో అంటుంది జయమ్మ.జీవితంలో మర్చిపోలేని రోజుమేము చేసే వృత్తి తప్పుడు పనేం కాదు. మా రెక్కల కష్టాన్నే నమ్ముకుని పనిచేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. అందులోనే మాకు సంతృప్తి ఉంది. ఎవరేమి అనుకున్నా మేము ఎప్పుడూ బాధపడలేదు. నా భర్తకు తోడుగా సాయంగా వెళ్లి క్లీనింగ్ పనులు చేస్తున్నా. గణతంత్ర వేడుకల్లో పాల్గొనాలని రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఆహ్వాన పత్రిక రావడం జీవితంలో మర్చిపోలేని సంఘటన. ఎంతో సంతోషంగా ఉంది.– జయమ్మ– చిలక మస్తాన్‌రెడ్డి సాక్షి ప్రతినిధి, నెల్లూరు -
పారిశుద్ధ్య కార్మికుడి కుమార్తె.. కమిషనర్
సాక్షి, చెన్నై: తిరువారూర్ జిల్లాకు చెందిన ఓ పారిశుద్ధ్య కార్మికుడి కుమార్తె అదే జిల్లాలోని ఓ మునిసిపాలిటీకి కమిషనర్ అయ్యారు. తన తాత, తండ్రి పారిశుద్ధ్య కార్మికులుగా జీవనం సాగించగా, చిన్నతనం నుంచి కష్టపడి చదివి గ్రూప్–2 ఉత్తీర్ణతతో తిరుత్తురైపూండి మునిసిపాలిటీ కమిషనర్‌గా దుర్గ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. వివరాలు.. తిరువారూర్ జిల్లా మన్నార్ కుడి పుదుపాలం గ్రామం సత్యమూర్తి నగర్ చెందిన శేఖర్, సెల్వి దంపతులకు దుర్గ ఏకైక కుమార్తె. శేఖర్ మన్నార్ కుడి కార్పొరేషన్లో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేసేవారు. తండ్రి పడే కష్టాన్ని చిన్నతనంలోనే ప్రత్యక్షంగా చూసిన దుర్గా ఏదో ఒక రోజు తాను ఉన్నత స్థితిలో నిలబడాలని ఆకాంక్షించింది. మన్నార్‌కుడి ప్రభుత్వ ఎయిడెడ్ బాలికల మహోన్నత పాఠశాలలో ప్లస్–2 వరకు చదవింది. ఆ తర్వాత అతి కష్టంతో మన్నార్ కుడి రాజగోపాల స్వామి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఫిజిక్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది. తండ్రి ఎంతో కష్ట పడి తనను చదివించినా, చివరకు 2015లో మదురాంతకంకు చెందిన నిర్మల్ కుమార్‌తో అనూహ్యంగా వివాహం చేసేయడం ఆమెను కలవరంలో పడేసింది. అయితే, తండ్రి స్థానంలో భర్త నిర్మల్ ఆమెకు సహకారం అందించాడు. 2019 నుంచి పట్టువదలని విక్రమార్కుడి తరహాలో టీఎన్పీఎస్సీ పరీక్షలు దుర్గ రాస్తూ వచ్చింది. 2023 గ్రూప్ –2 లో మెరిట్ సాధించింది. ఈ ఏడాది జరిగిన ఇంటర్వ్యూలలోనూ 30కు 30 మార్కులు సాధించారు. తొలుత పోలీసు విభాగంలో లోని స్పెషల్ బ్రాంచ్ సీఐడీలో పనిచేసే అవకాశం వచ్చినా, తన తండ్రి కారి్మకుడిగా పనిచేసిన మునిసిపాలిటీకి కమిషనర్ కావాలని తాపత్రయం పడింది. పరిస్థితులు అనుకూలించడంతో తిరువారూర్ జిల్లా పరిధిలోని మన్నార్‌కుడి మునిసిపాలిటికీ పొరుగున ఉన్న తిరుత్తురైపూండికి కమిషనర్ అయ్యే అవకాశం దక్కింది. సోమవారం సీఎం స్టాలిన్ నుంచి ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందుకున్న దుర్గా మంగళవారం కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. తన తండ్రి పేరును కాపాడటమే కాకుండా, పారిశుద్ధ్య కార్మికులకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా ముందుకెళ్తానని దుర్గా పేర్కొన్నారు. అయితే, తన కుమార్తె కమిషనర్‌గా మునిసిపాలిటీలోకి అడుగు పెట్టినా, కనులారా చూసే భాగ్యం తండ్రి శేఖర్‌కు దక్కలేదు. గత ఏడాది అనారోగ్యంతో ఆయన మరణించడం గమనార్హం. -
కిషన్ లీలలెన్నో..!
కుత్బుల్లాపూర్: పారిశుద్ధ్య విభాగం మహిళా కార్మికుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ అడ్డంగా దొరికిన శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ కిషన్ వ్యవహార శైలి ఆది నుంచీ వివాదాస్పదంగానే ఉంది. గతంలో ఆర్టీసీలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా కండక్టర్ విధులు నిర్వర్తిస్తూ డబ్బులు కాజేయడంతో సర్వీసు నుంచి ఇతడిని తొలగించినట్లు తెలిసింది. రాజు కాలనీలో నివాసముండే కిషన్ కూకట్పల్లి ఫీల్డ్ అసిస్టెంట్‌గా పని చేస్తూ అక్కడి నుంచి అయిదేళ్ల క్రితం గాజులరామారం సర్కిల్‌కు బదిలీపై వచ్చి సూరారం కాలనీలో ఉంటున్నాడు. కాగా.. మహిళా కారి్మకులతో కిషన్ రాసలీలలు బయటపడడంతో జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ అతడిని సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కిషన్‌తో పాటు రాసలీలల వీడియోను వైరల్ చేసిన పారిశుద్ధ్య కార్మికుడు ప్రణయ్‌ని సైతం సస్పెండ్ చేయాలని కూకట్పల్లి జడ్సీ అభిలాష అభినవ్‌కు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. మూడు నెలల కిందటే వెలుగులోకి వచ్చినా.. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు వాటిని సెల్ఫోన్లో బంధించి మహిళలను లోబరుచుకునేవాడు. తనకు అనుకూలంగా ఉండే మహిళలతో ఒకలా.. లేనివారితో మరోలా వ్యవహరిస్తూ వచ్చేవాడని.. మొత్తం మూడు యూనిట్ల బాధ్యతలు నిర్వహిస్తూ 21 మంది పారిశుద్ధ్య కారి్మకుల హాజరు వేసే విషయంలో సైతం చేతివాటం ప్రదర్శించేవాడని ఆరోపణలున్నాయి. ఆయా అంశాలు మూడు నెలల క్రితమే షాపూర్‌నగర్ యూనిట్లో వెలుగులోకి వచి్చనా అధికారులు మాత్రం చర్యలు తీసుకోకుండా సూరారం ప్రాంతానికి బదిలీ చేసి చేతులు దులుపుకోవడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఎదుట వివరణ.. 👉 గ్రేటర్ పరిధిలో మహిళలపై జరుగుతున్న దాడులను దృష్టిలో పెట్టుకుని ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ (ఐసీసీ) గతంలో ఏర్పాటు అయ్యింది. గురువారం వెలుగు చూసిన శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ కిషన్ వ్యవహార శైలిపై ఐసీసీ కమిటీ ముందు అదే రోజు రాత్రి 11 గంటల వరకు విచారణ చేశారు. ఉప కమిషనర్ మల్లారెడ్డి, వైద్య ఆరోగ్య అధికారి చంద్రశేఖర్ రెడ్డితో పాటు కిషన్ సైతం హాజరయ్యారు. గతంలో బయోమెట్రిక్ మిషన్ ఎక్కడో పోగా.. పారిశుద్ధ్య కారి్మకులు పోగొట్టారని వారి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు కమిటీ ముందు స్పష్టం చేశారు. 👉 తన రాసలీలల వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులకు విషయం చెప్పిన కిషన్.. అది వైరల్ చేసే క్రమంలో మొత్తం 14 మందికి డబ్బులు ఇచ్చినట్లు తేలింది. వీడియో పలు గ్రూపుల వారీగా చక్కర్లు కొట్టడంతో వాటిని ఇతరులకు పంపకుండా 14 మందికి రూ. వేయి మొదలుకొని రూ.10 వేల వరకు ముట్ట చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మరికొంత మంది బెదిరింపులు చేయడంతో కిషన్.. ఈ నెల 17న ఉప కమిషనర్ మల్లారెడ్డి, వైద్య ఆరోగ్య అధికారి చంద్రశేఖర్‌రెడ్డికి విషయాన్ని చెప్పుకోవడంతో అతడిని విధుల నుంచి తప్పించారు. వీడియోల లీక్‌పై ఆరా.. గురువారం పలు సామాజిక మాధ్యమాల్లో కిషన్ వీడియోలు చక్కర్లు కొట్టడంతో అధికారులు అవాక్కయ్యారు. ఇవి ఎలా లీక్ అయ్యాయి అనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఫార్వర్డ్ చేస్తున్న వారిపై సైతం కేసులు నమోదు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిసింది. కాళ్లు మొక్కి.. కవర్ చేసి.. శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ కిషన్ తాను తీసుకున్న గోతిలో తానే పడడంతో.. వీడియో వైరల్ చేసిన ప్రతి ఒక్కరి కాళ్లు మొక్కుతూ కవర్ చేస్తూ వచ్చాడు.. కొంతమంది బెదిరించి డబ్బులు వసూలు చేయగా.. మరి కొంతమంది వదిలేశారు.. ఇలా మూడు నెలల పాటు ముప్పతిప్పలు పెట్టిన పలువురు కార్మికులు, తోటి శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు ఎట్టకేలకు వీడియోను బయటకు పంపడంతో విషయం వెలుగులోకి వచి్చంది. శుభకార్యానికి వెళ్లి సాయి అనే కారి్మకునికి ఫోన్ ఇవ్వడం.. ప్రణయ్ అనే మరో కార్మికుడు ఈ వీడియోలను పలువురికి వైరల్ చేయడం.. ఆ తర్వాత మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కిషన్ కామలీలలు బయటపడడంతో ఆయనపై ఉన్నతాధికారులు వేటు వేయడం చకచకా జరిగిపోయాయి. -
జీహెచ్ఎంసీలో కామ పిశాచి.. కమిషనర్ రియాక్షన్
హైదరాబాద్, సాక్షి: జీహెచ్ఎంసీ సర్కిల్ ఎసిఎఫ్ఏ (శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్) కిషన్ కీచక పర్వం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన కింద పనిచేసే కార్మికురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ.. అదంతా వీడియోలు, పోటోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డా కీచకుడు. అయితే ఈ వ్యవహారం మీడియాకు ఎక్కడంతో జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రస్ స్పందించారు. కిషన్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.వివరాల్లోకెళ్తే..కుత్బుల్లాపూర్ పరిధిలోని గాజులరామారం 25 సర్కిల్ పరిధిలో మున్సిపల్ శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ ఎస్ఏఫ్ఏగా విధులు నిర్వహిస్తున్న కిషన్ అనే ఉద్యోగి అదే సర్కిల్లో పని చేసే ఓ పారిశుద్ధ్య కార్మికుకురాలిపై కన్నేసాడు. అధికార దర్పంతో ఆమెపై అఘాయిత్యానికి పాల్పడే దుస్సాహసానికి వడిగట్టాడు. తాను చెప్పినట్లు వినాలని హుకూం జారీ చేశాడు. ఆఖరికి అతడి మాట వినకపోతే.. విధి నిర్వహణలో ఇబ్బందులు పెట్టడం వంటి దురాగతాలకు పాల్పడేవాడు. దీంతో బాధితురాలు కీచక కిషన్ వేధింపులకు తట్టుకోలేక ఎవరికీ చెప్పలేక నరక యాతన అనుభవించింది. పైగా వాటన్నింటిని ఫోన్లో రికార్డ్ చేసేవాడుఏం జరిగిందో కానీ.. కిషన్ వీడియోలు బయటకు రావడం సహ ఉద్యోగుల వరకు చేరిపోవడం జరిగింది. దీంతో వారంతా సదరు ఉద్యోగిని గట్టిగా ప్రశ్నించటంతో.. ఎవరికి చెప్పవద్దంటూ..రూ. 10 వేల చొప్పున దాదాపు 14 మందికి డబ్బులు ఇచ్చి కవర్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. అతడిపై చర్యలు తీసుకోవాలని సహోద్యోగులు, కార్మికులు డిమాండ్ చేశారు. దీంతో జీహెచ్ఎంసీ కమిషనర్ చర్యలు తీసుకున్నారు. -
పవార్ రాజీనామా.. సుప్రియా సూలే ఆసక్తికరమైన వీడియో
సాక్షి, ముంబై: రాజకీయ కురువృద్ధుడు, విపక్షాల ముఖ్యనేత శరద్ పవార్ తన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. శరద్ పవార్ చేసిన షాకింగ్ ప్రకటనపై పలు పార్టీ కార్యకర్తలు, నాయకులు వ్యతిరేకించడమే గాక ఆయనను కొనసాగించమని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇకపై ఎన్నికల్లో పోటీ చేయనని కూడా చెప్పారు. ఆయన ఇలా ప్రకటించగానే ఎన్సీపీ క్యాడర్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. రాజీనామా చేయొద్దంటూ కార్యకర్తలు, రాజకీయ నాయకులు నిరసనలు చేశారు. కానీ ఆయన రాజీనామా చేసేందుకే మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఆయన కూతురు సుప్రియా సూలేకు ఒక వ్యక్తి నుంచి తన తండ్రి విషయమై ఆశ్చర్యకరమైన రీతిలో ఆభ్యర్థన వచ్చింది. ఈ మేరకు మార్నింగ్ వాక్కు వచ్చిన సుప్రియాను కలిసిన పారిశుధ్య కార్మికుడు ఆయన(శరద్ పవార్) తన నిర్ణయాన్ని పునరాలోచించమంటూ అభ్యర్థించాడు. ఈ సంభాషణను ఆమె తన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత సుప్రియా అతడితో సెల్ఫీని తీసుకుని, నగరంలోని రోడ్లను శుభ్రంగా ఉంచినందుకు ధన్యవాదాలని అతనికి చెప్పారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ..కేవలం 15 రోజుల్లో రెండు రాజకీయ ప్రకంపనాలు జరిగాయన్న ప్రకాశ్ అంబేద్కర్ వ్యాఖ్యపై స్పందించారు. ఔను ఢిల్లీలో ఒకటి, మహారాష్ట్రలో ఒకటి అని ఎన్సీపీ సీనియర్ ఎంపీ సుప్రియా సూలే అన్నారు. మాజీ ఉపముఖ్య మంత్రి అజిత్ పవర్ బీజేపీతో కలిసి వేడెక్కిస్తున్న రాజకీయాలకు చెక్ పెట్టేలా శరద్ పవర్ అనూహ్యాంగా రాజీనామా ప్రకటించారు. కాగా, కేంద్ర రక్షణ, వ్యవసాయ మంత్రిగా పనిచేసిన శరద్ పవార్ దేశంలోని అగ్ర ప్రతిపక్ష నాయకులలో ఆయన ఒకరు. పైగా మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ వంటి పార్టీలనే ఏకతాటిపైకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. (చదవండి: ఎన్సీపీ చీఫ్ పదవికి శరద్ పవార్ రాజీనామా.. అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు..) -
వేతనం రాక.. వెతలు తీరక
బీబీపేట: నాలుగు నెలలుగా వేతనాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిన ఓ పంచాయతీ పారిశుధ్య కార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మరో పదిరోజుల్లో ఆయన భార్య బిడ్డకు జన్మనివ్వనుండగా... ఈలోపే తన భర్త ఆత్మహత్య చేసుకోవడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతోంది. కామారెడ్డి జిల్లా బీబీపేట పంచాయతీలో ఆదివా రం జరిగిన ఈ విషాద ఘటన వివరాలిలా ఉన్నాయి. బీబీపేట గ్రామ పంచాయ తీలో వాటర్‌మన్‌గా పని చేస్తోన్న కొంగరి బాబు(32)కు 4 నెలలుగా వేతనం రావ డం లేదు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. భార్యకు ప్రసవ సమయం సమీపిస్తుండటం, చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో మనోవేద నకు గురై న బాబు.. ఆదివారం పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఉరి వేసుకుని ఆత్మ హత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న తోటి కార్మికులు, కుటుంబ సభ్యు లు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే బాబు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. పోలీసులు సర్దిచెప్పడానికి ప్రయత్నించినా ఆందోళన విరమించలేదు. సర్పంచ్‌తో పాటు పాలకవర్గం సభ్యులు, ప్రజాప్రతి నిధులు అక్కడకు చేరుకుని బాధితుడి కుటుంబానికి న్యాయం చేస్తామని, కుటుంబంలో ఒకరికి అదే ఉద్యోగాన్ని ఇస్తామని హామీనివ్వడంతో ఆందోళన విరమించారు. మృతుడికి భార్య దేవలక్ష్మి, కుమారుడు భరత్, కూతురు మేఘన ఉన్నారు. దేవలక్ష్మి పురిటి కోసం ముంబయిలో ఉన్న పుట్టింటికి వెళ్లింది. పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం నాలుగు నెలలుగా వేతనాలు విడుదల కావడం లేదని, వారి పరిస్థితిని అర్థం చేసుకుని పంచాయతీ నిధులలోంచి రెండు నెలల వేతనాన్ని ఇచ్చామని సర్పంచ్ లక్ష్మి తెలిపారు. -
గయ డిప్యూటీ మేయర్‌గా పారిశుద్ధ్య కార్మికురాలు
పట్నా: పారిశుద్ధ్య కార్మికురాలిని డిప్యూటీ మేయర్ పదవికి ఎన్నుకోవడం ద్వారా బిహార్‌లోని గయ మున్సిపాలిటీ ప్రజలు చరిత్ర సృష్టించారు. చింతాదేవి గత 40 ఏళ్లుగా మున్సిపాలిటీలో స్కావెంజర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈమె 16వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. 1996లో కూడా గయ ప్రజలు ముసాహిర్ వర్గానికి చెందిన రాళ్లు కొట్టుకునే భగవతీదేవి అనే సాధారణ మహిళను లోక్‌సభకు పంపారు. -
వైరల్ వీడియో: దవాఖానాలో పాముల హల్చల్
-
మంచిర్యాల: దవాఖానాలో పాముల హల్చల్.. వీడియో వైరల్
సాక్షి, మంచిర్యాల: భారీ వర్షాలు, వరదలతో తల్లడిల్లుతున్న ముంపు ప్రాంత ప్రజలను చీడపీడలు దడపుట్టిస్తున్నాయి. పరిసర ప్రాంతాలు జలమయం కావడం, చుట్టూరా చలి వాతావరణం నెలకొనడంతో పాములు, తేళ్లు ఇళ్లల్లోకి, ఆఫీసుల్లోకి చొరబడుతున్నాయి. తాజాగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాత శిశు ఆసుపత్రిలో పారిశుద్య కార్మికురాలు సునీత పాముకాటుకు గురయ్యారు. ఆసుపత్రికి వరద తాకిడికి గురికావడంతో ఆసుపత్రి ఆవరణలో పారిశుద్ధ్య పనులు చేస్తున్నారు. పనుల్లో సునీత కూడా పాల్గొన్నారు. అదే సమయంలో పాము కాటు వేయడంతో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. సునీత అరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కిటీకీ, ఫ్లోర్‌పై పాములు కదులుతున్న వీడియోలు వైరల్‌గా మారాయి. ఆపరేషన్ థియేటర్, దాని చుట్టుపక్కల పదుల సంఖ్యలో పాములు కనిపించాయని పారిశుద్ధ్య కార్మికులు చెప్పారు. వాటిని బయటకు తరిమేశామని వెల్లడించారు. -
KTR: క్యాప్ బాగుంది.. ఫొటో దిగుదామా అమ్మా!
సాక్షి, హైదరాబాద్: చందానగర్ సర్కిల్ పారిశుద్ధ్య కార్మికురాలు సైదమ్మను మంత్రి కేటీఆర్ ఆప్యాయంగా పలకరించారు. ఆమె తలపై ధరించిన టోపీ బాగుందంటూ, క్యాప్ సరిచేసి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వసంత్ సిటీ వద్ద నిర్మించిన లింక్ రోడ్‌ను ప్రారంభించి వెళ్తున్న సమయంలో, అక్కడే విధులు నిర్వహిస్తున్న ఆమెతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా... జీతం వస్తోందా అని మంత్రి కేటీఆర్ అడుగగా.. ‘‘మీరు వచ్చాక రెండు సార్లు పెరిగింది’’ అని సైదమ్మ తెలిపారు. ఇందుకు స్పందించిన కేటీఆర్.. ‘‘రెండుసార్లు కాదమ్మా.. మూడు సార్లు పెంచాము’’ అని బదులిచ్చారు. అనంతరం.. ‘‘ఫోటో దిగుదామా’’ అని అడిగి సైదమ్మతో మంత్రి ఫోటో దిగారు. కాగా ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులను దూరం చేసేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా కొత్తగా మరో నాలుగు రోడ్డు మార్గాలను ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. బీటీ లింకురోడ్డు నుంచి నోవాటెల్ హోటల్ నుంచి కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయం వరకు, బీటీ లింకురోడ్డు– మియాపూర్ మెట్రో డిపో నుంచి కొండాపూర్ మసీద్‌బండ జంక్షన్ వరకు, బీటీ లింకురోడ్డు – వసంత్సిటీ నుంచి న్యాక్ వరకు, బీటీ లింకురోడ్డు– జేవీ హిల్స్ పార్కు నుంచి మసీదుబండ వరకు వయా ప్రభుపాద లేఅవుట్ హైటెన్షన్ లైన్ గుండా పయనించేందుకు వీలుగా కొత్త మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. చదవండి: మంత్రి కేటీఆర్ నేడు ప్రారంభించిన రోడ్లు ఇవే.. పూర్తి వివరాలు -
నగల కోసం కరోనా రోగి హత్య.. సీసీటీవీలో దృశ్యాలు
సాక్షి, చెన్నై: నగలు, సెల్‌ఫోన్ కోసం జీహెచ్‌లో పనిచేసే ఓ పారిశుద్ధ్య కార్మికురాలు కరోనా రోగిని హత్య చేసింది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వివరాలు.. వెస్ట్ తాంబరానికి చెందిన ప్రొఫెసర్ మౌళి భార్య సునీత గత నెల కరోనా బారిన పడ్డారు. ఆమెకు ఆక్సిజన్ శాతం తక్కువగా ఉండడంతో మే 23వ తేదీ చెన్నై రాజీవ్‌గాంధీ జీహెచ్‌కు తరలించారు. ఇంటికి వెళ్లిన ఆమె భర్త సైతం అనారోగ్యం బారిన పడ్డారు. వారం రోజుల అనంతరం వచ్చి చూడగా, సునీత కనిపించడం లేదని సిబ్బంది సమాధానం ఇచ్చారు. దీంతో పోలీసులను ఆశ్రయించారు. వారం రోజుల అనంతరం ఆస్పత్రిలోని ఎనిమిదో అంతస్తులోని విద్యుత్ పరికరాల గది నుంచి దుర్వాసన రావడాన్ని సిబ్బంది గుర్తించారు. పరిశీలించగా కుళ్లిన స్థితిలో సునీత మృతదేహం బయట పడింది. పోస్టుమార్టం చేశారు. మూడో అంతస్తులో ఉన్న సునీత ఎనిమిదో అంతస్తుకు ఎలా వెళ్లారో..? అనే అనుమానం తలెత్తింది. సీసీ కెమెరా ఆధారంగా గుర్తింపు కేసును తీవ్రంగా పరిగణించిన ఉత్తర చెన్నై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. సీసీ కెమెరాల్లోని దృశ్యాలను పరిశీలించారు. ఆస్పత్రిలో పనిచేస్తున్న మహిళ పదేపదే సునీత బెడ్ వద్దకు వెళ్లిరావడం గమనించారు. తిరువళ్లూరుకు చెందిన పారిశుద్ధ్య కార్మికులు రతీదేవిగా గుర్తించారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. సునీతను వీల్‌చైర్‌లో తీసుకెళ్లి గొంతునులిమి చంపినట్లు విచారణలో తేలింది. నగలు, సెల్‌ఫోన్‌ను అపహరించినట్లు సమాచారం. చదవండి: కీచక బాబాకు సాయం.. మహిళా టీచర్లపై పోక్సో చట్టం -
వ్యాక్సిన్ వేసుకున్న కాసేపటికే కోమాలోకి
సాక్షి, ఉప్పల్ (హైదరాబాద్): కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న పారిశుధ్య కార్మికురాలు కొద్ది సేపట్లోనే కోమాలోకి వెళ్లింది. పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలోని హెల్త్ సెంటర్లో ఈ సంఘటన జరిగింది. పీర్జాదిగూడలో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న ఎన్.లత(30) శనివారం సాయంత్రం స్థానిక హెల్త్ సెంటర్లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకుంది. తర్వాత కొద్దిసేపటికే ఆమె అస్వస్థతకు గురై స్పృహ కోల్పోయింది. దీంతో లతను అత్యవసర చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. చదవండి: (తెలంగాణ: సాయంత్రం 6.30 వరకే ఆ దుకాణాలు) -
నిజాయితీ చాటుకున్న పారిశుధ్య కార్మికుడు
చెన్నై : బీసెంట్‌నగర్‌లో చెత్తకుండిలో పడి వున్న రూ.15వేల నగదును సొంతదారునికి అప్పగించి నిజాయితీ చాటుకున్న 181వ వార్డు పారిశుధ్య కార్మికుడిని కార్పొరేషన్ ఉన్నతాధికారులు అభినందించారు. చెన్నై అడయారు మండలం 181వ వార్డు కార్పొరేషన్ పారిశుధ్య కార్మికుడు ఎన్.మూర్తి (48). ఇతను బ్యాటరీ వాహనంలో చెత్తను సేకరిస్తుంటాడు. గత మూడవ తేదీ శాంతినగర్ బీచ్‌రోడ్డులో ఇంటిఇంటికీ వెళ్లిచెత్తను సేకరిస్తుండగా ఓ పార్శిల్ కంటపడింది. దానిని విప్పి చూడగా అందులో రూ.15వేల నగదు ఉంది. వెంటనే మూర్తి కార్పొరేషన్ పారిశుధ్య విభాగం వార్డు మేనేజర్ సెల్వంకు విషయం తెలిపాడు. సెల్వంతో కలిసి ఆ నగదును పార్శిల్ పడివేసిన ఇంటి యజమానికి అప్పగించారు. విషయం తెలుసుకున్న కార్పొరేషన్ ఆరోగ్యశాఖ డిప్యూటీ కమిషనర్ దివ్యదర్శిని, ఉన్నతాధికారులు బుధవారం మూర్తిని పిలిపించి అభినందించి అతనికి రూ.5వేలు బహుమతిగా అందజేశారు. మైలాపూర్ నియోజకవర్గం శాసనసభ సభ్యులు నటరాజన్ గురువారం మూర్తిని అభినందించారు. -
బతికుండగానే చంపేశారు
నెల్లూరు సిటీ: నగర పాలక సంస్థకు చెందిన రెగ్యులర్ పారిశుద్ధ్య కార్మికురాలిని బతికుండగానే చంపేశారు. తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రంతో ఆమె ఉద్యోగాన్ని మరో మహిళకు కేటాయించారు. బాధిత మహిళ ఫిర్యాదుతో గతంలో హెల్త్ విభాగం అధికారులు, సిబ్బంది కలిసి చేసిన నిర్వాకం బట్టబయలైంది. ఈ విషయమై మున్సిపల్ హెల్త్ అధికారి వెంకటరమణ పాతరికార్డులను పరిశీలించగా కొత్త కోణాలు వెలుగుచూశాయి. అప్పటి అధికారులు, సిబ్బంది కలిసి తప్పుడు పత్రాలతో బాధిత మహిళతో ఎటువంటి సంబంధం లేని మరో మహిళకు ఉద్యోగం కట్టబెట్టినట్లు తేలింది. (నేను బతికే ఉన్నా సారూ!) వివరాల్లోకి వెళితే..నగర పాలక సంస్థ పరిధిలో 1995 నుంచి రెగ్యులర్ పారిశుద్ధ్య కార్మికురాలిగా కిష్టమ్మ అనే మహిళ పనిచేస్తోంది. కిష్టమ్మ భర్త బీమగుంట కోటేశ్వరరావు. నెల్లూరు మున్సిపాలిటీలో రెగ్యులర్ పారిశుద్ధ్య కార్మికుడిగా విధులు నిర్వహించేవాడు. కోటేశ్వరరావు మృతితో ఆ ఉద్యోగాన్ని అప్పటి కమిషనర్ కిష్టమ్మకు కేటాయించారు. ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కొద్దికాలం పాటు ఆమె పనికి రాలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో కొందరు కార్పొరేషన్ ఉద్యోగులు చేతివాటం చూపి ఆమె ఉద్యోగాన్ని మరొకరికి కేటాయించేందుకు రంగం సిద్ధం చేశారు. 1997లోనే కిష్టమ్మ మృతి చెందినట్లు 2012లో తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రాలను సృష్టించారు. ఆమెతో ఏ సంబంధం లేని రమాదేవి అనే మహిళకు ఉద్యోగాన్ని కేటాయించారు. చనిపోయిన కోటేశ్వరరావు తమ కూతురుకు ఉద్యోగం ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు, ఆ మేరకు ఉద్యోగాన్ని కేటాయించినట్లు రికార్డుల్లో పేర్కొనడం కొసమెరుపు. ఈ వ్యవహారంలో భారీగా నగదు చేతులు మారినట్లు స్పష్టమవుతోంది. అక్రమాలపై విచారణ ముమ్మరం రెగ్యులర్ పారిశుద్ధ్య కార్మికురాలి ఉద్యోగాన్ని మరో మహిళకు అప్పగించడంపై ఎంహెచ్ఓ వెంకటరమణ విచారణ చేపట్టారు. హెల్త్విభాగంలోని పాతరికార్డులను పరిశీలించగా కొత్తకోణాలు వెలుగుచూశాయి. అప్పటి హెల్త్ ఉద్యోగులు, సిబ్బంది కలిసి తప్పుడు మరణ ధ్రువీకరణపత్రాలతో మరొకరికి ఉద్యోగం కట్టబెట్టారని తేలింది. దీంతో ఆధారాలను ఎంహెచ్ఓ ప్రభుత్వానికి అందజేయనున్నట్లు సమాచారం. -
నేను బతికే ఉన్నా సారూ!
నెల్లూరు సిటీ: 2012వ సంవత్సరంలో పారిశుద్ధ్య కార్మికురాలిగా విధులు నిర్వహించిన ఓ మహిళను మృతిచెందినట్లుగా ధ్రువపత్రాలు సృష్టించి ఆమె స్థానంలో మరో మహిళను పారిశుద్ధ్య కార్మికురాలిగా నియమించిన ఘటన తాజాగా వెలుగుచూసింది. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో 2012 సంవత్సరంలో కృష్ణమ్మ అనే మహిళ పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తుండేది. అప్పట్లో ఆమె ఆరోగ్యం క్షీణించడంతో పారిశుద్ధ్య పనులకు వెళ్లలేకపోయేది. కొన్ని నెలలపాటు పనికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో హెల్త్ విభాగంలోని ఓ ఉద్యోగి కృష్ణమ్మ మృతిచెందినట్లు ధ్రువీకరణ పత్రం సృష్టించారు. కృష్ణమ్మ కూతురుగా మరో మహిళను పారిశుద్ధ్య కార్మికురాలిగా నియమించారు. ఈ వ్యవహారం వెనుక హెల్త్ విభాగం అధికారులు, సిబ్బంది పాత్ర ఉందని స్పష్టమవుతోంది. అయితే ఆమె తన ఆరోగ్యం కుదుటపడిందని తిరిగి పనిలో చేర్చుకోవాలని గతంలో అధికారులను వేడుకోగా ఆమె స్థానంలో వేరే వాళ్లను నియమించామని చెప్పి పంపించేశారు. దీంతో ఆమె అప్పటి నుంచి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. మరోసారి కార్పొరేషన్ అధికారుల వద్ద తన పరిస్థితిని తెలియజేసేందుకు రెండు రోజుల క్రితం కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చింది. మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ వద్ద తన గోడు వినిపించింది విచారణలో బట్టబయలైన నిజాలు కృష్ణమ్మ తాను గతంలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేశానని, ఆరోగ్యం సరిగాలేక రాలేకపోయానని, తిరిగి తనను పారిశుద్ధ్య కార్మికురాలిగా తీసుకోవాలని ఎంహెచ్ఓ వెంకటరమణను కోరింది. దీంతో ఆమె గతంలో పనిచేసిన వివరాలను పరిశీలించారు. 2012లో అప్పటి ఉద్యోగులు చేసిన అక్రమాలు వెలుగుచూశాయి. బతికి ఉన్న మహిళను చనిపోయినట్లుగా పత్రాలు సృష్టించి ఆమె స్థానంలో మరో మహిళను పారిశుద్ధ్య కార్మికురాలిగా నియమించిన ఘటన వెలుగుచూసింది. కృష్ణమ్మ కూతురుగా రమాదేవి అనే మహిళను పారిశుద్ధ్య కార్మికురాలిగా నియమించారు. ఈ ఘటన వెనుక అప్పటి నాయకులు, అధికారులు పాత్ర ఉందని తెలుస్తోంది. ఈ విషయంపై ఎంహెచ్ఓ వెంకటరమణ విచారిస్తున్నారు. -
కరోనా: గొప్ప స్ఫూర్తినిచ్చే వీడియో ఇది!
చండీగఢ్: పంజాబ్‌లోని పటియాల జిల్లా నభా ప్రాంత ప్రజలు ఆదర్శంగా నిలిచారు. కరోనా భయాలు.. లాక్డౌన్ నేపథ్యంలోనూ క్రమం తప్పకుండా చెత్త సేకరిస్తున్న పారిశుధ్య కార్మికుడికి చప్పట్లతో స్వాగతం పలికిన ఓ కాలనీవాసులు.. అతనిపై పూల వర్షం కురిపించి కృతజ్ఞతలు తెలిపారు. దాంతో పాటు కరెన్సీ నోట్ల దండలు అతని మెడలో వేసి ఘనంగా సత్కరించారు. నిముషం పాటు ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇక భారత్ వ్యాప్తంగా 1361 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వారిలో 123 మంది కోలుకున్నారు. 35 మంది మరణించారు. -
వైరల్ ఫోటో.. భారీ విరాళం.. చివరకు వివాదం
న్యూఢిల్లీ : కొన్ని రోజుల క్రితం ఢిల్లీ నగరంలో విధులు నిర్వహిస్తూ అనిల్(37) అనే పారిశుధ్య కార్మికుడు మృతి చెందాడు. వీరి కుటుంబాన్ని ఆదుకోవడానికి కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో విరాళాలు సేకరించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సమయంలో అనిల్ మృతదేహం వద్ద విలపిస్తోన్న ఓ బాలుడి ఫోటోను ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమం కోసం వాడారు. హృదయవిదారకంగా ఉన్న ఈ ఫోటో నెటిజన్లను కదిలించిండంతో విరాళాలు భారీగా వచ్చాయి. ఈ ఒక్క ఫోటో వల్ల దాదాపు 60 లక్షల రూపాయల విరాళాలు వచ్చాయంటే ఈ ఫోటో ఎంత వైరల్‌గా మారిందో అర్ధం చేసుకోవచ్చు. విరాళాల ద్వారా వచ్చిన సొమ్మును సదరు బాలుడి కుటుంబానికి అందించే సమయానికి అసలు కథ ప్రారంభమయ్యింది. అప్పటి దాకా అనిల్ మృతదేహం పక్కన విలపిస్తున్న బాలున్ని అందరూ అతని కుమారుడిగానే భావించారు. పాపం చిన్న వయసులోనే తండ్రిని పొగొట్టుకున్నాడని జాలీ పడటంతో భారీగా విరాళాలు ఇచ్చారు. చివర్లో ఆ సొమ్మును ఆ బాలుని కుటుంబానికి ఇచ్చే సమయంలో అనూహ్యంగా అనిల్ సోదరి రంగంలోకి వచ్చారు. ఫోటోలో అనిల్ పక్కన ఏడుస్తున్న బాలుడికి, తన సోదరునికి ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. అంతేకాక అసలు తన సోదరునికి వివాహమే కాలేదని తెలిపారు. అంతేకాక బాలునికి, అనిల్‌కి ఉన్న సంబంధం గురించి అనిల్ సోదరి ఆసక్తికర అంశాలు వెల్లడించారు. ఫోటోలో ఉన్న బాలుడి తల్లి పేరు రాణి. ఆమె, అనిల్ ఇద్దరూ మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. రాణికి ఫోటోలో చూపిన బాలుడే కాక మరో ఇద్దరూ పిల్లలు కూడా ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం రాణి భర్త ముంబైలో ఉంటున్నాడన్నారు. అప్పటి నుంచి అనిల్ రాణి కుటుంబంతో సన్నిహితంగా ఉంటున్నట్లు తెలిపారు. ఫోటోలో ఉన్న బాలుడు అనిల్ కుమారుడు కాదని తెలియడంతో విరాళాలు సేకరిస్తున్న వ్యక్తులు ఇరకాటంలో పడ్డారు. అసలు ఇంత భారీ విరాళం రావడానికి ముఖ్య కారణం ఫోటోలోని కుర్రాడు. దాంతో విరాళాలు సేకరించిన వ్యక్తులు ఓ నిర్ణయానికి వచ్చారు. కొన్ని రోజుల క్రితమే సుప్రీం కోర్టు కూడా ఇద్దరు మేజర్లు కలసి జీవించవచ్చంటూ తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. దీని ఆధారంగా విరాళాలు సేకరించిన వ్యక్తులు ఈ సోమ్మును సదరు బాలుడి పేరున ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఈ విషయం గురించి వారు ‘ప్రస్తుతం రాణి, ఆమె పిల్లలు అనిల్ మీదనే ఆధారపడి ఉన్నారు. కాబట్టి ఈ సొమ్మును ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దాని మీద వచ్చే వడ్డీని ఆ పిల్లల భవిష్యత్ అవసరాల కోసం, చదువు కోసం వినియోగించే ఏర్పాట్లు చేశా’మని తెలిపారు. -
సెప్టిక్ ట్యాంక్‌లో ట్రాక్టర్ బోల్తా ; కార్మికుడి మృతి
సాక్షి, హైదరాబాద్ : హఫీజ్‌పేట్ డివిజన్లోని జనప్రియనగర్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. సెప్టిక్ ట్యాంక్‌లో ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో.. జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికుడు ప్రాణాలు కొల్పోయాడు. మృతున్ని వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన వెంకటేశ్‌గా గుర్తించారు. శుక్రవారం జనప్రియ కాలనీలో ఉన్న సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయడంతో పాటు, పక్కనే ఉన్న మురికి కాలువలోని మట్టిని తొలగించడానికి జీహెచ్ఎంసీ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ట్రాక్టర్ అదుపు తప్పి సెప్టిక్ ట్యాంక్‌పైకి రావడంతో ఒక్కసారిగా ట్యాంక్‌పైనున్న సిమెంట్ బిల్లలు పగిలిపోయాయి. దీంతో ట్రాక్టర్ అందులో పడిపోయింది. ట్రాక్టర్లో ఉన్న వెంకటేశ్ సెప్టిక్ ట్యాంక్‌లో పడి గల్లంతయ్యాడు. ఆ కాలనీ మొత్తానికి అదొక్కటే సెప్టిక్ ట్యాంక్ కావడం, 10మీటర్లకు పైగా లోతు ఉండటంతో వెంకటేశ్ ఆచూకీని గుర్తించడం కష్టంగా మారింది. ఘటన స్థలానికి చేరుకున్న జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ సహాయక చర్యలను పర్యవేక్షించారు. ట్యాంక్‌లోని నీటిని మోటర్ పంపుల ద్వారా బయటకు పంపించారు. మూడు గంటలపైగా శ్రమించిన అధికారులు వెంకటేశ్ మృతదేహాన్నిబయటకు తీసి బంధువులకు అప్పగించారు. -
కాటేసిన కర్కశత్వం
మానసిక వికలాంగ బాలికపై అత్యాచారం బాధితురాలి తల్లి, నిందితుడు పారిశుధ్య కార్మికులే బాధిత బాలికను పరామర్శించిన ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు కృష్ణ మాదిగ అమలాపురం టౌన్ : నోరు తెరిచి కనీసం అమ్మా అని కూడా పలకలేదు... కాళ్లు చేతులు కదపలేదు....కేవలం కళ్లతో మాత్రం దీనంగా చూడగలుగుతుంది. అమ్మే కంటికి రెప్పలా చూసుకుంటూ సాకుతున్న ఆ మైనర్ మానసిక వికలాంగురాలిని ఓ కామాంధుడు కాటేశాడు. స్థానిక మున్సిపల్ కాలనీకి చెందిన పదిహేనేళ్ల మైనర్ మానసిక వికలాంగరాలిపై అదే కాలనీకి చెందిన కొప్పనాతి సతీష్ మంగళవారం తెల్లవారుజామున అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికురాలైన తల్లే సాకుతోంది. తండ్రి లేని ఆ బాలికపై ఇంటి సమీపంలో నివాసముంటున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుడైన సతీష్ కన్నేశాడు. సోమవారం అర్ధరాత్రి కాలనీలో ఓ మహిళ చనిపోవడంతో ఇరుగుపొరుగంతా అక్కడే మంగళవారం తెల్లవారు జాము దాకా ఉండిపోయారు. ఇదే అదనుగా తెల్లవారు జాము నాలుగు గంటల సమయంలో ఇంట్లోకి చొరబడి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అదే సమయంలో తల్లి రావడాన్ని గమనించిన సతీష్ ఆమెను నెట్టి పరారయ్యాడు. తల్లి కేకలకు ఇరుగుపొరుగంతా అక్కడికి చేరుకుని పరిస్థితి గమనించి సతీష్‌పై ఆగ్రహంతో ఊగిపోయారు. జరిగిన ఘటనపై బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా సీఐ వైఆర్కే శ్రీనివాస్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. సతీష్ కోసం నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. బాలికను అత్యవసర చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. నిందితుడిపై ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ యాక్టుతో మరో ఏడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. సతీష్‌కు జీవిత ఖైదు విధించాలి: కృష్ణ మాదిగ నిందితుడు కొప్పనాతి సతీష్‌కు జీవిత ఖైదే సరైన శిక్ష అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందతున్న బాలికను ఆయన మంగళవారం పరామర్శించారు. బాధితురాలికి ప్రభుత్వం రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నిందితుడిపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు నిర్భయ కేసు కూడా నమోదు చేయాలని డిమాండు చేశారు. కృష్ణమాదిగతో పాటు ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి మందా వెంకటేశ్వరరావు, రాష్ట్ర పాలిట్ బ్యూరో సభ్యుడు ఆకుమర్తి సూర్యనారాయణ, కోనసీమ అధ్యక్షుడు గంపల సత్యప్రసాద్ తదితరులు బాలికను పరామర్శించారు. రాష్ట్ర ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి ఇజ్రాయిల్ కూడా ఓ ప్రకటనలో బాలికపై అత్యాచార ఘటనను తీవ్రంగా ఖండించారు. -
విద్యుదాఘాతంతో ఇద్దరి కన్నుమూత
బొబ్బిలి : జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో విద్యుదాఘాతంతో ఇద్దరు మరణించారు. ఈ సంఘటనల వివరాలు ఇలా ఉన్నాయి. బొబ్బిలి ఆకుల రెల్లివీధికి చెందిన దేవుపల్లి మున్న (42) స్థానిక కోట జంక్షన్‌లోని హరిప్రియ లాడ్జిలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే గురువారం ఉదయం లాడ్జి వద్ద క్లీనింగ్ చేస్తుండగా విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మతి చెందాడు. సమాచారం తెలిసిన వెంటనే సీఐ రవి ఆధ్వర్యంలో ఎస్సై అమ్మినాయుడు సంఘటనా స్థలానికి వచ్చి విచారణ జరిపారు. మతుడికి భార్య పూలమ్మ, ఇద్దరు పిల్లలున్నారు. ఏడాది కిందట రెండో కుమార్తె ఐశ్వర్య అనారోగ్యంతో మతి చెందగా, ఇప్పుడు ఇంటి పెద్ద కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎస్సై అమ్మినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గెడ్డవాని యాతపేటలో.. పూసపాటిరేగ : మండలంలోని చల్లవానితోట పంచాయతీ గెడ్డవాని యాతపేటలో ఒకరు మతి చెందారు. విజయనగరం దాసన్నపేటకు చెందిన పంచాది పైడిరాజు(25) రాడ్బెండింగు పనులు చేస్తుంటాడు. దీనిలో భాగంగానే గెడ్డవాని యాతపేటలో పెంటమాని రాముకు చెందిన ఇంటి పనులకు వెళ్లాడు. పనులు చేస్తుండగా శ్లాబు మీదున్న విద్యుత్ తీగలు తగలడంతో అక్కడికక్కడే మతి చెందాడు. మతుడికి భార్య సత్యవతి, కుమార్తె నీహారిక ఉన్నారు. ఎస్సై జి. కళాధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. \ -
డీసీఎం ఢీకొని పారిశుద్ధ్య కార్మికురాలి మృతి
చందానగర్‌లో డీసీఎం వాహనం ఢీకొని నర్సమ్మ(29) అనే పారిశుద్ధ్య కార్మికురాలు మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్నారు. ఈ ఘటనతో ఆ మార్గంలో ట్రాఫిక్‌కు కాసేపు అంతరాయమేర్పడింది. -
శభాష్ వెంకటయ్య!
జాతీయ స్థాయిలో ఉత్తమ పారిశుధ్య కార్మికుడిగా ఎంపికైన రాజేంద్రనగర్ గగన్‌పహాడ్‌కు చెందిన వెంకటయ్యకు రాష్ట్ర పురపాలక, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ రూ.1,11,116 చెక్కును అందజేశారు. దక్షిణ మండల జీహెచ్ఎంసీ కార్యాలయం నుంచి రూ.లక్ష, ఖర్చులకు మరో రూ.10 వేల చెక్కులను గురువారం అందించారు. శుక్రవారం సాయంత్రం వెంకటయ్య ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయనతో పాటు రాజేంద్రనగర్ సర్కిల్ శానిటరీ సూపర్వైజర్ ఆంజనేయులు వెళ్తున్నారు. విమాన టిక్కెట్లను గురువారం మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి వారికి అందజేశారు. తాను విమానంలో ప్రయాణిస్తానని కలలో కూడా అనుకోలేదని వెంకటయ్య అన్నారు. అభినందనలు మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ సర్కిల్ కార్యాలయంలో గురువారం వెంకటయ్యను సత్కరించారు. ఢిల్లీ వె ళ్లేందుకు ప్రయాణ ఖర్చుల కోసం రూ.25 వేలు అందజేశారు. వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆయనను అభినందించారు. అంతా కలగా ఉంది.. గత మూడు రోజులుగా తనకు అంతా కలగా ఉందని వెంకటయ్య సాక్షి’తో చెప్పారు. అందరూ తనను అభినందిస్తున్నారని... టీవీలు, పేపర్లలో తన ఫొటో కనిపిస్తోందని...కుటుంబ సభ్యులతో పాటు చుట్టు పక్కల వారు, బంధువులు అభినందిస్తుంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు. -
నగర పారిశుధ్య కార్మికుడికి ప్రధాని అవార్డు..
రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ సర్కిల్–6 జీహెచ్ఎంసీ పరిధిలోని బాబుల్‌రెడ్డినగర్‌లో పనిచేస్తున్న పారిశుధ్య కాంట్రాక్టు కార్మికుడు టి.వెంకటయ్య జాతీయ స్థాయిలో ఉత్తమ పారిశుధ్య కార్మికుడిగా ఎంపికయ్యారు. ఈ నెల 6వ తేదీన దేశరాజధానిలో నిర్వహించనున్న ‘స్వచ్ఛ సర్వేక్షణ్’ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేయనున్న కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుల చేతులమీదుగా అవార్డు తీసుకో నున్నారు. ఈ సందర్భంగా మంగళవారం రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయంలో వెంకటయ్యను ఘనంగా సన్మానించారు. సౌత్‌జోన్ జీహెచ్ఎంసీ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, సర్కిల్ ఉపకమిషనర్ దశరథ్, తోటి కార్మికులు, అన్ని విభాగాల అధికారులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. గగన్‌పహాడ్ ప్రాంతానికి చెందిన టి.వెంకటయ్య 16 ఏళ్లుగా పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇతడికి భార్య భారతమ్మ, కుమారులు నర్సింహ, జంగయ్య సంతానం. అతడి భార్య, ఒక కుమారుడు కూడా పారిశుధ్య విభాగంలో పనిచేయడం గమనార్హం. వెంకటయ్య అంటే హడల్... వెంకటయ్య మోహన్రెడ్డినగర్తో పాటు బాబుల్‌రెడ్డినగర్, రాఘవేంద్రకాలనీ, సాయిబాబానగర్, మార్కండేయనగర్, వడ్డెరబస్తీలలో పనిచేస్తుంటాడు. ఎవరైనా చెత్త చెదారాలను డస్ట్ బిన్లో కాకుండా బయట పడేస్తే దాన్ని నేరుగా తీసుకువెళ్లి వారి ఇంటి ముందు పడేస్తాడు. మరోసారి అలా చేయనని హామి ఇస్తేనే దాన్ని తొలగిస్తాడు. అతను అలా చేయడం వల్ల ఆయా ప్రాంతాల్లోని వారు చెత్తను రోడ్లపై కాకుండా డబ్బాల్లో ఉంచుతున్నారు. ఆ చెత్తను వెంకటయ్య సేకరిస్తాడు. ఎలాంటి డబ్బులు ఆశించకుండా పనిచేస్తాడు. మూడేళ్లుగా ఒక్క సెలవు కూడా తీసుకోకుండా పనిచేస్తున్నాడు. సెలవు తీసుకోమని కోరినా వద్దంటున్నాడని అధికారులు తెలిపారు. -
సమ్మె చేస్తూ కార్మికురాలి మృతి
మెదక్ : సమ్మెలో పాల్గొంటున్న కార్మికురాలు గుండెపోటుతో మృతిచెందింది. ఈ సంఘటన మెదక్ జిల్లా గజ్వేల్‌లో మంగళవారం జరిగింది. గత కొద్ది రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెలో భాగంగా మంగళవారం మెదక్ జిల్లాలోని గజ్వేల్‌లో ధర్నా నిర్వహిస్తుండగా.. గజ్వేల్ కు చెందిన అటుకూరి మల్లమ్మ(43) ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించగా.. అప్పటికే ఆమె చనిపోయిందని పోలీసులు నిర్ధారించారు. దీంతో ఆగ్రహించిన కార్మికులు ఆమె మృతదేహంతో ఆందోళన నిర్వహించారు. మృతురాలికి ఆర్థిక సాయం చేయాలని కోరుతూ రాస్తారోకో నిర్వహించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
విధుల నుంచి తొలగించారని గర్భిణి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ : విధుల నుంచి తొలగించారని మనస్తాపం చెందిన మహిళా కార్మికురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటన నగరంలోని కుత్బుల్లాపూర్ పరిధిలో సోమవారం జరిగింది. రోడ్మేస్త్రీ నగర్‌కు చెందిన పి. సంపూర్ణ(25) గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో స్వీపర్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మెలో భాగంగా ఆమె విధులకు గైర్హాజరై సమ్మెలో పాల్గనడంతో ఆమెను విధుల నుంచి తొలగించారు. దీంతో మనస్తాపం చెందిన సంపూర్ణ నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. కాగా ఆమె ఆరు నెలల గర్భవతి. ప్రస్తుతం ఆమెను ఈఎస్ఐ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.