శభాష్ వెంకటయ్య! | the best sanitation worker award to Venkataiah | Sakshi
Sakshi News home page

శభాష్ వెంకటయ్య!

Published Thu, Aug 4 2016 8:44 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM

the best sanitation worker award to Venkataiah

 జాతీయ స్థాయిలో ఉత్తమ పారిశుధ్య కార్మికుడిగా ఎంపికైన రాజేంద్రనగర్ గగన్‌పహాడ్‌కు చెందిన వెంకటయ్యకు రాష్ట్ర పురపాలక, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ రూ.1,11,116 చెక్కును అందజేశారు. దక్షిణ మండల జీహెచ్‌ఎంసీ కార్యాలయం నుంచి రూ.లక్ష, ఖర్చులకు మరో రూ.10 వేల చెక్కులను గురువారం అందించారు. శుక్రవారం సాయంత్రం వెంకటయ్య ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయనతో పాటు రాజేంద్రనగర్ సర్కిల్ శానిటరీ సూపర్‌వైజర్ ఆంజనేయులు వెళ్తున్నారు.

 

విమాన టిక్కెట్లను గురువారం మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి వారికి అందజేశారు. తాను విమానంలో ప్రయాణిస్తానని కలలో కూడా అనుకోలేదని వెంకటయ్య అన్నారు. అభినందనలు మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ సర్కిల్ కార్యాలయంలో గురువారం వెంకటయ్యను సత్కరించారు. ఢిల్లీ వె ళ్లేందుకు ప్రయాణ ఖర్చుల కోసం రూ.25 వేలు అందజేశారు. వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆయనను అభినందించారు. అంతా కలగా ఉంది.. గత మూడు రోజులుగా తనకు అంతా కలగా ఉందని వెంకటయ్య సాక్షి’తో చెప్పారు. అందరూ తనను అభినందిస్తున్నారని... టీవీలు, పేపర్లలో తన ఫొటో కనిపిస్తోందని...కుటుంబ సభ్యులతో పాటు చుట్టు పక్కల వారు, బంధువులు అభినందిస్తుంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement