సాక్షి, హైదరాబాద్: చందానగర్ సర్కిల్ పారిశుద్ధ్య కార్మికురాలు సైదమ్మను మంత్రి కేటీఆర్ ఆప్యాయంగా పలకరించారు. ఆమె తలపై ధరించిన టోపీ బాగుందంటూ, క్యాప్ సరిచేసి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వసంత్ సిటీ వద్ద నిర్మించిన లింక్ రోడ్‌ను ప్రారంభించి వెళ్తున్న సమయంలో, అక్కడే విధులు నిర్వహిస్తున్న ఆమెతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా... జీతం వస్తోందా అని మంత్రి కేటీఆర్ అడుగగా.. ‘‘మీరు వచ్చాక రెండు సార్లు పెరిగింది’’ అని సైదమ్మ తెలిపారు. ఇందుకు స్పందించిన కేటీఆర్.. ‘‘రెండుసార్లు కాదమ్మా.. మూడు సార్లు పెంచాము’’ అని బదులిచ్చారు. అనంతరం.. ‘‘ఫోటో దిగుదామా’’ అని అడిగి సైదమ్మతో మంత్రి ఫోటో దిగారు.
కాగా ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులను దూరం చేసేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా కొత్తగా మరో నాలుగు రోడ్డు మార్గాలను ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. బీటీ లింకురోడ్డు నుంచి నోవాటెల్ హోటల్ నుంచి కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయం వరకు, బీటీ లింకురోడ్డు– మియాపూర్ మెట్రో డిపో నుంచి కొండాపూర్ మసీద్‌బండ జంక్షన్ వరకు, బీటీ లింకురోడ్డు – వసంత్‌సిటీ నుంచి న్యాక్ వరకు, బీటీ లింకురోడ్డు– జేవీ హిల్స్ పార్కు నుంచి మసీదుబండ వరకు వయా ప్రభుపాద లేఅవుట్ హైటెన్షన్ లైన్ గుండా పయనించేందుకు వీలుగా కొత్త మార్గాలు అందుబాటులోకి వచ్చాయి.
చదవండి: మంత్రి కేటీఆర్ నేడు ప్రారంభించిన రోడ్లు ఇవే.. పూర్తి వివరాలు
Comments
Please login to add a commentAdd a comment