link roads
-
Hyderabad: రూ. 2410 కోట్ల లింక్ రోడ్ల పనులకు ప్రభుత్వం అనుమతులు
సాక్షి, హైదరాబాద్: దాదాపు రూ. 2410 కోట్ల లింక్ రోడ్ల పనులకు ప్రభుత్వం అనుమతులు జారీ చేయడంతో విడతల వారీగా, ప్యాకేజీల వారీగా టెండర్లు పిలుస్తున్నారు. మూడో దశలోని అయిదు ప్యాకేజీలకుగాను ఇప్పటికే రెండు ప్యాకేజీల్లోని పనులకు టెండర్లను ఆహ్వానించిన హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఆర్డీసీఎల్) మరో ప్యాకేజీలోని 11 కారిడార్లలో రూ. 213 కోట్ల పనులకు టెండర్లను పిలిచింది. రూ.213 కోట్లతో నిర్మించనున్న లింక్‌రోడ్ల వివరాలు 1.ప్రభుత్వ యూపీఎస్ నుంచి కోకాపేట: 3.34 కి.మీ. 2.చేవెళ్ల రోడ్– రాధా రియాల్టీ కార్పొరేషన్ లిమిటెడ్ (వయా పీబీఈఎల్సిటీ): 1.50 కి.మీ. 3.చేవెళ్ల రోడ్ (బాలాజీనగర్)–రాధా రియాల్టీ కార్పొరేషన్ లిమిటెడ్:0.62 కి.మీ. 4.నార్సింగి అప్పా సర్వీస్ రోడ్– చేవెళ్ల రాధా రియాల్టీ కార్పొరేషన్ రోడ్ (వయా మంత్రి యూఫోరియా: 1.23 కి.మీ. 5.ఓఆర్ఆర్ సర్వీస్‌రోడ్–చేవెళ్లరోడ్ (వయా కిస్మత్పూర్): 5.5 కి.మీ. 6. కిస్మత్పూర్ వివేకానంద విగ్రహం– ఆర్అండ్బీ రోడ్ ప్రెస్టీజ్ విల్లాస్: 2.05 కి.మీ. 7. కైసర్‌నగర్ హనుమాన్ ఆలయం–గాజుల రామారం మిథిలానగర్: 3 కి.మీ. 8. అమీన్పూర్ విలేజ్–మియాపూర్ హెచ్ఎంటీ కాలనీ: 1.50 కి.మీ 9. బాచుపల్లి వీఎన్ఆర్ కాలేజ్–పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ(నిజాంపేట): 2.30 కి.మీ. 10.ఎన్‌హెచ్44– రామిరెడ్డినగర్ ఇండస్ట్రియల్ ఏరియా (వయా ఫాక్స్‌సాగర్): 2.40 కి.మీ. 11. హనుమాన్ ఆలయం–అపర్ణ హిల్‌పార్క్ (వయాగంగారం చెరువు): 1.20 కి.మీ. ►మూడోదశలోని ఐదు ప్యాకేజీల్లో ఇది నాలుగో ప్యాకేజీ కాగా, ప్యాకేజీ–3, ప్యాకేజీ–1 పనులకు ఇదివరకే టెండర్లు పిలవడం తెలిసిందే. ప్యాకేజీ–2, ప్యాకేజీ–5 పనులకు మాత్రం టెండర్లు పిలవాల్సి ఉంది. ►లింక్‌రోడ్లు పూర్తయితే సదరు మార్గాల్లో ప్రయాణించే వారికి ఎంతో సదుపాయంతో పాటు సమయం, ఇంధన వ్యయం కలిసి వస్తుందని అధికారులు పేర్కొన్నారు. -
మరో ఏడు లింక్ రోడ్లు: రూ.203 కోట్లు.. 25 కి.మీ
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌న్ లిమిటెడ్(హెచ్ఆర్డీసీఎల్) ఆధ్వర్యంలో గ్రేటర్ శివార్లలో మరో ఏడు లింక్‌రోడ్ల పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. నగరంలో తొలి రెండు దశల్లో నిర్మించిన లింక్రోడ్లతో ఎంతో ప్రయోజనం కలగడంతో మూడో దశలో జీహెచ్ఎంసీతో పాటు శివార్లలోని 10 స్థానిక సంస్థల్లోనూ లింక్‌రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమైంది. వాటికి నిధులు మంజూరు చేస్తూ పరిపాలన అనుమతులు జారీ చేయడంతో పాటు ఇటీవల మూడో దశలోని మూడో ప్యాకేజీ పనులకు టెండర్లు పిలవడం తెలిసిందే. తాజాగా ఈ దశలోని మొదటి ప్యాకేజీ పనులకు టెండర్లు పిలిచినట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. పనులు చేపట్టేందుకు ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చిన 50 కారిడార్లలో ఈ ఏడు రోడ్లు కూడా ఉండటంతో వీటికి టెండర్లు పిలిచారు. టెండర్లు పూర్తికాగానే పనులు చేపట్టనున్నారు. వీటి అంచనా వ్యయం రూ.203.34 కోట్లు. రెండు ప్యాకేజీల్లోని పనులను పరిగణనలోకి తీసుకుంటే వాటికయ్యే మొత్తం వ్యయం దాదాపు రూ. 500 కోట్లు. తాజాగా టెండర్లు పిలిచిన ఏడు మార్గాలు.. నిర్మించనున్న లింక్‌రోడ్ల పొడవు వివరాలిలా ఉన్నాయి. 1.ఈసా నది తూర్పు వైపు బాపూఘాట్ బ్రిడ్జినుంచి పీఅండ్‌టీ కాలనీ: (2.10 కి.మీ) 2.కొత్తూరులో రైల్వేక్రాసింగ్ నుంచి కుమ్మరిగూడ జంక్షన్: (2.60 కి.మీ.) 3.కొత్తూరు వై జంక్షన్ నుంచి వినాయక స్టీల్ (ఎన్‌న్‌హెచ్44) వరకు:(1.50కి.మీ) 4.శంషాబాద్ ఎన్‌హెచ్ 44 బస్టాప్ నుంచి ఒయాసిస్ ఇంటర్నేషనల్:(4కి.మీ) 5.శంషాబాద్ రైల్వే క్రాసింగ్ నుంచి ధర్మగిరి రోడ్: (5కి.మీ) 6. ఎన్‌న్‌హెచ్ తొండుపల్లి జంక్షన్ నుంచి ఓఆర్ఆర్ సరీ్వస్‌రోడ్:(3కి.మీ) 7.గొల్లపల్లి ఎన్‌హెచ్ జంక్షన్– ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ (7 కి.మీ) ఏడు మార్గాల్లో వెరసి మొత్తం 25.20 కి.మీ.ల లింక్‌రోడ్డు నిర్మించనున్నారు. (చదవండి: రాష్ట్రాలకు ఆ అధికారం లేదు) -
Hyderabad: నాగారం, ఘట్కేసర్, దమ్మాయిగూడలో లింక్ రోడ్లు
సాక్షి, హైదరాబాద్: నగర శివార్లలోని రహదార్లకు మహద్భాగ్యం కలుగనుంది. నగరానికి తూర్పున ఉన్న మేడ్చల్ జిల్లా పరిధిలోని దమ్మాయిగూడ, జవహర్‌నగర్, నాగారం, ఘట్కేసర్ స్థానికసంస్థల పరిధిలో 4 లేన్లు, 6 లేన్లతో విశాలమైన రహదారులు రానున్నాయి. ఇన్నర్ రింగ్‌రోడ్, ఔటర్‌రింగ్ రోడ్‌కు అనుసంధానంగా ప్రజల సాఫీ ప్రయాణానికి లింక్, స్లిప్రోడ్లలో భాగంగా ప్రభుత్వం ఇటీవల 104 రోడ్ల పనులకు నిధులు మంజూరు చేస్తూ పరిపాలన అనుమతులు జారీ చేసింది. వాటిల్లో 50 రోడ్ల పనుల్ని ప్రాధాన్యతతో చేపట్టాల్సిందిగా సూచించింది. ఐదు ప్యాకేజీలుగా.. మొత్తం ఐదు ప్యాకేజీలుగా పనులకు నిధులు మంజూరు చేయగా వాటిల్లో మూడో ప్యాకేజీలోని 13 కారిడార్ల (రోడ్ల) పనులు చేసేందుకు హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఆర్డీసీఎల్) టెండర్లు ఆహ్వానించింది. వీటి అంచనా వ్యయం రూ.293.55 కోట్లు. ఏడాదిలోగా పనులు పూర్తిచేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అవసరమైన భూసేకరణ, యుటిలిటీస్ షిఫ్టింగ్ వంటి పనులు లేని ప్రాంతాల్లో రోడ్ల పనులు వేగంగా జరగనున్నాయి. వీటికి అవసరమైన నిధుల్ని హెచ్ఎండీఏ ఇవ్వనున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. టెండర్లు పిలిచిన రోడ్ల వివరాలు.. దమ్మాయిగూడ మునిసిపాలిటీలో.. ► దమ్మాయిగూడ రోజ్‌గార్డెన్ ఫంక్షన్‌హాల్ నుంచి నాగారం రోడ్ (ఈసీఐఎల్‌ను కలుపుతూ): 2.80 కి.మీ.లు. ► చీర్యాల జేఎన్ఎన్యూఆర్ఎం హౌసింగ్ కాలనీ నుంచి అహ్మద్‌గూడ: 1.70 కి.మీ.లు. జవహర్‌నగర్ కార్పొరేషన్లో.. ► ఫైరింగ్ కట్ట నుంచి ఎన్టీఆర్ విగ్రహం రోడ్ వరకు: 2.10 కి.మీ.లు ► ఎన్టీఆర్ విగ్రహం నుంచి దమ్మాయిగూడ రోడ్ (మునిసిపల్ పరిధి వరకు ): 1.90 కి.మీ.లు ► ఎన్టీఆర్ విగ్రహం నుంచి డంపింగ్ యార్డ్ వరకు: 2.35 కి.మీ.లు ► ఎన్టీఆర్ విగ్రహం నుంచి వంపుగూడ రోడ్ వరకు: 1.20 కి.మీ.లు నాగారం మునిసిపాలిటీలో.. ► రాంపల్లి క్రాస్‌రోడ్స్ నుంచి సర్వే నెంబర్ 421 వరకు(హెచ్‌పీ పెట్రోల్‌పంప్ దగ్గర) : 3.90 కి.మీ.లు. ► సర్వే నెంబర్ 421 (హెచ్‌పీ పెట్రోల్‌పంప్ దగ్గర)నుంచి యామ్నాంపేట (నాగారం మునిసిపాలి టీ సరిహద్దు వరకు): 3.10 కి.మీ.లు. ► చర్లపల్లి నుంచి ఓఆర్ఆర్ సర్వీస్‌రోడ్ వరకు( వయా కరీంగూడ ): 3.80 కి.మీ.లు ► యామ్నాంపేట ఫ్లైఓవర్ నుంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వరకు: 2.60 కి.మీ.లు ► చర్లపల్లి బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ నుంచి రాంపల్లి జంక్షన్ వరకు: 3.30 కి.మీ.లు పోచారం మునిసిపాలిటీలో.. ► యామ్నాంపేట నుంచి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ వరకు: 2.10 కి.మీ.లు ఘట్కేసర్ మునిసిపాలిటీలో.. ► శివారెడ్డిగూడ నుంచి మాధవ్‌రెడ్డి బిడ్జ్రి : 2.50 కి.మీ.లు. ప్రయోజనాలు ఈ రోడ్లు అందుబాటులోకి వస్తే నగరంనుంచి శివారు ప్రాంతాలకు సాఫీ రవాణా సాధ్యమవుతుంది. ప్రజలకు ప్రయాణదూరం, సమయం, ఇంధనవ్యయం తగ్గుతాయి. వాహన కాలుష్యం తగ్గడంతో ప్రయాణాల వల్ల తలెత్తే ఆరోగ్య ఇబ్బందులూ తగ్గుతాయని అధికారులు పేర్కొన్నారు. (క్లిక్: రెండంతస్తుల్లో చర్లపల్లి రైల్వేస్టేషన్ నిర్మాణం) -
‘లింక్’ ప్యాకేజ్... అనుసంధాన రోడ్లకు రూ.2410 కోట్లు
సాక్షి, హైదరాబాద్: నగరంలో ప్రధాన రహదారులతోపాటు లింక్ రోడ్లకు సైతం అధిక ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఆర్డీసీఎల్) ఆధ్వర్యంలో నగరంలో రెండు దశల్లో చేపట్టిన మిస్సింగ్, లింక్ రోడ్లతో ప్రజలకు మంచి ప్రయోజనం కలిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మూడో ఫేజ్‌లో జీహెచ్ఎంసీతోపాటు జీహెచ్ఎంసీని ఆనుకొని ఉన్న 10 యూఎల్బీల్లోనూ ఆయా కారిడార్లలో మిస్సయిన, లింక్ తెగిన ప్రాంతాల్లో మిస్సింగ్, లింక్‌రోడ్ల ఏర్పాటుకు, ఆయా కారిడార్ల అభివృద్ధికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా ఏకంగా 104 కారిడార్లలో (రోడ్లలో) పనులు చేపట్టేందుకు పురపాలనశాఖ రూ.2410 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. వీటిల్లో రూ.1500 కోట్ల అంచనా వ్యయంతో 50 కారిడార్లలో 120.92 కి.మీల మేర పనులను ప్రాధాన్యతాక్రమంలో చేపట్టేందుకు అనుమతినిచ్చింది. ఈ నిధులను హెచ్ఎండీఏ అంతర్గత వనరుల నుంచి కానీ, ఆరి్థక సంస్థల నుంచి రుణాలుగా కానీ సేకరించాలని ఆదేశించింది. ఈ మేరకు హెచ్ఆర్డీసీఎల్ ఎండీ, హెచ్ఎండీఏ కమిషనర్ తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ప్యాకేజీ–1 7 కారిడార్లు 25.20 కి.మీల లింక్ రోడ్లు వ్యయం రూ. 304 కోట్లు. ఈసానది తూర్పువైపు బాపూఘాట్ బ్రిడ్జి నుంచి పీఅండ్‌టీ కాలనీ. కొత్తూరులో రైల్వే క్రాసింగ్ నుంచి కుమ్మరిగూడ జంక్షన్. కొత్తూరు వై జంక్షన్ నుంచి వినాయక స్టీల్ (ఎన్‌హెచ్44)వరకు. శంషాబాద్‌లో ఎన్‌హెచ్ 44 బస్టాప్ నుంచి ఒయాసిస్ ఇంటర్నేషనల్. శంషాబాద్ రైల్వే క్రాసింగ్ నుంచి ధర్మగిరి రోడ్. ఎన్‌హెచ్ తొండుపల్లి జంక్షన్ నుంచి ఓఆర్ఆర్ సరీ్వస్‌రోడ్. గొల్లపల్లి ఎన్‌హెచ్ జంక్షన్–ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్. ప్యాకేజ్ –2 10 కారిడార్లు 27.20 కి.మీల లింక్ రోడ్లు వ్యయం రూ. 330 కోట్లు. ఆర్సీఐ ఎక్స్ రోడ్ నుంచి ఎయిర్పోర్ట్ హోటల్ శ్రీశైలం హైవే వరకు మల్లాపుర్ క్రాస్ రోడ్ నుంచి కుర్మగూడ వరకు కుర్మగూడ నుంచి నాదర్గుల్ వరకు బడంగ్‌పేట మెయిన్ రోడ్ నుంచి తుర్కంజల్ వయా రామయ్య నాదర్గుల్ వరకు అంబేద్కర్ జంక్షన్ నుంచి అక్టోపస్ వరకు ఇంజాపూర్ రోడ్ నుంచి మునుగురు రోడ్ తొర్రూర్ నుంచి నాగార్జున సాగర్ రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్ టూ డీఎల్ఆర్ఎల్ కాలనీ (వయా టీకేఆర్ కాలేజ్ రోడ్) వనస్థలిపురం రోడ్ టూ ఓల్డ్ హయత్‌నగర్ రోడ్ బడంగ్‌పేట–నాదర్గుల్ మెయిన్ రోడ్ –నాదర్గుల్ రోడ్ ప్యాకేజ్–3 13 కారిడార్లు 33.35 కి.మీల లింక్ రోడ్లువ్యయం రూ. 417 కోట్లు. రోజ్‌గార్డెన్ ఫంక్షన్‌హాల్ దోమల గూడ నుంచి నాగారం రోడ్ కనెక్టింగ్ టూ ఈసీఐఎల్ చేర్యాల జేఎన్ఎన్యూఎం హౌసింగ్ కాలనీ నుంచి అహ్మాద్గూడ ఆర్జీకే వరకు ఫిరంగ్ కట్టా నుంచి ఎనీ్టఆర్ విగ్రహాం రోడ్ వరకు – ఎన్టీఆర్గ్రహంనుంచి దోమలగూడ రోడ్ (మున్సిపల్ పరిధిలో ) వరకు ఎన్టీఆర్ విగ్రహం నుంచి డంపింగ్ యార్డ్ ఎన్టీఆర్ విగ్రహం నుంఇ వంపుగూడ రోడ్ రాంపల్లి ఎక్స్‌రోడ్ నుంచి సర్వే నెంబర్ 421 సర్వే నెంబర్ 421నుంచి యమన్పేట నగరం యూఎల్బీ బౌండ్రీ– చర్లపల్లి నుంచి ఓఆర్ఆర్ సరీ్వస్‌రోడ్ వయా కరీంగూడ యామన్పేట ఫ్లైఓవర్ నుంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వరకు చర్లపల్లి బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ నుంచి రాంపల్లి జంక్షన్ వరకు యామన్పేట్ నుంచి ఆర్ఆర్ఆర్ సర్వీస్ రోడ్ శివరెడ్డిగూడెం నుంచి మాధవ్‌రెడ్డి బిడ్జ్రి ప్యాకేజ్–4 11 కారిడార్లు 24.64 కి.మీల లింక్ రోడ్లు వ్యయం రూ.297 కోట్లు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నుంచి కోకపేట చెవేళ్ల రోడ్ టూ రాధా రియాల్టీ కార్పొరేషన్ రోడ్ చెవేళ్ల రోడ్ (బాలాజీనగర్)నుంచి రాధా రియాల్టీ కార్పొరేన్ లింక్ రోడ్ నార్సింగ్ అప్పా సర్వీస్ రోడ్ నుంచి చెవేళ్ల –రాధ రియాల్టీ కార్పొరేషన్ రోడ్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ నుంచి చెవేళ్ల రోడ్ వయా కిస్మత్‌పురా వివేకనంద విగ్రహం కిస్మత్‌పురా నుంచి ఆర్అండ్ బీ రోడ్ హనుమాన్ దేవాలయం నుంచి కైసర్ నగర్ నుంచి మైతలి నగర్ జాజుల రామారం అమీన్‌పురా నుంచి హెచ్‌ఎంటీకాలనీ మియాపూర్ వరకు వీఎన్ఆర్ కాలేజీ బాచుపల్లి నుంచి పోట్టి శ్రీరాములు తెలుగుయూనివర్సిటీ నిజాంపేట వరకు ఎన్‌హెచ్ 44 నుంచి ఇండస్ట్రీ ఏరియా రాంరెడ్డినగర్ వయా ఫాక్స్ సాగర్ వరకు ప్యాకేజ్–5 9 కారిడార్లు 10.53 కి.మీల లింక్ రోడ్లు వ్యయం రూ.152 కోట్లు. రాజ్‌భవన్ రోడ్ నుంచి ఆర్అండ్బీ అతిథిగృహాం, లింక్‌రోడ్ బేగం పేట రైల్వేస్టేషన్ ప్రకాశ్‌నగర్ నుంచి బ్రాహా్మణవాడి రైల్వే ట్రాక్ వయా పార్క్ బైరాగి గూడ నుంచి నార్సింగి వరకు దర్గా నుంచి ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి వరకు ఫర్మాయిస్ హోటల్ నుంచి తారమతి బారాదరి వయా కేంద్రీయా విహార్ అపార్ట్మెంట్ కుత్బుల్లాపూర్ రోడ్ నుంచి పైప్లైన్రోడ్ వయా గోదావరి హోస్ కుత్బుల్లాపూర్ రోడ్ నుంచి పైప్‌లైన్ రోడ్ వయా సెయింట్ అంథోని హైసూ్కల్ వెన్నలగడ్డ చెర్వు ఎన్సీసీ జంక్షన్ నుంచి అడిక్‌మెట్ ఫ్లైఓవర్ ఓయూ కంపౌండ్ వాల్ ప్రగతి నగర్ నుంచి మహదేవ్‌పురం పశువుల ఆసుపత్రి వరకు (చదవండి: ప్రకృతి వైద్యానికి కేరాఫ్‌గా హైదరాబాద్) -
సాఫీ జర్నీకి సై... మరో మూడు లింక్ రోడ్లు
సాక్షి హైదరాబాద్/బంజారాహిల్స్: నగర ప్రజలకు ప్రయాణ సదుపాయాన్ని సౌలభ్యంగా మారుస్తున్న లింక్రోడ్లలో మరో మూడింటికి, అభివృద్ధిపర్చిన మల్కంచెరువుకు సోమవారం మున్సిపల్ మంత్రి కె.తారకరామారావు లాంఛనంగా ప్రారంభోత్సవం చేశారు. ఈ పనుల విలువ దాదాపు రూ.100 కోట్లు. ఎస్సార్డీపీలో భాగంగా ప్రధాన రహదారుల్లో నిర్మిస్తున్న ఫ్లై ఓవర్లతో ప్రయాణ సదుపాయం పెరుగుతుండగా, ఆయా ప్రాంతాలను చేరుకునేందుకు లింక్‌రోడ్లు ఎంతగానో ఉపకరిస్తున్నాయని జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. నందిహిల్స్ అండర్‌పాస్.. జూబ్లీహిల్స్ రోడ్‌నెంబర్ 51 నందిహిల్స్ కాలనీలో అండర్‌పాస్‌గా నిర్మించిన లింక్ రోడ్డు వ్యయం రూ. 30 .30 కోట్లు. ఓల్డ్బాంబే హైవే (లెదర్‌పార్క్) నుంచి సైలెంట్ వ్యాలీ మీదుగా రోడ్‌నెంబర్ 45 వరకు నిర్మించిన ఈ లింక్ రోడ్డుతో షేక్‌పేట నుంచి రోడ్ నెంబర్ 45కు వెళ్లేవారికి ప్రస్తుతమున్న 5 కి.మీ దూరం 3.5 కి.మీలకు తగ్గుతుంది. ఈ మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయి. సర్వీస్ రోడ్ల వల్ల షేక్‌పేట–జూబ్లీహిల్స్‌ల మధ్య సాఫీ ప్రయాణం సాధ్యమని అధికారులు పేర్కొన్నారు. ఓల్డ్ బాంబే హైవే– ఖాజాగూడ రోడ్డు ఓల్డ్ బాంబే హైవే నుంచి వయా మల్కంచెరువు, చిత్రపురి కాలనీల మీదుగా ఖాజాగూడ రోడ్డు వరకు నిర్మించిన లింక్‌రోడ్డు పొడవు దాదాపు కిలోమీటరు. ఖాజాగూడ రోడ్డుకు వెళ్లాల్సినవారు ఖాజాగూడ జంక్షన్‌కు వెళ్లనవసరం లేకుండా గమ్యస్థానం చేరుకోవచ్చు. పోచమ్మబస్తీ, చిత్రపురి కాలనీ తదితర పరిసరాల వారికి ఎంతో ప్రయోజనం. అర కిలోమీటరు దూరం తగ్గుతుంది. దీని వ్యయం రూ. 15.07 కోట్లు. ఖాజాగూడ లేక్ – ఓఆర్ఆర్ జాతీయ ఉర్దూ యూనివర్సిటీ కాంపౌండ్ వాల్‌కు సమాంతరంగా ఖాజాగూడ లేక్ నుంచి ఖాజాగూడ– నానక్‌రామ్‌గూడ రోడ్డు వరకు నిర్మించిన ఈ లింక్ రోడ్డు పొడవు కిలోమీటరు. ఓల్డ్బాంబే హైవే నుంచి (కేర్ హాస్పిటల్ దగ్గర) ఖాజాగూడ రోడ్డుకు చేరుకోవాల్సిన వారికి ఇది ప్రత్యామ్నాయ మార్గం. దీని వ్యయం రూ. 47.66 కోట్లు. సీఎస్సార్‌లో భాగంగా మల్కం చెరువును అభివృద్ధి పరిచారు. పరిసరాలను ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దారు (చదవండి: స్కిల్, అప్‌స్కిల్, రీ–స్కిల్ ) -
Hyderabad: 103 కిలోమీటర్లు.. రూ. 1200 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఇప్పటి వరకు గ్రేటర్ నగరంలోని ప్రధాన రహదారుల మార్గాల్లో నిర్మించిన స్లిప్, లింక్ రోడ్లతో కలిగిన ప్రయోజనాన్ని పరిగణనలోకి తీసుకున్న అధికారులు శివారు ప్రాంతాలపై దృష్టి సారించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నగరానికి చుట్టూ ఉన్న స్థానిక సంస్థల్లోని పది మున్సిపల్ కార్పొరేషన్లు/మున్సిపాలిటీల పరిధిలో సాఫీ ప్రయాణానికి అనువుగా 32 లింక్‌రోడ్లను ప్రతిపాదించారు. ముఖ్యంగా ఆయా ప్రాంతాల నుంచి ఔటర్‌రింగ్‌రోడ్ (ఓఆర్ఆర్) సర్వీసు రోడ్లకు రాకపోకలు సాగించేందుకు వీలుగా వీటిని నిర్మించేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు రీజినల్ రింగ్‌రోడ్, ఇంటింటికీ నీటి సరఫరా రెండో విడత పనులు జరగనుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో శివార్లలో పెరగనున్న ట్రాఫిక్ ఒత్తిడిని కూడా పరిగణనలోకి తీసుకొని వివిధ ప్రాంతాల్లో ప్రయాణ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ ప్రణాళిక రూపొందించారు. మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఇటీవల శివారు ప్రాంతాలపై ఎక్కువ దృష్టి సారించడం.. గ్రేటర్ చుట్టూ ఉన్న ప్రాంతాలను కూడా గ్రేటర్లోవిగానే భావించి సదుపాయాలు కల్పిస్తామని పేర్కొనడం తెలిసిందే. ఆయన ఆదేశాలకనుగుణంగానే సంబంధిత అధికారులు ఈ ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలుస్తోంది. ప్రతిపాదిత లింక్‌రోడ్ల పొడవు దాదాపు 103 కిలోమీటర్ల కాగా, వీటి నిర్మాణానికి రూ.1200 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ నిధుల్ని ఎలా సమకూర్చుకోనున్నారో తెలియాల్సి ఉంది. చదవండి: (హైదరాబాద్: ఊపిరి ఉక్కిరిబిక్కిరి!.. ఏడాదికి 98 రోజులు అంతే) 80–100 అడుగులకు విస్తరణ లింక్ రోడ్లలో భాగంగా ఆయా మార్గాల్లో కొంత మేర రోడ్డు ఉండి ఎక్కడైనా లింక్ లోపిస్తే ఆ మేరకు కొత్తగా రోడ్డు నిర్మిస్తారు. రోడ్డు ఉన్నప్పటికీ, అధ్వా నంగా ఉంటే.. అభివృద్ధి చేసి బలపరుస్తారు. బాటిల్‌నెక్‌గా ఉన్న ప్రాంతాల్లో విస్తరిస్తారు. ప్రస్తుతం 20– 40 అడుగుల వెడల్పు మాత్రమే ఉన్న రోడ్లను నగరంలో మాదిరిగా 80– 100 అడుగుల వరకు విస్తరిస్తారు. ఎలాంటి ఆటంకాల్లేకుండా సాఫీ ప్రయాణమే లక్ష్యంగా వీటిని నిర్మించనున్నారు. ఎక్కడెక్కడ.. ఎన్ని రోడ్లు.. ఏ స్థానిక సంస్థ పరిధిలో ఎన్ని లింక్ రోడ్లకు ప్రతిపాదనలు రూపొందించారో వివరాలిలా ఉన్నాయి. బండ్లగూడ జాగీర్–6, కొత్తూరు–3, బడంగ్పేట్–3, శంషాబాద్–4, ఘట్కేసర్–3, దమ్మాయిగూడ–3, నాగారం–2, ఇబ్రహీంపట్నం–2, మణికొండ–2, జవహర్‌నగర్ కార్పొరేషన్–4. -
KTR: క్యాప్ బాగుంది.. ఫొటో దిగుదామా అమ్మా!
సాక్షి, హైదరాబాద్: చందానగర్ సర్కిల్ పారిశుద్ధ్య కార్మికురాలు సైదమ్మను మంత్రి కేటీఆర్ ఆప్యాయంగా పలకరించారు. ఆమె తలపై ధరించిన టోపీ బాగుందంటూ, క్యాప్ సరిచేసి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వసంత్ సిటీ వద్ద నిర్మించిన లింక్ రోడ్‌ను ప్రారంభించి వెళ్తున్న సమయంలో, అక్కడే విధులు నిర్వహిస్తున్న ఆమెతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా... జీతం వస్తోందా అని మంత్రి కేటీఆర్ అడుగగా.. ‘‘మీరు వచ్చాక రెండు సార్లు పెరిగింది’’ అని సైదమ్మ తెలిపారు. ఇందుకు స్పందించిన కేటీఆర్.. ‘‘రెండుసార్లు కాదమ్మా.. మూడు సార్లు పెంచాము’’ అని బదులిచ్చారు. అనంతరం.. ‘‘ఫోటో దిగుదామా’’ అని అడిగి సైదమ్మతో మంత్రి ఫోటో దిగారు. కాగా ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులను దూరం చేసేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా కొత్తగా మరో నాలుగు రోడ్డు మార్గాలను ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. బీటీ లింకురోడ్డు నుంచి నోవాటెల్ హోటల్ నుంచి కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయం వరకు, బీటీ లింకురోడ్డు– మియాపూర్ మెట్రో డిపో నుంచి కొండాపూర్ మసీద్‌బండ జంక్షన్ వరకు, బీటీ లింకురోడ్డు – వసంత్సిటీ నుంచి న్యాక్ వరకు, బీటీ లింకురోడ్డు– జేవీ హిల్స్ పార్కు నుంచి మసీదుబండ వరకు వయా ప్రభుపాద లేఅవుట్ హైటెన్షన్ లైన్ గుండా పయనించేందుకు వీలుగా కొత్త మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. చదవండి: మంత్రి కేటీఆర్ నేడు ప్రారంభించిన రోడ్లు ఇవే.. పూర్తి వివరాలు -
Hyderabad: ఐటీకారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్స్‌లో తగ్గనున్న ట్రాఫిక్ సమస్య
-
ఐటీ కారిడార్‌లో 4 కొత్త లింకు రోడ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
సాక్షి, రాయదుర్గం: ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యను దూరం చేసేందుకు లింకురోడ్ల నిర్మాణం వేగవంతం చేశారు. ఇప్పటికే అనేక లింకురోడ్లు అందుబాటులోకి తీసుకురాగా, కొత్తగా మరో నాలుగు రోడ్లు సోమవారం అందుబాటులోకి వచ్చాయి. వీటిని రాష్ట్ర ఐటీ శాఖమంత్రి కె. తారకరామారావు, విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, నగర మేయర్ విజయలక్ష్మి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికెపూడి గాందీతో కలిసి ప్రారంభించారు. రూ.23.43 కోట్ల వ్యయంతో హెచ్ఆర్డీసీఎల్ సంస్థ నాలుగు లింకురోడ్లను నిర్మించింది. నాలుగు లేన్ల రోడ్లు, సెంట్రల్ లైటింగ్, గ్రీనరీతో తీర్చిదిద్దారు. ఈ నాలుగు లింకురోడ్ల నిర్మాణంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య చాలా వరకు పరిష్కారం కానుంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతోందన్నారు. నగర అభివృద్ధికి రహాదారులు చాలా ముఖ్యమని, ఇప్పటికే 16 లింక్ రోడ్లు పూర్తి చేశామని వెల్లడించారు. లింక్ రోడ్ల వల్ల ప్రధాన రహదారులపై భారం తగ్గుతుందని తెలిపారు. హైదరాబాద్‌ను చూసి ఇతర రాష్ట్రాల వాళ్ళు అడుగుతున్నారని పేర్కొన్నన్నా. దశల వారీగా 133 లింక్ రోడ్లను నిర్మిస్తున్నామన్నారు. శేరిలింగంపల్లిలో జనసాంద్రత ఎక్కువని, అందుకే ఇక్కడ పనులు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. నేడు ప్రారంభించిన రోడ్లు ఇవే.. ► రూ.5.58 కోట్లతో నిర్మించిన 0.600 కిలో మీటర్ల బీటీ లింకురోడ్డు– నోవాటెల్ హోటల్ నుంచి కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయం వరకు. ►రూ.2.87 కోట్లతో నిర్మించిన 0.460 కిలో మీటర్ల బీటీ లింకురోడ్డు– మియాపూర్ మెట్రో డిపో నుంచి కొండాపూర్ మసీద్‌బండ జంక్షన్ వరకు. ►రూ.7.41 కోట్లతో 0.750 కిలోమీటర్ల బీటీ లింకురోడ్డు – వసంతసిటీ నుంచి న్యాక్ వరకు. ►రూ.7.57 కోట్లతో 1.010 కిలోమీటర్ల బీటీ లింకురోడ్డు– జేవీ హిల్స్ పార్కు నుంచి మసీదుబండ వరకు వయా ప్రభుపాద లేఅవుట్ హైటెన్షన్ లైన్. తగ్గనున్న దూరం... ► కొత్తగా అందుబాటులోకి వచ్చే రోడ్లతో దూరభారం తగ్గనుంది. ► కొత్త లింకురోడ్డులన్నీ నాలుగులేన్ల, మధ్యలో డివైడర్, సెంట్రల్ లైటింగ్, గ్రీనరీతో ఉండడంతో గతంలో కన్నా విశాలంగా రోడ్లు మారడం, లింకు కలుపడంతో చాలా వరకు ప్రధాన రోడ్లకు కనెక్టివిటీ పెరగనుంది. ►ట్రాఫిక్ సమస్యతోపాటు, వాహనదారులకు సమయం, ఇంధనం ఆదా అయ్యే అవకాశం కలుగుతుంది. ►నోవాటెల్–ఆర్టీఏ ఆఫీస్ లింకురోడ్డుతో హఫీజ్‌పేట్, కొండాపూర్, మియాపూర్, గచ్చిబౌలి వాసులకు హైటెక్‌సిటీ ఎంఎటీఎస్ స్టేషన్, హైటెక్స్, నోవాటెల్‌ను తక్కువ సమయంలో చేరుకోవచ్చు. ►అంతేకాకుండా మూడు లింకురోడ్లతో మియాపూ ర్, సర్దార్‌పటేల్‌నగర్, వసంతనగర్, కేపీహెచ్‌బీ, 6,9 ఫేజ్ నుంచి హైటెక్‌సిటీ ప్రాంతానికి మరింత దగ్గరవుతుంది. ►జాతీయ రహదారి నుంచి ప్రారంభమయ్యే లింకురోడ్డు ద్వారా డైమండ్‌హిల్స్ కాలనీ, ఐడీపీఎల్ ఎంప్లాయీస్‌కాలనీ, శిల్పాఎవెన్యూ కాలనీ, నోవాటెల్ హోటల్ రోడ్డు సర్కిల్ నుంచి కొండాపూర్ మజీదుబండ జంక్షన్ వరకు సులువగా చేరుకోవచ్చు. ►జేవీహిల్స్ పార్కు నుంచి మసీద్‌బండ రోడ్డు నిర్మాణంలో మాధవహిల్స్ ఎస్టేట్, ప్రభుపాద లేఅవుట్, మారుతీనగర్‌కాలనీ వారికి నేరుగా గచి్చ»ౌలికి వయా మసీదుబండ రోడ్డు ద్వారా వెళ్లే అవకాశం కలుగుతుంది. -
ట్రాఫిక్ చిక్కుల పరిష్కారానికి లింక్‌రోడ్లు
సాక్షి, హైదరాబాద్ : ట్రాఫిక్ చిక్కుల పరిష్కారానికి, కాలుష్యనియంత్రణకు హైదరాబాద్ నగరవ్యాప్తంగా 137 లింక్, స్లిప్‌రోడ్లు నిర్మిస్తున్నామని మున్సిపల్ మంత్రి కె.తారకరామారావు అన్నారు. మొదటిదశలో చేపట్టిన 37 లింక్‌రోడ్ల(126 కి.మీ.)లో కొన్ని ఇప్పటికే పూర్తికాగా, మిగతావి పురోగతిలో ఉన్నాయని పేర్కొన్నారు. లింక్‌రోడ్లకు ఇప్పటికే రూ.313.65 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అత్యంత ఆకర్షణీయ నగరం హైదరాబాద్ అని పేర్కొన్నారు. తగిన జీవన ప్రమాణాలతో నివాసయోగ్యమైన నగరంగా జేఎల్ఎల్, మెర్సర్ వంటి సంస్థల సర్వేల్లో వెల్లడైందని చెప్పారు. ఓల్డ్ బాంబే హైవే నుండి రోడ్ నంబర్ 45 మార్గంలో రూ. 23.10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అండర్‌పాస్ పనులకు శంకుస్థాపనతోపాటు ఓల్డ్ బాంబే హైవే నుండి ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ మీదుగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వరకు రూ.19.51 కోట్ల వ్యయంతో 2.30 కిలోమీటర్ల మేర లింక్‌రోడ్డు, ఓల్డ్ బాంబే హైవే లెదర్ పార్కు నుండి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 వరకు రూ.15.54 కోట్ల వ్యయంతో 1.20 కిలోమీటర్ల లింక్ రోడ్డు, మియాపూర్ రహదారి నుండి హెచ్‌టీ లైన్ వరకు రూ. 9.61 కోట్ల వ్యయంతో కిలోమీటరు దూరంతో నిర్మించిన మరో లింక్ రోడ్డును కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఖాజాగూడలో విలేకరులతో మాట్లాడుతూ పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా మౌలిక వసతులను కూడా పెంచాల్సిన అవసరం ఉందని, నగరంలో గత ఆరేళ్లలో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు. ప్రజల సూచనలు, సలహాలు స్వీకరిస్తాం.. నగర అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అవసరమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. లింకురోడ్ల గురించి సోషల్ మీడియా, పబ్లిక్‌డొమైన్‌లో పెడతామని, వీటిపై ప్రజల సూచనలు, సలహాలు, స్వీకరించి అవసరమైన ప్రాంతాల్లో మరిన్ని లింక్‌రోడ్లు నిర్మిస్తామన్నారు. ఖాజాగూడ కొత్తరోడ్డు పక్కనే ద్వీపంలా పెద్ద చెరువు ఉన్నందున దీన్ని నెక్లెస్‌రోడ్డు తరహాలో అభివృద్ధి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సంజీవయ్యపార్కు, దుర్గంచెరువు, ఇతర చెరవులను అభివృద్ధి చేసినట్లుగానే ఈ చెరువును మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్ది ప్రజలంతా వీకెండ్స్‌లో సేదతీరేలా మార్చాలన్నారు. కార్యక్రమాల్లో మంత్రులు సబితాఇంద్రారెడ్డి, తల సాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌రావు, ఎమ్మెల్యే గాంధీ, మేయ ర్ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు. -
లింక్ రోడ్లపై నజర్
సాక్షి, సిటీబ్యూరో: లాక్డౌన్ తరుణంలో వివిధ నిర్మాణ పనులను వేగంగా చేస్తోన్న జీహెచ్ఎంసీ స్లిప్, లింక్రోడ్లపైనా దృష్టి సారించింది. లాక్‌డౌన్‌ను సద్వినియోగం చేసుకొని ఇప్పటికే ఎస్సార్డీపీ, సీఆర్ఎంపీ పనుల్ని త్వరితంగా చేస్తుండగా.. స్లిప్, లింక్ రోడ్లకు సంబంధించి అవసరమైన భూసేకరణల్ని పూర్తిచేస్తే వాటిని కూడా లాక్‌డౌన్‌ను వినియోగించుకోవడంతోపాటు వర్షాకాలం వచ్చేలోపునే పూర్తిచేయాలని భావిస్తోంది. మునిసిపల్ మంత్రి కేటీఆర్ వీటిని త్వరితంగా చేయాలని ఆదేశించడంతో అధికారులు వీటిపై దృష్టి సారించారు. ఆస్తుల సేకరణ పూర్తయిన ప్రాంతాల్లో ఇప్పటికే పనులు జరుగుతుండగా, ఆస్తుల సేకరణ జరగాల్సిన ప్రాంతాల్లో త్వరితంగా ఆ పని చేసేందుకు మేయర్ బొంతు రామ్మోహన్ శేరిలింగంపల్లి, కూకట్పల్లి నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు గాంధీ, కృష్ణారావు, సీసీపీ దేవేందర్‌రెడ్డి, హెచ్ఆర్డీసీఎల్ సీఈ, వసంత తదితర అధికారులతో కలిసి క్షేత్రస్తాయిలో పర్యటించారు. ఆయా మార్గాల్లో ట్రాఫిక్ ఇబ్బందుల్లేకుండా చేసేందుకు అవసరమైన ఆస్తుల సేకరణకు సహకరించాల్సిందిగా యజమానులను కోరారు. అందుకు వారు సుముఖత వ్యక్తం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. మంగళవారం ఆయా ప్రాంతాల్లోని స్లిప్, లింక్‌రోడ్ల మార్గాలను మేయర్ పరిశీలించారు. అవి.. ♦ న్యూ అల్లాపూర్–సున్నం చెరువుకు వెళ్లే 100 అడుగుల రోడ్డుకు అనుసంధానం చేసేందుకు నిర్మిస్తున్న 420 మీటర్ల పొడవు లింక్ రోడ్డు ♦ జి.వి.హిల్స్ పార్కు నుండి వయా ప్రభుపాద లేఅవుట్ ద్వారా మజీద్ బండ రోడ్డును అనుసంధానం చేసేందుకు నిర్మిస్తున్న వెయ్యి మీటర్ల లింక్ రోడ్డు ♦ నిజాంపేట క్రాస్ రోడ్ నుండి వయా వసంతనగర్, న్యాక్ ద్వారా హైటెక్స్ జంక్షన్ రోడ్డుకు అనుసంధానం చేసేందుకు 2,200 మీటర్ల పొడవున నిర్మిస్తున్న లింక్ రోడ్డు ♦ హెచ్.టి.లైన్ నుండి మియాపూర్ రోడ్డు వరకు అనుసంధానం చేసేందుకు నిర్మిస్తున్న లింక్ రోడ్డు ♦ కొండాపూర్, బొటానికల్ గార్డెన్ రోడ్డు నుండి హఫీజ్ రైల్వే ట్రాక్ వరకు అనుసంధానం చేసేందుకు నిర్మిస్తున్న 230 మీటర్ల లింక్ రోడ్డు ♦ గోకుల్‌నగర్ అక్షయ ఫుడ్ కోర్టు నుండి వయా ఐ.డి.పి.ఎల్ ద్వారా ఎన్‌హెచ్–9 వరకు అనుసంధానం చేసేందుకు చేపట్టిన 200 మీటర్ల లింక్ రోడ్డు ♦ మియాపూర్ మెట్రో డిపో నుండి వయా ఐ.డి.పి.ఎల్ ఎంప్లాయీస్ కాలనీ ద్వారా కొండాపూర్ మజీద్ వరకు అనుసంధానం చేసేందుకు నిర్మిస్తున్న 1800 మీటర్ల లింక్ రోడ్డు కొన్ని ప్రాంతాల్లో పనులు.. ఇప్పటికే భూసేకరణ పూర్తయిన ప్రాంతాల్లో పనులు త్వరితంగా పూర్తిచేసేందుకు సంబంధిత అధికారులు కృషి చేస్తున్నారు. అలాంటి వాటిల్లో దాదాపు రూ. 12 కోట్లతో బోరబండ నుంచి అయ్యప్పసొసైటీ మార్గంలో 840 మీటర్ల రోడ్డు, తదితరమైనవి ఉన్నాయి. తొలిదశలో 55 మార్గాలు.. గ్రేటర్లో వివిధ ప్రభుత్వ విభాగాల పరిధిలో మొత్తం 248 కి.మీ.ల మేర 132 స్లిప్, లింక్‌రోడ్లు నిర్మించేందుకు ప్రతిపాదించారు. వీటిల్లో 55 మార్గాల్లోని 126 కి.మీ.ల పనులకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి చేయాలని భావించారు. ఇందులో తొలిదశలోభాగంగా 78 కి.మీ.ల పనులు త్వరితంగా చేయాలని నిర్ణయించారు. స్లిప్,లింక్‌రోడ్ల పనులు హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలోచేస్తుండగా, అవసరమైన భూసేకరణ జీహెచ్ఎంసీ చేస్తోంది. -
లింకు పోయింది
ఆకివీడు : వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లే లింకు రోడ్లకు గ్రహణం పట్టింది. ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న లింకు రోడ్ల నిర్మాణానికి ఎట్టకేలకు అనుమతించిన సర్కారు ఆ చేత్తో ఇచ్చి.. ఈ చేత్తో తీసేసుకున్నట్టుగా గడువు మీరిపోయిం దంటూ నిధుల్ని వెనక్కి మళ్లిపోయేలా చేసింది. ఏలూరు మినహా జిల్లాలోని 17 మార్కెట్ కమిటీల పరిధిలో 334 లింకు రోడ్ల నిర్మాణానికి సర్కారు ఆమోదించింది. వాటి నిర్మాణానికి మార్కెట్ కమిటీల నిధులు రూ.11.18 కోట్లు, జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు రూ.11.18 కోట్లు కలిపి మొత్తం రూ.22.36 కోట్లను కేటాయించారు. మార్కెట్ కమిటీల వాటా నిధులు రూ.11.18 కోట్లను పంచాయతీరాజ్ శాఖకు బదలాయించారు. ఒక్కొక్క రహదారి నిర్మాణానికి రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ కేటాయించారు. అయితే, ఉన్నతాధికారుల నుంచి సకాలంలో అనుమతులు మంజూరు కాకపోవడం, ఆ తరువాత వర్షాల వల్ల పనులు ప్రారంభంలో జాప్యం చోటుచేసుకుంది. జూన్ 30వ తేదీలోపు పనులు పూర్తి చేయకపోతే నిధులను నిలుపుదల చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 30లోగా పనులు ప్రారంభించకపోవడంతో నిధులు వెనక్కి మళ్లాయి. తుస్సుమన్న రూ.కోటి పనులు ఒక్కొక్క మార్కెట్ కమిటీ పరిధిలో రూ.కోటికి పైగా విలువైన పనుల్ని చేపట్టేందుకు అనుమతులు లభించాయి. ప్రతి నియోజకవర్గంలో 15 నుంచి 18 లింకు రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదించారు. ఈ నిధులతో లింకు రోడ్లను పూర్తిగా గ్రావెల్‌తో నిర్మించాల్సి ఉంది. అయితే, పనులు చేపట్టేందుకు ప్రభుత్వం అతి తక్కువ గడువు ఇవ్వడంతో నిధులు మంజూరైనా వెనక్కి మళ్లిపోయాయి. రైతుల సొమ్ము వారికి అక్కరకు రావడం లేదు రైతుల నుంచి మార్కెట్ సెస్ రూపంలో వసూలు చేసే నిధులు వారికి అక్కరకు రాకుండాపోతున్నాయి. ధాన్యం, బియ్యం, నూకలు, చేపలు, రొయ్యల ఎగుమతుల నుంచి మార్కెట్ కమిటీలు సెస్ వసూలు చేస్తున్నాయి. ఈ విధంగా ప్రతి మార్కెట్ కమిటీకి ఏటా కోట్లాది రూపాయల ఆదాయం లభిస్తోంది. ఇందులో 20శాతాన్ని ప్రభుత్వం తీసుకుం టోంది. మిగిలిన నిధులను రైతుల అవసరాల కోసం వినియోగించాల్సి ఉంది. అయితే, కొన్నేళ్లుగా ఒక్క పైసా కూడా రైతుల కోసం వెచ్చించడం లేదు. సెస్ రూపంలో వసూలయ్యే సొమ్ము 80 శాతం నిధులను రైతులకు అవసరమయ్యే నూర్పిడి కళ్లాలు, లింకు రోడ్ల నిర్మాణం, ఇతరత్రా పనులకు వినియోగించాల్సి ఉంది. కనీసం పశువైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయడం లేదు. వాళ్లకేమీ తెలియదట లింకు రోడ్ల నిర్మాణ పనులను పంచాయతీరాజ్ శాఖకు అప్పగించగా, జిల్లాస్థాయి అధికారులు ఆ పనుల వివరాలేమీ తమకు తెలియదని చెబుతున్నారు. జిల్లాలో ఎన్ని లింకు రోడ్లకు నిధులొచ్చాయి, ఎన్ని పనులను ప్రారంభించారనే వివరాలను చెప్పడానికి ఆ శాఖ అధికారులు సంకోచిస్తున్నారు. ఈ విషయమై పంచాయతీరాజ్ ఈఈ ఎస్.రఘుబాబును సంప్రదించగా, పూర్తి సమాచారం తమవద్ద లేదని ఎస్ఈని అడగాలని సూచించారు. ఎస్ఈ ఇ.మాణిక్యంను అడిగితే ఈఈ వద్దే సమాచారం ఉంటుందని దాటవేశారు.