సాక్షి, హైదరాబాద్: దాదాపు రూ. 2410 కోట్ల లింక్ రోడ్ల పనులకు ప్రభుత్వం అనుమతులు జారీ చేయడంతో విడతల వారీగా, ప్యాకేజీల వారీగా టెండర్లు పిలుస్తున్నారు. మూడో దశలోని అయిదు ప్యాకేజీలకుగాను ఇప్పటికే రెండు ప్యాకేజీల్లోని పనులకు టెండర్లను ఆహ్వానించిన హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌ఆర్‌డీసీఎల్) మరో ప్యాకేజీలోని 11 కారిడార్లలో రూ. 213 కోట్ల పనులకు టెండర్లను పిలిచింది.
రూ.213 కోట్లతో నిర్మించనున్న లింక్‌రోడ్ల వివరాలు
1.ప్రభుత్వ యూపీఎస్ నుంచి కోకాపేట: 3.34 కి.మీ.
2.చేవెళ్ల రోడ్– రాధా రియాల్టీ కార్పొరేషన్ లిమిటెడ్ (వయా పీబీఈఎల్‌సిటీ): 1.50 కి.మీ.
3.చేవెళ్ల రోడ్ (బాలాజీనగర్)–రాధా రియాల్టీ కార్పొరేషన్ లిమిటెడ్:0.62 కి.మీ.
4.నార్సింగి అప్పా సర్వీస్ రోడ్– చేవెళ్ల రాధా రియాల్టీ కార్పొరేషన్ రోడ్ (వయా మంత్రి యూఫోరియా: 1.23 కి.మీ.
5.ఓఆర్‌ఆర్ సర్వీస్‌రోడ్–చేవెళ్లరోడ్ (వయా కిస్మత్‌పూర్): 5.5 కి.మీ.
6. కిస్మత్‌పూర్ వివేకానంద విగ్రహం– ఆర్‌అండ్‌బీ రోడ్ ప్రెస్టీజ్ విల్లాస్: 2.05 కి.మీ.
7. కైసర్‌నగర్ హనుమాన్ ఆలయం–గాజుల రామారం మిథిలానగర్: 3 కి.మీ.
8. అమీన్‌పూర్ విలేజ్–మియాపూర్ హెచ్‌ఎంటీ కాలనీ: 1.50 కి.మీ
9. బాచుపల్లి వీఎన్‌ఆర్ కాలేజ్–పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ(నిజాంపేట): 2.30 కి.మీ.
10.ఎన్‌హెచ్44– రామిరెడ్డినగర్ ఇండస్ట్రియల్ ఏరియా (వయా ఫాక్స్‌సాగర్): 2.40 కి.మీ.
11. హనుమాన్ ఆలయం–అపర్ణ హిల్‌పార్క్ (వయాగంగారం చెరువు): 1.20 కి.మీ.
►మూడోదశలోని ఐదు ప్యాకేజీల్లో ఇది నాలుగో ప్యాకేజీ కాగా, ప్యాకేజీ–3, ప్యాకేజీ–1 పనులకు ఇదివరకే టెండర్లు పిలవడం తెలిసిందే. ప్యాకేజీ–2, ప్యాకేజీ–5 పనులకు మాత్రం టెండర్లు పిలవాల్సి ఉంది.
►లింక్‌రోడ్లు పూర్తయితే సదరు మార్గాల్లో ప్రయాణించే వారికి ఎంతో సదుపాయంతో పాటు సమయం, ఇంధన వ్యయం కలిసి వస్తుందని అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment