మరణించిన మున్న
విద్యుదాఘాతంతో ఇద్దరి కన్నుమూత
Published Thu, Aug 18 2016 11:23 PM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM
బొబ్బిలి : జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో విద్యుదాఘాతంతో ఇద్దరు మరణించారు. ఈ సంఘటనల వివరాలు ఇలా ఉన్నాయి. బొబ్బిలి ఆకుల రెల్లివీధికి చెందిన దేవుపల్లి మున్న (42) స్థానిక కోట జంక్షన్‌లోని హరిప్రియ లాడ్జిలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే గురువారం ఉదయం లాడ్జి వద్ద క్లీనింగ్ చేస్తుండగా విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మతి చెందాడు. సమాచారం తెలిసిన వెంటనే సీఐ రవి ఆధ్వర్యంలో ఎస్సై అమ్మినాయుడు సంఘటనా స్థలానికి వచ్చి విచారణ జరిపారు. మతుడికి భార్య పూలమ్మ, ఇద్దరు పిల్లలున్నారు. ఏడాది కిందట రెండో కుమార్తె ఐశ్వర్య అనారోగ్యంతో మతి చెందగా, ఇప్పుడు ఇంటి పెద్ద కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎస్సై అమ్మినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గెడ్డవాని యాతపేటలో..
పూసపాటిరేగ : మండలంలోని చల్లవానితోట పంచాయతీ గెడ్డవాని యాతపేటలో ఒకరు మతి చెందారు. విజయనగరం దాసన్నపేటకు చెందిన పంచాది పైడిరాజు(25) రాడ్‌బెండింగు పనులు చేస్తుంటాడు. దీనిలో భాగంగానే గెడ్డవాని యాతపేటలో పెంటమాని రాముకు చెందిన ఇంటి పనులకు వెళ్లాడు. పనులు చేస్తుండగా శ్లాబు మీదున్న విద్యుత్ తీగలు తగలడంతో అక్కడికక్కడే మతి చెందాడు. మతుడికి భార్య సత్యవతి, కుమార్తె నీహారిక ఉన్నారు. ఎస్సై జి. కళాధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
\
Advertisement
Advertisement