జీహెచ్‌ఎంసీలో కామ పిశాచి.. కమిషనర్‌ రియాక్షన్‌ | GHMC Field Assistant Harassment On Sanitation Worker In Gajukaramaram | Sakshi
Sakshi News home page

జీహెచ్‌ఎంసీలో కామ పిశాచి.. కమిషనర్‌ రియాక్షన్‌

Published Thu, May 23 2024 11:10 AM | Last Updated on Thu, May 23 2024 1:55 PM

GHMC Field Assistant Harassment On Sanitation Worker In Gajukaramaram

హైదరాబాద్, సాక్షి: జీహెచ్ఎంసీ సర్కిల్ ఎసిఎఫ్ఏ (శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్) కిషన్ కీచక పర్వం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన కింద పనిచేసే కార్మికురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ.. అదంతా వీడియోలు, పోటోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డా కీచకుడు. అయితే ఈ వ్యవహారం మీడియాకు ఎక్కడంతో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రస్‌ స్పందించారు. కిషన్‌ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

వివరాల్లోకెళ్తే..కుత్బుల్లాపూర్ పరిధిలోని గాజులరామారం 25 సర్కిల్ పరిధిలో మున్సిపల్ శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ ఎస్ఏఫ్ఏగా విధులు నిర్వహిస్తున్న కిషన్ అనే ఉద్యోగి అదే సర్కిల్‌లో పని చేసే ఓ పారిశుద్ధ్య కార్మికుకురాలిపై కన్నేసాడు. అధికార దర్పంతో ఆమెపై అఘాయిత్యానికి పాల్పడే దుస్సాహసానికి వడిగట్టాడు. తాను చెప్పినట్లు వినాలని హుకూం జారీ చేశాడు. 

ఆఖరికి అతడి మాట వినకపోతే.. విధి నిర్వహణలో ఇబ్బందులు పెట్టడం వంటి దురాగతాలకు పాల్పడేవాడు. దీంతో బాధితురాలు కీచక కిషన్ వేధింపులకు తట్టుకోలేక ఎవరికీ చెప్పలేక నరక యాతన అనుభవించింది. పైగా వాటన్నింటిని ఫోన్‌లో రికార్డ్ చేసేవాడు

ఏం జరిగిందో కానీ.. కిషన్ వీడియోలు బయటకు రావడం సహ ఉద్యోగుల వరకు చేరిపోవడం జరిగింది. దీంతో వారంతా సదరు ఉద్యోగిని గట్టిగా ప్రశ్నించటంతో.. ఎవరికి చెప్పవద్దంటూ..రూ. 10 వేల చొప్పున దాదాపు 14 మందికి డబ్బులు ఇచ్చి కవర్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. అతడిపై చర్యలు తీసుకోవాలని సహోద్యోగులు, కార్మికులు డిమాండ్ చేశారు. దీంతో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ చర్యలు తీసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement