బీబీపేట: నాలుగు నెలలుగా వేతనాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిన ఓ పంచాయతీ పారిశుధ్య కార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మరో పదిరోజుల్లో ఆయన భార్య బిడ్డకు జన్మనివ్వనుండగా... ఈలోపే తన భర్త ఆత్మహత్య చేసుకోవడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతోంది. కామారెడ్డి జిల్లా బీబీపేట పంచాయతీలో ఆదివా రం జరిగిన ఈ విషాద ఘటన వివరాలిలా ఉన్నాయి.
బీబీపేట గ్రామ పంచాయ తీలో వాటర్‌మన్‌గా పని చేస్తోన్న కొంగరి బాబు(32)కు 4 నెలలుగా వేతనం రావ డం లేదు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. భార్యకు ప్రసవ సమయం సమీపిస్తుండటం, చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో మనోవేద నకు గురై న బాబు.. ఆదివారం పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఉరి వేసుకుని ఆత్మ హత్య చేసుకున్నాడు.
విషయం తెలుసుకున్న తోటి కార్మికులు, కుటుంబ సభ్యు లు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే బాబు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. పోలీసులు సర్దిచెప్పడానికి ప్రయత్నించినా ఆందోళన విరమించలేదు. సర్పంచ్‌తో పాటు పాలకవర్గం సభ్యులు, ప్రజాప్రతి నిధులు అక్కడకు చేరుకుని బాధితుడి కుటుంబానికి న్యాయం చేస్తామని, కుటుంబంలో ఒకరికి అదే ఉద్యోగాన్ని ఇస్తామని హామీనివ్వడంతో ఆందోళన విరమించారు.
మృతుడికి భార్య దేవలక్ష్మి, కుమారుడు భరత్, కూతురు మేఘన ఉన్నారు. దేవలక్ష్మి పురిటి కోసం ముంబయిలో ఉన్న పుట్టింటికి వెళ్లింది. పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం నాలుగు నెలలుగా వేతనాలు విడుదల కావడం లేదని, వారి పరిస్థితిని అర్థం చేసుకుని పంచాయతీ నిధులలోంచి రెండు నెలల వేతనాన్ని ఇచ్చామని సర్పంచ్ లక్ష్మి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment