Babu
-
విచారణకు వర్మ టైం అడిగారు
-
గుడివాడ టీడీపీ నేత తులసి బాబుపై టీడీపీ డ్రామాలు
-
అటు ఒక పీకే..ఇటు ఒక పీకే..బాబూ సరిపోయిందా?
-
Babu - Ramoji : బిల్లీ కేసులో కళ్లు మూసుకున్న పిల్లి
మోసాల చంద్రబాబునీ, ఆయన మీసాలొత్తే రామోజీరావును ఎన్ని ఏనుగులను కట్టీ విడదీయలేం. నీతిమాలిన అవిభాజ్య కవలలు వాళ్లిద్దరూ! కుటిల రాజకీయాల అవిభక్త కుటుంబ వ్యాపారం వాళ్లిద్దరిదీ చంద్రబాబుపై ఎవరైనా కేసు వేస్తే.. కే సు వేసినవాళ్లే దొంగలు, దోషులు అని నిస్సిగ్గుగా ఒంటిమీద రాసుకుని తిరుగుతారు రామోజీ. చంద్రబాబు ‘దోషి’ అని స్వయంగా కోర్టే తీర్పు ఇచ్చినా.. కోర్టును తప్పుదారి పట్టించారని కూడా అసత్యాలను ప్రచారం చేయగలరు రామోజీ! ‘‘850 ఎకరాల స్కామ్‌లో చంద్రబాబుకు హైకోర్టు షాక్’’ అన్నది తాజా వార్త. ‘‘చంద్రుడిపై స్కామ్ మచ్చ’’ అనేది రామోజీ పెట్టే తిరగమోత! బాబుపై ఈగను వాలనివ్వని రామోజీ.. ఇంగితం లాంటి అంగీనైనా జారవిడుచుకుంటాడు కానీ.. కోర్టు షాకిచ్చిందంటే ఒప్పకుంటాడా? బాబుని సమర్థించటం మానుకుంటాడా? విషయం ఏంటంటే.? చంద్రబాబు తన హయాంలో ఒక సంస్థకు అక్రమంగా కేటాయించిన 850 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించిన కోర్టు తీర్పొకటి 18 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత నేడు (2024 మార్చి 7) వెలువడింది. 2004 మే నెలకు ముందు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ప్రభుత్వం చేసిన భూ కేటాయింపులను ఈ తీర్పులో తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది. ఆ కేటాయింపులను రద్దు చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే – 2003లో బిల్లీ రావు అనే వ్యక్తి హైదరాబాద్, చుట్టుపక్కల క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి పేరుతో ఐఎంజీ భారత్ అనే సంస్థను ప్రారంభించాడు. ఈ సంస్థకు 2004లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఉండగానే 850 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా కారుచవకగా కేటాయించారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయి చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. నాటి చంద్రబాబు ప్రభుత్వం చేసిన అక్రమ భూ కేటాయింపులను గుర్తించిన వైఎస్సార్ ప్రభుత్వం 2006లో ఈ భూ కేటాయింపులను రద్దు చేసింది. దీంతో బిల్లీ రావు ఈ రద్దును సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లారు. అప్పటి నుంచి దీనిపై సుదీర్ఘ విచారణ జరుగుతూ వచ్చింది. తాజాగా చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్ కూడిన తెలంగాణ హైకోర్టు ధర్మాసనం ఈ కేసు విషయమై తీర్పునిచ్చింది. వైఎస్సార్ ప్రభుత్వం భూ కేటాయింపులను రద్దు చేయడాన్ని సమర్థిస్తూ బిల్లీ రావు పిటిషన్ ను కొట్టేసింది. ఏకపక్షంగా భూ కేటాయింపులు చేసిన నాటి చంద్రబాబు ప్రభుత్వ తీరును తప్పుపట్టింది. విపరీతం ఏంటంటే.? చంద్రబాబు కొమ్ము కాస్తున్న రామోజీరావుకు ఇదొక వార్తగా కనిపించకపోవటం! ఆ స్థానంలో అదే కోర్టు ఇచ్చిన ఇంకో వార్తతో చంద్రబాబు స్కామ్ నుంచి తెలుగు ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేశారు రామోజీ! ‘‘ఎమ్మెల్సీల నియామకంలో ప్రభుత్వానికి చుక్కెదురు’’ అనేదే ఆ వార్త. సరే, చంద్రబాబు గురించీ, రామోజీ గురించి, వారిద్దరి మధ్య ఉన్న బలీయమైన అనుబంధం గురించి తెలియంది ఎవరికి? కనుక బాబు గారికీ, బిల్లీ రావుగారికి మధ్య ఉన్న బాంధవ్యం ఏమిటో కాస్త ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లి చూద్దాం. 1995 ఏపీ రాజకీయాల్లోని ముఖ్య ఘట్టం.. మామ గారికి అల్లుడు గారు పొడిచిన వెన్నుపోటు. ఆ సమయంలో చంద్రబాబుకు పరిచయమైన వ్యక్తే బిల్లీ రావు. ఉరఫ్ అహోబిల రావు. ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి కాగానే చంద్రబాబు చేసిన పని.. బిల్లీకి ‘కుప్పం’ ప్రాజెక్టును కట్టబెట్టటం! బిల్లీది కృష్ణా జిల్లాలోని కొండపల్లి. మద్రాస్ ఐఐటీలో చదివారు. అక్కడి నుంచి అమెరికా వెళ్లారు. అమెరికా చదువు పూర్తవగానే తిరిగి ఇండియా వచ్చేశారు. బిల్లీ రావుకు తెలియంది లేదు అన్నట్లే ఉంటాయి ఆయన మాటలు. 1995లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడే, సరిగ్గా చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడుస్తున్న సమయంలోనే బాబుకు పరిచయమయ్యారు. అప్పటి నుంచి వారిద్దరి బంధం బలపడుతూ వచ్చింది. వివిధ దేశాల్లో విస్త్రృతంగా పర్యటించటం, పెద్దపెద్ద వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవటం బిల్లీ హాబీ. ఇదే క్రమంలో ఈయనకు ఫ్లోరిడాలోని ఐఎంజీ యాజమాన్యమైన మార్క్ కుటుంబంతో సంబంధాలున్న ఆండ్రూక్రీగర్ పరిచయమయ్యాడు. బాబుకు క్రీగర్‌ను పరిచయం చేసి... ఆయన్ను ఐఎంజీబీ (ఇండియా) కంపెనీకి నామమాత్రపు చైర్మన్ గా చేసి... బాబు– బిల్లీ ఇద్దరూ చక్రం తిప్పారు. ఐఎంజీబీకి భూములు దక్కాక... క్రీగర్‌ను నేరస్తుడనే ముద్ర వేసి కంపెనీ నుంచి తొలగించటంతో ఆయన బిల్లీపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో కేసు కూడా వేశారు. కానీ బిల్లీ–బాబుల బంధం, బలం తెలిశాక తప్పుకున్నారు. ఇజ్రాయెల్ పేరిట కుప్పంలోను, అమెరికా పేరిట ఐఎంజీని సృష్టించి హైదరాబాద్‌లోను వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టడానికి పథకం వేసిన వారు చంద్రబాబు–బిల్లీ రావు. కేబినెట్ అనుమతి లేకుండా... అది కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ ఐఎంజీకి భూములు కట్టబెట్టిన చంద్రబాబును నేడు కోర్టు తప్పు పట్టిందంటే పట్టదా? అయినా గానీ రామోజీకి చీమ కుట్టినట్లయినా ఉండదా?! తప్పించుకున్న సీబీఐ! ఐఎంజీ కుంభకోణం బయటపడ్డాక.. ఒప్పందాన్ని రద్దు చేసిన వై.ఎస్.రాజశేఖర రెడ్డి ప్రభుత్వం.. 2007లో ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ జీవో విడుదల చేసింది. కానీ సీబీఐ మాత్రం దీనిపై దర్యాప్తు జరపడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు! చంద్రబాబును దోషిగా రుజువు చేసేందుకు సకల సాక్ష్యాలూ కళ్ల ముందు కనిపిస్తున్నా.. ఆయన్ను విచారించడానికి గానీ, అరెస్టు చెయ్యటానికి గానీ సీబీఐ ముందుకెళ్లలేదు. ‘‘మా దగ్గర తగినంత సిబ్బంది లేరు. తగిన వనరులు లేవు. అందుకని దర్యాప్తు జరపలేం’’ అని ప్రభుత్వానికి సమాధానమిచ్చి తప్పించుకుంది. విచిత్రమేంటంటే... అప్పుడు కూడా రాష్ట్రంలో సీబీఐ ఇంఛార్జిగా ఉన్నది జగన్ కేసులో అత్యుత్సాహం ప్రదర్శించిన వి.వి.లక్ష్మీనారాయణే!. అసలు ఆయనకు బాబుపై ఎందుకు అంత ప్రేమ? నేరం స్పష్టంగా కనిపిస్తున్నా... దొంగలెవరో ఆధారాలతో సహా తేలినా పట్టుకోవటానికి ఎందుకు తాత్సారం చేశారు? సమాధానం లేని ప్రశ్నలైతే కావు. తగిన వనరులు లేవన్న కారణంతో విచారణ జరపలేమని చెప్పటం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా? దొంగల్ని పట్టుకోవటానికి పోలీసులు లేరంటే... ఈ వ్యవస్థెందుకు? ఈ దర్యాప్తు సంస్థలెందుకు? కుప్పం ప్రాజెక్టు కథేంటి?! బిల్లీకి చంద్రబాబు నాయుడు తన నియోజకవర్గమైన కుప్పంలో... ఇజ్రాయెల్ టెక్నాలజీ ప్రాజెక్టును మొదట అప్పగించారు. అది ఘోరంగా విఫలం అయింది. కుప్పంలో 9,572 ఎకరాల్లో ఇజ్రాయెల్ తరహా సేద్యాన్ని అమలు చేసి... రెండోదశలో రంగారెడ్డి జిల్లాలో అమలు చేసి... ఆ తర్వాత దాన్ని రాష్ట్రమంతటికీ విస్తరించాలని 1997లో చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు అమలు బాధ్యతను బిల్లీ, ఆయన సోదరుడు ప్రభాకరరావు అలియాస్ ప్యాట్రావుకు చెందిన ‘బీహెచ్‌సీ ఆగ్రో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’కు అప్పగించేశారు చంద్రబాబు. సేద్యంలో ఇజ్రాయెల్ తరహా విప్లవాన్ని తెస్తామని, ఆకాశాన్ని కిందికి దించుతామని రకరకాల డప్పులు వాయించింది ఈ కంపెనీ. ఆ డప్పుల చప్పుడును రాష్ట్రమంతటికీ వినిపించేలా – రాష్ట్ర వ్యవసాయ రంగ ముఖచిత్రం మారిపోబోతోందంటూ – ఊదరగొట్టించేశారు రామోజీరావు. కానీ కుప్పంలో మాత్రం పరిస్థితి అడ్డం తిరిగింది. ఆ ప్రాజెక్టుకు రూ.19 కోట్లు ఖర్చుచేశారు. దీన్లో కొంత టెక్నాలజీకి, కొంత మౌలిక సదుపాయాలకు, మరికొంత యంత్రాలకు అంటూ మొత్తం బిల్లీ చేతిలో పోసేశారు. ప్రాజెక్టు కోసమని రైతుల నుంచి బలవంతంగా సేకరించిన భూముల్లో సరిహద్దులను మళ్లీ గుర్తించలేనంతగా చెరిపేశారు. మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడేశారు. దాంతో చుట్టుపక్కల భూముల్లో కూడా భూసారం నాశనమైపోయింది. చుట్టుపక్కల రైతులు అప్పటిదాకా 200 అడుగుల బోర్లు వేస్తే... ఈ భూముల్లో ఏకంగా 600 అడుగుల లోతున బోర్లు వేయవలసి వచ్చింది. దీంతో చుట్టూ ఉన్న బోర్లు ఎండిపోయి రైతులు బోరుమన్నారు. ఎకరానికి రూ.30,000– 50,000 వరకూ ఫలసాయం అందిస్తామని ఆర్భాటపు ప్రకటనలు చేసినా... ఎకరాకు రూ.3 నుంచి 5 వేలు కూడా దిగుబడి సాధించలేకపోయారు. ఈ వైఫల్యాల గురించి కూడా రామోజీరావు ఒక్క మాటా రాయలేదు! ఆయన నాడూ అంతే, ఈనాడూ అంతే.. ఏనాడూ అంతే. బిల్లీ, బాబుల ఆలింగనం కంటే కూడా గాఢమైనది రామోజీ, చంద్రబాబుల పరిష్వంగనం. -
విడుదలకు సిద్ధమైన ‘బాబు’
అర్జున్ కళ్యాణ్ హీరోగా, కుషిత కల్లాపు హీరోయిన్గా రాబోతోన్న చిత్రం ‘బాబు’. ట్యాగ్ లైన్ ‘నెంబర్ వన్ బుల్ షిట్ గై’. డీడీ క్రియేషన్స్ బ్యానర్ మీద దండు దిలీప్ కుమార్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంఎల్ఆర్ (లక్ష్మణ్ వర్మ) ఈ సినిమాకు దర్శకుడు. విలాసం కన్నా అవసరం గొప్పది అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కించారు. ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉండబోతోంది. ప్రస్తుతం ఈ మూవీ అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. త్వరలోనే విడుదలకు సిద్దం కానుంది. ఇప్పటికే వదిలిన ప్రమోషనల్ కంటెంట్ అందరినీ ఆకట్టుకుంది. ఇక మున్ముందు మరింతగా ప్రమోషనల్ కార్యక్రమాలను పెంచనున్నారు మేకర్లు. -
వెళ్లిన నెల రోజులకే.. ఇంటికి తిరిగొచ్చిన శవపేటిక!
వేములవాడ: బతుకుదెరువు కోసం నెల క్రితం గల్ఫ్ వెళ్లిన ఓ యువకుడు అక్కడ జరిగిన ప్రమాదానికి బలికాగా.. వారం రోజులకు శవపేటిక ఇంటికి చేరింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామానికి చెందిన లింగంపెల్లి రాజనర్సయ్య–లచ్చవ్వ కుమారుడు లింగంపల్లి బాబు(28) నెల రోజుల క్రితం బహ్రెయిన్ దేశం వెళ్లాడు. ఈ నెల 7న అక్కడ ఓ కంపెనీలో పనిచేస్తుండగా సెంట్రింగ్ పనికి వినియోగించే పెద్ద రాడ్ నాలుగో అంతస్తు మీదనుంచి బాబుపై పడింది. ఈ ప్రమాదంలో బాబు అక్కడికక్కడే మృతిచెందినట్లు తోటి స్నేహితులు గ్రామస్తులకు సమాచారం అందించారు. మృతుడి తండ్రి రాజనర్సయ్య కొన్నేళ్ల క్రితమే చనిపోగా, తల్లి లచ్చవ్వ, భార్య శిరీష, నాలుగేళ్ల వయస్సుగల కుమారుడు ఉన్నారు. స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి డాక్టర్ గోలి మోహన్ అక్కడి ఇండియన్ ఎంబసీ వారితో మాట్లాడి మృతదేహం ఇంటికి చేరేందుకు కృషి చేశారు. బాబు శవపేటిక ఇంటికి చేరడంతో కుటుంబసభ్యులు అశ్రునయనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఇవి కూడా చదవండి: 'అమ్మవారి మాల' తీసి మరీ.. భార్యను కిరాతకంగా.. -
దిక్కులేని వారిని చేసి వెళ్లిపోయావా.. బండపల్లిలో విషాదం..!
సాక్షి, కరీంనగర్: ఉన్న ఊరిలో ఉపాధి కరువై ఎడారి దేశానికి వెళ్లిన యువకుడి శవమై ఇంటికి తిరిగొచ్చాడు. యువకుడి మృతితో ఆ కుటుంబం రోడ్డున పడింది. బాధిత కుటుంబానికి అండగా నిలిచేందుకు గ్రామానికి చెందిన యువకులు ముందుకొచ్చి విరాళాలు అందిస్తున్నారు. మండలంలోని బండపల్లికి చెందిన రేగుల బాబు(39) గత డిసెంబర్లో జీవనోపాధి కోసం కువైట్ వెళ్లాడు. ఇరువై రోజుల క్రితం జ్వరం బారిన పడ్డాడు. అక్కడ వైద్యం చేయించుకున్నప్పటికీ తగ్గలేదు. రెండు, మూడు రోజుల్లో ఇంటికొస్తానని భార్యకు వారం క్రితం ఫోన్ చేసి చెప్పాడు. పరిస్థితి విషమించి బాబు శుక్రవారం మృతి చెందాడు. ఈ అతని స్నేహితులు ఫోన్ ద్వారా బాబు భార్య కల్యాణికి ఫోన్లో తెలపడంతో ఆమె గుండెలవిసేలా రోదించింది. బాబు శవపేటిక సోమవారం బండపల్లికి చేరింది. తండ్రి శవాన్ని చూసి కూతురు, కుమారుడు, భార్య రోదించిన తీరు అందరిని కన్నీరు పెట్టించింది. చిన్ననాటి నుంచి కష్టాలే.. బాబు చిన్నతనంలోనే తండ్రి లచ్చయ్య మృతి చెందడంతో తల్లి లచ్చవ్వ గ్రామంలో చిన్న హోటల్ నడిపిస్తూ కుమారుడిని పోషించింది. బాబు పదోతరగతి చదువుతుండగా తల్లి అనారోగ్యంతో చనిపోయింది. ఒంటరిగా జీవిస్తున్న బాబు బంధువులు పెళ్లి చేశారు. స్వగ్రామంలో చిన్నాచితక పనులు చేసుకునేవాడు. ఇటీవల అప్పు చేసి కువైట్‌కు వెళ్లాడు. అక్కడ పరిస్థితులు అనుకూలించకపోవడంతో జ్వరంబారిన పడి గత శుక్రవారం మృతిచెందాడు. ముందుకొచ్చిన యువకులు.. బాబు కుటుంబాన్ని ఆదుకునేందుకు గ్రామ యువకులు ముందుకొచ్చారు. మృతుడికి పదమూడేళ్ల కూతురు రష్మిత ఉంది. ఆమె చదువుల కోసం యువకులు రూ.50వేలు జమచేశారు. మరింత మొత్తం జమచేసి అందజేసేందుకు యువకులు ప్రయత్నిస్తున్నారు. ఇవి చదవండి: పండుగ రోజున యువకుడి తీవ్ర విషాదం! -
హరీశ్‌బాబుకు టికెట్ ఖరారు
సాక్షి, ఆసిఫాబాద్: కొన్ని రోజులుగా ఉత్కంఠ రేపిన బీజేపీ తొలి జాబితాను ఎట్టకేలకు ఆదివారం ఆ పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. ముందుగా ఊహించినట్లుగానే జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ పాల్వాయి హరీశ్‌బాబు ఖరారయ్యారు. ఆసిఫాబాద్ నియోజకవర్గ అభ్యర్థి ఎవరన్నది ఇంకా తేలలేదు. రెండో జాబితాలో అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. వాస్తవానికి శనివారమే జాబితా ప్రకటించాల్సి ఉండగా.. మూడు సీట్ల ఖరారు విషయంలో సందిగ్ధత నెలకొనడంతో వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి మాత్రం అభ్యర్థిత్వాలు ఖరారైన వారికి స్వయంగా ఫోన్లు చేసి ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. ఆయా నియోజకవర్గాల్లో శనివారమే పార్టీ శ్రేణులు సంబురాలు జరుపుకొన్నారు. బలమైన రాజకీయ నేపథ్యం.. పాల్వాయి హరీశ్‌బాబుకు బలమైన రాజకీయ కుటుంబ నేపథ్యం ఉంది. ఆయన తల్లిదండ్రులు ఇద్దరూ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. హరీశ్‌బాబు తండ్రి పాల్వాయి పురుషోత్తంరావు 1989, 1994లో వరుసగా రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందగా.. తల్లి రాజ్యలక్ష్మి సైతం 1999లో టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004లో ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన పాల్వాయి హరీశ్‌బాబు.. ఆ తర్వాత చైన్నెలోని శ్రీరామచంద్రా యూనివర్శిటీ నుంచి ఎం.ఎస్.(ఆర్థోపిడిక్స్) చేశారు. పీడియాట్రి ఆర్థోపిడిక్ సర్జన్‌గా వైద్యవృత్తిని ప్రారంభించారు. 2017 నవంబర్‌లో రాజకీయ అరంగ్రేటం చేశారు. ప్రత్యేక రాజకీయ ఎజెండాను రూపొందించుకుని ప్రజల్లోకి వచ్చారు. మొదట 2018లో కాంగ్రెస్ పార్టీ తరఫున సిర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి కోనేరు కోనప్పపై పోటీ చేసి 59,052 ఓట్లు సాధించారు. ఆ తర్వాత ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వివిధ వర్గాలకు మద్దతుగా పోరాటాలు చేయడంతోపాటు మారుమూల గ్రామాల్లో పాదయాత్ర చేసిన ఆయనకు నియోజకవర్గంలో మంచి పట్టుంది. -
హీరో మృతి.. నిద్రాహారాలు మానేయడంతో తల్లి కన్నుమూత!
30 ఏళ్లుగా మంచానికే పరిమితమైన తమిళ హీరో బాబు సెప్టెంబర్ 19న కన్నుమూసిన సంగతి తెలిసిందే! ఆయన మరణంతో బాబు తల్లి ప్రేమ తీవ్ర భావోద్వేగానికి లోనైంది. నిద్రాహారాలు మానేసి చనిపోయిన కొడుకు గురించే కలవరించింది. ఈ క్రమంలో అస్వస్థతకు లోనైన ప్రేమ అక్టోబర్ 11న కన్నుమూసింది. కొడుకు చనిపోయిన మూడు వారాలకే తను కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. ఆ ఒక్క సీన్ వల్ల జీవితమే నాశనం.. కాగా బాబు 'ఎన్ ఉయిర్ తొళన్' అనే సినిమాతో తమిళ చిత్రపరిశ్రమలో రంగప్రవేశం చేశారు. ఈ చిత్రాన్ని దర్శకదిగ్గజం భారతీరాజా తెరకెక్కించాడు. ఈ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో బాబుకు లెక్కలేనన్ని అవకాశాలు వచ్చాయి. దీంతో బాబు దాదాపు 10 సినిమాలకు సంతకం చేశారు. అందులో ఒకటి మనసారా వస్తుంగళెన్. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో బాబు కొన్ని ఫైట్ సన్నివేశాల్లో డూప్ లేకుండా నటించారు. ఈ క్రమంలో ఎత్తైన ప్రదేశం నుంచి ఆయన కిందకు దూకడంతో అతడికి తీవ్ర గాయాల్యాయి. వెన్నుముక విరిగిపోయి మంచానికి పరిమితమయ్యారు. 30 ఏళ్లుగా కంటికి రెప్పలా చూసుకుంది హీరోగా ఎదుగుతున్న సమయంలో జరిగిన ఈ ప్రమాదం ఆయన కెరీర్‌నే కాదు జీవితాన్నే తలకిందులు చేసింది. వెన్నెముకకు శస్త్ర చికిత్స చేయించుకున్నప్పటికీ అతడు నిటారుగా కూర్చోలేని పరిస్థితి! అప్పటినుంచి కొడుకుకు సపర్యలు చేస్తూ తనను కంటికి రెప్పలా చూసుకుంటోంది అతడి తల్లి ప్రేమ. మూడు దశాబ్దాలుగా మంచానికే పరిమితమైన బాబు ఇటీవలే కన్నుమూయడంతో ఆ బాధ తట్టుకోలేక తల్లి గుండె సైతం ఆగిపోయింది. కాగా గతంలో తమిళనాడు అసెంబ్లీ స్పీకర్‌గా వ్యవహరించిన కె. రాజారం సోదరియే ప్రేమ. సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి చదవండి: శోభా ఓవరాక్షన్.. ఆటలో మరీ ఇంతలా దిగజారాలా? -
ఒక్క ఫైట్ సీన్.. ఆ హీరో జీవితాన్నే ముగించింది!
కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. దాదాపు 30 ఏళ్ల పాటు మంచానికే పరిమితమైన హీరో కన్నుమూశారు. షూటింగ్లో జరిగిన ప్రమాదంతో కోమాలోకి వెళ్లిన తమిళ హీరో బాబు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ప్రముఖ దర్శకులు భారతీరాజా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఆయన 1990లో వచ్చిన 'ఎన్ ఉయిర్ తోజన్' అనే సినిమాతో అరంగేట్రం చేశారు. కాగా, ఈ సినిమాను తమిళ ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ఆయన మరణం పట్ల తమిళ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. బాబు సినీ ప్రస్థానం! 1990ల్లో 'ఎన్ ఉయిర్ తోజన్' అనే సినిమాతో అరంగేట్రం తమిళ చిత్ర పరిశ్రమల్లో అగ్ర కథానాయకుడిగా ఎదిగారు. ఆ తర్వాత 'పెరుంపుల్లి', 'తాయమ్మ', 'పొన్నుకు చేతి వందచు' చిత్రాల్లో హీరోగా నటించారు. పల్లెటూరి కథలు తనకు బాగా వర్కవుట్ అవుతాయని కోలీవుడ్‌లో చెప్పుకుంటున్న తరుణంలో తన ఐదవ చిత్రం ‘మనసారా పరిహితంగానే’ చిత్రంలో నటించారు. ఆ సినిమానే బాబు జీవితాన్ని ఒక్కసారిగా మలుపుతిప్పింది. షూటింగ్ సమయంలోనే ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ ఫైట్ సీన్ వల్లే! ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన కొద్ది రోజులకే ఓ ఫైట్ సీన్ చిత్రీకరించారు. సన్నివేశంలో హీరో నేలపై నుంచి దూకాలి. నిజంగానే జంపింగ్ చేస్తానని బాబు చెప్పడంతో యూనిట్ అందుకు అంగీకరించలేదు. డూప్ పెట్టుకోవచ్చు కదా అని దర్శకుడు చెప్పినా వినకుండా రియలిస్టిక్‌గా ఉంటుందని.. అంటూ బాబు నిజంగానే జంప్ చేశాడు. ఆ తర్వాత అనుకోకుండా బాబు ప్రమాదవశాత్తు మరో చోట పడిపోవడంతో వీపుపై బలంగా తగిలి ఎముకలు విరిగిపోయాయి. వెన్నెముకకు శస్త్ర చికిత్స చేయించుకున్నప్పటికీ బాబు నిటారుగా కూర్చోలేని పరిస్థితి నెలకొంది. అతని కుటుంబం చాలా మంది వైద్యులను సంప్రదించి చికిత్స అందించింది. కానీ అవేమీ పని చేయలేదు. భారతీరాజా సంతాపం సెట్లో జరిగిన ప్రమాదంలో గాయపడి 30 ఏళ్లుగా మంచానికే పరిమితమైన బాబు మరణించాడనే వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకురాలని నేను ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా. అంటూ సంతాపం ప్రకటించారు. కొన్ని నెలల క్రితమే దర్శకుడు భారతీరాజా బాబును స్వయంగా సందర్శించి వెళ్లిపోయారు. అయితే ఆ షూటింగ్ సమయంలో బాబు దెబ్బలు తిన్న తర్వాత మరో హీరోతో ‘మనసారా పరిహితంగానే’ సినిమా తీసినట్లు తెలుస్తోంది. బలమైన కోరికతో సినిమాల్లోకి వచ్చిన వ్యక్తి జీవితాన్ని ఫైట్ సీన్ ముగించింది. బాబుకు రాజకీయ నేపథ్యం కూడా ఉంది. ఎంజీఆర్, జయలలిత కాలంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా స్పీకర్‌గా అనేక పదవులను నిర్వహించిన కె. రాజారాం అతని మామ అవుతారు. -
40 ఇయర్స్ ఇండస్ట్రీ వచ్చినా.. ఫ్లాప్ షోనే ఎందుకు?
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జిల్లాలో మూడు రోజుల పర్యటన ప్రజల్ని ఆకట్టుకోలేకపోయింది. ఆ పార్టీ కేడర్‌లో సైతం జోష్ నింపలేకపోయింది. వైఎస్సార్ కడప జిల్లా నుంచి జిల్లాలోని గిద్దలూరుకు బుధవారం రాత్రి ఆయన చేరుకున్నారు. అదేరోజు రాత్రి నిర్వహించిన బహిరంగ సభ జనం లేక వెలవెలబోయింది. మొదటి సబే అట్టర్ ప్లాప్ కావడంతో అక్కడి నుంచే టీడీపీ నాయకులు, కేడర్‌పై చంద్రబాబు అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మూడు రోజుల పర్యటనలో చంద్రబాబు పార్టీ కేడర్‌లో ఊపు ఇవ్వలేకపోయారన్నది ఆ పార్టీ నేతల నోటి నుంచే వినిపిస్తోంది. గిద్దలూరు నుంచి ఆ రోజు రాత్రి 11 గంటలకు బయలుదేరి మార్కాపురం చేరుకున్నారు. మార్కాపురంలోనే బస చేశారు. గురువారం రెండో రోజు చంద్రబాబు పుట్టిన రోజు అక్కడే నిర్వహించుకున్నారు. తొలుత పుట్టిన రోజు వేడుకలను మార్కాపురంలో భారీగా నిర్వహించాలనుకున్నారు. జిల్లా వ్యాప్తంగా జన సమీకరణ చేయాలని చూశారు. కానీ, విఫలమయ్యారు. ఒక పక్క పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ ఉండగానే మహిళలు లేచి వెళ్లిపోవడం కనిపించింది. ఇక అదే రోజు సాయంత్రం మార్కాపురంలో నిర్వహించిన సభ సైతం తుస్సుమనిపించింది. వెలిగొండ ప్రాజెక్టు మీద చెప్పిందే చెప్పి.. మళ్లీ..మళ్లీ చెప్పి ప్రజలను విసుగెత్తించారు. తాను అధికారంలో ఉండగా ఒక టన్నెల్‌ను కూడా 5 కిలోమీటర్లు పూర్తి చేయించలేని ఆయన.. మళ్లీ అధికారంలోకి వస్తే వెలిగొండను ప్రారంభించి పశ్చిమ ప్రకాశం ప్రజల కష్టాలు తీరుస్తానంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చారు. ముచ్చటగా మూడో రోజు సైతం శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ చంద్రబాబు మార్కాపురంలోనే కాలక్షేపం చేశారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం డాక్టర్లు, ఎంపిక చేసిన మీడియా ప్రతినిధులు, రైతులతో విడివిడిగా ముఖాముఖీలు ఉంటాయని నాయకులు తెలిపారు. అయితే, అలాంటివేమీ జరగులేదు. ఎంపిక చేసుకున్న కొద్దిమంది రైతులతో మాత్రమే ముఖాముఖి నిర్వహించి ముగించారు. అది కూడా మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకే జరిగింది. సెల్ఫీలతో కాలక్షేపం.. మధ్యాహ్నం నుంచి చంద్రబాబు పార్టీ నేతలు, కార్యకర్తలతో సెల్ఫీలు దిగుతూ గడిపారు. సాయంత్రం 5 గంటలకు మార్కాపురం నుంచి యర్రగొండపాలెం బయలుదేరి వెళ్లారు. బయలుదేరినప్పటి నుంచే చంద్రబాబు కేడర్‌పై కొంత అసహనం వ్యక్తం చేస్తూ వచ్చారు. దళితుల నిరసన సెగ... యర్రగొండపాలెం పర్యటనకు వచ్చిన చంద్రబాబుకు దళితుల నుంచి సెగ ఎదురైంది. దళితులు చంద్రబాబు పర్యటనను అడ్డుకున్నారు. దళితులపై చేసిన వాఖ్యలకు క్షమాపణ చెప్పాలంటూ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో చంద్రబాబు పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. నల్ల టీ షర్టులు, ప్లకార్డులు, నల్ల బెలూన్లు ప్రదర్శించి చంద్రబాబుకు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దళితుల వ్యతిరేకి చంద్రబాబు అంటూ ఆయన పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దళితులను రెచ్చగొట్టే ప్రయత్నాలను చంద్రబాబు స్వయంగా చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్న వారికి వేలు చూపించి మరీ బెదిరించారు. చంద్రబాబు ప్రసంగంతో టీడీపీ కేడర్ కూడా రెచ్చిపోయి దళితులపైకి రాళ్లు రువ్వడంతో వైఎస్సార్ సీపీ నేతలతో పాటు పలువురు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. చంద్రబాబు వ్యవహరించిన తీరు పలు విమర్శలకు దారితీసింది. బయటపడిన విభేదాలు... చంద్రబాబు పర్యటనలో గిద్దలూరు, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో టీడీపీ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. అధినేత పర్యటన సందర్భంగా తమను పట్టించుకోలేదంటూ గిద్దలూరులో సాయికల్పన అలకబూనారు. అశోక్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే యర్రగొండపాలెం పట్టణంలో గ్రూపుల వారీగా అధినేత జన్మదిన వేడుకలు నిర్వహించారు. కొంత మంది నేతలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తీరుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ ప్రకాశంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పర్యటన ఫ్లాప్ షోగా మిగిలిపోయింది. మూడు రోజులు ఆయన ఇక్కడే ఉన్నా కేడర్‌లో ఏమాత్రం జోష్ కనిపించలేదు. ఆయన పార్టీ కేడర్‌పై అసహనం వ్యక్తం చేయడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు చిన్నబుచ్చుకున్నారు. మూడు ప్రాంతాల్లో నిర్వహించిన సభల్లో ఆయన చేసిన ప్రసంగాలు ప్రజల్ని ఆకట్టుకోలేకపోయాయి. వెలిగొండ ప్రాజెక్టు, పశ్చిమ ప్రాంతం అభివృద్ధిపై ఆయన దశాబ్దకాలంగా చెబుతున్న అబద్దాలే తిరిగి చెప్పారని ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. -
వేతనం రాక.. వెతలు తీరక
బీబీపేట: నాలుగు నెలలుగా వేతనాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిన ఓ పంచాయతీ పారిశుధ్య కార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మరో పదిరోజుల్లో ఆయన భార్య బిడ్డకు జన్మనివ్వనుండగా... ఈలోపే తన భర్త ఆత్మహత్య చేసుకోవడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతోంది. కామారెడ్డి జిల్లా బీబీపేట పంచాయతీలో ఆదివా రం జరిగిన ఈ విషాద ఘటన వివరాలిలా ఉన్నాయి. బీబీపేట గ్రామ పంచాయ తీలో వాటర్‌మన్‌గా పని చేస్తోన్న కొంగరి బాబు(32)కు 4 నెలలుగా వేతనం రావ డం లేదు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. భార్యకు ప్రసవ సమయం సమీపిస్తుండటం, చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో మనోవేద నకు గురై న బాబు.. ఆదివారం పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఉరి వేసుకుని ఆత్మ హత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న తోటి కార్మికులు, కుటుంబ సభ్యు లు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే బాబు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. పోలీసులు సర్దిచెప్పడానికి ప్రయత్నించినా ఆందోళన విరమించలేదు. సర్పంచ్‌తో పాటు పాలకవర్గం సభ్యులు, ప్రజాప్రతి నిధులు అక్కడకు చేరుకుని బాధితుడి కుటుంబానికి న్యాయం చేస్తామని, కుటుంబంలో ఒకరికి అదే ఉద్యోగాన్ని ఇస్తామని హామీనివ్వడంతో ఆందోళన విరమించారు. మృతుడికి భార్య దేవలక్ష్మి, కుమారుడు భరత్, కూతురు మేఘన ఉన్నారు. దేవలక్ష్మి పురిటి కోసం ముంబయిలో ఉన్న పుట్టింటికి వెళ్లింది. పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం నాలుగు నెలలుగా వేతనాలు విడుదల కావడం లేదని, వారి పరిస్థితిని అర్థం చేసుకుని పంచాయతీ నిధులలోంచి రెండు నెలల వేతనాన్ని ఇచ్చామని సర్పంచ్ లక్ష్మి తెలిపారు. -
గన్ షాట్ : చంద్రబాబుకు సీమ నేర్పిన పాఠం ఏంటి ..?
-
ఒంగోలులో శ్రీకారం చుట్టుకున్న‘సత్యం వధ - ధర్మం చెర’
ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అరాచకాలను ఎండగడుతూ తెరకెక్కుతున్న చిత్రం ‘సత్యం వధ - ధర్మం చెర’. బాబు నిమ్మగడ్డ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని త్రిదేవ్ క్రియేషన్స్ పతాకంపై రమాదేవి నిమ్మగడ్డ నిర్మిస్తున్నారు. ఒంగోలు, గోపాలస్వామి కన్వెన్షన్ హాల్ లో ఈ చిత్ర ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. రమణారెడ్డి-పూజలపై చిత్రీకరించిన ముహర్తపు సన్నివేశానికి ప్రముఖ పారిశ్రామికవేత్త సిద్ధా హనుమంతరావు క్లాప్ కొట్టగా... రవి శంకర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత కంది రమేష్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. మార్వెల్ గ్రైనేట్స్ అధినేత సూదనగుంట కోటేశ్వరరావు గౌరవ దర్సకత్వం వహించారు. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అరాచకాలను ఎండగడుతూ తెరకెక్కుతున్న ‘సత్యం వధ - ధర్మం చెర’ప్రేక్షకులతో ఆలోచింపజేస్తూనే అమితంగా అలరిస్తుందని దర్శకుడు బాబు నిమ్మగడ్డ అన్నారు. స్వాతి విఘ్నేశ్వరి, ఆల్లు రమేష్, రోహిణి, కీర్తి, రాజా, బద్రీనాథ్, సాగర్, సీత, బిందు భార్గవి, మమతారెడ్డి, బిందుకృష్ణ, మధుబాల, బాబు బంగారు, బి.కె.పి.చౌదరి, శ్రీనివాస్ రెడ్డి, అనిల్ కుమార్, అనంతలక్ష్మి, రమేష్ రాజా ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. -
వ్యవసాయం దండగన్న వ్యక్తి చంద్రబాబు: పెద్దిరెడ్డి
-
ప్రభుత్వం పై లోకేష్ పిచ్చికుక్కలా అరుస్తున్నారు : కొడాలి నాని
-
ఎమ్మెల్యే పొలంబాట
చిత్తూరు రూరల్ :ఎప్పుడూ ప్రజాసేవ, అభివృద్ధి కార్యక్రమాలతో బిజీగా కనిపించే పూతలపట్టు ఎమ్మెల్యే ఎం.ఎస్.బాబు ఆదివారం పొలం బాటపట్టారు. చిత్తూరు మండలం 5 వెంకటాపురం(పిళ్లారిమిట్ట) గ్రామంలోని తన పొలంలో వేరుశనగ పంట వేశారు. ఆదివారం పొద్దునే ఆవులను మేతకు తోలుకెళ్లి పంటను పరిశీలించారు. పొలంలో ఉన్న మామిడి చెట్ల కొమ్మలను కొద్దిసేపు కత్తిరించారు. -
స్మగ్లర్ బాబు.. కటకటాల పాలు
కడప అర్బన్ : తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా, అనేకట్ తాలూకా బంగ్లామేడు గ్రామానికి చెందిన అనేకట్ బాబు అలియాస్ వేలూరు బాబు అలియాస్ మురుగేషన్ బాబు చదివింది కేవలం పదవ తరగతి మాత్రమే. మొదట చందనం అక్రమ రవాణాకు పాల్పడుతుండేవాడు. ఆ తరువాత అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లు సేతు మాధవన్, మణియప్పన్‌లకు ప్రధాన అనుచరుడిగా ఎదిగాడు. ఇతను ప్రస్తుతం వేలూరు సమీపంలోని కాట్పాడిలో నివాసముంటున్నాడు. ఇతని స్వగ్రామం బంగ్లామేడు గ్రామం చుట్టు పక్కల ప్రాంతాల అడవుల్లో (జావాది హిల్స్) తన అనుచరులతో కలిసి చందనం చెట్లు నరికి వాటిని దుంగలుగా తయారు చేసేవాడు. 1990 నుంచి చందనం (శ్యాండిల్ వుడ్) అక్రమరవాణా చేస్తూ డబ్బును సంపాదించాడు. 1992 నుంచి 2000 సంవత్సరం వరకు ఆరు కేసులను తమిళనాడు రాష్ట్రం అటవీ, పోలీసు అధికారులు నమోదు చేశారు. చందనం అక్రమ రవాణా తర్వాత 2010 నుంచి తమిళనాడుకు చెందిన పలువురు ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాలు ఏర్పరచుకుని అప్పటి నుంచి ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్నాడు. ఇతను తమ ప్రాంతంలోని చెట్లు నరికే కూలీలకు భారీగా డబ్బు ఆశ చూపి వారి సహకారంతో రాయలసీమ జిల్లాలలోని శేషాచలం, లంకమల్ల, నల్లమల, అటవీ ప్రాంతాల నుంచి వాహనాలలో ఎర్రచందనం దుంగలను తమిళనాడు రాష్ట్రానికి చేరవేసి అక్కడి అంతర్జాతీయ స్మగ్లర్లకు అందజేసేవాడు. ఇటీవల జిల్లాలో అరెస్టయిన సేతు మాధవన్, ఆర్కాట్ భాయ్‌ల విచారణలో అనేకట్ బాబు గుట్టు రట్టయింది. జిల్లాలో ఇతను 24 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. 2010 నుంచి దాదాపు 500 టన్నుల ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడ్డాడని పోలీసుల విచారణలో తెలిసింది. అనేకట్ బాబుతో పాటు మరో నలుగురు అరెస్ట్ : అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ అనేకట్ బాబుతో పాటు, చిత్తూరు జిల్లాకు చెందిన సుధాకర్, సత్య, హైదర్ ఆలీలు వృత్తి రీత్యా డ్రైవర్లుగా, అనేకట్ బాబుకు ప్రధాన అనుచరులుగా ఉన్నారు. అనేకట్ బాబు ఆదేశాల మేరకు తమిళనాడు నుంచి కూలీలను తీసుకొచ్చి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని శేషాచలం, నల్లమల, లంకమల, పాలకొండలు అటవీ ప్రాంతాల్లోకి వాహనాల్లో చేరవేస్తూ ఉంటారు. వీరిపై జిల్లాలో మూడు కేసులు నమోదయ్యాయి. వీరితోపాటు కడప నగరం ఎర్రముక్కపల్లెకు చెందిన షేక్ మున్నా ఆటో డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఇతను సుధాకర్, సత్యలకు అనుచరుడిగా ఉంటూ వారు చెప్పిన మేరకు ఎర్రచందనం నరికే వారిని బస్టాండు, రైల్వేస్టేషన్ల నుంచి తన ఆటోలో తీసుకెళ్లి మైదుకూరు, పోరుమామిళ్ల అటవీ ప్రాంతాల సమీపంలో వదిలేవాడు. వారికి బియ్యం, కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలను చేరవేసేవాడు. ఇతనిపై జిల్లాలో మూడు కేసులు నమోదయ్యాయి. జిల్లా ఎస్పీ బాబూజీ అట్టాడ నేతృత్వంలో పోలీసులు పక్కా వ్యూహంతో వీరిని అరెస్టు చేశారు. -
ఆడుకుంటూ.. మృత్యుఒడిలోకి
♦ బాలుడిని చిదిమేసిన లారీ ♦ వలస కుటుంబానికి తీరని శోకం బోయినపల్లి(చొప్పదండి) : అప్పటిదాకా ఆ బాలుడు అమ్మ ఒడిలో ఆడుకున్నాడు. ఇంట్లో పని ఉండడంతో తల్లి లోపలికి వెళ్లగా.. ఇంటిముందు ఆడుకుంటూనే క్షణాల్లో మృత్యుఒడిలోకి చేరాడు. మృత్యురూపంలో వచ్చిన లారీ ఆ ముక్కుపచ్చలారని బాలుడిని కబళించింది. ఈ విషాదకరమైన సంఘటన బోయినపల్లి మండలం కొదురుపాక క్రాస్‌రోడ్డు వద్ద మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. జయశంకర్భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం మేదరిమడ్ల గ్రామానికి చెందిన వైనాల తిరుమల, రాజు దంపతులు. కొదరుపాక క్రాస్‌రోడ్డులో ఉన్న సిమెంట్ బ్రిక్స్‌లో పనిచేసేందుకు వచ్చారు. ఇద్దరు వాచ్మెన్, కార్మికులుగా ఆర్నెల్ల నుంచి పనిచేస్తున్నారు. వీరికో బాబు, పాప సంతానం. కొడుకు అయన్(18నెలలు)ను తల్లి తిరుమల ఇంటిముందు ఆడిస్తోంది. డ్రైవర్ అజాగ్రత్తతో పోయిన ప్రాణం కొడుకును ఆడుకోమని చెప్పిన తల్లి ఇంట్లో పని ఉండడంతో లోపలికి వెళ్లింది. ఆమె అలా లోపలికి వెళ్లిందో..లేదో.. యాష్‌డస్ట్‌తో వచ్చిన లారీ అయన్ను ఢీకొంది. బాలుడు వెనుక టైరుకింద పడిపోవడంతో తల నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతిచెందాడు. కళ్లముందు అప్పటివరకు ఆడుకున్న కుమారుడు మృత్యుఒడిలోకి చేరడంతో ఆ తల్లి గుండెలవిసేలా రోదించింది. రాజును ఆపడం ఎవరితరమూ కాలేదు. అజాగ్రత్తగా లారీ నడిపి బాలుడి మృతికి కారణమైన డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్ బుచ్చినాయుడు తెలిపారు. -
ఉద్దానంపై బాబు కపట నాటకం
-
హిట్లర్ పాలనను తలపిస్తోంది
టీడీపీ ప్రభుత్వంపై జక్కంపూడి ఆగ్రహం ధవళేశ్వరంలో 23 మంది కాపు నాయకుల అరెస్టు ధవళేశ్వరం : రాష్ట్రంలో హిట్లర్ పాలన తలపించే విధంగా చంద్రబాబు నాయుడు పరిపాలనను సాగిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి విమర్శించారు. శనివారం ఆమె ధవళేశ్వరం పోలీస్‌స్టేషన్‌లో ఉన్న కాపు సంఘ నాయకులను కలిసి సంఘీభావం తెలిపారు. అంతకు ముందు అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చేందుకు ర్యాలీగా బయలు దేరిన కాపు సంఘ నాయకులను పోలీసులు స్టేషన్ సెంటర్లో అడ్డుకున్నారు. అక్కడే నిరసనకు దిగిన కాపు సంఘ నాయకులను అరెస్ట్ చేశారు. విషయం తెలసుకున్న జక్కంపూడి విజయలక్ష్మి ధవళేశ్వరం పోలీస్‌స్టేషన్ చేరుకొని దక్షిణ మండల డీఎస్పీ నారాయణరావుతో చర్చించారు. అనంతరం అరెస్ట్ అయిన కాపు నాయకులను విడుదలచేశారు. విజయలక్ష్మి మాట్లాడుతూ కాపులపై వివిధ సెక్షన్లు ప్రయోగిస్తూ చంద్రబాబు వేధింపులకు గురిచేయడం దారుణమన్నారు. కాపులకు, బీసీలకు మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ కాపు ప్రజాప్రతిని«ధులు విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. విశాఖ భూములను గంటా శ్రీనివాసరావుకు, అంగన్వాడీ కేంద్రాలను మంత్రి నారాయణకు నజరానాగా ఇవ్వడం వల్లనే వారు విమర్శలకు పాల్పడుతున్నారన్నారు. ఇప్పటికైనా ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ధవళేశ్వరం బస్టాండ్సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి వినతి పత్రం అందజేశారు. కాపు సంఘ నాయకులు పెన్నాడ జయప్రసాద్, మెండా సత్తులు, గరగ శ్రీనివాసరావు, బండారు బంపి, దొండపాటి శ్రీనివాస్, సాధనాల చంద్రశేఖర్ (శివ), ఏజీఆర్ నాయుడు, ముత్యాల పోసికుమార్, శ్రీరంగం బాలరాజు, యడ్ల మహేష్, యడ్ల వెంకటేష్, అల్లంపల్లి ముత్యాలు, పందిళ్ల భానుప్రసాద్, దూది సాయి, నూకరాజు, గపూర్, గాలి ప్రసన్నకుమార్, దళిత సంఘ నాయకులు రేగుళ్ల రఘు, మిరప రమేష్, రాజేష్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
స్కీములు వారికి... కేసులు మాకు
స్వేచ్ఛగా బ్రతికే పరిస్థితి జిల్లాలో లేదు అనపర్తి : బ్రిటిష్ వారి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు విభజించు–పాలించు దుర్నీతిని అనుసరించి పాలన చేస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి దుయ్యబట్టారు. అనపర్తిలో వైస్సార్సీపీ మండల కన్వీనర్ మల్లిడి ఆదినారాయణరెడ్డి పుట్టిన రోజు వేడుకల్లో జగ్గిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనపర్తి నియోజకవర్గం కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో స్వేచ్ఛగా బ్రతికే పరిస్థితిలు లేకుండా పోయాయన్నారు. ప్రభుత్వం అమలు చేసే పథకాలు పచ్చ చొక్కాల వారికి అందజేస్తూ, వైఎస్సార్ సీపీ సానుభూతి పరులపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తున్నారని ఆయన విమర్శించారు. దేశంలో ప్రతి ఒక్కరికీ నిరసన తెలిపే స్వేచ్ఛ, హక్కు ఉందన్నారు. ముద్రగడ పద్మనాభం చేపట్టబోయే పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా వైఎస్సార్సీపీ శ్రేణులను అణచి వేసేందుకు అధికారపార్టీ నాయకులు కుట్ర సాగుతోందన్నారు. అప్పటికే ప్రభుత్వం గత కొన్ని రోజులుగా సెక్షన్ 30 అమలు చేయటంతో సామాన్యులు ఇబ్బందికర పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముద్రగడ పాదయాత్రను సైతం చంద్రబాబు సర్కారు రాజకీయం చేస్తూ, అమాయకులపై కేసులు నమోదు చేయడం తగదని, దీనికి చంద్రబాబునాయుడు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. జగన్ మోహన్‌రెడ్డి ప్రకటించిన నవ రత్నాలు స్కీమ్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మతి భ్రమించిందన్నారు. ఏమీ పాలుపోని స్థితిలో ఉన్న ఆయన నిరసన కార్యక్రమాలను సైతం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు చేస్తున్న నిరంకుశ పాలనను గుర్తెరిగిన ప్రజలు తెలుగుదేశం పాలనకు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. మండల స్ధాయి నేతలను, నాయకులను, కార్యకర్తలను గౌరవించే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న నియోజకవర్గ పార్టీ నాయకత్వాన్ని, పార్టీ శ్రేణులను ఆయన అభినందించారు. వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి, జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి సత్తి వీర్రెడ్డి, జిల్లా కార్యదర్శి చిర్ల వీర్రాఘవరెడ్డి, కాపు నేతలు అడబాల వెంకటేశ్వరరావు, యక్కలదేవి శ్రీను, ర్యాలి కృష్ణ, కేదారి రంగారావు, చింతా భాస్కరరామారావు, కేదారి బాబూరావు, గొల్లు హేమసురేష్, పడాల వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బాబు దిగిపోతేనే పోలీసు సెక్షన్లు పోతాయి
కాకినాడ సిటీ : జిల్లాను ఒక రోగం పట్టుకుని పీడిస్తోందని ఎప్పుడూ సెక్ష¯ŒS–30, సెక్ష¯ŒS–144లు అమలులో ఉంటాయని ఇవి పోవాలంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దిగిపోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. ప్రజాసమస్యలపై పోరుబాటలో భాగంగా సీపీఐ జిల్లా కమిటి బుధవారం కాకినాడలో ప్రజాగర్జన నిర్వహించింది. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొని కలెక్టరేట్ ఎదుట జరిగిన సభలో మాట్లాడుతూ పోలవరం నిర్వాసితుల సమస్యలు అధికంగా ఉన్నాయన్నారు. ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లా ఏలేరుపాడు, కుక్కునూరు ప్రాంతాల్లో ఆర్అండ్ఆర్ సర్వే చేపట్టి మెరుగైన ప్యాకేజీ ఇస్తున్నారని కాని ఈ జిల్లాలోని నాలుగు ముంపు మండలాల్లో సర్వే చేయడంలేదన్నారు. తక్షణం ప్రభుత్వం స్పందించి ప్యాకేజీ ప్రకటించకుంటే పోలవరంపై ఢిల్లీలో ధర్నా చేపడతామని ప్రకటించారు. మరోపక్క కనీస సౌకర్యాలు, తాగునీరు లేక, విష జ్వరాలతో గిరిజనులు బాధపడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఏజన్సీలో మందులు కూడా అందుబాటులో లేని పరిస్థితి ఉందన్నారు. ముఖ్యమంత్రి గడిచిన మూడేళ్లుగా అందరికీ ఇళ్లని చెబుతున్నారని, ఇప్పటి వరకు ఒక ఇల్లు కూడా నిర్మించలేదన్నారు. జన్మభూమి కమిటీల వల్ల అర్హులైన లబ్ధిదారులు నష్టపోతున్నా, ప్రభుత్వం వాటినే ప్రోత్సహిస్తోందని విమర్శించారు. ఆందోళన అనంతరం కలెక్టర్ కార్తికేయ మిశ్రాకు ప్రజాసమస్యలపై వినతిపత్రం అందజేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, జిల్లా కార్యవర్గ సభ్యులు నల్లా రామారావు, నాయకులు కె.సత్తిబాబు, డాక్టర్ సి.స్టాలిన్, తోకల ప్రసాద్, పెదిరెడ్డి సత్యనారాయణ, చెల్లుబోయిన కేశవశెట్టి పాల్గొన్నారు. భారీ ర్యాలీ, వినూత్న ప్రదర్శనలు : జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన పార్టి శ్రేణులు, అభిమానులు సీపీఐ ప్రజాగర్జనలో భాగంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆనందభారతి ఆవరణ నుంచి కల్ప నా సెంటర్, మెయి¯ŒSరోడ్డు, మసీద్ సెంటర్, దేవాలయంవీధి, బాలాజీ చెరువుసెంటర్, జెడ్పీసెంటర్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ సాగింది. ఈ ర్యాలీలో చేపట్టిన వినూత్న ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. జీఎస్టీ మోత..ప్రజలకు వాత అంటూ ఎడ్లబండిని లాగుతూ ప్రదర్శించారు. గిరిజనులు విల్లంబులతోనూ, గిరిజన మహిళలు నృత్య ప్రదర్శనగా ర్యాలీలో పాల్గొన్నారు. -
మృత్యువుతో పోరాటం
♦ విషమంగా వైఎస్సార్సీపీ కార్యకర్త బాబులు పరిస్థితి ♦ దాడికి బాధ్యులు ఎమ్మెల్యే అనుచరులే.. కోట(గూడూరు): టీడీపీ వర్గీయుల దాడిలో తీవ్రంగా గాయపడి నెల్లూరు నారాయణ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్సీపీ నాయకులు బాబులు, శ్రీధర్ల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వీరిలో బాబులు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైఎస్సార్సీపీ నాయకులు తెలిపారు. వైఎస్సార్సీపీ నాయకుడు పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి తన అనుచరులపై దాడిని ఖండించారు. మరో వైపు కొత్తపట్నం పంచాయతీ పరిధిలోని నాలుగు గ్రామాల్లో శనివారం కూడా పోలీస్ పహారా కొనసాగింది. వాకాడు సీఐ సత్యనారాయణ, గూడూరు రూరల్ సీఐ అక్కేశ్వరరావు, ఆరుగురు ఎస్సైలు, సిబ్బంది పికెట్ ఏర్పాటు చేశారు. అట్రాసిటీ డీఎస్పీ సుధాకర్ కొత్తపట్నంలో జరిగిన ఘటనపై విచారణ జరిపారు. దాడి చేసిన కొత్తపట్నం ఎంపీటీసీ, టీడీపీ నాయకుడు తిరుపాలయ్య గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్‌కు ముఖ్య అనుచరుడని తెలుస్తోంది. తిరుపాలయ్యతోపాటు ముద్దాయిలను కాపాడేందుకు ఎమ్మెల్యేనే స్వయంగా రంగంలోకి దిగి కేసు తీవ్రతను తగ్గించేలా పోలీస్ అధికారులపై ఒత్తిడి పెంచినట్లు సమాచారం. ఫ్యాక్షన్ ఏరియాగా మారుతున్న కోట మండలం కోట మండలంలో అధికారపార్టీ నేతల ఆగడాలకు, దౌర్జన్యాలకు అంతే లేకుండాపోతోంది. ఎమ్మెల్యే అండదండలు ఉండడంతో గ్రామాల్లో వివాదాలకు ఆజ్యం పోస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. ఒకవైపు కేసవరం పంచాయతీ రాఘవాపురంలో పోలీస్ పికెట్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక్కడ రెండు నెలలుగా ఇరువర్గాల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. ఇరువర్గాల వారు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ అనుచరులే కావడం గమనార్హం. ఒకరు తొలి నుంచి టీడీపీలో ఉన్న వారు కాగా ఎమ్మెల్యేతోపాటు టీడీపీలోకి వెళ్లిన వారు మరొకరు. సమర్థులైన పోలీసు అధికారులు ఉన్నా ఒత్తిళ్ల కారణంగా నిస్సహాయస్థితిలో ఉంటూ ఘర్షణలను నివారించలేకపోతున్నారు. ఇరువర్గాలకు చెందిన 60 మందిపై కేసులు నడుస్తున్నాయి. మండలంలో ఇదే విషయమై చర్చ జరుగుతుండగా తాజాగా కొత్తపట్నం పంచాయతీలో చోటుచేసుకున్న దాడులు ప్రజల్ని భయపెడుతున్నాయి. భూవివాదమై మాట్లాడుకునేందుకు పిలిచి ఎమ్మెల్యే అనుచరుడు తిరుపాలయ్య ముందుగా వేసుకున్న పథకం ప్రకారం వైఎస్సార్సీపీ నేత పేర్నాటి అనుచరులపై మారుణాయుధాలతో దాడి చేశారు. -
నీకోసం ప్రాణం లాగుతోంది!
‘పాలొల్ల లగ్గానికని నగరంకు పోయిన కొడుకు తిరిగి రాలేదు. ఇరువై రెండేండ్ల సంది కొడుకు కోసం లెంకుతనే ఉన్న. తిరిగి తిరిగి అయ్య సచ్చిపోయిండు. ఆడు దొరికేదాక లెంకుతనే ఉంట. ఒక్కసారి ఆని మొఖం జూస్తే నా పానం తుర్తి అయితది. నా దగ్గర ఉండకున్న సరే. మంచిగుంటే సాలు’ రెండు దశాబ్దాలుగా కొడుకు జాడ కోసం తపిస్తున్న ఓ కన్నతల్లి ఆవేదన. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని దేమికలాన్ గ్రామానికి చెందిన బొల్లి నర్సయ్య–శివవ్వ దంపతులకు ఒక్కగానొక్క కొడుకు బాబు. తండ్రి నర్సయ్య బొంబాయిలో నౌకరి జేస్తుంటే, తల్లి శివవ్వ కొడుకును చదివిపించుకుంట ఇంటికాడనే ఉండేది. కొడుకు చదువులో ఉషారుగా ఉండెటోడు. ఎవరి తెరువు పోయేటోడు కాదు. మంచిగ చదువుకునేటోడు. టెన్త్, ఇంటర్ పూర్తి చేసి డిగ్రీలో చేరిండు. కామారెడ్డిలో డిగ్రీ చదువుతున్న బాబు 1995లో సదాశివనగర్‌లో జరిగిన బంధువుల పెళ్లికని వెళ్లిండు. ఆ రోజు తిరిగి ఇంటికి రాలేడు. కొడుకు రాకపోయేసరికి తల్లి బేజారైంది. కొడుకు జాడ కోసం అప్పటి నుంచి వెతుకుతనే ఉంది. ఎక్కడా దొరకలేదు. చేతగాని వయసులో ఉన్నప్పటికీ కొడుకు కోసం ఆమె తిరుగుతనే ఉంది. బొంబాయిలో ఉన్న తండ్రి నర్సయ్య ఉద్యోగాన్ని వదిలిపెట్టి సొంతూరికి చేరాడు. కొడుకు కోసం ఏళ్ల తరబడి తిరిగాడు. ఎక్కడా ఆచూకీ దొరకలేదు. కొడుకు కోసం ఏడ్చి ఏడ్చి, తిరిగి తిరిగి అనారోగ్యం పాలైన నర్సయ్య నాలుగేండ్ల కిందట కన్నుమూసిండు. కాని శివవ్వ మాత్రం కన్నకొడుకు ఎక్కడో ఉన్నాడని ఆశతో బతుకుతోంది. ఏనాటికైనా తన కొడుకు వస్తాడని నమ్ముతోంది. తెలిసిన వారినల్లా ఏడైనా నా కొడుకు కనిపించిండా అని ఇప్పటికీ అడుగుతూనే ఉంటోంది. బంధువుల ఇళ్లకు, వెళ్లిన చోటల్లా కొడుకు జాడ కోసం వెదుకులాడుతోంది ఆ తల్లి. భర్త సంపాదించిన డబ్బులన్నీ వెదుకులాటకే ఖర్చయ్యాయి. కొంత భూమి ఉంటే అది కూడా అమ్మారు. ఇక మిగిలింది చిన్న ఇల్లు మాత్రమే. నెలనెలా వస్తున్న ఆసరా పింఛన్ ఆధారంగా బతుకుతున్న శివవ్వ ఏనాటికైనా కొడుకు వస్తాడని నమ్ముతోంది. మిస్సింగ్...మిస్టరీ కొడుకు కనిపించకుండా పోయి సరిగ్గా 22 ఏళ్లయింది. కొడుకు ఆచూకీ కోసం నూటొక్క దేవుళ్లకు మొక్కుకున్నారు. కాని ఎక్కడా ఆచూకీ లభించలేదు. అయితే అదృశ్యమైన నాలుగేళ్లకు కొడుకు బాబు రాసినట్టుగా ఇంటికి ఉత్తరాలు వచ్చాయి. తాను హైదరాబాద్‌లో ఉన్నానని అందులో పేర్కొన్నాడు. వాటి ఆధారంగా తిరిగినా కూడా జాడ దొరకలేదు. కొడుకు కోసం తిరిగి తిరిగి అలసిపోయి, మనోవ్యాధితో మంచం పట్టిన భర్త తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. కొడుకే ఆశగా, శ్వాసగా బతుకుతున్న శివవ్వ మాత్రం ఇంకా తన కొడుకు వస్తాడని ఎదురుచూస్తోంది. బాబు అదృశ్యం మాత్రం మిస్టరీగానే మిగిలింది. ఇంటి దగ్గర ఏ సమస్యా లేదు. కుటుంబంలో కలహాలు అసలే ఉండేవి కావని గ్రామస్తులు అంటారు. మరి ఎందుకు అదృశ్యమయ్యాడు. అన్నదానికి మాత్రం ఎవరి దగ్గరా సమాధానం లేదు. ‘కాలేజీలో అందరితో బాగానే ఉండేవాడు. ఎవరితోటీ గొడవపడ్డ సంఘటనలూ లేవు. ఎందుకు అదృశ్యమైండో ఎవరికీ అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది’ అని గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు రాజయ్య అన్నారు. రోజూ కండ్లల్ల తిరుగుతనే ఉంటడు... కొడుకును ఎంతన్న పేమతోని పెంచుకున్న. కాలేజీ సదువుతుంటే నౌకరీ సంపాయించి నన్ను మంచిగ జూసుకుంటడని ఆశ ఉండేది. కొడుకు కానరాక ఇరువై రెండేండ్లయినా రోజూ నా కండ్లల్ల తిరుగుతనే ఉంటడు. తిన్నా, పన్నా కొడుకు కనబడుతుంటడు. ఆడు ఎన్నటికైనా అస్తడనే ఆశ ఉన్నది. అందుకే బతుకుతున్న. ఆని కోసం ఎన్నో ఊళ్లు తిరిగినా. ఆళ్ల అయ్య మస్తు రంది పడ్డడు. తిరిగి తిరిగి సచ్చిపోయిండు. నేను మాత్రం కొడుకు దొరికేదాక తిరుగతనే ఉంట. ఏడనో ఉండి ఉంటడు. వాడు ఒక్కసారి నాకు ముఖం జూయిస్తే చాలు. ఏడనన్న కనబడితే నాకు చెప్పుండ్రి సారూ! – బొల్లి శివవ్వ, బాబు తల్లి, దేమికలాన్ – సేపూరి వేణుగోపాల్‌చారి, స్టాఫ్ రిపోర్టర్, కామారెడ్డి. ఫొటోలు: అరుణ్గౌడ్ -
పెద్ద నోట్ల రద్దుపై మళ్లీ మాట మార్చిన బాబు
-
హామీలతో అన్నివర్గాలను వంచించిన బాబు
–మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి అనంతపురం సప్తగిరి సర్కిల్: ఎన్నికల్లో బూటకపు హామీలతో చంద్రబాబు అధికార పీఠం ఎక్కి ఆ తర్వాత అన్ని వర్గాలవారిని వంచించారని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి తెలిపారు. స్థానిక ఆర్డీఓ కార్యలయం ఎదుట ధర్నా చేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్ల దీక్షా శిబిరాన్ని గురునాథరెడ్డి సందర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో బీజేపీ, సినిమా హీరో పవన్‌కళ్యాణ్‌తో కలిసి హామీలను గుప్పించారన్నారు. హామీలను నెరవేర్చకపోవడంతో వంచనకు గురైనవర్గాలవారు కఽలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల మంది కాంట్రాక్ట్ అధ్యాపకులున్నారని, వారికి సమాన పనికి సమాన వేతనాన్ని అందించడం పెద్ద కష్టమైన పని కాదన్నారు. మంగళవారం విద్యార్థి సంఘాలు, యువజన నాయకులు, కాంట్రాక్ట్ అధ్యాపకులతో కలిసి కలెక్టరేట్ ముట్టడి నిర్వహిస్తామన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. జిల్లా అధికార ప్రతినిధి చింతకుంట మధు, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి నాగిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్రామిరెడ్డి, మైనార్టీ నాయకులు ముక్తియార్, కాంట్రాక్ట్ అధ్యాపకులు హనుమంతరెడ్డి, శివారెడ్డి, ఎర్రప్ప, రామలింగా, రామాంజినేయులు, రాధమ్మ, రాధిక, భాస్కర్‌రెడ్డి, అరుణ, శంకరప్ప, రామన్న, సత్యనారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు. -
నిరుద్యోగ యువతను మోసం చేసిన బాబు
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి గుంతకల్లు టౌన్: ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగులకు భృతి పేరుతో యువతను ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేశారని వైఎస్సార్సీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డితో కలిసి శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 1.80 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పేపర్ నోటిఫికేషన్, మెరిట్, కలెక్టర్ సెలెక్షన్)విధానాన్ని అమలు చేసి వీటిని భర్తీ చేయాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తే నిరుద్యోగ సమస్య తీరుతుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ తెచ్చి కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగ, కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేయాలన్నారు. అధికార పీఠం కోసం అడ్డమైన హామీలిచ్చి చంద్రబాబు అన్నివర్గాల ప్రజల్ని మోసం చేశారన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మేనిఫెస్టో నియంత్రణ కమిటీ వేసి ప్రాసిక్యూట్ చేయాలన్నారు. గుంతకల్లులో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుకు కృషి చేస్తానని గోపాల్‌రెడ్డి ప్రకటించారు. వై వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, నిరుద్యోగుల కోసం నిరంతరం పోరాడుతున్న ఏపీ ఎన్జీఓ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు వెన్నపూస గోపాల్‌రెడ్డిను గెలిపించుకుందామని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచార కరపత్రాలను వారు విడుదల చేశారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్, కౌన్సిలర్లు గోపి, రంగన్న, నగేష్, మాజీ కౌన్సిలర్ సుంకప్ప, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. -
భర్తను హతమార్చిన భార్య
రోకలిబండతో మోదడంతో మృతి వేధింపులు తాళలేకే హత్య చేసినట్లు నిందితురాలు వెల్లడి శ్రీకాళహస్తి : అగ్ని సాక్షిగా పెళ్లాడిన వ్యక్తి నిత్యం అనుమానాలతో వేధిస్తుండడంతో విసిగి వేసారిపోరుుంది. ఏళ్లకాలంగా వేధింపులు భరించలేక రోకలిబండతో మోది భర్తను మట్టుపెట్టింది. మంగళవారం అర్ధరాత్రి అనంతరం శ్రీకాళహస్తిలో చోటుచేసుకున్న ఈ సంఘటన చర్చనీయాంశమైంది. శ్రీకాళహస్తి డీఎస్పీ వెంకట కిశోర్ కథనం మేరకు..పట్టణంలోని ప్రాజెక్టు వీధిలో కాపురముంటున్న ఢిల్లీబాబు(37)కు రేవతితో 14ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి పూజ(11), పవన్(9) సంతానం. ఢిల్లీబాబుతోపాటు ఆయన సోదరుడు నాగరాజు, తల్లి వసంతమ్మ కూరగాయల మార్కెట్లో పనిచేస్తారు. ఈ క్రమంలో ఢిల్లీబాబు దుర్వ్యసనాలకు బానిసై తరచూ ఏదో ఒక వంకతో భార్యతో తగవులాడేవాడు. ఈ నేపథ్యంలో, మంగళవారం రాత్రి మద్యం సేవించి ఢిల్లీబాబు 10గంటలకు ఇంటికి చేరుకున్నాడు. భార్యతో గొడవ పడి తీవ్రంగా కొట్టాడు. మళ్లీ కొట్టబోయేసరికి ప్రతిఘటించింది. వంటరూములోని రోకలిబండ తీసుకుని ఎదురుదాడికి దిగింది. తలపై బలంగా కొట్టడంతో ఢిల్లీబాబు తీవ్రగాయంతో కుప్పకూలాడు. సమాచారం తెలుసుకున్న సీఐ చిన్నగోవిందు అక్కడికి చేరుకుని అతడిని ఆస్పత్రికి తరలించారు. అరుుతే అప్పటికే ఢిల్లీబాబు మృతిచెందినట్లు శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. నిందితురాలిని విచారణ శ్రీకాళహస్తి డీఎస్పీ, సీఐ నిందితురాలు రేవతిని అదుపులోకి తీసుకుని ఆమెతో పాటు స్థానికులనూ విచారణ చేశారు. ఘటన ప్రత్యక్ష సాక్షి అరుున హతుని కుమార్తె పూజ నుంచి మరింత సమాచారం రాబట్టే ప్రయత్నం చేశారు. ఆ ఇంట మరణ మృదంగమే.. మృతుని సోదరుడు నాగరాజు కూడా ఓ ముస్లిం యువతిని ప్రేమ వివాహం చేసుకుని ఇలాగే తరచూ వేధిస్తుండటంతో ఏడాది కిందట బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అలాగే హతుని తల్లి కూడా ఏడాది క్రితం ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందారు. తొలి నుంచీ కుటుంబ వాతావరణం సరిగా లేకపోవడం, తన భర్త పెడుతున్న వేధింపుల వలనే ఇలా చేయవలసి వచ్చిందని రేవతి పోలీసుల ఎదుట వాపోరుునట్లు తెలిసింది. సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నిజామాబాద్ జిల్లాలో తొలి, చివరి రోజు!
బాన్సువాడ: నిజామాబాద్ జిల్లా నేటితో రెండు జిల్లాలుగా మారనుంది. కొత్త జిల్లాగా కామారెడ్డి ఏర్పడనుంది. అయితే, సోమవారం పుట్టిన పిల్లలందరికీ ఆ రోజు చారిత్రాత్మకం కానుంది. సోమవారం జన్మించిన పిల్లలకు ఇచ్చే బర్త్ సర్టిఫికెట్లో నిజామాబాద్ జిల్లాగానే ఉంటుంది. అంటే ఒక్క రోజు నిజామాబాద్‌లో ఉండి, మిగతా జీవిత కాలం మొత్తం కామారెడ్డి జిల్లాలో కొనసాగనుంది. నిజామాబాద్ జిల్లాలో ఇదే తొలి, చివరి రోజు కావడంతో ఆ రోజు వారికి మరుపురాని రోజుగా మిగులనుంది. కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో సోమవారం సుమారు 200లకు పైగా పిల్లలు పుట్టారని అంచనా. అలాగే మంగళవారం పుట్టే పిల్లలకు కామారెడ్డి జిల్లా బర్త్ సర్టిఫికేట్ లభిస్తుంది. దీంతో సోమ, మంగళవారాల్లో జన్మించిన పిల్లలకు ఈ రెండ్రోజులుగా ప్రత్యేక రోజులుగా మారనున్నాయి. గుర్తుండిపోయే రోజు: అర్షియా, తిర్మలాపూర్ సోమవారం నాడు బాబు పుట్టాడు. నిజామాబాద్ జిల్లాలో పుట్టాడు కనుక నిజామాబాద్ జిల్లా పేరుతో బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు. మంగళవారం నుంచి కొత్త జిల్లాలోకి అడుగు పెడతాడు. ఈ రోజు ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. -
బాబు వెంటే కరువు : రఘువీరా
అగళి : అవిభక్త కవలలైన వాణి, వీణలను విడగొట్టడం ఎలా సాధ్యం కాలేదో చంద్రబాబును, కరువును విడగొట్టడం కూడా అలాగే సాధ్యం కాదని, కరువు ఎల్లప్పుడూ ఆయన వెంటే ఉంటుందని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధాకర్ వ్యంగ్య బాణాలు సంధించారు. సినిమా డైలాగుల తరహాలో ‘నన్ను చూసి కరువు పారిపోతుంది’ అనడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. వారు సోమవారం అగళి మండలంలోని పి.బ్యాడిగెర గ్రామ పరిధిలో ఎండిపోయిన వేరుశనగ పంటను పరిశీలించారు. అనంతరం హెచ్‌డీహళ్లి సబ్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ హయాంలో కరువొస్తే వెంటనే స్పందించి నష్టపరిహారం, బీమా అందించేవాళ్లమన్నారు. కానీ చంద్రబాబు పరిహారం రాకుండా చేసేందుకు రక్షక తడులు ఇచ్చినట్లు కేంద్రానికి నివేదిక పంపారన్నారు. కర్ణాటకలో ఇప్పటికే కరువు మండలాలు ప్రకటించారని, ఇక్కడ మాత్రం నేటికీ జాబితా విడుదల చేయలేదని విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి సీఎం ఉండటం మన రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమన్నారు. ఆయన వెంట కన్వీనర్ మహేంద్ర, మాజీ కన్వీనర్ సూర్యనారాయణరెడ్డి, మాజీ ఎంపీపీ నరసింహయ్య, మాజీ సర్పంచు చిక్కవన్నప్ప, నాయకులు క్వారీ యజమానులు నవీన్, షరీఫ్, త్యాగరాజు తదితరులు ఉన్నారు. -
బాబూ.. గిరిజనులకు భూములేవి?
బాబు వాగ్దాన భంగంపై కాకాణి ఫైర్ పైనాపురంలో గడపగడపకు వైఎస్సార్ ముత్తుకూరు : పేద గిరిజనుల వ్యవసాయాభివృద్ధికి రెండు ఎకరాల చొప్పున భూమిని పంపిణీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు రాష్ట్రంలో ఒక్క సెంటు భూమైనా పంపిణీ చేశారా? అని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రశ్నించారు. గడపగడపకు వైఎస్సార్‌లో భాగంగా సోమవారం పైనాపురం పంచాయతీలో ప్రజాబ్యాలెట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జెన్కో ప్రాజెక్ట్ యాష్‌పాండ్‌కు దగ్గరగా ఉన్న దేవరదిబ్బ గిరిజనకాలనీని సురక్షిత ప్రాంతానికి తరలించే అంశం జిల్లా కలెక్టర్‌తో చర్చిస్తామని గిరిజనులకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులివ్వకుండా చంద్రబాబు ఓడిపోయిన వారికి అప్పగించి, దుష్ట సంప్రదాయానికి ఒడిగట్టారన్నారు. అభివృద్ధి ముసుగులో జరుగుతున్న అవినీతిపై ప్రశ్నిస్తుంటే తనపై వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతున్నారన్నారు. ఇటువంటి విమర్శలకు భయపడి, జరుగుతున్న అవినీతిని చూస్తూ ఊరుకునేదిలేదన్నారు. తొలుత కాకాణి స్థానిక భోగేశ్వరాలయంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు నెల్లూరు శివప్రసాద్, సర్పంచ్‌లు పల్లంరెడ్డి జనార్దన్‌రెడ్డి, కట్టా సుబ్రహ్మణ్యం, ప్రభాకర్, మండల నాయకులు లక్ష్మణరెడ్డి, ఈదూరు శ్రీనివాసులురెడ్డి, కలికి చంద్రశేఖర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, మారు సుధాకర్‌రెడ్డి, కొడవలూరు రామిరెడ్డి, చిన్నపరెడ్డి, ధనుంజయరెడ్డి, గండవరం సూరి, చెంగారెడ్డి, ఆలపాక శ్రీనివాసులు, చిన్నపరెడ్డి పాల్గొన్నారు. -
బాత్ రూమ్ పైనుంచి తలకు గన్ పెట్టి..
హైదరాబాద్: తనపై కాల్పులు జరిపిన బాబుకు తనకు ఎలాంటి సంబంధం లేదని కాల్పులకు గురైన కాంగ్రెస్ నాయకుడు దండుగుల యాదగిరి అన్నాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు ప్రాణాహాని తొలగిందని వైద్యులు చెప్పారు. బుల్లెట్ హార్ట్ పక్క నుంచి వెళ్లడంతో ప్రాణాపాయం తప్పిందని చెప్పారు. ప్రస్తుతానికి ఆయన ఔట్ ఆఫ్ డేంజర్ అని రేపు 10గంటలకు డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా కాల్పులకు గురైన యాదగిరి సాక్షి టీవీతో మాట్లాడారు. తనపై కాల్పులు జరిపిన బాబుకు తనకు ఎలాంటి సంబంధం లేదని, అతడి బావమరిది మాత్రం ఎప్పుడైనా డబ్బులు కావాలంటే తన వద్దకు వచ్చి తీసుకునే వాడని చెప్పారు. తనకు తన కుటుంబసభ్యులకు ప్రాణహాని ఉందని అన్నారు. తమకు రక్షణ కల్పించాలని కోరాడు. కాల్పులు జరిగే సమయంలో ఆస్పత్రిలో బాత్ రూమ్ లో దాక్కున్నానని, ఆ సమయంలో బాత్ రూమ్ పై గన్ పెట్టి తన తలపై షూట్ చేయబోయాడని చెప్పారు. ప్రతిఘటించి గన్ లాక్కున్న తర్వాత 100కి కాల్ చేశానని, కాసేపట్లో ఆస్పత్రి సిబ్బంది బయటకు రావడంతో తాను బయటకు వచ్చానని చెప్పాడు. పోలీసులకు చూపిద్దామని తన వెంటే గన్ ఉంచుకున్నానని అన్నారు. తెలిసిన వ్యక్తి కనబడటంతో లిఫ్ట్ అడిగి ఆస్పత్రి చేరినట్లు వివరించాడు. -
దోచిపెట్టేందుకే బాబు ప్యాకేజీ జపం
– పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి డోన్: తనతో పాటు అనుచరులకు దోచి పెట్టేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్యాకేజీ జపం చేస్తున్నారని పీఏసీ చైర్మన్, డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా సాధనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపులో భాగంగా మంగళవారం కర్నూలు జిల్లా డోన్‌లో చేపట్టిన బంద్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ రాజ్యసభలో కుండబద్ధలు కొట్టిన తర్వాత కూడా చంద్రబాబు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ఆ బురద నుంచి బయటపడేందుకు కేంద్రానికి ఊడిగం చేస్తున్నాడన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన ఆయన నేడు హోదా విషయంలోనూ తన అసలు స్వరూపం బయట పెట్టాడన్నారు. ఎన్నికలకు ముందు 15ఏళ్ల పాటు ప్రత్యేక ప్యాకేజీ కావాలని డిమాండ్ చేసిన బాబు.. ఇప్పుడు ఆ మాట విస్మరించి మాట్లాడటం శోచనీయమన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివద్ధి హోదాతోనే సాధ్యమనే విషయాన్ని ముఖ్యమంత్రితో పాటు ఆ పార్టీ నేతలు గుర్తుంచుకోవాలన్నారు. హోదా కోసం పార్టీలకు అతీతంగా పోరాడాల్సిన అవసరం ఎంతయినా ఉందన్నారు. -
చరిత్ర ఉన్నంత కాలం బాబును నమ్మరు
- గుంటూరు మార్కెట్ యార్డు మాజీ కార్యదర్శి నరహరి అనుచిత వ్యాఖ్యలు - సీఎం చంద్రబాబుపైనా తనదైన శైలిలో విమర్శలు - విలేకర్లను బిచ్చగాళ్లతో పోలుస్తూ సంభాషణలు - నరహరి ఆడియో టేపులతో మార్కెటింగ్ శాఖలో కలకలం సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్‌ను మోసం చేశాడు. ఆయన చనిపోయే ముందు ఒక మాట అన్నాడు. తెలుగు చరిత్ర ఉన్నంత కాలం, మానవాళి మనుగడ సాగించినంత కాలం బాబు చేసిన ద్రోహం ప్రజలు మరిచిపోరు.. అలాంటి బంగారం లాంటి వ్యక్తిని అన్యాయంగా చంపేశాడు’. ఇది ఎవరో రాజకీయ నేత చేసిన విమర్శ కాదు. వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉన్నత శ్రేణి కార్యదర్శి హోదాలో ఉన్న అధికారి అన్న మాటలు. గుంటూరు మార్కెట్ యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శిగా పనిచేసి ప్రస్తుతం విజయవాడ మార్కెట్ యార్డు కార్యదర్శిగా ఉన్న ఎన్.నరహరి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర కలకలం సృష్టించాయి. గుంటూరు యార్డులో కమీషన్ ఏజెంట్ల లైసెన్స్‌లకు సంబంధించి 293 మంది వ్యాపారుల వద్ద రూ.కోటికి పైగా మొత్తం నరహరి వసూలు చేశాడు. ఈ క్రమంలో వసూళ్లను నిజం చేసే ఆడియో టేపులు మంగళవారం బహిర్గతం అయ్యాయి. ఆడియో టేపుల్లో లైసెన్స్‌లకు సంబంధించి వ్యాపారులతో సాగించిన బేరసారాలు, వ్యాపారులు, నరహరి మధ్య సాగిన సంభాషణ మొత్తం ఆడియో టేపుల రూపంలో వెలుగులోకి వచ్చాయి. నరహరి తనదైన శైలిలో సీఎం చంద్రబాబు మొదలుకొని మార్కెటింగ్ శాఖ కార్యదర్శులు, చివరకు విలేకర్లను కూడా విమర్శించటంతో పాటు దూషణల పర్వం కొనసాగించారు. మార్కెట్ యార్డులో ఒక స్థాయి అధికారి మొదలుకొని ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు అందరిని తనదైన శైలిలో విమర్శిస్తూ ఎవరికి ఎంత వాటా ఇవ్వాలో కూడా లెక్క చెప్పాడు. విలేకర్లను బిచ్చగాళ్లతో పోలుస్తూ.. ‘మనం చేసే డీల్‌లో విలేకర్లకు కూడా డబ్బులు ఇస్తే సరిపోతుంది. ముందుగానే వారితో మాట్లాడుకొని డబ్బులు ఇస్తే తలనొప్పి ఉండదు. ఎందుకంటే డబ్బులు ఇవ్వకపోతే వీళ్లు రాసే వార్తలకు యార్డు చైర్మన్, మనం పెట్టే ఫైల్స్‌పై సంతకాలు పెట్టే మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అందరూ ఇబ్బందిపెడతారు. ముందు వాళ్లను సెట్ చేసి రేటు మాట్లాడండి. వీళ్లంతా బిచ్చగాళ్ల లాంటి వాళ్లు. కొద్దిగా పడేస్తే పోతుంది.’ అని వ్యాఖ్యలు చేశాడు. మార్కెటింగ్ శాఖలో కలకలం మార్కెటింగ్ శాఖ, మార్కెట్ యార్డులో నరహరి ఆడియో టేపులు తీవ్ర కలకలం రేపాయి. మార్కెటింగ్ శాఖ అధికారి ఇస్సార్ అహ్మద్, మార్కెటింగ్, వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు, ఓఎస్డీ, ఇతర అధికారులకు మామూళ్లలో ఎవరికి ఎంత ఇవ్వాలో సమగ్రంగా లెక్కలు చెప్పాడు. దీంతో శాఖలో ఆడియో టేపులు హాట్æటాపిక్‌గా మారి అధికారుల మధ్య చర్చ జరుగుతోంది. మరోవైపు మార్కెటింగ్ శాఖ ఉద్యోగులు ఈ వ్యవహారాన్ని కమిషనర్, మంత్రి దష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. -
వాటా కోసమే వారి ప్రచారం
టీఎంయూ ఓడితే టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తారా? ఎన్నికల ప్రచార సభలోఆర్టీసీ ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.బాబు హన్మకొండ : టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అక్రమంగా సంపాదించిన రూ.100 కోట్లలో వాటా కోసమే టీఆర్ఎస్ నేతలు ఆయన తరఫున ప్రచారం చేస్తున్నారని ఆర్టీసీ ఎంప్లాయూస్ యూనియన్ (ఈయూ) రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.బాబు ఆరోపించారు. ఆర్టీసీ ఈయూ, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఐక్య కూటమి ఎన్నికల బహిరంగ సభ శుక్రవారం ఇక్కడ జరిగింది. ఈ సభలో ఎంప్లాయూస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.బాబు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. టీఆర్ఎస్ నాయకులు టీఎంయూకు మద్దతుగా ప్రచారం చేయడంతోనే ఆ యూనియన్ ఓటమి స్పష్టమైందన్నారు. టీఎంయూ ఓడిపోతే టీఆర్ఎస్ నాయకులు వారి పార్టీకి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చిరుద్యోగులైన కండక్టర్లపై నిందలు వేయడం ఎంతవరకు సమంజసమన్నారు. టీఎంయూకు సరైన నాయకత్వం లేక రాజకీయ నాయకులు ప్రచారానికి వస్తున్నారని విమర్శించారు. కండక్టర్ల వ్యవస్థను తొలగించేందుకు యూజమాన్యం కుట్రలు పన్నుతోందని, దీనిపై ఆ యూనియన్ పోరాటం చేస్తుందా అని నిలదీశారు. నిరక్షరాస్యుడు ఆ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారని, యాజమాన్యం ఏ ఉత్తర్వులు జారీ చేస్తుందో తెలుసుకోలేని వ్యక్తితో కార్మికులకు ఏం న్యాయం జరుగుతుందన్నారు. వేతన బకాయిలు 27న ఇవ్వనున్నట్లు యాజమాన్యం పేర్కొనగా తమ ఐక్య కూటమి అడ్డుకుందంటూ టీఎంయూ రాద్దాంతం చేస్తోందన్నారు. స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్.రావు మాట్లాడుతూ కార్మికులు ఇప్పుడు వేసే ఓటుపై రెండేళ్ల భవిష్యత్ ఆధారపడి ఉంటుందన్నారు. రాష్ట్ర గుర్తింపు కోసం ఈయూకు, రీజియన్ గుర్తింపు కోసం ఎస్‌డబ్ల్యూఎఫ్‌కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈయూ రీజియన్ గౌరవ అధ్యక్షుడు, డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. సకలజనుల సమ్మెను విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికులకు సకలజనుల సమ్మె కాల వేతనాన్ని చెల్లించడంలో చిన్నచూపు చూస్తున్నారని దుయ్యబట్టారు. సీపీఐ జిల్లా కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ టీఎంయూ ఏనాడూ కార్మికుల సమస్యలు పట్టించుకోలేదని, పైరవీలకే పరిమితమైందని విమర్శించారు. ఐక్య కూటమిని గెలిపిస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి పోరాడుతామన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి సారంపల్లి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ ఈయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్ కూటమిని గెలిపించి ఆర్టీసీ కార్మికులు చారిత్రాత్మక తీర్పు ఇవ్వాలన్నారు. అంతకు ముందు వరంగల్-1 డిపో నుంచి, వరంగల్-2 డిపో మీదుగా విజయటాకీస్, హనుమాన్ దేవాలయం మీదుగా సభాస్థలి వరకు భారీ ర్యాలీ తీశారు. ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సభలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పనాసా ప్రసాద్, ఎస్‌డబ్ల్యూఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్.రాంచందర్, రీజియన్ అధ్యక్షుడు ఎస్.యాదగిరి, కార్యదర్శి ఎన్.రాజయ్య, ఈయూ రీజియన్ అధ్యక్షుడు బి.జనార్థన్, కార్యదర్శి ఈదురు వెంకన్న, ఐక్య కూటమి నాయకులు మనోహర్, పునేందర్, రవీందర్‌రెడ్డి, కరుణాకర్ పాల్గొన్నారు. -
అబద్ధాలతోనే నడుస్తున్న ప్రభుత్వం
రైతు భరోసాయాత్రలో బాబుపై మండిపడ్డ వైఎస్ జగన్ సాక్షి, కడప: ‘‘ఎన్నికలకు ముందు ఒక మాట.. అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక మాట మాట్లాడటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఎక్కడచూసినా ప్రచారం కోసం పాకులాడటం.. తర్వాత మాట తప్పడం ఆయనకు నైజంగా మారింది. ముఖ్యమంత్రిగా అబద్ధాలతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు’’ అని వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. రైతు భరోసా యాత్రలో భాగంగా ఆయన గురువారం వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పర్యటించారు. పెద్దకుడాల, తాటిమాకులపల్లె, ముద్దప్పగారిపల్లె, ఎర్రగుడి తదితర గ్రామాల్లో మహిళలు, వృద్ధులు పింఛన్లతోపాటు డ్వాక్రా రుణమాఫీ సక్రమంగా అమలుచేయలేదని జగన్ దృష్టికి తీసుకొచ్చారు. చివరకు పంట రుణాలు కూడా సక్రమంగా మాఫీ చేయలేదనడంతో ఘాటుగా స్పందించారు. రుణమాఫీ, డ్వాక్రామాఫీ జరగలేదని.. చివరకు పండుటాకులకు అందించే పింఛన్ల విషయంలో కూడా కోతలు పెట్టడం ప్రభుత్వానికి తగదని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ప్రజలకు ఒరిగిందేమీ లేదని.. టీడీపీ నేతలకు మాత్రం చంద్రబాబు కావాల్సినంత దోచిపెడుతున్నారని ఆయన తీవ్రస్థాయిలో ఆరోపించారు. జగన్మోహన్రెడ్డి వెంట కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ఉన్నారు. రెండు కుటుంబాలకు పరామర్శ వ్యవసాయంలో పెట్టిన పెట్టుబడులు రాక.. ఉన్న పొలాలను అమ్ముతున్నా అప్పులు తీరక.. మానసిక వేదనతో బలవన్మరణం చెందిన ఇద్దరు రైతుల కుటుంబాలను వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం పరామర్శించారు. ముందుగా లింగాల మండలంలోని పెద్దకుడాల గ్రామానికి వెళ్లి రైతు మంజుల చలపతి కుటుంబసభ్యులను , అనంతరం చక్రాయపేట మండలంలోని ముద్దప్పగారిపల్లెకు చెందిన రైతు శుద్ధమల్ల చెన్నారెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. -
నాదే పూచీ అన్న పవన్ ఏడి?
- ప్రశ్నిస్తానన్న పవన్ ఎక్కడ? - వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా రాజమహేంద్రవరం: ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకు రూ.రెండు వేల నిరుద్యోగ భృతి ఇస్తానని ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి, గద్దెనెక్కిన సీఎం చంద్రబాబు రెండేళ్లైనా వాటిని అమలు చేయకుండా యువతను మోసం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా ధ్వజమెత్తారు. రాజమహేద్రవరంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీనీ చంద్రబాబు అమలు చేయలేదని మండిపడ్డారు. యువత తల్చుకుంటే ప్రభుత్వాలు కూలిపోరుున ఘటనలను చంద్రబాబు గుర్తుచేసుకోవాలని సూచించారు. కాపులను బీసీల్లో చేరుస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఇప్పుడు కమిషన్ పేరుతో తాత్సారం చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు కాపుల నమ్మకాన్ని కోల్పోయారన్నారు. చంద్రబాబు ఇచ్చే హామీలకు నాది పూచీ అన్న పవన్ కల్యాణ్ ఇప్పడు ఎక్కడున్నారని ప్రశ్నించారు. సినిమాల్లోలాగా ఎప్పుడో ఒకసారి అలా వచ్చి మెరిసిపోతున్నారని ఆక్షేపించారు. ప్రశ్నించేందుకు పార్టీ పెట్టానన్న వ్యక్తి ఇప్పుడు కనిపించకుండాపోయాడని విమర్శించారు. తనను నమ్మి టీడీపీకి ఓట్లేసిన కాపు యువతను పవన్ కల్యాణ్ ఏమి సమాధానం చెబుతారని ధ్వజమెత్తారు. జనసేన పార్టీ పెట్టి ప్రజలకు ఏం సేవ చేశారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ఒకసారి, పోటీ చేయడానికి తన దగ్గర డబ్బులు లేవని మరోసారి చెబుతూ గందరగోళం స్పష్టిస్తున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల్లో కాపులకు అత్యధికంగా సీట్లిచ్చిన ఘనత వైఎస్సార్ సీపీదేనన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో యువజన విభాగం కీలక పాత్ర పోషించేలా కృషి చేస్తానన్నారు. -
మంత్రి రాజీనామా.. అంతలోనే తూచ్!
తిరువనంతపురం: కేరళను కుదిపేస్తున్న బార్ స్కాం, సోలార్ స్కాం పలు మలుపులు తిరుగుతున్నాయి. బార్లకు అనుమతి ఇచ్చేందుకు రూ. 50 లక్షల లంచం తీసుకున్నారన్న కేసులో కోర్టు విచారణకు ఆదేశించడంతో ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కె. బాబు రాజీనామా చేశారు. అయితే.. కాంగ్రెస్ నేతృత్వంతోని యూడీఎఫ్ నేతల నుంచి ఒత్తిడి రావడంతో రాజీనామాను అంతలోనే ఉపసంహరించుకున్నారు. అయితే ఇదంతా సీఎం ఊమెన్ చాందీ పక్కాగా రచించిన స్క్రిప్టు ప్రకారమే జరిగిందని విపక్ష సీపీఐ-ఎం ఆరోపించింది. బార్ ఓనర్ల నుంచి లంచం తీసుకున్నారన్న ఆరోపణలతో గతంలో ఆర్థికమంత్రి కేఎం మణి కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయనకు కూడా కోర్టులో ఊరట లభించడంతో తిరిగి పదవి చేపట్టాలని యూడీఎఫ్ వర్గాలు అంటున్నా, తాను మళ్లీ వచ్చేందుకు తొందరేమీ లేదని మణి అంటున్నారు. మంత్రి పదవి చేపట్టాలని కోరిన యూడీఎఫ్‌కు కృతఙ్ఞతలు తెలిపిన ఆయన ఈ అంశంపై పార్టీలో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని శనివారం తెలిపారు. అయితే ఈ ఇద్దరు నేతలకు హైకోర్టు క్లీన్చిట్ ఇవ్వలేదని, కేవలం కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై రెండు నెలలు స్టే మాత్రమే విధించిందని సీపీఐ-ఎం నేత కొడియేరి బాలకృష్ణన్ తెలిపారు. హైకోర్టు ఈ కుంభకోణంలో వాదనలు కూడా వినబోతున్న నేపథ్యంలో అప్పుడే క్లీన్చిట్ దొరికిందని నేతలు చెప్పడం ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ పక్కాగా నడిపిస్తున్న డ్రామాగా అభివర్ణించారు. -
'శ్రీమంతుడి' రాక కోసం
-
హామీలు అటకెక్కిస్తున్న మోదీ, కేసీఆర్
► దిగ్విజయ్‌సింగ్ ధ్వజం ► 14 నుంచి 16 వరకుగ్రేటర్ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా 18న మేనిఫెస్టో ప్రకటన సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అటకెక్కించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీపడుతున్నారని ఏఐసీసీ ప్రధానకార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ విమర్శించారు. ఏఐసీసీ కార్యదర్శి ఆర్.సి.కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీనేత కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ, ఎంపీ వి.హనుమంతరావులతో కలసి ఆయన బుధవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నల్లధనాన్ని వెనక్కి తెప్పిస్తానని ప్రధాని మోదీ యూ టర్న్ తీసుకున్నారని దిగ్విజయ్ దుయ్యబట్టారు. తెలంగాణ ఇస్తే పార్టీని విలీనం చేస్తానంటూ సోనియాగాంధీ ఇంటివద్ద వడిగాపులు కాసిన కేసీఆర్ ఆ తరువాత యూటర్న్ తీసుకున్నారని ఎద్దేవా చేశారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన కేసీఆర్ ఈ 19 నెలల్లో కనీసం ప్రతిపాదనలను కూడా సిద్దంచేయలేదన్నారు. దళితులకు మూడెకరాల భూమి, కేజీ టు పీజీ ఉచిత విద్య వంటివాటిపై సీఎం కేసీఆర్ చెప్పిన మాటలేవీ అమలుచేయలేదని విమర్శించారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ భారీ అవినీతికి పాల్పడ్డారని దిగ్విజయ్‌సింగ్ ఆరోపించారు. నితిన్ గడ్కారీ కుమారుడు నిఖిల్ గడ్కారీ డెరైక్టరుగా ఉన్న కంపెనీకి 10 వేలకోట్ల కాంట్రాక్టును నిబంధనలకు వ్యతిరేకంగా కట్టబెట్టారని ఆరోపించారు. గ్రేటర్లో అన్ని సీట్లకూ పోటీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అన్ని సీట్లకూ పోటీచేస్తామని దిగ్విజయ్‌సింగ్ చెప్పారు. ఈ నెల 18న పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటిస్తామన్నారు. దిగ్విజయ్ ఆధ్వర్యంలో బుధవారం పీసీసీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. పార్టీ ముఖ్యనేతలు కె.జానారెడ్డి, షబ్బీర్‌అలీ, శ్రీధర్‌బాబు, పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ నెల 14 నుంచి 16 దాకా పార్టీ అభ్యర్థుల జాబితాలను ప్రకటిస్తామని దిగ్విజయ్ చెప్పారు. -
ఎంటర్ ద డ్రాగన్
-
ఇప్పటికైనా అరెస్టు చేస్తారా లేదా..?
-
బాబు.. ఆంధ్రా డెంగ్!
చైనాలో మావోను తొలగించిన డెంగ్ వెన్నుపోటుదారుడా? * తప్పనిసరి పరిస్థితుల్లోనే మావోపై తిరుగుబాటు చేశారు * ఎన్టీఆర్, చంద్రబాబు ఉదంతం కూడా ఈ కోవలోనిదే * చైనాలో డెంగ్‌ను, ఏపీలో బాబును ప్రజలు అభిమానిస్తున్నారు * వెన్నుపోటుపై చరిత్రను వక్రీకరిస్తూ తెలుగుదేశం కార్యకర్తలకు శిక్షణ సాక్షి, హైదరాబాద్: చైనా కమ్యూనిస్టు నేత మావో నాలుగో భార్య మాయలోపడి చైనా ప్రభుత్వానికి, అధికార కమ్యూనిస్టు పార్టీకి ప్రమాదకర పరిస్థితులు కల్పించినప్పుడు ఆయనను అధికారం నుంచి తొలగించారు... అదే తరహాలో ఎన్టీఆర్‌ను సీఎం పదవి నుంచి తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించారు... ఇదీ టీడీపీ కార్యకర్తలకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాల్లో ప్రస్తుతం బోధిస్తున్న కొత్త పాఠం. టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు పార్టీ నాయకులకు వరు సగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. అందులో భాగంగా చిత్తూరు జిల్లా తిరుపతి, ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గ కేంద్రాల్లో శుక్రవారం నుంచి శిక్షణ శిబిరాలు ప్రారంభమయ్యాయి. కందుకూరు శిక్షణ శిబిరాన్ని ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు లోకేశ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో శిక్షణాంశాలు పేరుతో శ్రేణులకు పుస్తకాలను పంపిణీ చేశారు. సొంత మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి గద్దెదింపి సీఎం పదవిని చేపట్టారన్న ముద్రనుంచి బయటపడటానికి బాబు పార్టీ శిక్షణ తరగతుల్లో అందించిన పుస్తకంలో కొత్తగా చేర్చిన అధ్యాయంలో చరిత్రను వక్రీకరించారు. శిక్షణాంశాల పేరుతో ప్రచురించిన 82 పేజీల పుస్తకంలో ‘1994లో విశేష ప్రజాదరణ’ పేరిట 7వ అధ్యాయంలో 1994 నాటి పరిణామాలను వివరించారు. అందులో ఎన్టీఆర్‌ను గద్దెదించిన వైనాన్ని సమర్థించుకోవడానికి నానా తంటాలు పడ్డారు. ఎన్టీఆర్‌ను గద్దెదింపిన సంఘటనను ఏకంగా చైనాలో మావో ఘటనతో పోల్చారు. ‘‘చైనా ప్రజలు, చైనా కమ్యూనిస్టు పార్టీ మావోను అమితంగా అభిమానిస్తారు. అయితే ఆయన నాలుగో భార్య మాయలోపడి చైనా ప్రభుత్వానికి, అధికార కమ్యూనిస్టు పార్టీకి ప్రమాదకర పరిస్థితి కల్పించినప్పుడు మావోను అధికారం నుంచి తొలగించారు. ఇందులో కీలకపాత్ర పోషించిన డెంగ్ జియావో పింగ్ వెన్నుపోటుదారుడా? చైనా ప్రభుత్వ స్థాపకుడిగా మావోను, ఆధునిక చైనా నిర్మాతగా డెంగ్‌ను చైనా ప్రజలు నేటికీ ప్రేమిస్తున్నారు. ఎన్టీఆర్, బాబు ఉదంతం కూడా ఈ కోవకు చెందిన ఒక చారిత్రక అని వార్య ఘటనగా చూడాలి’’ అని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి గద్దెదింపిన 20 ఏళ్ల తర్వాత దాన్ని సమర్థించుకోవడానికి చేసిన ఈ ప్రయత్నంపై పార్టీ శ్రేణుల్లో విస్మ యం వ్యక్తమవుతోంది. చైనాలో డెంగ్ వెన్నుపోటుదారుడైతేనే ఇక్కడ తనను కూడా వెన్నుపోటుదారుడిగా చూడాలని పరోక్షంగా అందులో చెప్పడం పార్టీ నేతలను విస్మయపరుస్తోంది. ‘‘ఎన్టీఆర్‌ను లోబరచుకొన్న ఒక దుష్టశక్తి చర్యలవల్ల పార్టీ దెబ్బతినే పరిస్థితి వచ్చింది. దాంతో ఆవేదనకు గురైన కార్యకర్తలు, నాయకులు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యేలు చంద్రబాబును ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి పార్టీని, ప్రభుత్వాన్ని గట్టెక్కించాలని తీవ్ర ఒత్తిడి చేశారు. వారి అభీష్టం మేరకు గుండెను రాయిచేసుకుని 1995లో చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించారు’’ అని సమర్థించుకున్నారు. కానీ వాస్తవానికి మావో 1976లో మరణించేవరకూ అధికారంలోనే ఉన్నారు. ఆయన్నెవరూ అధికారం నుంచి తొలగించలేదు. సాంస్కృతిక విప్లవం సమయంలో తన విధానాలను వ్యతిరేకించినందుకు సన్నిహితుడైన డెంగ్‌ను జైల్లో పెట్టించారు. మావో మరణానంతరం రెండేళ్ల తర్వాత 1978లో డెంగ్ పార్టీ బాధ్యతలు చేపట్టారు. ఈ వాస్తవాలన్నీ వక్రీకరించి మావోను డెంగ్ అధికారం నుంచి తప్పించినట్లు రాయడంపై పార్టీ నేతలే ఆశ్చర్యపోతున్నారు. -
ప్రత్యేక హోదాకు 'ఆ రెండిటీ' ఆమోదం లేదు
-
పార్లమెంట్లో కౌంటర్ చేయాలి
‘ఓటుకు కోట్లు’పై ఎంపీలకు బాబు దిశానిర్దేశం సాక్షి, హైదరాబాద్: ఈ నెల 21 నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాలు ‘ఓటుకు కోట్లు’ వ్యవహారా న్ని లేవనెత్తే అవకాశాలున్నందున దానికి కౌంటర్‌గా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకున్న విషయాలను ప్రస్తావించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ, బీజేపీ ఎంపీలకు సూచించా రు. నేతల ఫోన్ల ట్యాపింగ్, సెక్షన్ 8 అమలు వంటి విషయాలను ప్రస్తావిస్తూ గొడవ చేయాలని చెప్పారు. సమావేశంలో పాల్గొన్న ఎంపీలు అందించిన సమాచారం మేరకు... పార్లమెంట్లో మిత్రపక్ష బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విషయాలేవీ లేవనెత్తరాదని సూచించారు. శుక్రవారం విజయవాడలో నిర్వహించిన బీజేపీ, టీడీపీ ఎంపీల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ సమావేశాల్లో నడుచుకోవలసిన తీరుపై వివరించారు. ఈ సందర్భంగా ఏడాది కాలంగా తాను చేసిన విదేశీ పర్యటనలు, రాష్ట్రాభివృద్ధికి తాను చేస్తున్న కృషిని చంద్రబాబు సుదీర్ఘంగా వివరించారు. ప్రణాళిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రాన్ని విభజించి ఏడాది గడిచినా కేంద్రం నుంచి అధికంగా నిధులు, పథకాలు సాధించలేకపోయామని ప్రజల్లో టీడీపీపై వ్యతిరేకత ఉందని చెప్పారు. అయినప్పటికీ కేంద్రంతో సంబంధాలు తెగిపోయేలా, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరించరాదని చెప్పారు. ఏపీ పునర్విభజన చట్టంలో రాష్ట్రానికి ప్రయోజనం కలిగించే పలు అంశాలను అమలు చేస్తామని కేంద్రం ఈ సమావేశాల్లో హామీ ఇస్తుందన్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పుష్కరాలతో పాటు ముస్లింల కు అందిస్తున్న తోఫాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రాజకీయంగా ఉపయోగించుకోవాల్సిందిగా పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. -
లారీ, కారు ఢీ: ఒకరి మృతి
అల్వాల్: వేగంగా వెళ్తున్న బొలేరో వాహనం రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన గురువారం తెల్లవారుజామున నగరంలోని బొల్లారం కంటెయినర్ డంపింగ్ యార్డ్ వద్ద జరిగింది. వివరాలు.. కూకట్పల్లి యల్లమ్మబండకు చెందిన కొంతమంది భక్తులు యాదగిరిగుట్టకు వెళ్లి వస్తుండగా ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనలో బాబు (19), అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం తరలించారు. కాగా, ప్రస్తుతానికి వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో కారులో 8మంది ఉండగా అందూ ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఫోరెన్సిక్ చేతికి బాబు టేపులు
- రేవంత్ సహా నిందితుల సెల్ఫోన్లు, ఆడియో, వీడియో టేపులు కూడా - ఏసీబీ విజ్ఞప్తి మేరకు ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు - బాబు సంభాషణపై నిగ్గుతేల్చనున్న ఫోరెన్సిక్ శాస్త్రవేత్తలు - 2, 3 రోజుల్లో నివేదిక ఇచ్చే అవకాశం సాక్షి, హైదరాబాద్: ఓటుకు నోటు కుంభకోణంలో సూత్రధారిగా భావిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అసలు బాగోతం రెండు, మూడు రోజుల్లో బట్టబయలుకానుంది! ఈ కేసులో ఏసీబీ అధికారులు రికార్డు చేసిన ఆడియో, వీడియో సీడీలతోపాటు నిందితులైన రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహల ఇళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లు, సీసీటీవీ రికార్డులు, కంప్యూటర్ పరికరాలను విశ్లేషణ కోసం ప్రత్యేక కోర్టు ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్)కి పంపింది. ఏసీబీ విజ్ఞప్తి మేరకు న్యాయమూర్తి లక్ష్మీపతి శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఎఫ్ఎస్ఎల్కు పంపిన వాటిలో రాజకీయ ప్రముఖులు మాట్లాడినవిగా చెబుతున్న 14 ఆడియో టేపులు ఉన్నట్లు సమాచారం. ఇవి కాకుండా స్టీఫెన్సన్ సోదరుడి ఇంట్లో నడిచిన రూ. 5 కోట్ల డీల్ తతంగం, రూ. 50 లక్షల అడ్వాన్స్‌కు సంబంధించిన వీడియో ఫుటేజీలు, రేవంత్‌రెడ్డితోపాటు మిగతా ఇద్దరు నిందితుల ఇళ్ల నుంచి సేకరించిన సీసీ కెమెరా ఫుటేజీలను కూడా ఎఫ్ఎస్ఎల్కు పంపారు. నిందితులతో ఫిర్యాదుదారుడైన స్టీఫెన్సన్ వివిధ సందర్భాల్లో మాట్లాడేందుకు వాడిన మొబైల్‌ఫోన్ సహా 21 ఫోన్లు, 3 సోనీ డిజిటల్ రికార్డర్లు, సీపీయూ, హార్డ్‌డిస్క్‌లను పరీక్షల కోసం పంపించారు. దీంతో స్టీఫెన్‌సన్‌తో మాట్లాడిన మాటలపై చంద్రబాబు అండ్ కో చెపుతున్నట్టుగా ‘ఎక్కడెక్కడో మాట్లాడిన మాటలను తెచ్చి అతికించారా... చంద్రబాబే మాట్లాడారా ...’ అనే విషయాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ శాస్త్రవేత్తలు నిగ్గుతేల్చనున్నారు. అదే సమయంలో రేవంత్‌రెడ్డి, చినబాబు లోకేశ్, ఎంపీలు, తెలుగుదేశం పోషకులుగా ఉన్న పారిశ్రామికవేత్తలు మాట్లాడిన రికార్డుల నాణ్యతను కూడా ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించి వాస్తవ నివేదిక ఇవ్వనున్నారు. ఎఫ్ఎస్ఎల్ నివేదిక వ చ్చాక కూడా రికార్డుల్లో ఉన్న మాటలు తమవి కావంటే సంబంధిత వ్యక్తుల మాటలను మరోసారి రికార్డు చేసి నిజాలను బహిర్గతం చేస్తారు. సోమవారం నాటికి వీటికి సంబంధించిన నివేదిక రావచ్చని ఓ అధికారి తెలిపారు. స్టీఫెన్సన్ స్టేట్మెంట్ సేకరించే పనిలో.. చంద్రబాబు ఆశీస్సులతో రేవంత్‌రెడ్డి అండ్ కో తనను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రాతపూర్వకంగా ఏసీబీని ఆశ్రయించి ఓటుకు కోట్ల కేసును తెరపైకి తెచ్చిన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ స్టేట్మెంట్ను రికార్డు చేయాలని ఏసీబీ నిర్ణయించింది. సోమవారం రేవంత్‌రెడ్డి బెయిల్ పిటిషన్ కోర్టు ముందుకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కేసు తీవ్రతను కోర్టు ముందు ఉంచేందుకు తమ వద్ద ఉన్న ఆధారాలన్నింటినీ న్యాయమూర్తికి సమర్పించాలని ఏసీబీ భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా శని, ఆదివారాల్లో స్టీఫెన్సన్ స్టేట్మెంట్ను రికార్డు చే సి సోమవారం కోర్టుకు సమర్పించనున్నట్లు తెలిసింది. పసుపు శిబిరంలో ఆందోళన... ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు కోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రూ. 50 లక్షలు ఇవ్వజూపుతూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడటంతో ఆయన జైలుపాలైన విషయం తెలిసిందే. చంద్రబాబు ఆదేశాల మేరకే రేవంత్ రూ. 50 లక్షలు తీసుకెళ్లారని స్టీఫెన్‌సన్‌తో బాబు మాట్లాడిన ఫోన్ రికార్డులతో తేటతెల్లమైంది. ఫోన్ రికార్డులు బయటపడ్డప్పటి నుంచి ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు పొంతన లేకుండా మాట్లాడుతూ ఢిల్లీ పెద్దల చుట్టూ చెక్కర్లు కొడుతున్నా పసుపు శిబిరంలో ఆందోళన మాత్రం తగ్గలేదు. స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు మాట్లాడిన రికార్డింగ్‌లతోపాటు ఆయన తనయుడు లోకేశ్ నాలుగో నిందితుడుగా ఉన్న మత్తయ్యతో మాట్లాడిన రికార్డులు కూడా ఏసీబీ వద్ద ఉన్నట్లు తేలడంతో టీడీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. -
'బాబు రాజీనామా చేయాలి'
-
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొత్త చుట్టాలు
-
ఇది చంద్రబాబు ఘోర వైఫల్యమే
- బడ్జెట్లో ఏపీకి ఏదీ సాధించలేకపోయారు: అంబటి రాంబాబు - రాష్ట్ర ప్రజలను బాబు, మోదీ, వెంకయ్య మోసగించారు సాక్షి, హైదరాబాద్: ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన సాధారణ, రైల్వే బడ్జెట్లలో రాష్ట్రానికి ఏమీ సాధించుకోలేకపోవడం సీఎం చంద్రబాబు ఘోర వైఫల్యానికి నిదర్శనమని వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు, కేంద్ర మం త్రి వెంకయ్యనాయుడు ఇద్దరూ కలిసి తెలుగు ప్రజలను నిలువునా మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు భారీగా నిధులు తెచ్చేందుకు టీడీపీ, బీజేపీ కూటమికి ఓట్లేయాలని ఎన్నికలకు ముందు కోరిన వారిద్దరూ అధికారంలోకి వచ్చాక మాట మార్చడాన్ని చూస్తే అసలు రంగేమిటో తెలిసిపోతోందన్నారు. టీడీపీ, బీజేపీ కలయికతో రాష్ట్రానికి ఏదో ఒరుగుతుందని ఓట్లేసిన తెలుగు ప్రజలను సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ కలసి నిట్టనిలువునా ముంచేశారన్నారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఊసే లేదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేవలం వంద కోట్లు ఇచ్చి దులిపేసుకున్నారని, విభజన చట్టంలో పేర్కొన్న వాటిని ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోలేదని దుయ్యబట్టారు. మొసలి కన్నీళ్లతో ఏం లాభం? రాష్ట్రం రెక్కలు విరిచేసి పరిగెత్తమంటే ఎలా సాధ్యమని అడుగుతున్న సీఎం బడ్జెట్‌కు ముం దు ఏం చేశారని అంబటి ప్రశ్నించారు. బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముందే రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలను సమావేశపరిచి కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తేలేకపోయారన్నారు.బాబు సరైన తరుణంలో స్పందించకుండా ఇప్పుడు మొసలి కన్నీరు కారిస్తే ప్రయోజనం ఏమిటన్నారు. తీరిగ్గా రాష్ట్రానికి అన్యా యం జరిగిందంటే ప్రయోజనం ఏమిటన్నారు. ఎనిమిది సార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్రంపై ఒత్తిడి చేశానని సీఎం చెప్పడాన్ని అంబటి ఎద్దేవా చేశారు. ‘ఆయన ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి వెళ్లడంపై చూపే శ్రద్ధను రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవటంపై చూపితే బాగుండేది’ అని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాజ్యసభలో ప్రగల్భాలు పలికిన వెంకయ్యనాయుడు బడ్జెట్లో ఆ విషయాన్ని ఎందుకు చేర్చలేదని అంబటి ప్రశ్నించారు. పోలవరానికి జాతీయ హోదా ఇస్తామని విభజన చట్టంలో పేర్కొనలేదని వెంకయ్య చెప్పటాన్ని చూస్తుంటే ఈ ప్రాజెక్టు ఇక రాదేమో అన్న అనుమానం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్డీయే, టీడీపీ ప్రభుత్వాలు కూడబలుక్కునే పోలవరం ప్రాజెక్టును నీరుగారుస్తున్నట్లుగా ఉందన్నారు. కేంద్రం బడ్జెట్లో పోలవరానికి రూ.వంద కోట్లు , టీడీపీ ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టుకు రూ.1,300 కోట్లు కేటాయించడం చూస్తే పోలవరం ఇక రాదేమోనన్న అనుమానం కలుగుతోందన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా వాల్తేరులో రైల్వే జోన్ ఏర్పాటు అంశాన్ని కూడా రైల్వే బడ్జెట్లో చేర్చకపోవడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి కూడా రాష్ట్రానికి సీఎం చంద్రబాబు ఏమీ సాధించలేక పోయారని అంబటి విమర్శించారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాకుండా ఓ దేశాధ్యక్షుడి మాదిరిగా మలేసియా, సింగపూర్‌లో పర్యటిస్తున్న చంద్రబాబు వారంతా రాష్ట్ర రైతులకు ఏదో ఒరగబెడతారనుకోవడం తప్పన్నారు. -
సంక్రాంతి సంబరాల్లో పాల్గొననున్న చంద్రబాబు
హైదరాబాద్: ఈ నెల 13న రాష్ట్రంలో జరగబోయే సంక్రాంతి వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొంటారని ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 12న సీఎం ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారన్నారు. అనంతరం రాష్ట్రంలో జరగబోయే సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటారన్నారు. ఈ వేడుకలకు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ హాజరవుతారన్నారు. విశాఖ, విజయవాడ, తిరుపతిలో మంత్రి పర్యటిస్తారన్నారు. అనంతరం చంద్రబాబు ఈశ్వరన్‌తో కలిసి తుళ్ళూరులో ఏరియల్ సర్వే నిర్వహిస్తారన్నారు. సంక్రాంతి సందర్భంగా కోటి 31 లక్షల మందికి చంద్రన్న సంక్రాంతి కానుకగా ఆరు రకాల సరుకులు అందిస్తారన్నారు. -
'అధికారం కోసం ప్రజలను మోసం చేసిన బాబు'
రైతులు, డ్వాక్రా మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, పింఛన్ అర్హులను ఇలా అన్ని వర్గాల ప్రజలను అధికారం కోసం బాబు అండ్ కో మోసం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. బాబు హామీలను నమ్మి అధికారం అప్పజెప్పినందుకు నేడు అన్ని వర్గాల ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు. బాధితులందరి తరఫునా వైసీపీ పోరాటం కొనసాగిస్తుందన్నారు. ఈ పోరులో ప్రతి వైసీపీ కార్యకర్త, నేత ఓ సైనికుడిలా పోరాడాలని కర్నూలు జిల్లా నియోజకవర్గాల సమీక్ష సమావేశాల్లో జగన్ పిలుపునిచ్చారు. -
టెక్నాలజీతో మరింత ప్రగతి సాధించగలం
-
ప్రజా వ్యతిరేకులు మోదీ, బాబు
బొబ్బిలి : ప్రజలను మాయ చేయాలని చూసే వాడే అందంగా మాట్లాడతాడని, ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి కూడా అలాగే ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం. కృష్ణమూర్తి అన్నారు. పట్టణంలోని అంజనీ కల్యాణ మండపంలో బుధవారం సీపీఎం డివి జన్ స్థాయి మహాసభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు చెప్పిన ఏ మాటా నమ్మడానికి లేదన్నారు. పైకి చెప్పేదొకటి, చేస్తున్నదొకటిగా ఉంటుందన్నారు. రాష్ట్రాన్ని సింగపూర్‌గా మారుస్తామన్న చంద్రబాబు, అక్కడ సంతలా ఉం టుందని, వ్యవసాయం, పరిశ్రమలు ఉండదని, ఈ రాష్ట్రాన్ని కూడా అలాగే చేయాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. క్లస్టర్ విధా నం పెట్టి విద్యను దూరం చేస్తున్నారన్నారు. మొన్నటి వరకూ 3 కిలోమీటర్ల దూరం వరకేనని పరిమితి విధించి ఇప్పుడు పది కిలోమీటర్లు పెంచారని, రాష్ట్రంలో అసలు ప్రభుత్వ బడులు ఉండకూడదన్నదే చంద్రబాబు ఉద్దేశమన్నారు. లచ్చయ్యపేట చక్కెర కర్మాగారాన్ని ఆనాడు అతి తక్కువగా ప్రైవేటుకు అమ్మేసిన చంద్రబాబు, ఇప్పుడు రైతులకు రావలసిన బకాయి కోసం యాజ మాన్యాన్ని అరెస్టు చేస్తే ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి కౌంటర్ దాఖలు చేయాలని, అలా కాకుండా యాజమాన్యానికి వత్తాసు పలికిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేకులని విమర్శించారు. సామాన్య ప్రజల గొంతు కోసే విధంగా నిర్ణ యాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. కార్మిక చట్టాలను సవరించి సంఘాలే లేకుండా చేయాలని మోదీ, బాబు చూస్తున్నార న్నారు. దోపీడీ వర్గాలకు ప్రయోజనం చేకూర్చడానికి, వారి ఆటలు సాగడానికి మోదీ ప్రభుత్వాన్ని తీసుకువచ్చారన్నారు. ఇందు కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో దేశవ్యాప్తంగా రూ. 50 వేల కోట్ల పెట్టుబడుదారులు ఖర్చు పెట్టారని ఆరోపించారు. అంతకుముం దు ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించి, స్తూపం వద్ద నివాళులు అర్పించారు. సీపీఎం డివిజన్ కార్యదర్శి రెడ్డి వేణు అధ్యక్షతన జరిగిన ఈ సభలో చెరకు రైతు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మర్రాపు సూర్యనారాయణ, సీఐటీయూ నాయకుడు పి. శంకరరావు, రామారావు, తదితరులు పాల్గొన్నారు. -
మోదీ, బాబు కార్పొరేట్ జీతగాళ్లు
ధర్మవరం అర్బన్: నరేంద్రమోదీ, చంద్రబాబునాయుడు ఇద్దరూ కార్పొరేట్ జీతగాళ్లని సీపీఎం జిల్లా కార్యదర్శి ఓబుళు విమర్శిం చారు. పట్టణంలోని పీఆర్టీ సర్కిల్లో సోమవారం నిర్వహించిన ఏపీ చేనేత కార్మిక సంఘం 8వ రాష్ట్ర మహాసభల్లో ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉండగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని మోదీ వ్యతిరేకించారని గుర్తుచేశారు. అధికారం చేపట్టాక ఇండియన్ ఫాస్ట్ డెవలప్మెం ట్ అనే పేరుతో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నారన్నారు. మోదీ, చంద్రబాబులు ఇద్దరూ చేనేత పార్క్‌ల ను ఏర్పాటు చేయకుండా టెక్స్టైల్స్ పార్కులు ఏర్పాటు చే స్తూ చేనేతలను నాశనం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశా రు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 25 హామీల్లో ఒక్కటి కూ డా చంద్రబాబునాయుడు నెరవేర్చలేదన్నారు. అంగన్వాడీలను తీసేయండి, తహశీల్దార్, ఎంపీడీఓలను మార్చండి, రేషన్డీలర్లను పీకేయండి అంటూ స్థానిక ఎమ్మెల్యే సూరి అ ధికారులపై జులుం చేస్తున్నారని ఆరోపించారు. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ధర్మవరానికి చేనేత పార్క్‌ను తీసుకురావాలని డిమాండ్ చేశారు. బాబు మాటలు విని రైతులు 90శా తం మంది బ్యాంకు లో రుణాలను రెన్యూవల్ చేసుకోలేదన్నారు. ఇన్పుట్ సబ్సిడీ, వాతావరణ బీమా ఇవ్వక, రుణమాఫీలు చేయకపోవడంతో అనంత రైతు పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. రైతులు, చేనేతల ఉసురు చంద్రబాబుకు తగులుతుందన్నారు. 63 మండలాలకు ఉన్న ఉపాధి హామీను ఇప్పుడు కేవలం 17మండలాలకే పరిమితం చేసిన మహనీయుడు బాబుగారని ఎద్దేవా చేశారు. వాగ్దానాల్లో ఏ ఒక్కటైనా నెరవేర్చావా?.. బాబూ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ ఎన్నికల సమయంలో చేనేతల సమస్యల పరిష్కారానికి మేనిఫెస్టోలో 25 హామీలు ఇచ్చి, ఇందులో ఒక్కటి కూడా చంద్రబాబు నెరవేర్చలేదని ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ తెఇపారు. పట్టణంలోని పరమేశ్వరి ఫంక్షన్ హాల్లో సోమవారం ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం 8వ రాష్ట్ర మహాసభలో ఆయన మాట్లాడారు. చేనేతల రుణ మొత్తం కేవలం రూ.238 కోట్ల మాత్రమేనని, దీనిని కూడా మాఫీ చేయడానికి చంద్రబాబు మనసు అంగీకరించడంలేదన్నారు. చంద్రబాబునాయుడు మాటలు విని జిల్లాలో 8మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలను చేనేత ఓృ్లతోనే గెలిపించడం జరిగిందన్నారు. ఇప్పటికైనా చేనేత సమస్యలు పరిష్కరించకుంటే ప్రతి ఒక్క చేనేత కార్మికుడు కొమ్ము తీసుకుని బయటకు వచ్చి నీ భరతం పడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు టీఎన్ శేషయ్య, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆశాం సురేష్, స్థానిక నాయకులు ఎస్‌హెచ్‌బాషా, ఆదినారాయణ, రమణ, డాక్టర్ ఆదిశేషు తదితరులు పాల్గొన్నారు. -
తక్కువ నీరు.. ఎక్కువ సేద్యం
పరిగి రూరల్: బిందుసేద్యంతో నీటి వృథాను అరికట్టడమే కాకుండా తక్కువ నీటితో ఎక్కువ సేద్యం చేసేందుకు వీలుంటుందని తెలంగాణ రాష్ట్ర సూక్ష్మ నీటి పారుదల శాఖ ప్రాజెక్ట్ డెరైక్టర్ బాబు పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని బసిరెడ్డిపల్లిలో కావలి మల్లేష్ వ్యవసాయ పొలంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో బిందుసేద్యంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని మరింత పెంచేందుకే గ్రామీణ ప్రాంతాల్లో డ్రిప్ వాడకంపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. రైతులు ఇప్పటికీ సాంప్రదాయ పద్ధతుల్లోనే పంటలు సాగు చేస్తున్నారన్నారు. కాల్వల ద్వారా పొలాలకు నీరందిస్తూ వ్యవసాయం చేయడం వల్ల నీరు వృథా అవుతోందన్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న డ్రిప్ పరికరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. డ్రిప్ కావాల్సిన రైతులు ఆల్‌లైన్‌లో కూడా దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. బిందు సేద్యం ద్వారా పొలాలకు నీరందిస్తున్న రైతులు మూడు నెలలకోసారైనా డ్రిప్ పైపుల్లో పట్టిన నాచును తొలగించేందుకు యాసిడ్ ట్రీట్మెంట్ చేయాలన్నారు. అనంతరం యాసిడ్ ట్రీట్మెంట్ చేసే విధానం గురించి రైతులకు అర్థమయ్యేలా చేసి చూపించారు. అవగాహన సదస్సులో మైక్రో ఇరిగేషన్ జిల్లా కో ఆర్డినేటర్ బిచ్చయ్య, నెటాఫిమ్ కంపెనీ ప్రతినిధులు మధుప్రసాద్, జీవన్‌రెడ్డి, ఏరియా ఆఫీసర్ రాంరెడ్డి విజయ్, రాజనర్సింహులు, బాగన్న, శ్రీశైలం, జగన్మోహన్రెడ్డి, నర్సింహారెడ్డి, వెంకట్‌రెడ్డి, వినాయకరెడ్డి, నర్సింహులు,వెంకటయ్య, రామకృష్ణ పాల్గొన్నారు. -
ఆంధ్రాకు అద్దె మేధావులు
-
బాపూ అంత్యక్రియలు పూర్తి
చెన్నై : ప్రఖ్యాత చిత్రకారుడు,సినిమా దర్శకుడు బాపూ అంత్యక్రియలు పూర్తయ్యాయి. చెన్నైలోని బీసెంట్ నగర్ శ్మశాన వాటికలో బాపూ అంత్యక్రియలు నిర్వహించారు. అంతకు ముందు బాపూ నివాసం నుంచి బీసెంట్ నగర్ శ్మశాన వాటిక వరకూ అంతిమ యాత్ర కొనసాగింది. అంతిమ యాత్రలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్, మంత్రి పల్లె రఘునాథరెడ్డి, గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, బోనీకపూర్, అనీల్ కపూర్, సినీరంగ ప్రముఖులతో పాటు, పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. -
నిజాయితీగల నాయకుడు జగన్
ప్రజల బలహీనతలను అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చిన బాబు రాష్ట్ర విభజనకు సహకరించి చరిత్రహీనుడిగా మిగిలిన కిరణ్ బాబు, కిరణ్ చిత్తూరు జిల్లాలో పుట్టడం దురదృష్టకరం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పులిచెర్ల (కల్లూరు): రాజకీయాల్లో నిజాయితీ కలిగిన ఏకైక నాయకుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి మాత్రమేనని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పులిచెర్లలో సోమవారం ఎంపీపీ మురళీధర్ సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఇటీవల ఎన్నికల్లో రాష్ట్ర ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకుని అమలుకు సాధ్యంకాని హామీలను గుప్పించి అడ్డదారిలో చంద్రబాబు అధికారంలోకి వచ్చాడని దుయ్యబట్టారు. నాడు అధికారం కోసం పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచిన మాదిరిగానే నేడు ప్రజలను వెన్నుపోటు పొడవడానికి చంద్రబాబు సిద్ధమయ్యారని ఆయన ధ్వజమెత్తారు. అధికారంలోకి వస్తే మొదటి సంతకం రుణమాఫీపైనే చేస్తానంటూ ప్రగల్భాలు పలికి ఇప్పుడు దానిపై కమిటీ వేసి కాలయాపన చేస్తున్నాడన్నారు. ఎన్నికల సమయంలో తమ పార్టీ మేనిఫెస్టోలో రుణమాఫీని చేర్చాలని తనతో పాటు మరికొంత మంది అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకుపోగా అందుకు ఆయన స్పందిస్తూ అది సాధ్యమయ్యే పనికాదని, అధికారంలోకి వచ్చిన తరువాత చేయకపోతే ప్రజల మనసులో మాట నిలుపుకోలేని వ్యక్తులుగా మిగిలిపోవాల్సి వస్తుందని చెప్పినట్టు ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారంలో ఉన్నన్ని రోజులు రాష్ట్ర విభజనకు సహకరించి చరిత్ర హీనుడుగా మారాడని విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రజలను మోసం చేసిన ప్రస్తుత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఇద్దరూ చిత్తూరు జిల్లాలో పుట్టడం మన దురదృష్టకరమన్నారు. టీడీపీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు తెలుగుదేశానికి ఓటు వేసిన ప్రతి ఒక్కరూ ఆ పార్టీ నాయకులను నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు అశోక్, ఎంపీపీ మురళీధర్, మండల పార్టీ కన్వీనర్ మురళీమోహన్‌రెడ్డి, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు రవీంద్రారెడ్డి, సహకార సంఘం మాజీ అధ్యక్షులు రెడ్డీశ్వర్‌రెడ్డి, నాయకులు నాదమునిరెడ్డి, సురేంద్రనాథ్‌రెడ్డి, ఎన్ఎస్ రెడ్డిప్రకాష్, నాగిరెడ్డి, వెంకటరెడ్డెప్ప, డీఎస్.గోవింద్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్వీ రమణ, కోదండయ్య, ముర్వత్బాషా, రాయల్‌మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
‘డ్రిప్’తో రైతులకు లాభదాయకం
జిల్లా ఉద్యాన శాఖ ప్రాజెక్ట్ డెరైక్టర్ బాబు నవాబుపేట: పంటల సాగులో డ్రిప్ విధానాన్ని అవలంబిస్తే రైతులకు లాభదాయకంగా ఉంటుందని జిల్లా ఉద్యాన శాఖ ప్రాజెక్ట్ డెరైక్టర్ బి.బాబు అన్నారు. బుధవారం మండలంలోని మమ్మదాన్‌పల్లిలో జిల్లా సూక్ష్మ నీటి పారుదల పథకం ఆధ్వర్యంలో రైతులకు యాసిడ్ ట్రీట్మెంటు, ఫెర్టిగేషన్పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా నెట్‌ఫీం సంస్థవారు రైతులకు డ్రిప్ వాడకంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పీడీ బాబు మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు 60 కిలోమీటర్ల పరిధి వరకు కూరగాయల జోన్‌గా మార్చాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. దీని ద్వారా దిగుబడి పెంచడమే కాకుండా రైతులకు దన్నుగా నిలవాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉన్నట్లు తెలిపారు. హైదరాబాద్‌కు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే కూరగాయలను అరికట్టి ఇక్కడి రైతులతో సాగు చేయించి వారి జీవన స్థాయిని పెంచాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉందన్నారు. ఇందుకు తగిన విధివిధానాలను ఖరారు చేస్తున్నామన్నారు. కూరగాయల జోన్‌కు డ్రిప్ సహకారం చాలా అవసర మని ఆయన తెలిపారు. జిల్లాలోని 78 వేల బోరుబావుల కింద ప్రస్తుతం 59 వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతున్నాయన్నారు. ఇందులో 24 వేల హెక్టార్లలో మాత్రమే రైతులు డ్రిప్‌తో సాగు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కూర గాయల సాగు దిశగా రైతులను చైతన్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.డ్రిప్‌తో సాగునీరు ఆదా కావడమే కాకుండా విద్యుత్ వాడకం తగ్గుతుందన్నారు. దిగుబడి పెరుగుందని ఆయన తెలిపారు. ఇందుకోసం ప్రతి రైతూ డ్రిప్ విధానంలో సాగు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉద్యాన శాఖ అదనపు ప్రాజెక్ట్ డెరైక్టర్ హరిప్రసాద్, ఎంఐడీసీవో బిచ్చయ్య, నెట్‌ఫీం సంస్థ డీసీవో బాలసుబ్రహ్మణ్యం, మైక్రో ఇరిగేషన్ ఇంజినీర్ శిరీష, మైక్రో ఇరిగేషన్ ఏరియా ఆఫీసర్లు రాజేందర్, లక్ష్మయ్య, రాంరెడ్డి, నర్సింలు, చంద్రకాంత్, సంధ్యాజ్యోతి, మౌనిక, కృష్ణ య్య, జ్యోతిర్లింగం, రైతులు పాల్గొన్నారు. -
ఏక్సే బడ్కర్ ఏక్
కాక కతలు సెప్తుంటడు. గవి గిప్పటి కతలు గావు. ఎన్కటి జమాన కతలు.అట్లిట్ల జేసి గా కతలను గాయిన గిప్పటి జమానకు గల్పుతుంటడు. గీ నడ్మ మా కాక ఒక కత జెప్పిండు. ఎన్కట ఒక పంతులుండె. గాయినకు పెండ్లాం పిల్లలు లేరు. గాయిన తాన పోరగాండ్లు సద్వుకునెటోల్లు. ఒక దినం పక్కూరుకెల్లి ఒక పోరడు గాయిన తాన్కి వొచ్చిండు. గాడు గున్నకుగున్నున్నడు. రాంగనే గాడు పంతులు కాల్లు మొక్కిండు. నాకెవ్వరు లేరు. మీ తాన సద్వుకునేతందుకొచ్చిన. నన్ను మీ కొడ్కనుకొండ్రి. మీ తాన్నె ఉంచుకొండ్రి అని ఒక్క తీర్గ బత్మిలాడిండు. గాని మాటలకు పంతులు మనసు బరఫ్ లెక్క గర్గింది. నాతాన్నే ఉండి సదువుకో అని గాయిన అన్నడు. గాడు పొద్దుగాల్లే నిద్రలేసెటోడు. ఆకిలూకెటోడు. సాన్పు సల్లి ముగ్గ్గేసెటోడు. పంతులు లెవ్వంగనే యాప్పుల్ల దెంపి ఇచ్చెటోడు. గాయిన మొకం గడ్గంగనే ఛాయ్ ఇచ్చెటోడు. గాయిన తానం జేసెతందుకు చేదబాయిల కెల్లి నీల్లు దోడిచ్చెటోడు. నాస్త బెట్టెటోడు. వొంటజేసెటోడు. పంతులు పండుకుంటె కాల్లు పిస్కెటోడు. గాన్ని పంతులు గూడ కొడ్కులెక్క జూసెటోడు. గా పంతులు తాన ఒక బొంత ఉండేది. గూసున్నా, నిలవడ్డా, పండుకున్నా, గీడున్నా, గాడున్నా ఎప్పుడు గా బొంతను గాయిన ఇడ్సెటోడు గాదు. ఒక్క మినిట్ గూడ ఎవ్వరికి ఇచ్చెటోడు గాదు. గది గాయిన పానం. ఒకసారి పంతులుకు పక్కూర్ల పనిబడ్డది. మీరు మా వూరికే బోదమనుకుంటున్నరు. నేను గూడ మీతోని వొస్త అని గాడు అన్నడు. మంచిది రారా అని పంతులన్నడు. పంతులు బొంత దీసి సంకల బెట్టుకున్నడు. ఇద్దరు గల్సి నడ్సుకుంట పక్కూరికి బోబట్టిండ్రు. ఎండ ఎక్వ ఉండబట్కె చెమ్టతోని ఇద్దరు తోపుతోపైండ్రు. నడ్మల ఒక చెర్వు గండ్లబడ్డది. పంతులూ! పెయ్యంత చీదరచీదరున్నది. చెర్ల తానం జేసొస్త అని గాడన్నడు. చెర్ల దుంకి తానం జేసిండు. నాగ్గూడ పెయ్యి చీదరచీదరగున్నది. నేను గూడ చెర్ల తానం జేస్తే బాగుండు గని గీ బొంత నా పానమసుంటిది. ఏం జెయ్యాలె ? అని పంతులు జెరసేపు సోంచాయించిండు. గీడు నాతాన్నే ఉంటడాయె. నన్నిడ్సి యాడికి బోతడు గీనిక నా బొంత ఇచ్చి చెర్ల తానం జేస్త అని పంతులు మనసుల అనుకుండు. అనుకోని గానికి బొంత ఇచ్చిండు. చెర్లకు దిగిండు. పంతులిట్ల చెర్లకు దిగంగనే బొంత దీస్కోని చెంగోబిల్లన్నడు. పెయి మీద బట్ట పామై గర్సిందని పంతులనుకున్నడు. బొంత బోయిందనే ఫికర్తోనే సచ్చిండు. అసల్ సంగతేందంటె గా బొంత నిండ బంగారమున్నది. బొంతనెత్కబోయెతందుకే గాడు పంతులు తాని కొచ్చిండు. బంగారం తోని గాడు మజా ఉడాయించుకుంట బత్కిండు. కొన్నేండ్లకు గాడు గూడ సచ్చిండు. పంతులు ఎన్టీఆర్గ బుట్టిండు. బొంతనెత్కబోయిన గాడు చెంద్రబాబుగా బుట్టిండు. అని మా కాక కత జెప్పిండు. గీ జల్మల గూడ బాబుకు ఎన్కటి గునం బోలేదన్నడు. ఎప్పటి తీర్గనే గా దినం గూడ పాన్ డబ్బా కాడికి బోయిన. గాడ్కి మా దోస్తులొస్తుంటరు. పాన్ దినెటోడు పాన్ దింటడు. సిగిలేటు దాగెటోడు సిగిలేటు దాగుతడు. ‘ చెంద్రబాబు సీమాంద్రను బంగారి సీమాంద్ర జేస్తనంటున్నడు’అని మా సత్నారి అన్నడు.గానికి మా కాక జెప్పిన కత జెప్పిన. ‘గిప్పుడు గూడ బాబుకు బంగారమంటె శానిస్టమున్నట్టు గొడ్తున్నది.’ అని సిగిలెటు దాక్కుంట మా యాద్గిరి అన్నడు. ‘ గట్లే గొడ్తున్నది బంగారం గాయినకు .. పచ్చంగిలు, పచ్చ జెండలు. పస్కలు కడ్మోల్లకు’ అని పాన్ నమ్లుకుంట సత్నారి అన్నడు. ‘చెంద్రబాబు సైకిల్ గేరు బద్లాయించి స్పీడ్ బెంచుతడట. ఎదురుంగ ఎవ్వరొచ్చిన కిందికి తొక్కుతడట.’ అని మా లచ్చినారి అంటే - ‘ఎవ్వరన్న బుడ్డ మొలతోని గాయిన సైకి ల్ గాలిదీస్తే ఎం జేస్తడు’ అని సత్నారి అడిగిండు.‘బిజెపితోని సోపతి జెయ్యబట్కే మా సైకిల్ గాలి బోయిందని అంటడు’ మా ముచ్చట ఇంటున్న పాన్డబ్బోడన్నడు.‘చెంద్రబాబు కడ్మ పార్టిల లీడర్ల గుండెలల్ల నిద్రబోతనంటున్నడు.’ అనా యాద్గిరి అన్నడు. ‘ముక్యమంత్రి కుర్సి ఉండంగ గది యాడ బోతదో అనే బయంతోని గాయిన నిద్రబోలేడు. గిప్పుడు ముక్యమంత్రి కుర్సి దొరుక్తదో లేదో అనేటి పరేషాన్తోని నిద్రబోతలేడు. ఇగ గాల్ల గుండెల గీల్ల గుండెల గాయిన నిద్రబోయే సవాలే లేదు.’ అని సిగిలేటు ముట్టించుకుంట సత్నారి అన్నడు. ‘గీ పారి సీమాంద్రల తప్పకుంట ముక్యమంత్రినైతనని చెంద్రబాబు అంటున్నడు’ యాద్గిరి పాన్ ఉంచుకుంట అన్నడు. ‘ఏం జేసిండని అయితదడట. పాదయాత్ర జేసినందుకా? ప్రజాగర్జన మీటింగ్‌లు బెట్టినందుకా? కోట్లకు కోట్లున్నోల్లను టిడిపిల శరీక్ జేస్కున్నందుకా? ఎందుకైతడట’ అని పత్నారి అడిగిండు. గీ యాడాది ఆనలు సరిగ గుర్వయి. కర్వుకాలం వొస్తున్నదని బాబుకు ఎర్కైంది. నేను ముక్యమంత్రిగ ఉండంగ దప్పిడ్సి ఎవ్వరు ముక్యమంత్రిగ ఉండంగ కర్వుకాలం రాలేదు. కర్వుకాలమొస్తున్నదంటె నేను ముక్యమంత్రి అయితున్నట్టే గదా అని గాయినంటున్నడు’ అనా యాద్గిరి జెప్పిండు. ‘పవన్‌కల్యాన్ గీయినను జూసి మొకం దిప్పుకున్నా గాయిన ఇంటికి బొయిండు. టిడిపి దిక్కుకెల్లి ప్రచారం జెయ్యుమని ఒక్క తీర్గ బత్మిలాడిండు. మోడి, నువ్వు, నేను ఒక్కతీర్గనేసోంచాయిస్తమన్నడు. మోడి ఈన్న తీర్గ 1+1+1= 3 గాదు 111 అన్నడు.మనం ముగ్గురం గలిస్తేనే 111 అని మల్లొక్కపారి పవన్‌కు జెప్పిండు.’ అని లచ్చినారి అన్నడు. ‘అవ్ పవన్ ఏక్ మోడి గ్యారా చెంద్రబాబు ఏక్సౌగ్యారా. ఏక్సే బడ్కర్ ఏక్. ఏదాంట్ల అంటె ఎన్కకెల్లి పొడ్సుట్ల.’ అని సత్నారి అన్నడు. గీ తీర్గ రాత్రి పదిగొట్టె దాంక ముచ్చట బెట్టి ఎవ్వరింటికి గాల్లు బోయినం. తోక : గాంగ్రెస్ సెంటర్మంత్రి సర్వే సత్యనారాయన ఎలచ్చన్ల ప్రచారం జేస్కుంట దిర్గబట్టిండు. ఒక తాన మీటింగ్బెట్టిండ్రు. కడ్మ లీడర్లు స్పీచ్ గొడ్తుంటే స్టేజి మీద కూసొనే గాయిన నిద్రబోయిండు. ‘అన్న ఐదేండ్లు మంచిగ నిద్రబోయిండు. గిప్పుడు గుడ్క నిద్రబోతె ఎట్లరా బై’ అని గల్లి కాంగ్రెస్ లీడర్ పక్కనున్నోని తోని అన్నడు. -
మహిళల మాటేది బాబూ!
సీట్లివ్వాల్సిందేనంటూ తెలుగు మహిళ డిమాండ్ చాకిరీ చేయించుకోవడం తప్ప ప్రోత్సహించరా..? సాక్షి, సిటీబ్యూరో: ‘ ఎక్కడైనా ధర్నాలు చేయాలంటే ముందుండేది మేం! సమావేశాలు, రాస్తారోకోల్లోనూ మాదే ముఖ్య భూమిక. పార్టీ చేపట్టిన వివిధ కార్యక్రమాల్లో.. ఆందోళన కార్యక్రమాల్లో మమ్మల్ని ముందుంచుతున్నప్పటికీ, టిక్కెట్ల విషయంలో మాత్రం ఎందుకు గుర్తుకు రావడం లేదు? ’ అంటూ తెలుగు మహిళలు టీడీపీ అధిష్టానాన్ని ప్రశ్నించారు. పురుషులకు ఏమాత్రం తీసిపోని విధంగా అన్ని కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్న తమపై టిక్కెట్ల కేటాయింపులో వివక్ష ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. బుధవారం హైదరాబాద్జిల్లా టీడీపీ కార్యాలయంలో సమావేశమైన తెలుగు మహిళలు గ్రేటర్ పరిధిలో కనీసం ముగ్గురు మహిళలకైనా అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీలకు తగినన్ని సీట్లు.. బీసీ ముఖ్యమంత్రి అంటూ ప్రచారం చేస్తున్నప్పటికీ, మహిళలను ఎందుకు విస్మరిస్తున్నారని ప్రశ్నించారు. టిక్కెట్లిస్తే మగవాళ్లకు తీసిపోని విధంగా గెలిచి చూపిస్తామన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో తమ పార్టీ మహిళలు 13 మంది ఉండటాన్ని ప్రస్తావించారు. ఎన్టీఆర్ మాదిరిగానే చంద్రబాబు కూడా మహిళలకు తగిన గుర్తింపు నివ్వాల్సి ఉందన్నారు. జిల్లా తెలుగు మహిళ నుంచి కనీసం ముగ్గురికి టిక్కెట్టివ్వాలని డిమాండ్ చేశారు. కేటాయించే ఒకటీ అరా సీట్లు సైతం పార్టీ నాయకుల భార్యలకో, కుటుంబీకులకో కేటాయించడం మరింత దారుణమన్నారు. ఈసారైనా అలా కాకుండా నిజమైన మహిళా కార్యకర్తలకే అవకాశం కల్పించాలని కోరారు. తెలుగుమహిళ జల్లా అధ్యక్షురాలు శేషుకుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో తెలుగుమహిళ నేతలు సీఆర్ స్వరూపరాణి, సుమిత్రాబాయి, కాంతమ్మ, ఫరీదాబేగం, అనూరాధ తదితరులు మాట్లాడారు. అనంతరం శేషుకుమారి విలేకరుల తో మాట్లాడుతూ సమావేశ నిర్ణయాన్ని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి, జిల్లా అధ్యక్షుడు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు తెలియజేస్తామన్నారు. ఈ మేరకు వారికి వినతిపత్రాలు సమర్పించనున్నట్లు చెప్పారు. -
సంక్రాంతి రాజకీయాల్లో చంద్రబాబు బిజీ
-
బాబు,కిరణ్ బీఏసీ భేటీకి డుమ్మా
-
లలిత్‌బాబు విజయం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్. లలిత్‌బాబు ఎనిమిదో రౌండ్ గేమ్‌లో రష్యా గ్రాండ్‌మాస్టర్ వాసిలీ పాపిన్కు షాకిచ్చాడు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న అంతర్జాతీయ గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో ఆదివారం జరిగిన ‘ఎ’ కేటగిరీ ఎనిమిదో రౌండ్ పోటీలో ఏపీ ఆటగాడు చక్కని ఎత్తులతో రష్యన్ ప్రత్యర్థిని నిలువరించాడు. 34 ఎత్తుల్లోనే వాసిలీ ఆటకట్టించాడు. తాజా విజయంతో అతను 6 పాయింట్లతో మరో ఐదుగురితో కలిసి ఉమ్మడిగా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. చెన్నైకి చెందిన గ్రాండ్‌మాస్టర్ సేతురామన్ ఆరున్నర పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. అతను మిఖాయిల్ మొజరోవ్ (రష్యా, 6)తో గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. సంచలన విజయాలతో దూసుకెళ్తున్న ఏపీ కుర్రాడు ధూళిపాళ బాలచంద్ర ప్రసాద్ (5)కు ఎనిమిదో రౌండ్లో చుక్కెదురైంది. ఆర్మేనియా గ్రాండ్‌మాస్టర్ శామ్వెల్ టెర్-సహక్యాన్ (6) చేతిలో బాలచంద్ర కంగుతిన్నాడు. ఏడో రౌండ్దాకా సంయుక్తంగా మూడో స్థానంలో కొనసాగిన అతను తాజా పరాజయంతో ఇప్పుడు నాలుగో స్థానానికి పడిపోయాడు. ‘బి’ కేటగిరీలో జరిగిన ఏడో రౌండ్ గేముల్లో ఆంధ్రప్రదేశ్ ఆటగాళ్లు వరుణ్, విశ్వనాథ్ ప్రసాద్, లక్ష్మీసందీప్ నాయుడు, సాయి అగ్ని జీవితేశ్, ప్రతీక్ శ్రీవాస్తవ, ఎస్. ఖాన్, కల్యాణ్ కుమార్ విజయాలు నమోదు చేశారు. బి-కేటగిరీ ఏడో రౌండ్ ఫలితాలు వరుణ్ (ఏపీ, 6.5)... సుబ్రమణ్యం (తమిళనాడు)పై, విశ్వనాథ్ ప్రసాద్ (ఏపీ, 6.5)... రమణబాబు (ఏపీ, 5)పై, లక్ష్మీ సందీప్ (ఏపీ, 6)... విజయ్ ఆనంద్ (తమిళనాడు, 5)పై, సాయి అగ్ని జీవితేశ్ (ఏపీ, 5.5)... నయన్‌దీప్ (డీఏఎస్సీబీ, 4.5)పై, కళ్యాణ్ కుమార్ (ఏపీ, 5)... బైవబ్ (ఒడిశా, 4)పై, ఎస్.ఖాన్ (ఏపీ, 5)... రాజేంద్ర (రాజస్థాన్, 4)పై, ప్రతీక్ (ఏపీ, 5)... రూప్ సౌరవ్ (బీహార్, 4)పై నెగ్గారు. -
ఏకంగా ఎనిమిది సుమోలు..మరి ఏమైపోయాయ్..?
-
కాకులు ఎత్తుకెళ్లలేదు..గద్దలు తన్నుకెళ్లలేదు..మరి ఏమైపోయాయ్..?
-
బురిడీ బాబు
-
బురిడీ బాబు
-
లోకేష్ ఒక చవటబ్బాయి: ఎమ్మెల్యే శ్రీకాంత్
-
ఒప్పందం బాబుది.. భూములిచ్చింది రోశయ్య..