వేగంగా వెళ్తున్న బొలేరో వాహనం రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది.
అల్వాల్: వేగంగా వెళ్తున్న బొలేరో వాహనం రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన గురువారం తెల్లవారుజామున నగరంలోని బొల్లారం కంటెయినర్ డంపింగ్ యార్డ్ వద్ద జరిగింది. వివరాలు.. కూకట్‌పల్లి యల్లమ్మబండకు చెందిన కొంతమంది భక్తులు యాదగిరిగుట్టకు వెళ్లి వస్తుండగా ఈ సంఘటన జరిగింది.
ఈ ఘటనలో బాబు (19), అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం తరలించారు. కాగా, ప్రస్తుతానికి వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో కారులో 8మంది ఉండగా అందూ ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.