సాక్షి, నంద్యాల: నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కారు, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. ఇక, మృతిచెందిన వారిని హైదరాబాద్‌కు చెందినవారిగా గుర్తించారు.
వివరాల ప్రకారం.. ఆళ్లగడ్డ మండలంలోని నల్లగుట్ల వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. కాగా, వీరంతా హైదరాబాద్‌లోని అల్వాల్‌కు చెందిన వారు అని తెలుస్తోంది.
ఇక, మృతుల్లో నవ దంపతులు ఉండటం కుటుంబ సభ్యులను ఆవేదనకు గురిచేస్తోంది. అల్వాల్‌కు చెందిన బాలకిరణ్, కావ్యకు ఇటీవలే ఫిబ్రవరి 29 తేదీన వివాహం జరిగింది. మార్చి మూడో తేదీన షామీర్‌పేటలో రిసెప్షన్ జరిగింది. కాగా, వీరింతా తిరుమలకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరగడంతో మృతిచెందారు.
Comments
Please login to add a commentAdd a comment