Car - a lorry collided
-
నంద్యాల: ఘోర రోడ్డు ప్రమాదం.. నవ దంపతులు మృతి
సాక్షి, నంద్యాల: నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కారు, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. ఇక, మృతిచెందిన వారిని హైదరాబాద్‌కు చెందినవారిగా గుర్తించారు. వివరాల ప్రకారం.. ఆళ్లగడ్డ మండలంలోని నల్లగుట్ల వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. కాగా, వీరంతా హైదరాబాద్‌లోని అల్వాల్‌కు చెందిన వారు అని తెలుస్తోంది. ఇక, మృతుల్లో నవ దంపతులు ఉండటం కుటుంబ సభ్యులను ఆవేదనకు గురిచేస్తోంది. అల్వాల్‌కు చెందిన బాలకిరణ్, కావ్యకు ఇటీవలే ఫిబ్రవరి 29 తేదీన వివాహం జరిగింది. మార్చి మూడో తేదీన షామీర్‌పేటలో రిసెప్షన్ జరిగింది. కాగా, వీరింతా తిరుమలకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరగడంతో మృతిచెందారు. -
శ్రీకాళహస్తిలో ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి
సాక్షి, తిరుపతి: శ్రీకాళహస్తిలో విషాద ఘటన చోటుచేసుకుంది. లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి అతి వేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఇక, మృతులు విజయవాడకు చెందినట్టు సమాచారం. వివరాల ప్రకారం.. శ్రీకాళహస్తి సమీపంలోని మెట్ట కండ్రిగ వద్దలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న లారీని హైస్పీడ్‌లో ఉన్న కారు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందగా, మరో ఇద్దరు త్రీవంగా గాయపడ్డారు. ఇక, ప్రమాదం జరిగిన సమయంలో కారులో 8 మంది ప్రయాణిస్తున్నారు. కాగా, వీరంతా తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. కాగా, ప్రమాదంలో గాయపడిన వారిని అంబులెన్స్‌లో వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇది కూడా చదవండి: లారీ ఢీకొని.. నాలాలో కూరుకుపోయి.. -
గుడికి వెళ్తూ మృత్యువు ఒడికి
- కారును ఢీకొన్న లారీ - నలుగురికి గాయూలు - ఆస్పత్రికి తరలిస్తుండగా ఓ వ్యక్తి మృతి కొయ్యలగూడెం : గుడికి వెళుతున్న ఓవ్యక్తి మృత్యువాత పడ్డాడు. కొయ్యలగూడెం సమీపంలోని హార్టిజన్ కాంప్లెక్స్ వద్ద కారును లారీని ఢీట్టింది. కారులోని ఓ వ్యక్తి మరణించాడు. ముగ్గురికి గాయూలయ్యూరుు. వివరాలు ఇవి.. జంగారెడ్డిగూడెంకు చెందిన ఎన్.లోవరాజు భార్య, కుమారుడు, తండ్రి జోగిరాజు(55)తో కలసి తూర్పుగోదావరి జిల్లా తలుపులమ్మ లోవలోని అమ్మవారి ఆలయానికి శుక్రవారం అర్ధరాత్రి దాటిని తరువాత సొంత కారులో బయలుదేరారు. లోవరాజు డ్రైవింగ్ చేస్తున్నాడు. ముందు సీట్లో జోగిరాజు, వెనుక సీట్లలో లోవరాజు భార్య, కుమారుడు కూర్చున్నారు. శనివారం వేకువజాము సుమారు 2 గంటలకు కొయ్యలగూడెం సమీపంలోని హార్టిజన్ కాంప్లెక్స్ వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న లారీ కారుని ఢీకొంది. కారులోని నలుగురు గాయాలయ్యూరుు. వారిని జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా జోగిరాజు మార్గమధ్యంలో మృతిచెందాడు. జోగిరాజు వ్యాపారి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.