గుడికి వెళ్తూ మృత్యువు ఒడికి | Larry car a collision | Sakshi
Sakshi News home page

గుడికి వెళ్తూ మృత్యువు ఒడికి

Published Sun, Aug 2 2015 2:19 AM | Last Updated on Sun, Sep 3 2017 6:35 AM

గుడికి వెళ్తూ మృత్యువు ఒడికి

గుడికి వెళ్తూ మృత్యువు ఒడికి

- కారును ఢీకొన్న లారీ
- నలుగురికి గాయూలు
- ఆస్పత్రికి తరలిస్తుండగా ఓ వ్యక్తి మృతి
కొయ్యలగూడెం :
గుడికి వెళుతున్న ఓవ్యక్తి మృత్యువాత పడ్డాడు. కొయ్యలగూడెం సమీపంలోని హార్టిజన్ కాంప్లెక్స్ వద్ద కారును లారీని ఢీట్టింది. కారులోని ఓ వ్యక్తి మరణించాడు. ముగ్గురికి గాయూలయ్యూరుు. వివరాలు ఇవి.. జంగారెడ్డిగూడెంకు చెందిన ఎన్.లోవరాజు భార్య, కుమారుడు, తండ్రి జోగిరాజు(55)తో  కలసి తూర్పుగోదావరి జిల్లా తలుపులమ్మ లోవలోని అమ్మవారి ఆలయానికి శుక్రవారం అర్ధరాత్రి దాటిని తరువాత సొంత కారులో బయలుదేరారు.
 
లోవరాజు డ్రైవింగ్ చేస్తున్నాడు. ముందు సీట్లో జోగిరాజు, వెనుక సీట్లలో లోవరాజు భార్య, కుమారుడు కూర్చున్నారు. శనివారం వేకువజాము సుమారు 2 గంటలకు కొయ్యలగూడెం సమీపంలోని హార్టిజన్ కాంప్లెక్స్ వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న లారీ కారుని ఢీకొంది. కారులోని నలుగురు గాయాలయ్యూరుు. వారిని జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా జోగిరాజు మార్గమధ్యంలో మృతిచెందాడు. జోగిరాజు వ్యాపారి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement