
మల్దకల్ : క్షతగాత్రులను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తున్న సిబ్బంది
వనపర్తి : ప్రమాదవశాత్తు ఆటో బోల్తాపడి ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని నాగవరంలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఎస్‌ఐ మశ్చెందర్‌రెడ్డి కథనం ప్రకారం.. సహచరుడి కూతురు పెళ్లి సందర్భంగా బుధవారం రాత్రి కొత్తకోటలో నిర్వహించిన ఎదుర్కోళ్ల కార్యక్రమానికి వెళ్లి వేడుక చూసుకుని తిరిగి ఇంటికి ట్రాలీ ఆటోలో వస్తుండగా.. గురువారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో వనపర్తి మండలం నాగవరం గ్రామ శివారులో ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్‌తో కలిపి మొత్తం 13 మంది ప్రయాణిస్తున్న ఆటో బోల్తాపడింది.
ఈ ప్రమాదంలో భరత్, రవి, భూపాల్, రాజు గాయాలపాలయ్యారు. మిగతా వారికి ప్రమాదం త్రుటిలో తప్పింది. వీరిలో భరత్(30) పరిస్థితి విషమంగా మారడంతో వైద్యులు హైదరాబాద్‌కు సిఫార్సు చేశారు. వెళ్తుండగానే భరత్ మార్గమధ్యలోనే మృతిచెందాడు. రవి, భూపాల్, రాజులను మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ అంజికి స్వల్ప గాయాలపాలయ్యారు. అంజి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment