one person died
-
శుభకార్యానికి వెళ్లి.. తిరిగిరాని లోకాలకు
బత్తలపల్లి : రోడ్డుపక్కనున్న బావిలో ఈతకొట్టేందుకు పైనుంచి దూకిన టైల్స్‌వర్కర్ కడుపుభాగంలో బలమైన దెబ్బతగిలి నీటమునిగి మృతిచెందాడు. ఈదులముష్టూరులో ఈ ఘటన జరిగింది. ప్రత్యక్ష సాక్షులతోపాటు ఎస్ఐ హారున్‌బాషా తెలిపిన మేరకు.. అనంతపురం నగరంలోని కళ్యాణదుర్గం బైపాస్ రోడ్డుకు చెందిన టైల్స్‌వర్కర్ బలిజ వన్నూరుస్వామి (25) తన స్నేహితులు రాము, అనిల్, శేఖర్‌తో కలిసి బంధువుల గృహప్రవేశం కోసం శుక్రవారం ఆటోలో ధర్మవరం వచ్చారు. అక్కడ కార్యక్రమం ముగిసిన అనంతరం తిరుగుపయనమయ్యారు. బత్తలపల్లి మండలం ఈదుల ముష్టూరు సమీపంలోని వ్యవసాయ బావి వద్ద కొందరు చిన్నారులు ఈత కొడుతుండడం గమనించారు. ఎండలకు ఉక్కపోతగా ఉండటంతో ఆటోను పక్కన ఆపి ఈతకొట్టేందుకు వెళ్లారు. బావిలో నీరు బాగా ఉండటంతో వన్నూరుస్వామి రెండుసార్లు పై భాగం నుంచి నీళ్లలోకి దూకాడు. మూడోసారి నీటిలోకి దూకినపుడు కడుపుభాగంలో దెబ్బతగిలింది. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో స్థానికులు నీటి అడుగుభాగంలో గాలించి అతడిని బయటకు తీసుకొచ్చారు. అప్పటికే ఊపిరాడక వన్నూరుస్వామి మృతిచెందాడు. తహసీల్దార్ సురేష్‌బాబు, ఎస్ఐ హారున్‌బాషా తమ సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి సమాచారం సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
ట్రాక్టర్ కిందపడి యువకుడి మృతి
దుగ్గొండి(నర్సంపేట) : ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి యువకుడు మృతి చెందిన సంఘటన వరంగల్‌రూరల్ జిల్లా దుగ్గొండి మండలం మహ్మదాపురం గ్రామ సమీపంలో శనివారం సాయంత్రం జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన పాశికంటి మహేందర్, రమ దంపతుల కుమారుడు పాశికంటి రాకేష్ (22) అనస్తిషియా డిప్లొమా పూర్తి చేశాడు. అనంతరం గత సంవత్సర కాలంగా హన్మకొండలోని మాక్స్‌కేర్ ఆస్పత్రిలో అనస్తిషియా అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇదే క్రమంలో విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతుండగా తిమ్మంపేట గ్రామం వట్టెంచెరువు కట్ట క్రాస్ తిరుగుతుండగా మహ్మదాపురం నుంచి తిమ్మంపేట వైపుకు ట్రాక్టర్ ఎదురుగా వస్తుండటంతో సడన్ బ్రేక్ వేశాడు. దీంతో అదుపుతప్పి రోడ్డుపై పడ్డాడు. ఇదే క్రమంలో వేగంగా వస్తున్న ట్రాక్టర్ రాకేష్ పైనుంచి వెళ్లింది. దీంతో రాజేష్‌కు తీవ్ర గాయాలు కాగా స్థానికులు గమనించి వరంగల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.విషయం తెలుసుకున్న ఎస్సై భాస్కర్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పది రోజుల క్రితమే కూతురు.. పాశికంటి మహేందర్, రమ దంపతులకు కుమారుడు, కూతురు ఉన్నారు. అయితే ఇటీవల 10 రోజుల క్రితం గర్భవతిగా ఉన్న కూతురు అనూషకు అధిక రక్తస్రావం కావడంతో చికిత్స చేయించినా ఫలితం లేక మృతి చెందింది. దశదిన కర్మ పూర్తి అయిన వెంటనే కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ దంపతులకు తీరని శోకాన్ని మిగిల్చింది. కన్న పేగులను పొగొట్టుకున్న వారి రోదనలు కంటతడి పెట్టించాయి. మహ్మదాపురం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
ఆటో బోల్తా.. ఒకరి మృతి
వనపర్తి : ప్రమాదవశాత్తు ఆటో బోల్తాపడి ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని నాగవరంలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఎస్ఐ మశ్చెందర్రెడ్డి కథనం ప్రకారం.. సహచరుడి కూతురు పెళ్లి సందర్భంగా బుధవారం రాత్రి కొత్తకోటలో నిర్వహించిన ఎదుర్కోళ్ల కార్యక్రమానికి వెళ్లి వేడుక చూసుకుని తిరిగి ఇంటికి ట్రాలీ ఆటోలో వస్తుండగా.. గురువారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో వనపర్తి మండలం నాగవరం గ్రామ శివారులో ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్‌తో కలిపి మొత్తం 13 మంది ప్రయాణిస్తున్న ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో భరత్, రవి, భూపాల్, రాజు గాయాలపాలయ్యారు. మిగతా వారికి ప్రమాదం త్రుటిలో తప్పింది. వీరిలో భరత్(30) పరిస్థితి విషమంగా మారడంతో వైద్యులు హైదరాబాద్‌కు సిఫార్సు చేశారు. వెళ్తుండగానే భరత్ మార్గమధ్యలోనే మృతిచెందాడు. రవి, భూపాల్, రాజులను మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ అంజికి స్వల్ప గాయాలపాలయ్యారు. అంజి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
దేవరకొండ : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఆదివారం రాత్రి దేవరకొండ పట్టణ శివారులో చోటుచేసుకుంది. దేవరకొండ సీఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. డిండి మండలం బొల్లనపల్లి పెద్దతండాకు చెందిన జర్పుల శంకర్(30), కాట్రావత్ కిషన్, కాట్రావత్ కల్యాణ్ కొండమల్లేపల్లి మండలం గుమ్మడవెల్లి గ్రామపంచాయతీ పరిధిలో జరుగుతున్న తమ బంధువు వివాహానికి హాజరయ్యారు. అనంతరం తిరుగు ప్రయాణంలో ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వస్తుండగా మార్గమధ్యంలో దేవరకొండపట్టణ శివారులోకి రాగానే దేవరకొండ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో శంకర్ మృతిచెందాడు. గాయలపాలైన కాట్రావత్ కిషన్, కాట్రావత్ కల్యాణ్‌ను చికిత్స నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. శంకర్‌కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఆర్టీసీ, ప్రైవేట్ బస్సు ఢీ: ఒకరు మృతి
సాక్షి, నెల్లూరు: నెల్లూరు నగరంలో రెండు బస్సులు ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతిచెందాడు. స్థానిక అయ్యప్ప గుడి వద్ద ఆర్టీసీ బస్సు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా అతడిని నాయుడుపేటకు చెందిన కాశి గురుప్రసాద్‌గా గుర్తించారు. పదిమందికి గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సు గుంటూరు జిల్లా పొన్నూరు నుంచి తిరుపతి వెళ్తోంది. -
ఇళ్లపై దాడి
మహబూబాబాద్ రూరల్ : అమనగల్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మృతికి తమ కులస్తులే కారణమని పలువురు తమ ఇష్టం వచ్చినట్లు దాడి చేసి ఆస్తి నష్టం చేశారని ఎరుకల కులస్తులు కూజ అనిత, వెంకటమ్మ, మంగమ్మ, చంద్ర మ్మ, చిన్న మంగమ్మ బుధవారం తెలిపారు. మహబూబాబాద్ మండలంలోని అమనగల్ గ్రామానికి చెందిన గీత కార్మికుడు పూజారి వీరన్న ఆగస్టు 12న గ్రామ శివారులో ద్విచక్ర వాహనం ఢీకొని గాయపడి చికిత్సపొందుతూ అదే నెల 25న మృతిచెందాడు. ఈ ప్రమాదానికి సంబంధించి ఎరుకల కులానికి చెందిన వ్యక్తి కారణమంటూ ఆమనగల్‌కు చెందిన బొమ్మెర రామస్వామి 40 మందిని వెంటబెట్టుకుని వచ్చి తమ కులానికి చెందిన ఎనిమిది ఇళ్లపై దాడులు చేశారన్నారు. ఈ దాడుల్లో తమ ఇళ్ల ధ్వంసమయ్యాయని, బియ్యం, సామాన్లు, బీరువాలు, టీవీలు, ఫర్నీచర్ పనికి రాకుండా పగులగొట్టారని వాపోయారు. తమ కుటుంబ సభ్యులపై కూడా బూతులు తిడుతూ దాడి చేశారన్నారు. పూజారి వీరన్న మృతికి తమ కులస్తులే కారణమంటూ ఇష్టం వచ్చినట్లు దాడి చేయడంతో భయాందోళనకు గురై అమనగల్ విడిచి పారి పోయి మహబూబాబాద్‌కు వచ్చి రూరల్ పోలీస్‌స్టేçÙన్లో ఫిర్యాదుచేశామన్నారు. రూరల్ ఏఎస్సై రాజేందర్, హెడ్‌కానిస్టేబుల్ డీ.మనోహరస్వామి, పోలీసు సిబ్బంది అమనగల్‌లోని ఎరుకల కులస్తుల ఇళ్లు ధ్వంసమైన ప్రాంతాలను పరిశీలించారు. -
బావిలో బిందె తీయబోయి.. మృత్యువాత
బురదలో చిక్కుకోవడంతో ఘటన హసన్‌పర్తి : బావిలో పడిన బిందెను తీయబోయి ఓ వ్యక్తి బురదలో చిక్కుకొని మృతిచెందిన సంఘటన హసన్‌పర్తి మండలం హరిశ్చంద్రనాయక్ తండాలో మంగళవారం జరిగింది. హరిశ్చంద్రనాయక్ తండాకు చెందిన భూక్య వస్రం(45) వ్యవసాయ కూలీ. అతడి ఇంటి పక్కనే ఉన్న నూనావత్ సమ్మయ్యకు చెందిన బిందె బావిలో పడింది. దీంతో సమ్మయ్య ఆ బిందె తీయాలని కోరగా వస్రం బా విలోకి దిగాడు. బిందె తీస్తున్న క్రమంలో బురదలో చిక్కుకుని ఊపిరాడక ప్రాణాలు వదిలాడు. సమాచారం అం దుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వస్రం మృతదేహాన్ని బయటికి తీసి పంచనామా నిర్వహిం చారు. మృతుడి కుమారుడు భూక్యఅనిల్ ఫిర్యాదు మేర కు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై ఉపేందర్ తెలిపారు. అది గుడుంబా బిందె హరిశంద్రనాయక్ తండా గుడుంబా తయారీ కేంద్రం. ఇక్కడ ఎన్నిసార్లు దాడులు నిర్వహించినా వారు తమ గుడుంబా తయారీ మానడం లేదు. రెండు రోజుల క్రితం ఈ తండాలో ఎకై్సజ్ సిబ్బంది దాడులు నిర్వహించారు. పోలీసుల రాకను గమనించి న నూనావత్ సమ్మయ్య భ యంతో తన వద్ద నిల్వ ఉన్న గుడుంబా బిందెను ఇంటి ఆవరణలోని బావిలో పడేసినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. ఆ బిందెను తీయడానికి బావిలోకి దిగిన వస్రం బురదలో చిక్కుకుని ప్రాణాలు వదిలాడు. -
గుడికి వెళ్తూ మృత్యువు ఒడికి
- కారును ఢీకొన్న లారీ - నలుగురికి గాయూలు - ఆస్పత్రికి తరలిస్తుండగా ఓ వ్యక్తి మృతి కొయ్యలగూడెం : గుడికి వెళుతున్న ఓవ్యక్తి మృత్యువాత పడ్డాడు. కొయ్యలగూడెం సమీపంలోని హార్టిజన్ కాంప్లెక్స్ వద్ద కారును లారీని ఢీట్టింది. కారులోని ఓ వ్యక్తి మరణించాడు. ముగ్గురికి గాయూలయ్యూరుు. వివరాలు ఇవి.. జంగారెడ్డిగూడెంకు చెందిన ఎన్.లోవరాజు భార్య, కుమారుడు, తండ్రి జోగిరాజు(55)తో కలసి తూర్పుగోదావరి జిల్లా తలుపులమ్మ లోవలోని అమ్మవారి ఆలయానికి శుక్రవారం అర్ధరాత్రి దాటిని తరువాత సొంత కారులో బయలుదేరారు. లోవరాజు డ్రైవింగ్ చేస్తున్నాడు. ముందు సీట్లో జోగిరాజు, వెనుక సీట్లలో లోవరాజు భార్య, కుమారుడు కూర్చున్నారు. శనివారం వేకువజాము సుమారు 2 గంటలకు కొయ్యలగూడెం సమీపంలోని హార్టిజన్ కాంప్లెక్స్ వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న లారీ కారుని ఢీకొంది. కారులోని నలుగురు గాయాలయ్యూరుు. వారిని జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా జోగిరాజు మార్గమధ్యంలో మృతిచెందాడు. జోగిరాజు వ్యాపారి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రాక్టర్ బోల్తా పడి ఒకరి మృతి
గుమ్మలక్ష్మీపురం/కురుపాం: కురుపాం మండలం పల్లంబారిడి గ్రామ సమీపంలోని మలుపు వద్ద శనివారం మధ్యాహ్నం ఓ ట్రాక్టర్ బోల్తాపడటంతో ఒకరు మృతి చెందగా పలువురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు.. కురుపాం మండలం మరిపల్లి గ్రామానికి చెందిన 16 మంది గిరిజనులు గుజ్జువాయి పంచాయితీ గోర్జిపాడు గ్రామానికి ఎగువన ఉన్న ఊటమానుగూడలో ఈ నెల 29, 30, 31 తేదీల్లో జరగనున్న క్రైస్తవ పండగల కోసం ఈత కొమ్మలను తీసుకెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరిక సుబ్బారావు (16) అనే యువకుడు అక్కడి కక్కడే మృతిచెందాడు. సుబ్బారావు ఇటీవల పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 7.8 గ్రేడ్ పాయింట్లతో ఉత్తీర్ణుడయ్యాడు. ఇంతలోనే అతడు మరణించటంతో తల్లిదండ్రులు తులసి, యేసోన్, బంధువులు బోరున విలపించారు. ప్రమాదం గురించి తెలియగానే పల్లంబారిడి గ్రామస్తులు వచ్చి ట్రాక్టరు తొట్టెను లేపి దానికింద ఉన్న క్షతగాత్రులను మొండెంఖల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. గాయపడినవారిలో ఆరిక అనూష, ఆరిక శ్రీను, బిడ్డిక ఎల్లంగు, ఆరిక తీజన్కుమార్, ఆరిక బెనితో, బిడ్డిక నవీన్‌కుమార్, ఎ.మాస, ఆరిక సురేష్, ఎన్.రామారావు, ఆరిక సరోజిని, కామరాజు, ఆరిక జయరాజు, కవిత ఉన్నారు. ప్రథమ చికిత్స అనంతరం వీరిని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఆరిక అనూష అనే పదమూడేళ్ల బాలిక పరిస్ధితి విషమంగా ఉంది. మొండెంఖల్లు పీహెచ్సీ నుంచి క్షతగాత్రులు ముగ్గుర్ని మాత్రమే 108 వాహనంలో పార్వతీపురం తీసుకెళ్లగా మిగిలిన వారు ప్రైవేట్ వాహనాల్లో వెళ్లారు. అతివేగమే కారణం డ్రైవర్ రాజు ట్రాక్టర్‌ను అతివేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని క్షతగాత్రులు తెలిపారు. సంఘటన స్ధలాన్ని ఎల్విన్‌పేట ఎస్సై ఐ.గోపి పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. అందుబాటులో లేని వైద్యులు మొండెంఖల్లు పీహెచ్సీలో ఇద్దరు వైద్యాధికారులు పనిచేస్తున్నప్పటికీ క్షతగాత్రులు వచ్చేసరికి ఏ ఒక్కరూ అందుబాటులో లేరు. దీంతో వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స చేసి ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేశారు. వైద్యుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఓవర్ టేక్ చేస్తూ..
కంటైనర్ లారీని ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు అక్కడికక్కడే ఒకరి మృతి, మరో 12 మందికి గాయాలు సూర్యాపేట శివారులో ఘటన సూర్యాపేట రూరల్ అతివేగంతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు కంటైనర్ లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో 12 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన సూర్యాపేట పట్టణ సమీపంలో సువెన్ కెమికల్ కంపెనీ ఎదుట జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారు జామున కంటైనర్ లారీ విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తోంది. ఈ క్రమంలో వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు సూర్యాపేట పట్టణ సమీపంలోని సువెన్ కెమికల్ కంపెనీ సమీపంలోకి రాగానే కంటైనర్ లారీని ఓవర్ టేక్ చేస్తూ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సు ఎడమ పక్కన పూర్తిగా దెబ్బతిని ఇంజన్ లారీ వెనుక భాగంలో ఇరుక్కు పోయింది. ఈ ప్రమాదంలో వైజాక్‌కు చెందిన అవినాష్ (19) అక్కడికక్కడే మృతిచెందగా, రాజమండ్రికి చెందిన గుత్తుల సాయినాథ్, విశాఖపట్టణానికి చెందిన సందీప్, శ్రీకాంత్, అమీత్, సంతోష్, శాలిని, కాకినాడకు చెందిన బస్సు క్లీనర్ పరుశరాంతో పాటు పూర్తి సమాచారం తెలియని వి.గుప్తా, రవితేజ, మాణిక్యమ్మ, ఎస్.సయ్యద్, రామక్రిష్ణకు గాయాలయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకుని ఎస్ఐ పవన్‌కుమార్‌రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు. 108 వాహనంలో క్షతగాత్రులను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రైవేట్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని కంటైనర్ లారీ డ్రైవర్ చాపరాల తాత య్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సూర్యాపేటరూరల్ ఎస్ఐ తెలిపారు. ఎంసెట్ పరీక్షకు వెళ్తూ.. వైజాక్‌కు చెందిన అవినాష్ ఈ నెల 14న జరిగే ఎంసెట్ పరీక్ష కోసం తన పెద్దనాన్న ఇంటికి హైదరాబాద్‌కు వెళ్తూ ప్రమాదానికి గురయ్యాడు. ఉన్నత చదువుల కోసం పెద్దనాన్న పిలుపు మేరకు పరీక్షకు ముందే పెద్దనాన్న ఇంటికి వెళ్తున్న అవినాష్ ప్రమాదంలో మృతిచెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. అవినాష్ మృతదేహానికి సూర్యాపేట ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కారు- ఆటో ఢీకొని.. నార్కట్‌పల్లి కారు, ఆటో ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందగా మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన నార్కట్‌పల్లి శివారులో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీఏపల్లి మండలం, పెరుమల్ల గ్రామానికి చెందిన ఎడ్ల అనిల్, సోదరుడు ఆంజనేయలు నల్లగొండలో ఆటోనడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం అనిల్ (18) ఆటోలో సామగ్రిని తీసుకుని నార్కట్‌పల్లికి వచ్చి తిరిగి వెళ్తుండగా బైపాస్ వద్దకు రాగనే హైదారాబాద్ నుంచి నల్లగొండకు వెళుతున్న కారు ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పిన ఆటో పక్కనే ఉన్న డీవైడర్‌ను మరోమారు ఢీకొంది. ప్రమాదంలో ఆటోలో ఉన్న అనిల్ అక్కడికక్కడే మృతిచెందగా ఆంజనేయులుకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమితం స్థానిక కామినేని అస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ మోతీరామ్ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
నల్లమాడ: అనంతపురం జిల్లా నల్లమాడ మండలం తంబళ్లపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బుగ్గపట్నం మండలం మదినేపల్లి గ్రామానికి చెందిన చిన్న తులసే నాయక్ బైక్‌పై పుట్టపర్తికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చిన్న తులసే నాయక్‌కు తీవ్ర గాయాలయ్యాయి. -
థానే మురికివాడలో భారీ అగ్నిప్రమాదం
థానే మురికివాడలోని శాంతినగర్ కాలనీలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వందలాది ఇళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఆ ఘటనలో ఒకరు మరణిచాగా, అనేక మంది గాయపడ్డారు. అగ్నికీలలు ఒక్కసారిగా ఎగసి పడటంతో ఇళ్లలోని ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. అగ్నిప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. దాదాపు 2 గంటలపాటు అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మృతి చెందిన వ్యక్తి సులేమన్ షేక్‌గా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియారాలేదని, ఆ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అగ్ని ప్రమాదం కారణంగా వందలాది మంది ప్రజలు నిరాశ్రయులైయ్యారు.