థానే మురికివాడలో భారీ అగ్నిప్రమాదం | Fire in Thane slum; one dead | Sakshi
Sakshi News home page

థానే మురికివాడలో భారీ అగ్నిప్రమాదం

Published Mon, Feb 17 2014 10:38 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

Fire in Thane slum; one dead

థానే మురికివాడలోని శాంతినగర్ కాలనీలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వందలాది ఇళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఆ ఘటనలో ఒకరు మరణిచాగా, అనేక మంది గాయపడ్డారు. అగ్నికీలలు ఒక్కసారిగా ఎగసి పడటంతో ఇళ్లలోని ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు.

 

అగ్నిప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. దాదాపు 2 గంటలపాటు అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మృతి చెందిన వ్యక్తి సులేమన్ షేక్గా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియారాలేదని, ఆ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అగ్ని ప్రమాదం కారణంగా వందలాది మంది ప్రజలు నిరాశ్రయులైయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement