బాత్ రూమ్ పైనుంచి తలకు గన్ పెట్టి.. | i dont have any relation with babu: yadagiri | Sakshi
Sakshi News home page

బాత్ రూమ్ పైనుంచి తలకు గన్ పెట్టి..

Published Sun, Aug 14 2016 3:42 PM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM

బాత్ రూమ్ పైనుంచి తలకు గన్ పెట్టి.. - Sakshi

బాత్ రూమ్ పైనుంచి తలకు గన్ పెట్టి..

హైదరాబాద్: తనపై కాల్పులు జరిపిన బాబుకు తనకు ఎలాంటి సంబంధం లేదని కాల్పులకు గురైన కాంగ్రెస్ నాయకుడు దండుగుల యాదగిరి అన్నాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు ప్రాణాహాని తొలగిందని వైద్యులు చెప్పారు. బుల్లెట్ హార్ట్ పక్క నుంచి వెళ్లడంతో ప్రాణాపాయం తప్పిందని చెప్పారు. ప్రస్తుతానికి ఆయన ఔట్ ఆఫ్ డేంజర్ అని రేపు 10గంటలకు డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా కాల్పులకు గురైన యాదగిరి సాక్షి టీవీతో మాట్లాడారు.

తనపై కాల్పులు జరిపిన బాబుకు తనకు ఎలాంటి సంబంధం లేదని, అతడి బావమరిది మాత్రం ఎప్పుడైనా డబ్బులు కావాలంటే తన వద్దకు వచ్చి తీసుకునే వాడని చెప్పారు. తనకు తన కుటుంబసభ్యులకు ప్రాణహాని ఉందని అన్నారు. తమకు రక్షణ కల్పించాలని కోరాడు. కాల్పులు జరిగే సమయంలో ఆస్పత్రిలో బాత్ రూమ్ లో దాక్కున్నానని, ఆ సమయంలో బాత్ రూమ్ పై గన్ పెట్టి తన తలపై షూట్ చేయబోయాడని చెప్పారు.

ప్రతిఘటించి గన్ లాక్కున్న తర్వాత 100కి కాల్ చేశానని, కాసేపట్లో ఆస్పత్రి సిబ్బంది బయటకు రావడంతో తాను బయటకు వచ్చానని చెప్పాడు. పోలీసులకు చూపిద్దామని తన వెంటే గన్ ఉంచుకున్నానని అన్నారు. తెలిసిన వ్యక్తి కనబడటంతో లిఫ్ట్ అడిగి ఆస్పత్రి చేరినట్లు వివరించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement