కోల్‌కతా ఉదంతం: క్రైమ్‌ సీన్‌ను నాశనం చేశారా? పోలీసులేమన్నారంటే.. | Kolkata molestation case: mob tried to destroy crime scene several arrested | Sakshi
Sakshi News home page

కోల్‌కతా ఉదంతం: క్రైమ్‌ సీన్‌ను నాశనం చేశారా? పోలీసులేమన్నారంటే..

Published Thu, Aug 15 2024 2:38 PM | Last Updated on Tue, Aug 20 2024 11:19 AM

Kolkata molestation case: mob tried to destroy crime scene several arrested

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ జూనియర్‌  డాక్టర్‌ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా కుదిపేస్తోంది. ఈ ఘటనను విద్యార్థులు, డాక్టర్లు తీవ్రంగా ఖండిస్తున్నారు.  అయితే ఘటనకు సంబంధించి జరుగుతున్న ప్రచారాలతో దర్యాప్తునకు ఆటంకం కలుగుతోందని కోల్‌కతా పోలీసులు అంటున్నారు.

ఆర్జీ కర్‌ హాస్పిటల్‌ ముందు నిన్న (బుధవారం) ‘స్వాతంత్రం వచ్చిన అర్థరాత్రి మహిళల స్వాతంత్రం కోసం’ పేరుతో చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా  మారింది.  గుంపుగా కొంతమంది  ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డులోని వైద్య పరికరాలు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. అయితే తాజాగా.. ఈ ఘటనకు పాల్పడిన 9 మందిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే హత్యాచార జరిగిన స్థలం ఎటువంటి ధ్వంసానికి గురికాలేదని వెల్లడించారు.

 

‘‘నిరసనల ముసుగులో దాదాపు 40-50 మంది  గుర్తు తెలియని  దుండగులు బుధవారం అర్థరాత్రి ఆసుపత్రి ఆవరణలోకి చొరబడి ఆస్తులను ధ్వంసం చేసినట్లు తెలిపారు. వారిని చెదరగొట్టేందుకు  పోలీసులు  టియర్ గ్యాస్ ప్రయోగించి లాఠీచార్జి చేసినట్లు తెలిపారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే న్యాయ పరమైన చర్యలు తీసుకుంటామని కోల్‌కతా పోలీసులు వెల్లడించారు.

 

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. ఫుటేజీ అధికారం ఘటనను, దాడిచేసిన మరికొందరి కదలికలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఆస్పత్రిలో చొరబడి ఇటువంటి దారుణమైన ధ్వంసానికి పాల్పడటంపై ఇండియన్ మెడికల్‌ అసోషియేషన్(ఐఎంఈ) అధికారుల నిర్లక్ష్యంపై తీవ్రంగా మండిపడింది. డాక్టర్ అత్యాచార ఘటనకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న యువ వైద్య విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని  దుండగుల గుంపు దాడి చేసిందని ఐఎంఈ పేర్కొంది.

జూనియర్‌ డాక్టర్‌ హత్య కేసును విచారిస్తున్న సీబీఐ బృందం గురువారం బాధితురాలి నివాసానికి చేరుకుంది. ఆస్పత్రిలో సీజ్‌ చేసిన ఘటనాస్థలం విధ్వంసంపై తనిఖీ చేయడానికి  దర్యాప్తు సంస్థ అర్జీ కర్ ఆసుపత్రిని కూడా సందర్శించనుంది. మరోవైపు..  ఆస్పత్రిలో  దుండగుల గుంపు చేసిన విధ్వంసానికి వ్యతిరేకంగా నర్సులు గురువారం ఉదయం నిరసన తెలిపారు. నేరం జరిగిన సెమినార్ గదిలోకి దుండగులు చొరబడాలని ప్రయత్నించారని నర్సుల్లో ఒకరు తెలిపారు.

ఈ ఘటనపై  ప్రతిపక్ష బీజేపీ సీఎం మమత  ప్రభుత్వం తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. సాక్ష్యాలను తారుమారు చేయటం కోసం టీఎంసీ గూండాలు  ఈ  విధ్వంసానికి పాల్పడినట్లు ఆరోపణుల చేస్తోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.

ప్రచారం: బాధితురాలి ఒంట్లో ముగ్గురి వీర్యం ఉన్నట్లు కొందరు నిపుణులు చెబుతుండడం.. దాని ఆధారంగా మీడియా, సోషల్‌ మీడియా కథనాలు

శవపరీక్షలో అలాంటి విషయం తేలేది లేదని కోల్‌కతా పోలీసుల స్పష్టీకరణ

ప్రచారం: కాలర్‌(మెడ) బోన్‌, పొత్తి కడుపు కింది భాగంలో ఎముక విరిగిపోయిందన్న ప్రచారం

అలాంటిదేం జరగలేదన్న పోలీసులు

ప్రచారం: బాధితురాలి తండ్రికి ఓ పోలీస్‌ అధికారి డబ్బును ఆశ చూపించి.. కేసును చల్లబర్చే ప్రయత్నం చేశారనే ప్రచారం

అంతా ఉత్తదేనన్న కోల్‌కతా పోలీసులు

ప్రచారం: బాధిత కుటుంబానికి ఫోన్‌ చేసి.. ఆత్మహత్య చేసుకుని ఉంటుందని కోల్‌కతా పోలీసులు చెప్పారనే ప్రచారం

.. అలాంటిదేం జరగలేదని, అసలు కోల్‌కతా పోలీసుల నుంచి అలాంటి కాల్‌ రాలేని స్వయంగా బాధిత కుటుంబం ద్వారా వివరణ ఇప్పించిన కోల్‌కతా పోలీసులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement