Mob attack
-
బంగ్లాదేశ్‌లో దారుణం.. భారత ఏజెంట్ అంటూ మహిళ జర్నలిస్ట్‌పై దాడి!
ఢాకా: బంగ్లాదేశ్‌లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. భారతీయులు, హిందువులు, మైనార్టీలే టార్గెట్‌గా కొందరు దాడులు చేస్తున్నారు. తాజాగా ఓ మహిళా జర్నలిస్టును మూకుమ్మడిగా అడ్డుకుని వేధింపులకు గురి చేయడం కలకలం రేపింది. ఆమెను భారత ఏజెంట్ అంటూ దాడి చేసే ప్రయత్నం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకారం.. బంగ్లాదేశ్‌ను భారత్‌లో భాగం చేసేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారంటూ బంగ్లాదేశ్ సీనియర్ జర్నలిస్టు మున్నీ సాహాను కొందరు టార్గెట్ చేశారు. గుంపుగా వచ్చిన కొంతమంది.. ఢాకాలో ఆమెను చుట్టుముట్టారు. సాహా ఒక భారతీయ ఏజెంట్ అంటూ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మద్దతుదారు అని వారు ఆరోపించింది. ఆమెపై దుర్భాషలాడుతూ దాడికి చేసేందుకు ప్రయత్నించారు. ఇదే సమయంలో మహిళా జర్నలిస్టుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చివరకు పోలీసులు.. ఆమెను రక్షించారు. అనంతరం, ఆమెను తేజ్ గావ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే, మున్నీ సాహాను వేధించిన వ్యక్తులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.ఇదిలా ఉండగా.. బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత అక్కడ దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనార్టీలపై దాడులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో హిందువులకు మద్దతుగా ఉద్యమించిన స్వామి చిన్మయ్ కృష్ణదాస్‌ను దేశద్రోహం కింద అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. బంగ్లా ప్రభుత్వ వైఖరిని భారత్ ప్రభుత్వం సైతం తప్పుపడుతోంది. Bangladeshi TV journalist Munni Saha's car was intercepted by radical in Dhaka.The Radical mob accused her of being an Indian agent and a supporter of the former Hasina govt.Later on she was arrested by Dhaka police based on the allegations levelled by Radical .… pic.twitter.com/icHcUIuZZt— MÃHĘŠH ŸĐV (@MkYdv97) December 1, 2024 -
కోల్‌కతా ఉదంతం: క్రైమ్ సీన్‌ను నాశనం చేశారా? పోలీసులేమన్నారంటే..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ జూనియర్ డాక్టర్ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా కుదిపేస్తోంది. ఈ ఘటనను విద్యార్థులు, డాక్టర్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. అయితే ఘటనకు సంబంధించి జరుగుతున్న ప్రచారాలతో దర్యాప్తునకు ఆటంకం కలుగుతోందని కోల్‌కతా పోలీసులు అంటున్నారు.ఆర్జీ కర్ హాస్పిటల్ ముందు నిన్న (బుధవారం) ‘స్వాతంత్రం వచ్చిన అర్థరాత్రి మహిళల స్వాతంత్రం కోసం’ పేరుతో చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. గుంపుగా కొంతమంది ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డులోని వైద్య పరికరాలు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. అయితే తాజాగా.. ఈ ఘటనకు పాల్పడిన 9 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే హత్యాచార జరిగిన స్థలం ఎటువంటి ధ్వంసానికి గురికాలేదని వెల్లడించారు."Crime Scene not disturbed," says Kolkata Police after vandalism at RG Kar Medical CollegeRead @ANI Story | https://t.co/EiRtFIht5H #RGKarMedicalcollege #doctor #murder #rape #KolkataPolice pic.twitter.com/cYUsPKJrcq— ANI Digital (@ani_digital) August 15, 2024 ‘‘నిరసనల ముసుగులో దాదాపు 40-50 మంది గుర్తు తెలియని దుండగులు బుధవారం అర్థరాత్రి ఆసుపత్రి ఆవరణలోకి చొరబడి ఆస్తులను ధ్వంసం చేసినట్లు తెలిపారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి లాఠీచార్జి చేసినట్లు తెలిపారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే న్యాయ పరమైన చర్యలు తీసుకుంటామని కోల్‌కతా పోలీసులు వెల్లడించారు.#WATCH | Aftermath of vandalism by mob in Emergency Department of RG Kar Medical College and Hospital in Kolkata last night pic.twitter.com/d7HI8crQ4l— ANI (@ANI) August 15, 2024 ఈ ఘటనకు సంబంధించి పోలీసులు సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. ఫుటేజీ అధికారం ఘటనను, దాడిచేసిన మరికొందరి కదలికలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఆస్పత్రిలో చొరబడి ఇటువంటి దారుణమైన ధ్వంసానికి పాల్పడటంపై ఇండియన్ మెడికల్ అసోషియేషన్(ఐఎంఈ) అధికారుల నిర్లక్ష్యంపై తీవ్రంగా మండిపడింది. డాక్టర్ అత్యాచార ఘటనకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న యువ వైద్య విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని దుండగుల గుంపు దాడి చేసిందని ఐఎంఈ పేర్కొంది.జూనియర్ డాక్టర్ హత్య కేసును విచారిస్తున్న సీబీఐ బృందం గురువారం బాధితురాలి నివాసానికి చేరుకుంది. ఆస్పత్రిలో సీజ్ చేసిన ఘటనాస్థలం విధ్వంసంపై తనిఖీ చేయడానికి దర్యాప్తు సంస్థ అర్జీ కర్ ఆసుపత్రిని కూడా సందర్శించనుంది. మరోవైపు.. ఆస్పత్రిలో దుండగుల గుంపు చేసిన విధ్వంసానికి వ్యతిరేకంగా నర్సులు గురువారం ఉదయం నిరసన తెలిపారు. నేరం జరిగిన సెమినార్ గదిలోకి దుండగులు చొరబడాలని ప్రయత్నించారని నర్సుల్లో ఒకరు తెలిపారు.#WATCH | West Bengal | Visuals of the aftermath from RG Kar Medical College and Hospital campus in Kolkata. A scuffle broke out when a mob entered the campus last night and damaged the property. pic.twitter.com/qf0rO5eVm2— ANI (@ANI) August 15, 2024ఈ ఘటనపై ప్రతిపక్ష బీజేపీ సీఎం మమత ప్రభుత్వం తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. సాక్ష్యాలను తారుమారు చేయటం కోసం టీఎంసీ గూండాలు ఈ విధ్వంసానికి పాల్పడినట్లు ఆరోపణుల చేస్తోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.ప్రచారం: బాధితురాలి ఒంట్లో ముగ్గురి వీర్యం ఉన్నట్లు కొందరు నిపుణులు చెబుతుండడం.. దాని ఆధారంగా మీడియా, సోషల్ మీడియా కథనాలుశవపరీక్షలో అలాంటి విషయం తేలేది లేదని కోల్‌కతా పోలీసుల స్పష్టీకరణప్రచారం: కాలర్(మెడ) బోన్, పొత్తి కడుపు కింది భాగంలో ఎముక విరిగిపోయిందన్న ప్రచారంఅలాంటిదేం జరగలేదన్న పోలీసులుప్రచారం: బాధితురాలి తండ్రికి ఓ పోలీస్ అధికారి డబ్బును ఆశ చూపించి.. కేసును చల్లబర్చే ప్రయత్నం చేశారనే ప్రచారంఅంతా ఉత్తదేనన్న కోల్‌కతా పోలీసులుప్రచారం: బాధిత కుటుంబానికి ఫోన్ చేసి.. ఆత్మహత్య చేసుకుని ఉంటుందని కోల్‌కతా పోలీసులు చెప్పారనే ప్రచారం.. అలాంటిదేం జరగలేదని, అసలు కోల్‌కతా పోలీసుల నుంచి అలాంటి కాల్ రాలేని స్వయంగా బాధిత కుటుంబం ద్వారా వివరణ ఇప్పించిన కోల్‌కతా పోలీసులు -
పోలీసుల కళ్లెదుటే ‘మణిపూర్ ఘోరం’
మణిపుర్లో మైతీ తెగకు చెందిన మూకల చేతికి చిక్కిన ఇద్దరు కుకీ తెగ మహిళను నగ్నంగా ఊరేగించి.. లైంగిక హింసకు పాల్పడిన ఘటన దేశంలో కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి సీబీఐ ఛార్జిషీట్లో షాకింగ్ విషయాలను వెల్లడించింది. బాధిత మహిళలు సాయం చేయమని కోరినా.. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని, వారు ఏమాత్రం పట్టించకోకుండా అల్లరిగుంపుకే సహకరించేలా వ్యవహరించారని తెలిపింది.కాంగ్పోక్పీ జిల్లాలో మైతీ అల్లరిగుంపు చేతికి చిక్కిన ఇద్దరు కుకీ మహిళలు ఘటనా ప్రాంతానికి సమీపంలో ఉన్న పోలీసు జీపు వద్దకు వెళ్లి సాయం చేయాలని కోరారు. అయితే పోలీసులే స్వయంగా బాధితులను ఆ అల్లరిగుంపకు అప్పగించినట్లు ఛార్జిషీటులో సీబీఐ పేర్కొంది. దీంతో ఆ అల్లరి మూక ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, వరిపొలాల్లో దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు వివరించింది.బాధితురాళ్లలో ఒక మహిళ తమను కాపాడి, సురక్షిత ప్రాంతాని తీసుకుళ్లాలని పోలీసులను కోరారు. అయితే జీపు తాళాలు తమ వద్ద లేవని పోలీసులు అబద్దాలు చెప్పినట్లు సీబీఐ ఛార్జిషీట్ పేర్కొంది. మరోవైపు.. అల్లరిగుంపు చేతికి చిక్కిన మూడో మహిళ వారి నుంచి త్రుటిలో తప్పించుకొంది.గతేడాది మే 4న జరిగిన ఈ ఘటన రెండు నెలల తర్వాత జులై నెలలో వైరల్‌గా మారి దేశమంతా కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆరుగురు నిందితులతోపాటు ఓ బాల నేరస్థుడిపై గౌహతి సీబీఐ ప్రత్యేక జడ్జి కోర్టులో అక్టోబరు 16న ఛార్జిషీటు దాఖలు అయింది.ఈ దాడుల్లో అల్లరిగుంపు చేతిలో మృతిచెందిన కుకీ తెగకు చెందిన తండ్రీకొడుకుల మృతదేహాలను గ్రామ సమీపంలోని నీరులేని నదిలోకి విసిరేసినట్లు తెలిపింది. మైతీ గుంపు జీపు వద్దకు చేరుకోగానే బాధితులను అక్కడే వదిలేసి.. పోలీసులు పారిపోయినట్లు సీబీఐ మూడు పేజీల ఛార్జిషీటులో పేర్కొంది. -
కాల్పుల్లో టీఎంసీ నేత మృతి.. మూక దాడిలో నిందితుడు హతం
జోయ్‌నగర్: పశి్చమబెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లా జోయ్‌నగర్‌లో సోమవారం టీఎంసీకి చెందిన స్థానిక నేత ఒకరు దుండగుల కాల్పుల్లో చనిపోయారు. నిందితుడిగా అనుమానిస్తున్న ఓ వ్యక్తి మూకదాడిలో ప్రాణాలు కోల్పోయాడు. బమున్‌గాచి ఏరియా టీఎంసీ అధ్యక్షుడు సైఫుద్దీన్ లస్కర్(47) సోమవారం ఉదయం ప్రార్థనలకు బయటకు వచ్చారు. మాటువేసిన దుండగులు దగ్గర్నుంచి జరిపిన తుపాకీ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఘటనతో కోపోద్రిక్తులైన ఆయన మద్దతుదారులు నిందితులుగా భావిస్తున్న ఇద్దరిని పట్టుకున్నారు. వారి దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. రెండో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లస్కర్ మద్దతుదారులు పొరుగునే ఉన్న దలువాఖలి గ్రామంలో లూటీకి పాల్పడ్డారు. ఈ ఘటనల నేపథ్యంలో ఆ ప్రాంతంలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. లస్కర్ హత్యతో తమకెలాంటి సంబంధం లేదని సీపీఎం పేర్కొంది. అధికార యంత్రాంగం, పోలీసులు టీఎంసీకి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించింది. -
మణిపూర్‌లో ఆయుధాల లూటీ
ఇంఫాల్: మణిపూర్‌లో తెగల పోరు, ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి పోలీసు ఆయుధాగారంపై దుండగులు దాడి జరిపి ఆయుధాలను లూటీ చేశారు. ఎకే 47, ఘాతక్ వంటి అత్యాధునిక రైఫిల్స్, వివిధ రకాల తుపాకుల్లోని 19 వేలకు పైగా బుల్లెట్లు అపహరించారు. బిష్ణుపూర్ జిల్లా నారన్‌సైనా ప్రాంతంలో రెండవ ఇండియా రిజర్వ్ బెటాలియన్‌లో ఈ లూటీ జరిగింది. ‘‘బెటాలియన్ కేంద్రంపై దాడులకు దిగిన అల్లరి మూకలు అత్యాధునిక ఆయుధాలను లూటీ చేశారు. ఏకే, ఘాతక్ రైఫిళ్లు, 195 సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్, అయిదు ఎంపీ–5 గన్స్, 16 9ఎంఎం పిస్టల్స్, 25 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, 21 కార్బైన్స్, 124 హ్యాండ్ గ్రేనేడ్స్‌ను దొంగిలించారు’’ అని అధికారులు తెలిపారు. మరోవైపు మే 3వ తేదీన జరిగిన ఘర్షణల్లో మరణించిన వారి సామూహిక ఖననానికి ఆదివాసీలు చేస్తున్న ప్రయత్నాలు ఉద్రిక్తతలకి దారి తీస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్న మరికొందరు ప్రదర్శనగా ఆ ప్రాంతానికి వెళ్లడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో 25 మందికిపైగా గాయపడ్డారు. దీంతో, అంతిమ సంస్కార కార్యక్రమాలను కేంద్రం వినతి మేరకు వారం పాటు వాయిదా వేసుకున్నారు. -
Manipur: కేంద్రమంత్రి ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి
ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో హింసాకాండ ఇంకా కొనసాగుతోంది. రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలు నేటికి చల్లారడం లేదు. నెల రోజులు దాటినా రాష్ట్రంలో పరిస్థితులు ఇంకా అదుపులోకి రాలేదు. తాజాగా వెయ్యి మందికిపైగా నిరసనకారులు ఇంఫాల్‌లోని కేంద్రమంత్రి ఆర్రంకే జన్ సింగ్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. దాడి సమయంలో గుంపుగా ఎగబడిన జనం మంత్రి ఇంటిపై పెట్రోల్ బాంబులు విసిరినట్లు ఆయన నివాస భద్రతా సిబ్బంది వెల్లడించారు. అయితే ఘటన జరిగిన సమయంలో మంత్రి ఇంఫాల్‌లోని ఇంట్లో లేరని మణిపూర్ అధికారులు తెలిపారు. ఇంఫాల్‌లో కర్ఫ్యూ ఉన్నప్పటికీ ఆందోళనకారులు కొంగ్బాలోని మంత్రి ఇంటిపై దాడి చేశారు. ఆ సమయంలో మంత్రి నివాసంలో తొమ్మిది మంది ఎస్కార్ట్ సిబ్బంది, ఐదుగురు సెక్యూరిటీ గార్డ్స్, ఎనిమిది మంది అడిషనల్ గార్డ్స్ విధుల్లో ఉన్నారని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. కాగా భారీగా నిరసనకారులు దూసుకురావడంతో వారిని అడ్డుకోలేకపోయామని ఎస్కార్ట్ కమాండర్ ఎల్ దినేశ్వర్ సింగ్ వెల్లడించారు. మంత్రి ఇంటి ముందు, వెనక అన్ని వైపుల నుంచి నుంచి బాంబులు విసరడంతో పరిస్థితిని నియంత్రించలేకపోయామని పేర్కొన్నారు. ముకదాడి చేసిన వారిలో దాదాపు 1,200 మంది ఉన్నారని తెలిపారు. కాగా రంజన్ సింగ్ ఇంటిపై దాడి జరగడం ఇది రెండోసారి. మే నెలలో కూడా ఇంటిపై దాడికి యత్నం జరగ్గా.. భద్రతా సిబ్బంది గాల్లోకి కాల్పులు జరిపి నిరసనకారులను చెదరగొట్టారు. చదవండి: గవర్నర్ Vs సీఎం స్టాలిన్:సెంథిల్ బాలాజీ అంశంలో మరో వివాదం.. #WATCH | Manipur: A mob torched Union Minister of State for External Affairs RK Ranjan Singh's residence at Kongba in Imphal on Thursday late night. https://t.co/zItifvGwoG pic.twitter.com/LWAWiJnRwc — ANI (@ANI) June 16, 2023 ఇక ఆర్కే రంజన్ సింగ్ ప్రస్తుతం మోదీ కేబినెట్లో విదేశీ వ్యవహారాలు, విద్యాశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. అయితే ఇంటిపై దాడి జరిగిన సమయంలో ఆయన అధికారిక పనిపై కేరళలో ఉన్నట్లు మంత్రి రంజన్ సింగ్ చెప్పారు. తన ఇల్లు పెట్రోలు బాంబుల దాడిలో దెబ్బతిందని తెలిపారు. మణిపూర్‌లో శాంతి స్థాపనకు అందరూ కలిసి రావాలని కేంద్రమంత్రి కోరారు. కాగా రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు ఆయన మెయిటీ, కుకీ వర్గానికి చెందిన ప్రముఖులతో చర్చలు జరిపారు. అలాగే హింసను ప్రేరేపిస్తోన్న స్థానిక నేతలను గుర్తించి, చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీకి కూడా లేఖ రాశారు. -
Video: డిన్నర్‌కు వెళ్లిన జంటపై దాడి.. అడ్డుకున్న వారిపై..
భోపాల్: మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్కూటీపై వెళ్తున్న యువతియువకుడిని అడ్డుకున్న కొందరు దుండగులు వారిపై దాడి చేశారు. ఈ క్రమంలో యువతి వారిని ఎంత వారించినా.. దుండగులు రెచ్చిపోయారు. ఆ జంటను రక్షించిన ఇద్దరిని ఆగంతకులు కత్తితో పొడిచారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. ఇండోర్‌లో యువతి, యువకుడు విందు కోసం హోటల్‌కు వచ్చారు. వారు డిన్నర్ చేసిన అనంతరం.. హోటల్ నుంచి బయటకు రాగానే వారిని కొందరు దుండగులు అడ్డుకున్నారు. స్కూటీ మీద ఉన్న వారిద్దరిని ఓ గుంపు వెంబడించి వారిని చుట్టుముట్టింది. ఇంతలో కొందరు.. అతడితో ఎందుకు కలిసి తిరుగుతున్నావని ఆమెను ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఆ జంటను రక్షించేందుకు అటుగా వెళ్తున్న ఇద్దరు యువకులు ముందుకు వచ్చారు. దీంతో, మరింత రెచ్చిపోయిన దుండగుటు.. వారిద్దరినీ కత్తితో పొడిచారు. అయితే, దుండగుల దాడి అనంతరం డీసీపీ రాజేష్ రఘువంశీ మాట్లాడుతూ.. ఆమె తన పేరెంట్స్ అనుమతితోనే(వారికి సమాచారం ఇచ్చిన తర్వాతే) ఆ వ్యక్తితో కలిసి డిన్నర్ చేయడానికి వచ్చానని చెప్పింది. వారిని అడ్డుకున్న దుండగులపై సదరు యువతి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతలో జంటను రక్షించడానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులను గుంపులో నుంచి ఎవరో కత్తితో పొడిచారు. దీంతో, వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. In Indore, MP MusIim mobs beat a couple because the girl was a MusIim & the boy was a Hindu. It's becoming a new normal! Imagine the amount of national-international outrage if any Hindu group starts doing this with M boy & H girl couples.. pic.twitter.com/Is0nis1QbJ — Mr Sinha (@MrSinha_) May 26, 2023 ఇది కూడా చదవండి: మరో బాంబు పేల్చిన సుకేశ్ చంద్రశేఖర్.. కవిత, కేజ్రీవాల్‌కు షాక్ -
మణిపూర్: బీజేపీ ఎమ్మెల్యేపై దాడి.. హెల్త్ కండిషన్ సీరియస్
ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. తమకు షెడ్యూల్డ్ కులాల(ఎస్టీ) హోదా కల్పించాలని రాష్ట్ర జనాభాలో 53 శాతం ఉన్న మైతీ వర్గం డిమాండ్ చేయడం అగ్గి రాజేసింది. దీంతో, గిరిజనులు భగ్గుమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఇళ్లు, దుకాణాలు, వాహనాలకు నిప్పుపెట్టారు. ప్రార్థనా మందిరాలపై దాడి చేశారు. గిరిజనేతరులతో ఘర్షణకు దిగారు. ఈ హింసాకాండలో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మరోవైపు.. నిరసన సందర్భంగా రాష్ట్ర మంత్రి, బీజేపీ నేత ఉంగ్జాగిన్ వాల్టేపై నిరసనకారులు దాడికిపాల్పడ్డారు. కాగా, నిరసనకారుల దాడిలో ఉంగ్జాగిన్ వాల్టే తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో తీవ్రంగా గాయపడిన వాల్టే ఇంఫాల్‌లోని రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చేర్పించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఇక, ఉంగ్జాగిన్ వాల్టే.. కూకి తెగకు చెందిన వ్యక్తి. వాల్టే ఫెర్జావల్ జిల్లాలోని థన్లోన్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత ప్రభుత్వంలో గిరిజన వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. కాగా, గురువారం సెక్రటేరియట్లో సీఎం బీరేన్ సింగ్‌తో సమావేశమై తిరిగి తన అధికార నివాసానికి వెళ్తుండగా నిరసనకారులు ఆయనపై దాడికి పాల్పడ్డారు. వాల్టేతోపాటు ఆయన డ్రైవర్‌ను విచక్షణారహితంగా కొట్టారు. కష్టంపై వాళ్లు అక్కడినుంచి బయటపడ్డారు. Tribal MLA Shri Vungzagin Valte attack by Meitei in Imphal today#TribalLivesMatter #ManipurOnFire @ndtv @AmitShah @ANI @KirenRijiju pic.twitter.com/hY4gpt8Kl2 — Lalsang H. (@lalsanghauzel) May 4, 2023 ఇదిలా ఉండగా.. మణిపూర్‌లో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి 55 పటాలాల సైన్యంతోపాటు అస్సాం రైఫిల్స్ జవాన్లను ప్రభుత్వం రంగంలోకి దించింది. మరో 14 పటాలాల సైన్యాన్ని సిద్ధంగా ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, మణిపూర్‌లో ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని ఆర్మీ అధికారులు తెలిపారు. భద్రతా బలగాలు నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నాయని చెప్పారు. అయితే రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతల పరిస్థితుల నేపథ్యంలో మణిపూర్‌కు వెళ్లాల్సిన అన్ని రైళ్లను బోర్డర్లో నిలిపివేస్తున్నట్ట నార్త్ఈస్ట్ ఫ్రాంటీర్ రైల్వే వర్గాలు ట్విట్టర్ వేదికగా తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాత రైళ్ల పునరుద్ధరణకు సంబంధించి నిర్ణయం తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. Following the law & order situation in #Manipur, Northeast Frontier Railway has stopped all Manipur-bound trains. "No trains are entering Manipur till the situation is improved. The decision has been taken after the Manipur government advised to stop train movement, says… pic.twitter.com/nG9UWYbEVi — ANI (@ANI) May 5, 2023 ఇది కూడా చదవండి: ఎన్సీపీ అధినేత ఎవరవుతారో? -
భర్తను చంపిన వ్యక్తి విడుదల.. సుప్రీంకోర్టుకు ఐఏఎస్ అధికారి భార్య
న్యూఢిల్లీ: 1994లో దారుణ హత్యకు గురైన ఐఏఎస్ అధికారి జి.కృష్ణయ్య సతీమణి ఉమ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో దోషి, మాజీ ఎంపీ ఆనంద్ మోహన్‌ను బిహార్ ప్రభుత్వం జైలు నుంచి ముందస్తుగా విడుదల చేయడాన్ని ఆమె సవాల్ చేశారు. ఉరిశిక్షకు బదులు యావజ్జీక కారాగార శిక్ష పడిన వ్యక్తి జైల్లో ఉండాలని, కానీ బిహార్ ప్రభుత్వం నిబంధలనలు మార్చి విడుదల చేయడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఈమె ఇప్పటికే ప్రధాని మోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. తెలంగాణకు చెందిన ఐఏఎస్ అధికారి జి.కృష్ణయ్యను 1994లో బిహార్‌లో మూకదాడి చేసి దారుణంగా హత్య చేశారు. వీరికి ఆనంద్ మోహన్ నేతృత్వం వహించారు. ఈ కేసులో న్యాయస్థానం అతడ్ని దోషిగా తేల్చి కఠిన యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అయితే బిహార్ ప్రభుత్వం ఏప్రిల్ 10న జైలు నిబంధలను మార్చింది. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని హత్య చేసిన వారిని కూడా విడుదల చేసేలా సవరణలు చేసింది. దీంతో 14 ఏళ్ల శిక్ష పూర్తి చేసుకున్న మోహన్ జైలు నుంచి విడుదల అయ్యేందుకు మార్గం సుగమం అయ్యింది. ఈయన విడుదలను ప్రతిపక్షాలు సహా ఐఏఎస్ అధికారులు సమాఖ్య తీవ్రంగా వ్యతిరేకించింది. బిహార్ ప్రభుత్వం మాత్రం వీటిని పట్టించుకోలేదు. చదవండి: బీజేపీ ఎమ్మెల్యే హత్య కేసు.. బీఎస్పీ ఎంపీకి షాక్.. గ్యాంగ్‌స్టర్‌కు పదేళ్ల జైలు శిక్ష -
పాక్‌లో దారుణం..కస్టడీలో ఉన్న వ్యక్తిపై హత్యయత్నం
పాకిస్తాన్ ఓ గుంపు కస్టడీలో ఉన్న వ్యక్తిపై దాడి చేసి చంపేసింది. దీంతో పోలీసులు వెంటనే అప్పమత్తమయ్యారు. వివరాల్లోకెళ్తే..దైవదూషణ ఆరోపణలపై 20 ఏళ్ల మహ్మద్ వారిస్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే అనుకోకుండా ఓ గుంపు పోలీస్టేషన్‌లోకి ప్రవేశించి వారిస్‌పై దాడి చేసి హతమార్చింది. అంతేగాదు వారిసి మృతదేహానికి నిప్పు పెట్టేందుకు యత్నిస్తుండగా అప్రమత్తమైన పోలీసులు అడ్డుకున్నారు. సరిగ్గా అదే సమయంలో కొంతమంది అధికారులు పోలీస్‌స్టేషన్‌లో ఉండటంతో ఆ గుంపును అడ్డుకోలేకపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. వాస్తవానికి పాక్‌లో దైవదూషణ కూడా నేరమే, దీనికి మరణశిక్ష విధిస్తుంది అక్కడి ప్రభుత్వం. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఇలాంటి ఘటనలు పాక్‌లో గతంలో చాలానే జరిగాయి. అంతేగాదు అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఈ విషయమై పలుమార్లు పాక్‌ని విమర్శించింది కూడా. ఈ మేరకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ ఘటనపై ఘాటుగా స్పందించారు. ఈ సంఘటనపై తక్షణమే విచారణ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించనట్లు సమాచారం. అలాగే ఆ గుంపు కస్టడీలో ఉన్న వ్యక్తిని చంపకుండా అడ్డుకోవండంలో విఫలమైనందుకు పలవురు పోలీసులను కూడా సస్పెండ్ చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. (చదవండి: అమెరికా గగనతలంలో మరో బెలూన్ కలకలం) -
మా వాళ్లనే అరెస్ట్ చేస్తారా? ఢిల్లీ పోలీసులపై 100 మంది ఆఫ్రికన్ల దాడి!
న్యూఢిల్లీ: వీసా గడువు ముగిసినా దేశ రాజధానిలో ఉంటున్న ముగ్గురు నైజీరియన్లు అదుపులోకి తీసుకుంది యాంటీ డ్రగ్స్ ఫోర్స్. దీంతో దక్షిణ ఢిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమవారిని అరెస్ట్ చేస్తున్నారని తెలిసి సుమారు 100 మంది ఆఫ్రికన్లు పోలీసులను చుట్టు ముట్టారు. నైజీరియన్లను వారి నుంచి విడిపించేందుకు పోలీసులకు చుక్కులు చూపించారు. దేశంలో అక్రమంగా ఉంటున్న వారిని స్వదేశం పంపించేందుకు నెబ్‌సరాయ్‌లోని రాజుపార్క్‌కు శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు నార్కొటిక్స్ సెల్ బృందం వెళ్లింది. వీసా గడువు ముగిసిన ముగ్గురు నైజీరియన్లను తమ అదుపులోకి తీసుకున్నారు. అప్పుడే పోలీసులను 100 మంది ఆఫ్రికన్లు చుట్టుముట్టారు. వారిని వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ గందరగోళ పరిస్థితుల్లోనే ముగ్గురిలో ఇద్దరు పోలీసుల చెర నుంచి తప్పించుకున్నారు. 22 ఏళ్ల పిలిప్ అనే వ్యక్తి దొరికిపోయాడు. పోలీసులపై మూకదాడి సమాచారం అందుకున్న నెబ్సరాయ్ పోలీస్ స్టేషన్ బృందం, నార్కొటిక్స్ స్క్వాడ్ సాయంత్రం 6.30 గంటలకు రాజ్‌పార్క్‌కు చేరుకుంది. ఓ మహిళతో పాటు మొత్తం నలుగురు నైజీరియన్లను అదుపులోకి తీసుకుంది. మళ్లీ సుమారు 150-200 మంది ఆఫ్రికన్ దేశాల ప్రజలు పోలీసులను చుట్టుముట్టారు. పోలీసుల చెరలో ఉన్న వారు తప్పించుకునేందుకు సాయం చేశారు. వారిని చెదరగొట్టిన పోలీసులు నిందితులను నెబ్సరాయ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి వారిని స్వదేశాలకు పంపించనున్నారు. Delhi Cops Arrest 3 On Drug Charge, Foreigners' Mob Brings Them Back https://t.co/Ggnt34m0rC pic.twitter.com/tFJLQBcF1L — NDTV (@ndtv) January 8, 2023 ఇదీ చదవండి: రాజౌరీ: హిందువులే లక్ష్యంగా దాడులు.. కేంద్రం కీలక నిర్ణయం.. గ్రామ రక్షణ కమిటీల పునరుద్ధరణ -
వైరల్ వీడియో: బండి ఆపారని పోలీసులపై రాళ్ల దాడి చేయించాడు..
-
Viral Video: బండి ఆపారని పోలీసులపై రాళ్ల దాడి చేయించాడు..
లఖ్‌నవూ: పోలీసులపై కొందరు స్థానికులు దాడికి దిగారు. వారిపై రాళ్లు రువ్వారు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్ బదౌన్ జిల్లాలోని కక్రాల నగరంలో శుక్రవారం రాత్రి జరిగింది. సాధారణ తనిఖీల్లో భాగంగా ఓ వ్యక్తి బండిని పోలీసులు ఆపినందుకు.. కొందరు అల్లరి మూకలను పోగు చేసి దాడి చేసినట్లు జిల్లా ఎస్పీ ఓపీ సింగ్ తెలిపారు. ఈ సంఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వీడియ ఫుటేజ్ ఆధారంగా మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని వెల్లడించారు. ‘పోలీసు బృందం నడుచుకుంటూ నగరంలో పెట్రోలింగ్ చేస్తోంది. సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఓ వ్యక్తి వాహనం తనిఖీ చేసేందుకు ప్రయత్నించగా పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత తన కుటుంబ సభ్యులతో వచ్చి రోడ్డుపై నిరసనకు బైఠాయించాడు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించొద్దని పోలీసులు తెలపటంతో వారిపై రాళ్ల దాడి చేశారు’ అని జిల్లా ఎస్పీ ఓపీ సింగ్ తెలిపారు. రాళ్లదాడి జరిగిన క్రమంలో కాలనీలో స్థానికులు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోయారు. పోలీసులు లాఠీఛార్జ్ చేసే అవకాశం ఉందనే భయంతో ఇళ్లల్లోంచి వెళ్లిపోయినట్లు సమాచారం. మరోవైపు.. బలగాలను తరలించి అల్లరి మూకను చెదరగొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశామన్నారు. ఈ ఘటనలో ఆరుగురు పోలీసులు గాయపడినట్లు చెప్పారు. Mob Clashes With Cops, Throws Stones In UP's #Badaun @budaunpolice pic.twitter.com/0PFaZT1bBu — Himanshu dixit 💙 (@HimanshuDixitt) December 9, 2022 Clash between police and local people in UP's #Badaun, protesters pelted stones at police. According to the police, the whole incident took place after a dispute during the vehicle checking drive. Some people have been detained: Dr. OP Singh, SP Badaun pic.twitter.com/6bGjESlh4z — Nikhil Choudhary (@NikhilCh_) December 9, 2022 ఇదీ చదవండి: ఇంతకీ.. గెలిచింది ఎవరు! మూడు రాష్ట్రాల తీర్పు చెప్పిందేంటి? -
అస్సాంలో మూకదాడి..విద్యార్థి నేత మృతి
జోర్హాత్: అస్సాంలో జరిగిన మూకదాడిలో ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్(ఆసు)నేత ఒకరు అసువులు బాశారు. జోర్హాత్ నగరంలోని ట్యాక్సీ స్టాండ్ వద్ద సోమవారం పట్టపగలు అందరూ చూస్తుండగానే ఈ దారుణం చోటుచేసుకుంది. ఆసు నేత అనిమేశ్ భుయాన్(28), మరో ఇద్దరు కార్యకర్తలు మృతుస్మంత బారువా, ప్రణయ్ దత్తాలతో కలిసి తమ వాహనం వద్ద నిలుచుని ఉండగా ఒక వృద్ధుడు స్కూటీపై వచ్చి అక్కడే పడిపోయాడు. అనిమేశ్ వాహనం ఢీకొనడం వల్లే వృద్ధుడు పడిపోయాడంటూ అతడి సంబంధీకులు వారితో గొడవకు దిగి, తీవ్రంగా కొట్టారు. చుట్టుపక్కల గుమికూడిన జనం ఈ దారుణం చూస్తూ నిలబడ్డారే తప్ప, అడ్డుకునేందుకు ఎవరూ ప్రయత్నించలేదు. సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు ఆముగ్గురితోపాటు వృద్ధుడిని కూడా ఆస్పత్రికి తరలించారు. భుయాన్ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. -
అగర్తలలో ఉద్రిక్తత: ఆగంతకుల దాడిలో సీపీఎం కార్యాలయానికి నిప్పు
అగర్తల: కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) కార్యాలయంపై దుండగులు రెచ్చిపోయారు. రాళ్లు, కర్రలతో దాడి చేసి బీభత్సం సృష్టించారు. అనంతరం నిప్పు పెట్టారు. దీంతో ఒక్కసారిగా త్రిపుర రాజధాని అగర్తలలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సీపీఎం ప్రధాన కార్యాలయం భాను స్మృతి భవన్‌పై బుధవారం సాయంత్రం కొందరు యువకులు గుంపుగా వచ్చి దాడికి పాల్పడ్డాయి. ఆ భవనంతో పాటు పక్కనే ఉన్న దశరథ్ భవన్‌ను కూడా నిప్పు పెట్టారు. అక్కడ కనిపించిన వాహనాలను కూడా దగ్ధం చేశారు. ఈ ఘటనకు పాల్పడింది బీజేపీ అని సీపీఎం ఆరోపిస్తోంది. బీజేపీ నాయకులే ఈ దాడికి పాల్పడ్డారని పేర్కొంది. అయితే బీజేపీ వాటిని తిప్పికొట్టింది. వారి పార్టీ కార్యాలయాల్లో బాంబులు ఉన్నాయని, అవి పేలడంతో నిప్పు చెలరేగిందిన బీజేపీ ఆరోపిస్తోంది. చదవండి: గద్వాలలో అద్భుత దృశ్యం.. మీరే చూసేయండి -
సారా వ్యాపారుల బీభత్సం: కర్రలు, రాళ్లతో పోలీసులపై దాడి
పాట్నా: సారా తయారు చేస్తున్నారని సమాచారం రావడంతో పెద్ద ఎత్తున పోలీసులు ఆ గ్రామంలో దాడులు చేశారు. అయితే పోలీసుల సమాచారం తెలుసుకున్న ఆ గ్రామస్తులు వారిని అడ్డగించారు. మూకుమ్మడిగా దాడి చేసి పోలీసులను చితకబాదారు. వారి దాడి నుంచి తప్పించుకునేందుకు పోలీసులు ముప్పుతిప్పలు పడ్డారు. ప్రాణభయంతో ఆ గ్రామం నుంచి బయట పడ్డారు. ఈ సంఘటన ఆ రాష్ట్రంలో కలకలం రేపింది. మద్యపానం నిషేధించడంతో ఆ రాష్ట్రంలో కల్తీ మద్యం రవాణా బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలో కల్తీ మద్యం తాగి కొందరు మృతి చెందారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించారు. ఈ క్రమంలోనే జహనాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో సారా స్థావరాలు ఉన్నాయనే సమాచారం అందుకున్న పోలీసులు శనివారం గ్రామానికి వెళ్లారు. ఈ సమాచారం ముందే తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులు రాగానే వారిని అడ్డగించారు. రోడ్లను బంద్ చేసి వారిపై ప్రతిదాడికి దిగారు. కర్రలు.. రాళ్లతో దాడికి పాల్పడ్డాడు. కనిపించిన పోలీస్‌ను చితకబాదారు. దీంతో పోలీసులు ప్రాణభయంతో పరుగులు పెట్టారు. ఈ ఘటనలో ఒక మహిళా కానిస్టేబుల్ మృతి చెందారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులపై దాడిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దీనిపై విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దాడి చేసిన వారిలో నలుగురైదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ ఉన్నతాధికారి అశోక్ పాండే తెలిపారు. కొన్ని పోలీస్ వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. -
నాంపల్లిలో బర్త్‌డే వేడుకపై ఆకతాయిల దాడి
సాక్షి, హైదరాబాద్: నాంపల్లిలో బర్త్‌డే వేడుకపై ఆకతాయిలు దాడికి తెగబడ్డారు. కమ్యూనిటీ హల్లో జరుగుతున్న పుట్టినరోజు వేడుకల్లో బ్యాండ్ ఆపకపోవడంతో 10 మంది యువకులు గొడవ చేశారు. బర్త్‌డే పార్టీ నిర్వహిస్తున్న వారిపై కర్రలు, రాడ్లతో దాడికి దిగారు. ఈ ఘటనలో పలువురికి గాయాలవ్వగా వారిని ఆసుపత్రికి తరలించారు. నాంపల్లిలో దాడి నేపథ్యంలో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. బాధితులు నాంపల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చదవండి: ఇన్‌స్టా పరిచయం.. ప్రేమ అంగీకరించలేదని ప్రియుడి ఆత్మహత్య -
గుంటూరులో ఆకతాయిల హల్చల్
-
పెట్రోల్ బంక్‌లోకి చొరబడి పిడిగుద్దుల వర్షం.. సీసీటీవీలో దృశ్యాలు
సాక్షి, గుంటూరు: గుంటూరులో కొందరు ఆకతాయిలు హల్చల్ చేశారు. మద్యం మత్తులో పెట్రోల్ బంక్‌లోకి చొరబడి హంగామా చేశారు. వివాదం ఏంటో తెలియదు గానీ బంక్‌లో పనిచేస్తున్న ఓ యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. తోటి సిబ్బంది ఆ యువకులకు ఎంత నచ్చ జెప్పినా వినకుండా మళ్లీ మళ్లీ బాధితుడిపై దాడికి పాల్పడ్డారు. దాడి దృశ్యాలు బంక్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఘటనపై బంక్ యాజమాని పోలీసులకు సమాచారమివ్వగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీల దృశ్యాల ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే పాత కక్షల నేపథ్యంలో ఈ దాడి జరిగిందా అనే కోణంలోనూ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలిసింది. మరోవైపు ఘటనపై రాజీకి రమ్మంటూ బంక్ యజమానిపై కొందరు రాజకీయ నేతలు ఒత్తిడి తెస్టున్నట్టు సమాచారం. చదవండి: యల్లనూరులో భగ్గుమన్న పాత కక్షలు -
డాక్టర్‌పై భయానక దాడి.. వెంటాడి.. వేటాడి
డిస్పూర్: మహమ్మారి విజృంభిస్తోన్న వేళ ఫ్రంట్‌లైన్ వారియర్స్ అయిన వైద్య సిబ్బంది తమ ప్రాణాలు పణంగా పెట్టి మరి కోవిడ్ బాధితులకు సేవలందిస్తున్నారు. కానీ కొన్ని చోట్ల జనాలు వారి త్యాగాన్ని మర్చిపోయి.. వైద్య సిబ్బందిపై దాడి చేస్తూ అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి అసోంలో చోటు చేసుకుంది. ఆక్సిజన్ కొరత వల్ల కరోనా బాధితుడు ఒకరు మృతి చెందారు. ఈ క్రమంలో అతడి కుటుంబ సభ్యులు మృతుడికి వైద్యం చేసిన డాక్టర్‌పై దారుణంగా దాడి చేశారు. కింద పడేసి తంతూ.. చేతికి దొరికిన వస్తువులతో చితకబాదారు. వారి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే.. వెంటపడి మరీ కొట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. అసోం గువహటి నుంచి 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న హుజై నగరంలోని ఉడాలి మోడల్ ఆస్పత్రిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ వివరాలు.. పిపాల పుఖురి గ్రామానికి చెందిన ఉద్దీన్ అనే వ్యక్తికి కరోనా సోకింది. ఈ క్రమంలో అతడిని హుజైలని ఉడాలి మోడల్ ఆస్పతిలో చేర్పించారు. డాక్టర్ సీజ్ కుమార్ సేనాపతి అతడికి వైద్యం అందించారు. చికిత్స పొందుతున్న ఉద్దీన్ మంగళవారం సాయంత్రం మరణించాడు. డాక్టర్ సేనాపతి నిర్లక్ష్యం వల్లనే ఆక్సిజన్ కొరతతో ఉద్దీన్ మరణించాడని భావించిన అతడి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఆస్పత్రిపై దాడి చేశారు. వారి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన సేనాపతిని వెంటాడి మరీ చితకబాదారు. డాక్టర్ సేనాపతి మాట్లాడుతూ.. ‘‘మంగళవారం సాయంత్రం నేను విధుల్లో ఉండగా ఉద్దీన్ సహాయకుడు ఒకరు వచ్చి అతడి పరిస్థితి విషమిస్తుందని నాకు తెలిపాడు. నేను రూమ్‌లోకి వెళ్లేసరికే ఉద్దీన్ మరణించాడు. దీని గురించి అతడి కుటుంబ సభ్యులకు తెలియజేశాను. వారంతా నా వల్లనే ఉద్దీన్ చనిపోయాడని భావించి నాపై దాడికి దిగారు. సుమారు 30 మంది వరకు ఆస్పత్రిపై దాడి చేశాను. వారికి భయపడి నేను ఓ రూమ్‌లోకి పరిగెత్తి దాక్కుందామని ప్రయత్నించినప్పటికి దాని డోర్ తెరుచుకుని వచ్చి.. నాపై దాడి చేశారు. నా మెడలో ఉన్న బంగారు గొలుసు, ఉంగరాలు, మోబైల్ ఫోన్ లాక్కున్నారు’’ అని తెలిపాడు. Such barbaric attacks on our frontline workers won't be tolerated by our administration. @gpsinghassam @assampolice Ensure that the culprits brought to justice. https://t.co/HwQfbWwYmn — Himanta Biswa Sarma (@himantabiswa) June 1, 2021 ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన డాక్టర్ సేనాపతిని వెంటనే నాగావ్‌లోని మరో ఆసుపత్రికి తరలించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ జె.ఎ.జయలాల్ ఈ దాడిపి తీవ్రంగా ఖండించారు. అసోం చాప్టర్ ఆఫ్ అసోం మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ (అమ్సా) సభ్యులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైద్యుడిపై దాడికి నిరసనగా అన్ని ప్రభుత్వ వైద్య సదుపాయాలలో వారు ఈ రోజు ఔట్ పేషెంట్ విభాగం (ఓపీడీ) సేవలను బహిష్కరించారు. అత్యవసర సేవలు, కోవిడ్ విధులు కొనసాగుతాయని.. బ్లాక్ బ్యాడ్జీ ధరించి వైద్యులు విధుల్లోకి హాజరవుతారని తెలిపారు. ఈ దాడిపై దర్యాప్తు జరిపి బాధ్యులను అరెస్టు చేయాలని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ పోలీసులను ఆదేశించారు. చదవండి: లక్షలతో కాదు, ఒక్క ఫోన్ కాల్ తో కరోనా పేషెంట్లను బ్రతికిస్తున్నాడు -
ట్రాఫిక్ పోలీసుల్ని ప్రజలు చితక్కొట్టేశారు
మైసూరు: ట్రాఫిక్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా బైకిస్టు జారి పడి మరణించడంతో తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. దీంతో కోపం వచ్చిన ప్రజలు పోలీసులను చితక్కొట్టారు. సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన వీడియోలు వైరల్ అయ్యాయి. వివరాలు.. మైసూరు నగరం బోగాది రింగ్ రోడ్డుపై దేవరాజ్ బైక్ నడుపుతుండగా సురేష్ అనే వ్యక్తి వెనుక కూర్చున్నాడు. కాస్త ముందు పోలీసులు వాహనాలను ఆపి తనిఖీలు చేస్తున్నారు. పోలీసులు చెయ్యెత్తి ఆపమనడంతో బైక్ అదుపు తప్పి కింద పడడం, దేవరాజ్ తీవ్ర గాయాలతో మరణించినట్లు తెలుస్తోంది. ఈ వార్త దావాలనంలా వ్యాపించడంతో స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ధర్నాకు దిగారు. పోలీసులు డబ్బుల కోసం ఎప్పుడంటే అప్పుడు తనిఖీలు చేస్తూ ప్రజలను ప్రమాదాలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. వాదన ముదిరి కొందరు వ్యక్తులు ఏఎస్సైలు స్వామినాయక్, మాదేగౌడ, కానిస్టేబుల్ మంజులపై దాడి చేశారు. ఒక పోలీస్ జీపును తలకిందులు చేశారు. ప్రజలను రక్షించాల్సిన పోలీసులు భక్షకులుగా మారి ఇలాంటి అమాయకపు ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నారని ఆరోపించారు. Traffic Cop thrashed by locals in Mysore who were furious after one of the riders the cops tried to stop fell of the bike and lost his life. pic.twitter.com/n02bkc0F1t — Deepak Bopanna (@dpkBopanna) March 22, 2021 ఏం జరిగిందో తెలియదు.. పోలీసులు మాట్లాడుతూ బైక్‌ను టిప్పర్ ఢీకొనడం వల్లనే ప్రమాదం జరిగిందని, తమ తప్పేం లేదని చెప్పారు. బైక్ ప్రమాదంలో గాయపడిన సురేష్ తాము పొలీసులకు సుమారు 250 మీటర్ల దూరంలో ఉన్నామని, వెనుక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ తమ బైకును డీకొట్టిందని, కిందపడిన తరువాత ఏం జరిగిందో తనకు తెలియదని చెప్పాడు. దాడికి గురైన పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. -
జాతిపితపై గుడ్లు, రాళ్లు రువ్విన వేళ
(వెబ్ స్పెషల్): మహాత్మ గాంధీ గురించి ప్రసిద్ధ శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్‌స్టీన్ చేసిన ఓ వ్యాఖ్య ఆయన జీవితాన్ని అత్యంత అద్భుతంగా ఆవిష్కరిస్తుంది. జాతిపితను ఉద్దేశించి ఐన్‌స్టీన్ ‘ఇలాంటి వ్యక్తి ఒకరు, రక్తమాంసాలతో ఈ నేలమీద నడిచారు అనే విషయాన్ని ముందు తరాలవారు విశ్వసించటం కూడా కష్టమే!’ అన్నారు. ఈ ఒక్క మాట చాలు ఆయన గొప్పతనాన్ని వెల్లడించడానికి. బ్రిటిషర్లు దాదాపు రెండు వందల ఏళ్ల పాటు మనల్ని పాలించారు. రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గాంధీ ఎలాంటి ఆయుధం వాడకుండా తరిమి కొట్టారంటే ఇప్పటికి వింతగానే ఉంటుంది. ఆయన అహింసా వాదం ఆ తర్వాత ఎందరికో ఆదర్శంగా నిలిచింది. హింసకు వ్యతిరేకి అయిన గాంధీ ఓ సారి దారుణ హింసకు గురయ్యారు. అది దక్షిణాఫ్రికాలో. దాదాపు 6వేల మంది తెల్ల యూరోపియన్లు గాంధీ మీద రాళ్లు రువ్వి, కోడి గుడ్లు విసిరి.. పిడి గుద్దులు కురిపించారు. అయితే అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం లేకుండా ఆయన ఆ దాడి నుంచి బయటపడగలిగారు. ఈ సంఘటన 1897, జనవరి 13న చోటు చేసుకుంది. దక్షిణాఫ్రికాలో న్యాయవాదిగా పని చేస్తున్న గాంధీ భారత పర్యటన తర్వాత కుటుంబంతో కలిసి డర్బన్‌కి తిరిగి వచ్చారు. గాంధీ రెండు ఓడల కాన్వాయ్‌లో దక్షిణాఫ్రికా చేరుకున్నారు. అయితే ఆ సమయంలో గాంధీకి వ్యతిరేకంగా తెల్ల యూరోపియన్లు ఆందోళన చెపట్టడంతో ఆయన కొంత సమయం ఓడలోనే ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే అప్పటికే గాంధీ నాటల్ ప్రాంతంలోని భారతీయ ప్రజల హక్కుల కోసం పోరాటం చేశారు. దాంతో వారు ఆయన మీద కోపం పెంచుకున్నారు. ఈ క్రమంలో వారు ఆయనకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. బ్రిటీషర్లతో పాటు భారతీయుల సమానత్వం కోసం ఆయన కృషి చేశారు. దాంతో వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఆందోళన నేపథ్యంలో ఓడ కెప్టెన్ మహాత్మ గాంధీని కిందకు దిగవద్దని హెచ్చరించాడు. ఆ సమయంలో యూరోపియన్లు గాంధీ వచ్చిన ఓడ తిరిగి భారతదేశానికి వెళ్లాలని డిమాండ్ చేశారు. తిరిగి వెళ్లందుకు అవసరమైన డబ్బులు తామే ఇస్తామన్నారు. తమ మాట వినకపోతే దాడి చేస్తామని హెచ్చరించారు. (చదవండి: ఇప్పటికీ 'ఆమె' పోరాడుతూనే ఉంది) కొంత సమయం తర్వాత ప్రమాదం లేదని తెలియడంతో గాంధీ కిందకు దిగారు. పక్కనే ఉన్న ఓ వీధిలోకి వెళ్తుండగా దాదాపు 6 వేల మంది ఆయనను చుట్టు ముట్టారు. వారు చాలా కోపంగా ఉన్నారు. వారిలో కొందరు గాంధీ మీద రాళ్లు రువ్వారు.. కోడి గుడ్లతో దాడి చేశారు. ఓ వ్యక్తి గాంధీ తలపాగాను కింద పడేశాడు. కొందరు ఆయన మీద పిడిగుద్దులు కురిపించారు. ఈ దాడిలో గాంధీ స్పృహ కోల్పోయాడు. పోలీసులు గాంధీని దాడి చేసిన వారి నుంచి సురక్షితంగా రక్షించారు. గాంధీ తన స్నేహితుడు పార్సీ రుస్తమీ ఇంటికి చేరుకున్నారు. కానీ వందలాది మంది గుంపు ఆ ఇంటిని చుట్టుముట్టి, "గాంధీని తిరిగి మాకు అప్పగించండి" అని అరవడం ప్రారంభించింది. ఆందోళనకారులు ఇంటికి నిప్పంటించాలని ప్లాన్ చేశారు. ఆ సమయంలో ఇంటి లోపల పిల్లలు, మహిళలు సహా సుమారు 20 మంది ఉన్నారు. అప్పుడు చీఫ్ కానిస్టేబుల్ అలెగ్జాండర్ గాంధీని ఇంటి నుంచి బయటకు తీసుకువచ్చి గుంపు నుంచి రక్షిస్తాడు. (చదవండి: మహమ్మారులపై మహాత్ముడి మంత్రోపదేశం) అలెగ్జాండర్ బ్రిటిషర్ కాని గాంధీ స్నేహితుడు. అతను గాంధీని భారత పోలీసు కానిస్టేబుల్‌గా తయారు చేసి, సమీప పోలీస్ స్టేషన్‌కు సురక్షితంగా రవాణా చేయడానికి ఏర్పాట్లు చేశాడు. అలెగ్జాండర్ స్వయంగా జనసమూహంలో కలిసి గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ఆయనను అక్కడి నుంచి తప్పిస్తాడు. అలా భారతదేశం స్వాతంత్ర్యం పొందటానికి 50 సంవత్సరాల కంటే ముందే మహాత్మా గాంధీ ప్రాణాంతకమైన మూక దాడి నుంచి తప్పించుకున్నారు. ఆయన 1915 లో దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చారు.. ఆ తర్వాత స్వాతంత్య్ర సంగ్రామానికి కొత్త దిశను ఇచ్చారు. -
క్షమాపణలు అంగీకరిస్తున్నా: నటి
బెంగుళూరు: కర్ణాటకలో నటి సంయుక్త హెగ్డే, కాంగ్రెస్ నేత కవిత రెడ్డి మధ్య నెలకొన్న వివాదం ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. కవిత రెడ్డి క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. పార్క్‌లో స్పోర్ట్స్‌వేర్ ధరించి సంయుక్త, ఆమె స్నేహితురాలు వ్యాయమం చేస్తుండగా అటుగా వెళ్లిన కాంగ్రెస్ నేత కవిత రెడ్డి వారిని వీడియో తీసి వారిపై దాడి చేశారు. ఈ వీడియోను నటి సంయుక్త హెగ్డే ఆమె సోషల్‌మీడియా అకౌంట్లో పోస్ట్ చేసి ‘మహిళలు ఏం ధరిస్తున్నారు, ఎటు వెళుతున్నారు, ఏం చేస్తున్నారు అనే కారణాలతో వారిని హింసించడం సమాజం ఆపాలి’ అని ఆమె ట్వీట్ చేశారు. అదేవిధంగా కవిత మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో దిగివచ్చిన కవిత సంయుక్తకు క్షమాపణలు చెప్పింది. తాను అప్పుడు అలా చేసి ఉండాల్సింది కాదని పేర్కొంది. ఇదిలా వుండగా కవిత క్షమాపణలను అంగీకరిస్తున్నట్లు సంయుక్త తెలిపింది. ఇదంతా మరిచిపోయి ముందుకు సాగుదామని కోరింది. ప్రతి చోట మహిళలకు భద్రత ఉండాలి తాను కోరుకుంటున్నట్లు పేర్కొంది. చదవండి: 'కిరాక్ పార్టీ' హీరోయిన్‌పై మూక దాడి -
'కిరాక్ పార్టీ' హీరోయిన్‌పై మూక దాడి
బెంగళూరు: కన్నడ హీరోయిన్ సంయుక్త హెగ్డేపై మూకదాడి జరిగింది. శుక్రవారం వర్కవుట్లు చేసేందుకు స్నేహితులతో కలిసి సంయుక్త బెంగళూరులోని ఓ పార్క్‌కు వెళ్లింది. అక్కడే ఉన్న ఓ మహిళ ఆమె వేసుకున్న దుస్తులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. స్పోర్ట్స్ దుస్తులు ధరించి పబ్లిక్‌లోకి ఎలా వస్తావంటూ దూషణలకు దిగింది. పార్కులో ఉన్న మరికొందరు కూడా సదరు మహిళతో కలిసి సంయుక్తతోపాటు ఆమె స్నేహితులపై దాడి చేశారు. కాగా దాడికి దిగిన మహిళను కవితారెడ్డిగా గుర్తించారు. మరోవైపు ఈ ఘటనతో షాక్ తిన్న హీరోయిన్ ఇన్స్టాగ్రామ్ ద్వారా తనకు జరిగిన చేదు అనుభవాన్ని వెల్లడించారు. (చదవండి: కూతురుతో సహా సినీ నటి అదృశ్యం) The future of our country reflects on what we do today. We were abused and ridiculed by Kavitha Reddy at Agara Lake@BlrCityPolice @CPBlr There are witnesses and more video evidence I request you to look into this#thisisWRONG Our side of the storyhttps://t.co/xZik1HDYSs pic.twitter.com/MZ8F6CKqjw — Samyuktha Hegde (@SamyukthaHegde) September 4, 2020 "స్పోర్ట్స్ బ్రా వేసుకుని బయటకు వచ్చినందుకు చెప్పరాని మాటలు అన్నారు. నా స్నేహితురాలు ఏమీ అనకముందే ఆమెను కొట్టడానికి వెళ్లారు. ఇక్కడ ఇంత జరుగుతుంటే మాకు సహాయం చేయాల్సింది పోయి మరికొందరు మగవాళ్లు ఆమెకు తోడుగా నిలిచారు. డ్రగ్స్ కేసులో ఇరికిస్తామని బెదిరించారు" అని సంయుక్త వాపోయారు. ట్విటర్లోనూ తనపై దాడి చేసిన కవితారెడ్డి అనే మహిళ వీడియోను పోస్ట్ చేశారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాల్సిందిగా బెంగళూరు పోలీసులను కోరారు. తమ దగ్గర మరిన్ని సాక్ష్యాలు ఉన్నాయని తెలిపారు. కాగా సంయుక్త హెగ్డే తమిళ, కన్నడ సినిమాల్లో హీరోయిన్గా రాణిస్తున్నారు. తెలుగులో 'కిరాక్ పార్టీ' చిత్రంలో నటించారు. (చదవండి:మానసిక సమస్యలలో అమితాబ్ మనవరాలు) View this post on Instagram A post shared by Samyuktha Hegde (@samyuktha_hegde) on Sep 4, 2020 at 5:38am PDT -
చండీఘర్: పోలీసుల ముందే పాశవిక దాడి!
-
అమానుషం: పోలీసుల ముందే పాశవిక దాడి!
చండీఘర్: దేశ రాజధాని సమీపంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. గోమాంసాన్ని తరలిస్తున్నాడనే అనుమానంతో గురుగ్రామ్‌లో కొంతమంది ఓ ట్రక్కు డ్రైవర్‌పై విరుచుకుపడ్డారు. సుత్తెతో బాదుతూ తీవ్రంగా హింసించారు. పోలీసుల ముందే రెచ్చిపోతూ విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో వెలుగులోకి రావడంతో పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాలు.. లక్మన్ అనే వ్యక్తి శుక్రవారం ఉదయం బాద్షాపూర్ నుంచి మాంసం(గేదె) లోడ్‌తో బయల్దేరాడు. ఈ విషయం తెలుసుకున్న గోరక్షక బృందం అతడిని వెంబడించింది. ఈ క్రమంలో 9 గంటల సమయంలో గురుగ్రామ్‌లో ట్రక్కును ఆపేసిన గోరక్షకులు లక్మన్‌ను కిందకు లాగి, గోమాంసం తరలిస్తున్నాడనే అనుమానంతో అతడిని తీవ్రంగా కొట్టారు. కిందపడేసి తన్నుతూ సుత్తెతో బాదారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, తొలుత మాంసాన్ని ల్యాబ్‌కు పంపించే పనిలో పడ్డారే తప్ప.. బాధితుడిని రక్షించే ప్రయత్నం చేయలేదని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. లక్మన్‌ను తమ గ్రామమై బాద్షాపూర్కు తీసుకువెళ్లేందుకు దుండగులు ప్రయత్నించగా.. అప్పుడు రంగప్రవేశం చేశారని.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని తెలిపారు. (దారుణం: కల్తీ మద్యం తాగి 24 మంది మృతి) ఇక ఇందుకు సంబంధించిన వీడియో వెలుగులోకి రావడంతో పోలీసులను సంప్రదించగా... స్పందించేందుకు వారు నిరాకరించారని ఓ జాతీయ మీడియా పేర్కొంది. లక్మన్‌పై దాడి చేసిన దుండగుల ముఖం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారని కేసు నమోదు చేసినట్లు వెల్లడించింది. కాగా ఈ విషయం గురించి ట్రక్కు యజమాని మాట్లాడుతూ.. యాభై ఏళ్లుగా తాను మాంసాన్ని విక్రయిస్తున్నానని, తమ వాహనంలో ఉన్నది గేదె మాంసమని వివరణ ఇచ్చారు. -
దారుణం: మరో మాట లేకుండా ప్రాణాలు తీశారు
దిస్పూర్: అస్సాంలోని టీ తోటల ప్రాంతాల్లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు యువకులపై 50 మంది గుంపు విచక్షణారహితంగా దాడికి పాల్పడింది. తీవ్ర గాయాలతో ఒక యువకుడు ప్రాణాలు కోల్పోగా.. మరొకరు ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. జోర్హాత్ జిల్లాలో శనివారం ఈ ఘటన జరిగింది. టూరిస్టు ప్రాంతం గభోరు పర్బాత్‌కు వెళ్లిన ఇద్దరు స్నేహితులు దేవాశిష్ గొగోయ్ (23), ఆదిత్యదాస్ శనివారం సాయంత్రం బైక్‌పై ఇంటికి తిరుగుపయనమయ్యారు. మరియాణి పట్టణానికి సమీపాన ఉన్న టీ ప్యాక్టరీ వద్దకు చేరుకున్న క్రమంలో దారిగుండా వెళ్తున్నఇద్దరు మహిళలను వారి ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. దాంతో 50 మంది గుంపు వారిపై ఒక్కసారిగా దాడికి దిగింది. మహిళలకు పెద్దగా గాయాలు కాలేదని, ప్రమాదానికి సంబంధించి ఎలాంటి వాదనలు లేకుండానే యువకులను గుంపులోనివారు చావబాదారని స్థానికులు తెలిపారు. ఇక దేవావిష్ తండ్రి, సోదరి హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని నచ్చజెప్పినా వారు వినిపించుకోలేదని పోలీసులు వెల్లడించారు. యువకులను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించినప్పటకీ ఫలితం లేకపోయిందని చెప్పారు. దేవాశిష్ ప్రాణాలు విడువగా.. ఆదిత్యదాస్ చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేశామని, నలుగురిని అరెస్టు చేశామని వెల్లడించారు. (చదవండి: మానవత్వాన్ని చాటుకున్న మిజోలు) -
కరోనా భయం: తమిళనాడులో అమానుషం
చెన్నై: మహమ్మారి కరోనా వ్యాపిస్తుందన్న భయం మానవత్వాన్ని మంటగలుపుతోంది. వైరస్ బారి నుంచి ప్రజలను కాపాడుతున్న వైద్య, పారిశుద్ధ్య సిబ్బందిపై దాడులకు పురిగొల్పుతోంది. తాజాగా.. న్యూరో సర్జన్‌గా సేవలు అందించిన ఓ డాక్టర్ మృతదేహాన్ని తీసుకెళ్తున్న అంబులెన్సుపై మూకదాడి జరిగిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు గాయాలపాలయ్యారు. వివరాలు... వైద్య సేవలు అందించే క్రమంలో కోవిడ్-19 బారిన పడిన డాక్టర్ సిమన్ హెర్క్యూల్స్ ఆదివారం మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు ఇద్దరు వార్డుబాయ్‌లు చెన్నైలోని ఓ శ్మశానవాటికకు అంబులెన్సులో బయల్దేరారు. ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్న స్థానికులు మృతదేహం కారణంగా తమకు కూడా కరోనా సోకుతుందన్న భయంతో అంబులెన్సుపై దాడి చేశారు. ఇటుకలు, రాళ్లు, బాటిళ్లు, కర్రలతో విరుచుకుపడ్డారు. అక్కడి నుంచి మరో శ్మశాన వాటికకు వెళ్లగా.. అక్కడికి కూడా వచ్చి అంబులెన్సును అడ్డగించారు. డ్రైవర్లు, పారిశుద్ధ్య సిబ్బందిని విచక్షణారహితంగా కొట్టారు. దీంతో మరో వైద్యుడు తానే స్వయంగా అంబులెన్సు నడుపుతూ ఇద్దరు వార్డ్‌బాయ్‌లను తీసుకుని మరోసారి శ్మశానానికి వెళ్లారు. వారితో కలిసి ఎనిమిది ఫీట్ల గుంత తవ్వి డాక్టర్ మృతదేహాన్ని పూడ్చారు.(కరోనా: ఆరోగ్య సిబ్బంది మరణిస్తే రూ.50 లక్షలు!) ఈ విషాదకర ఘటన గురించి డాక్టర్ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘డాక్టర్ సిమన్ మృతదేహాన్ని తీసుకువెళ్లిన సిబ్బందిపై స్థానికులు దాడిచేశారు. వాళ్లు తీవ్ర గాయాలపాలయ్యారు. దీంతో నేను స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ మరోసారి అంబులెన్సులో శ్మశానానికి బాడీని తీసుకువెళ్లాను. మాపై ఇదే తరహా దాడి జరుగుతుందని భయం వేసింది. అందుకే హడావుడిగా మృతదేహాన్ని కిందకు దించి.. గుంత తవ్వి పూడ్చిపెట్టాం. మా దగ్గరకు రావడానికి, సహాయం చేయడానికి పోలీసులు కూడా భయపడ్డారు’’అని ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి ఒంటి గంట దాటిన తర్వాత దొంగతనంగా డాక్టర్ మృతదేహాన్ని పాతిపెట్టాల్సి వచ్చిందంటూ ఉద్వేగానికి లోనయ్యారు. కాగా ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు 21 మందిని అరెస్టు చేశారు. ఇక ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన మద్రాస్ హైకోర్టు వివరణ కోరుతూ తమిళనాడు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. భారత వైద్య సమాఖ్య సైతం ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులతో డాక్టర్లకు భద్రత కల్పించాలని డిమాండ్ చేసింది. కరోనాపై పోరులో ముందుండి యుద్ధం చేస్తున్న వైద్యులు చనిపోతే వారి పట్ల ఇలా అనాగరిక చర్యలకు పాల్పడటం సిగ్గుచేటని మండిపడింది. ఇలాంటి ఘటనలు ఆపే శక్తి ప్రభుత్వానికి లేకపోతే పాలన సాగించే నైతిక హక్కు కోల్పోయినట్లేనని ఘాటుగా విమర్శించింది. -
ఎంత సిగ్గుచేటు: మాజీ సీఎం
సాక్షి, బెంగళూరు: పాదరాయణపురలో హింసకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి డిమాండ్ చేశారు. ఇటువంటి దాడులు ఏమాత్రం ఉపేకక్షించకూడదని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. బెంగళూరు పరిధిలోని పాదరాయణపురలో ముగ్గురు వ్యక్తులు కోవిడ్ బారిన పడిన నేపథ్యంలో సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లు, పోలీసులపై కొంత మంది దాడికి దిగారు. బారికేడ్లను, వైద్య పరికరాలను ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. ఈ ఘటనపై కుమారస్వామి స్పందిస్తూ.. ‘ఆశా వర్కర్లు, పోలీసులు, డాక్టర్లపై దాడులు చేయాల్సిన అవసరం లేదు. ఇటువంటి దాడులు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఈ దాడి సిగ్గుచేటు. దాడులు చేసింది ఏ మతానికి చెందినవారైనా చట్టప్రకారం శిక్షించాల్సిందే. లాక్డౌన్ మార్గదర్శకాలకు ప్రతిఒక్కరూ పాటించాల’ని అన్నారు. కాగా, పాదరాయణపురలో దాడికి పాల్పడిన 58 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. డీజీపీ, రాష్ట్ర హోంమంత్రితో సహా పలువురు అధికారులు సంఘటనా స్థలంలో పర్యటించి పరిస్థితిని అంచనా వేశారు. మరోవైపు తన కొడుకు పెళ్లిలో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన కుమారస్వామిపై చర్యలు తీసుకోవాలన్న వాదనలు ఇంకా వినిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై కన్నడవాసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వైద్య సిబ్బందిపై దాడులు: కేంద్రం కీలక నిర్ణయం -
కరోనా టెంట్లు ధ్వంసం
-
అలజడి : ఆశా వర్కర్లపై దాడి
సాక్షి, బెంగళూరు : కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందిపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా పోకిరీలు రెచ్చిపోతున్నారు. వైద్య, పోలీసు సిబ్బందిపై దాడికి పాల్పడి, కరోనా అనుమానిత ప్రాంతంలో ఏర్పాటు చేసిన బారికేడ్లను ధ్వంసం చేసిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. రాష్ట్ర పోలీసు అధికారి బీ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం. పశ్చిమ బెంగళూరు పరిధిలోని పెద్దనారాయణపురంలో ఈనెల మొదటి వారంలో ముగ్గురు వ్యక్తులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే ఈ ముగ్గురు ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన మర్కజ్ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చినట్లు పోలీసుల గుర్తించారు. దీంతో ఆ ముగ్గురు యువకులు నివహిస్తున్న ప్రాంతాన్ని గుర్తించిన పోలీసులు చూట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసి అందరినీ స్వీయ నిర్బంధంలో ఉండాలని ఆదేశించారు. అంతేకాకుండా వారిలో వైరస్ లక్షణాలు కనిపించిన పలువురికి ఇంట్లోనే వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి అక్కడి చేరుకున్న ఆశా వర్కర్లు, పోలీసులపైకి కొందరు యువకులు దాడికి దిగారు. బారికేడ్లను ధ్వంసం చేసి వైద్య పరికరాలను పగటకొట్టారు. ఈ ఘటనలో పలువురు ఆశా వర్కర్లు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న డీజీపీ, రాష్ట్ర హోంమంత్రితో సహా పలువురు అధికారులు భారీ బందోబస్త్‌తో ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. దాడికి పాల్పడిన వారిలో 58మందిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అలాగే మిగతా వారిపై నిర్బంధం కొనసాగిస్తామని తెలిపారు. తాజాగా ఈ ఘటనపై ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప స్పందించారు. బాధ్యతులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ఆశా వర్కర్లు, వైద్య చికిత్స అందిస్తున్న సిబ్బందికి భద్రతను ఏర్పాటు చేస్తామన్నారు. -
రైతులను దారుణంగా చితకబాదారు..
-
రైతులను దారుణంగా చితకబాదారు..
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఆరుగురు రైతులను గ్రామస్తులు దారుణంగా చితకబాదారు. కర్రలు, దుంగలతో కొట్టడమే కాకుండా వారిపైకి పెద్ద పెద్ద బండరాళ్లను విసిరారు. రైతులు వచ్చిన రెండు కార్లను ధ్వంసం చేశారు. వారిని 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోర్లాయ్ వరకు తరిమి తరిమి కొట్టారు. వారిలో ఒక రైతు అక్కడికక్కడే మరణించగా, మిగతా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఖిరికియా గ్రామంలో బుధవారం ఈ దారుణ సంఘటన జరగ్గా పోలీసులు గురువారం 15 మంది నిందితులను అరెస్ట్ చేసి వారిపై హత్యానేరం మోపారు. ఈ సంఘటనను స్థానిక జర్నలిస్ట్ ఒకరు వీడియో తీసి ఆన్లైన్లో పోస్ట్ చేయగా, ఇప్పుడది వైరల్ అవుతోంది. పోలీసుల కథనం ప్రకారం పొరుగూరికి చెందిన రైతులు వ్యవసాయ పనుల నిమిత్తం ఖిరికియా గ్రామానికి చెందిన ముగ్గురు కూలీలకు అడ్వాన్స్ కింద లక్షా యాభై వేల రూపాయలు ఇచ్చారు. డబ్బులు తీసుకొని పనికి రాకుండా ఎగ్గొడుతున్న ఆ కూలీలను డబ్బులన్నా ఇవ్వాల్సిందిగా రైతులు కోరారు. తమ ఊరికొస్తే డబ్బులిస్తామని కూలీలు వారికి నచ్చ చెప్పారు. వారి మాటలు నమ్మి గ్రామానికి వచ్చిన ఆరుగురు రైతులను ఊరు శివారున ముగ్గురు కూలీలు మరికొందరితో కలిసి అడ్డుకొని కొట్టడం ప్రారంభించారు. ఇదేమిటని అక్కడికొచ్చిన గ్రామస్తులు అడగ్గా, పిల్లలను ఎత్తుకుపోవడానికి వచ్చిన దొంగలంటూ కూలీలు అబద్ధమాడారు. దాంతో మరికొంత మంది గ్రామస్తులు ఆ కూలీలతో చేతులు కలిపి రైతులను చితకబాదారు. అక్కడ గుమికూడిన ప్రజలంతా చోద్యం చూస్తున్నట్టుగా చూస్తూ తమ తమ సెల్ఫోన్లలో వీడియోలు తీసుకున్నారు. యూనిఫామ్‌లో ఉన్న ఓ పోలీసు అధికారి మాత్రం ముక దాడిని అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. మరోవైపు ఈ సంఘటనకు సంబంధించిన మొత్తం 40మందిపై కేసు నమోదు కాగా, ఆరుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. -
వారికి చదువంటే చచ్చేంత భయం
అక్కడ పుస్తకాలు చెల్లాచెదురైనాయి. చదివే మస్తకాలు పగిలాయి. సైలెన్స్ బదులు గ్రంథాలయాల్లో వయొలెన్స్ విలయ తాండవం చేసింది. కలాలు కాదు ఐరన్ రాడ్లు, కంప్యూటర్లు కాదు మొబైల్ ఫోన్లలో వాట్సాప్ కుట్రలు పనిచేసాయి. విద్యార్థులు కాదు విద్యార్థి సంఘాల గూండాలు విజృంభించారు. చంపడం తన్నడం పాఠాలనుకునే వారు, లాఠీతో సరిచేద్దామనుకునే తత్వజ్ఞులు చీకటితో వెలుగు మీద దాడిచేశారు. హాస్టళ్ల అద్దాలు పగిలాయి. బాత్రూంలలో కూడా నెత్తురు చుక్కలు.. వారు ఎవరిమీద ఎక్కడ దాడిచేశారో చెప్పే రుజువులు. కొత్త సంవత్సరం మొదటి ఆదివారం రాత్రి జేఎన్‌యూలో కాళరాత్రి. ఎవరూ రమ్మనకుండానే వచ్చి ఒక యూనివర్సిటీలో జొరబడి విద్యార్థులను శాంతిభద్రతలకోసం చితకబాదిన పోలీసులు ఈసారి వచ్చి కూడా అనుమతి లేదని కొన్నిగంటలు నిశ్చలంగా ఉండిపోయారు. జేఎన్‌యూలోని ముగ్గురు వ్యక్తులు గూండాలను తీసుకువచ్చి ఏయే హాస్టల్ గదుల మీద దాడిచేయాలో చూపారని వార్తలు. ఎవరు చేశారో, ఎందుకు చేశారో తెలిసిన రహస్యమే. ముసుగు పర్వం: పాలకులు ఎవరైనా సరే వారికి చదువంటే భయం. చదువుల నిలయాలంటే భయం. చదువుకునే వారంటే ఇంకా భయం. చదివిన చదువు లక్ష మెదళ్లను కదిలి స్తుంటే భయం. ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి వెంట రాడ్లు తెచ్చుకుని, ముసుగులేసుకుంటారు. జాతీయతా పర్వం: భయాన్ని దాచుకోవడానికి జాతీయత, దేశభక్తి వంటి భారీ పదజాలం కప్పుకోవాలి. లైబ్రరీ అయితే నాకేమిటి, పుస్తకాలు నాకెందుకు. అక్కడ ప్రొఫెసర్ ఉంటేనేం, విద్యార్థి అయితేనేం ఎవడైతే నాకేమిటి. లాఠీతో కొడతాను. పుస్తకం చింపేస్తాను. గొంతు నులిపేస్తాను, శరీరాల్ని నలిపేస్తాను. నీవు చదువుకుని ఏం చేస్తావు? మేం పాలిస్తున్నాం. మీకన్నీ ఇస్తాం. నోరుమూసుకుని పడి ఉండు. అనేదే ఫిలాసఫీ. భయపడే పర్వం: ఈ పిరికి మంద పాడైపోవడాన్ని బాగుపడడం అనుకుంటుంది. పాపం జేఎన్ యూను బాగుచేయాలనుకున్నారు పాడైపోయిందనుకుని, కొట్టి భయపెట్టి. తలలు పగిలితే బాగుపడుతుందని నమ్మారు. ఈ మంద భయపడుతూ శరీరాలపై హింసకు పాల్పడి భయపెడుతున్నానుఅనుకుంటుంది. నిజాలంటే భయం, నిలదీయడమంటే భయం. టెర్రరిజం పర్వం: ఎదురుపడలేని పిరికితనమే టెర్రరిజం. సరిహద్దు అవతలనుంచి విసిరే రాకెట్ కన్న దారుణమైంది విశ్వవిద్యాలయం మీద గూండాల దాడి. సంబంధంలేని వాడిని తన్ని గర్వించడమే టెర్రరిజం. కళ్లు కనబడలేదన్నా వదలరు. కదలలేమన్నా వదలరు. వారికి మెదడు ఉండే చోట మరేదో ఉంది. గుండె ఉండేచోట ఇంకేదో ఉండకూడని పదార్థం ఉంది. సంస్కృతి పర్వం: పిరికితనం దాచుకుని గూండాగిరీ చేసేవారు వాడుకునే మరో ఇనుప రాడ్–సంస్కృతి. సంస్కృతి అంటే లాఠీలు పట్టుకుని రాడ్లు పట్టుకుని, వాట్సాప్‌లో తోడున్న గూండాలను, మందలను తరలిం చినట్టు తరలించి, పోలీసులు మనోళ్లే, సర్కార్ మనదే, వీసీ మనోడే, ఇంకెవడో కూడా మనోడే అని సంక్షిప్త సందేశాలిస్తూ, తరువాత దొరికిపోతామన్న ఆలోచన కూడా లేకుండా, ముసుగు దాచదన్న భయం లేకుండా మూర్ఖత్వంతో దాడి చేస్తారు. ఇది సంస్కృతి మీద, సనాతన ధర్మం మీద దాడి. లాఠీ లూటీ పర్వం: రేపటి తరానికి రిజర్వ్ బాంక్ విశ్వవిద్యాలయమే. అది లూటీ చేయడానికి వీలుకాని ధనాగారం. జేఎన్‌యూలో దాడిచేసిన గూండాల ముసుగులను తొలగించే అంశాలు ఒక్కటొక్కటే బయటపడుతున్నాయి. అందుకే కొందరు సిగ్గు లేకుండా మేమే తన్నాం, మేమే గుద్దాం, మేమే దాడి చేశాం, మాది దక్షిణ పక్షమని ఉన్మత్తంగా చెప్పుకుంటూనే ఉన్నారు. జేఎన్‌యూ అయింది. ఇక ఆ యూనివర్సిటీ ఈ యూనివర్సిటీ అని టార్గెట్లు కూడా నిర్ణయించారు. మౌనాంగీకార పర్వం: దీన్ని ఖండించక మౌనంగా ఉండడానికి ఫేస్బుక్లో లైక్‌లు పెట్టడానికి పెద్ద తేడా లేదు. మౌనం అతి భయంకరం. విశ్వవిద్యాలయం శత్రుస్థావరం అనుకునే విజ్ఞానవంతులకు రాజ్యాంగం ఎందుకు? నిర్భయ, దిశ కన్న భయంకర నేరం ఇది. వెలుగుదిశ చూపే నిర్భయ విద్య ఎక్కడ? మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
చనిపోయాడనుకొని అంత్యక్రియలు చేశాక..
పట్నా: లేడనుకున్న మనిషి.. ఇక రాలేడునుకున్న వ్యక్తి అకస్మాత్తుగా ప్రత్యక్షమైతే! చనిపోయాడనుకుని అంత్యక్రియలు కూడా నిర్వహించిన వ్యక్తి ఒక్కసారిగా మన ముందుకు వచ్చి నిలబడితే ఎలా ఉంటుంది? ఊహించడానికి కూడా కష్టమే. సరిగ్గా ఇలాంటి సంఘటన బీహార్‌లో చోటు చేసుకుంది. మూక దాడుల్లో చనిపోయాడని భావించిన ఓ వ్యక్తి కి అంత్యక్రియలు నిర్వహించిన మూడు నెలల తర్వాత తిరిగి ఇంటికి వచ్చాడు. వివరాలు.. పట్నాలోని నిసార్‌పురా గ్రామానికి చెందిన కృష్ణ మాంచి అనే వ్యక్తి ఈ ఏడాదిలో ఆగస్టులో కనిపించకుండాపోయాడు. అదే నెల 10న బీహార్‌లో హమత్పూర్ గ్రామంలో చిన్న పిల్లల్ని ఎత్తుకెళ్తున్నారనే నెపంలో ఓ వ్యక్తిపై గ్రామస్తులు దాడి చేసి చంపారు. అయితే మృతదేహం గుర్తుపట్టకుండా ఉండడంతో దుస్తులు ఆధారంగా అతను కృష్ణ మాంచి అని గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కుటుంబ సభ్యులు కూడా మృత దేహం కృష్ణ దే అనుకొని అంత్యక్రియలు నిర్వహించారు. అయితే దాదాపు మూడు నెలల తర్వాత కృష్ణ మాంచి తిరిగి తన ఇంటికి వచ్చాడు. అతన్ని చూసిన కుటుంబ సభ్యులు షాకయ్యారు. ఇక లేడు అనుకున్న వ్యక్తి తిరిగి రావడంతో ఆనందంతో చిందులేశారు. ‘ నేను మృతదేహాన్ని సరిగా గుర్తించలేదు. దుస్తుల ఆధారంగా అతను నా భర్తే అని గ్రామస్తులు చెప్పడంతో నమ్మేశాను. ఇకలేడు అనుకున్న నా భర్త తిరిగిరావడం అనందంగా ఉంది’ అని కృష్ణ భార్య రూడీదేవి మీడియాకు తెలిపారు. కాగా, కృష్ణ తిరిగి రావడం శుభపరిణామమని, అయితే మూక దాడిలో చనిపోయిన వ్యక్తి ఎవరో తెలుసుకోవాడానికి విచారణ చేపట్టామని పట్నా సినీయర్ పోలీసు అధికారిణి గరిమా మాలిక్ పేర్కొన్నారు. -
పోలీసులను చెట్టుకు కట్టేసి కొట్టిన గ్రామస్తులు
వారణాసి: ఉత్తరప్రదేశ్‌లో ఘోరం జరిగింది. నేరస్తులను అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులను చెట్టుకు కట్టేసి కొట్టారు కొంతమంది దుర్మార్గులు. వదిలేయాలని పోలీసులు బతిమాలుతున్నా వినకుండా దాడి చేశారు. ఈ దారుణ ఘటన వారణాసి నగరంలోని హార్సోస్ గ్రామంలో చోటు చేసుకుంది. రాజన్ భరద్వాజ్, రాహుల్ అనే నేరస్తులు హార్సోస్ గ్రామానికి వచ్చినట్లు పోలీసులకు సమాచారం అందింది.దీంతో వారిని పట్టుకునేందుకు పోలీసులు ఆ గ్రామానికి వెళ్లారు. పోలీసుల రాకను గమనించిన రాహుల్ అక్కడి నుంచి పారిపోయాడు. రాజన్ భరద్వాజ్ పోలీసులకు దొరికిపోయాడు. రాజన్ భరద్వాజ్‌ను కారులో ఎక్కించుకుని వెళ్తుండగా, క్రిమినల్స్‌కు చెందిన అనుచరులు, కొందరు గ్రామస్తులు పోలీసులకు అడ్డుపడ్డారు. బైక్ మీద వెళ్తున్న పోలీసులను పట్టుకుని కొట్టారు. రాళ్లతో దాడి చేశారు. అనంతరం గ్రామంలోని ఓ చెట్టుకు వారిని కట్టేశారు. తమను వదిలేయాలని పోలీసులు బతిమాలుతున్నా వినకుండా దాడి చేశారు. అనంతరం పోలీస్ అధికారుల వద్ద ఉన్న సర్వీస్ రివాల్వర్‌ను కూడా లూటీ చేసి పారిపోయారు. సమాచారం తెలుసుకున్న రూరల్ ఎస్ఎస్పీ అదనపు బలగాలతో వెళ్లి గ్రామస్తులను చెదరగొట్టారు. పోలీసులను రక్షించారు. ఈ ఘటన కు సంబంధించి సుమారు 12 మందికి పైగా నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. రాజన్ భరద్వాజ్, రాహుల్ బంధువుల ఇళ్లలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. -
మూకదాడి కేసులో వారంతా నిర్దోషులే
జైపూర్: పెహ్లూఖాన్ మూకదాడి కేసులో ఆరుగురు నిందితులనూ ఆల్వార్ కోర్టు బుధవారం నిర్దోషులుగా ప్రకటించింది. ఆవులను తరలిస్తున్నారన్న కారణంతో పెహ్లూఖాన్ (55) అతని కుమారులపై రెండేళ్ల క్రితం మూకదాడి చోటు చేసుకోగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పెహ్లూఖాన్ చనిపోయారు. ఈ కేసులో నిందితులైన ఆరుగురిని కోర్టు నిర్దోషులుగా పేర్కొంటూ తీర్పునిచ్చింది. ఈ తీర్పును పై కోర్టులో సవాల్ చేస్తామని రాజస్తాన్ హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ అన్నారు. తీర్పుకు సంబంధించిన పత్రాలు ఇంకా రాలేదని ప్రభుత్వం తరఫు న్యాయవాది యోగేంద్ర ఖటనా తెలిపారు. కోర్టు తీర్పుతో తాము సంతోషంగా లేమని పెహ్లూఖాన్ కుమారుడు ఇర్షాద్ ఖాన్ అన్నారు. పైకోర్టులో అయినా తమకు న్యాయం అందుతుందని భావిస్తున్నట్లు బాధితుల తరఫు న్యాయవాది ఖాసిం ఖాన్ తెలిపారు. అసెంబ్లీలో ప్రతిపక్షనేత గులాబ్‌చాంద్ కటారియా మాట్లాడుతూ ఘటన జరిగినపుడు బీజేపీ ప్రభుత్వం తీసుకోదగ్గ అన్ని చర్యలు తీసుకుందన్నారు. కోర్టు నిర్దోషులుగా తీర్పునిచ్చిన వారిలో విపిన్ యాదవ్, రవీంధ్ర కుమార్, కలురామ్, దయానంద్, యోగేశ్ కుమార్, భీమ్ రాతిలు ఉన్నారు. ఈ కేసులో మరో ముగ్గురు మైనర్ నిందితులు ఉన్నారు. -
అమ్మాయి కోసం అరాచకం
అనంతపురం సెంట్రల్: పాతిక మందికి పైగా విద్యార్థులు ఓ యువకుడిని చితకబాదారు. రౌడీల్లా అరాచకం సృష్టించారు. అచేతన స్థితికి చేరుకున్నా ఏమాత్రం కనికరం లేకుండా బెల్టులు, బండరాళ్లతో దాడి చేశారు. ఈ ఘటన అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాలలో మూడ్రోజుల క్రితం చోటు చేసుకుంది. ఈ దాడి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ధర్మవరం మండలం చిగిచెర్లకు చెందిన రాజేష్ అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో బీకాం మొదటి ఏడాది చదువుతున్నాడు. రాజేష్ స్నేహితుడైన శివయ్య పదో తరగతి వరకు చదివి మానేశాడు. అతను అప్పుడప్పుడు ఆర్ట్స్ కళాశాలకు వెళ్లి స్నేహితుడు రాజేష్‌ను కలుస్తుండేవాడు. ఈ క్రమంలో శివయ్య ఓ విద్యార్థినితో ప్రేమలో పడ్డాడు. అయితే ఆ అమ్మాయి భరత్ అనే విద్యార్థితో చనువుగా ఉంటోంది. దీంతో శివయ్యకు వార్నింగ్ ఇవ్వాలని భరత్ అనుకున్నాడు. ఈ విషయాన్ని రాజేష్‌కు చెప్పి ఈనెల 25వ తేదీన శివయ్యను కళాశాలకు పిలిపించాడు. ఆవరణలోని కామర్స్ బిల్డింగ్ ఎదుట శివయ్యపై భరత్ పాతిక మందికి పైగా విద్యార్థులతో కలసి దాడి చేశాడు. దెబ్బలకు తాళలేక బాధితుడు అపస్మారక స్థితికి చేరుకున్నా వదలకుండా బెల్టులు, బండరాళ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన యువకుడిని సహచరులు స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించారు. కాగా, బాధితుడు జరిగిన ఘటనపై అదే రోజు త్రీటౌన్ పోలీసులను ఆశ్రయించగా సర్దిచెప్పి పంపినట్లు తెలిసింది. అయితే దాడికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేయడం, విషయం ఎస్పీ బూసారపు సత్యయేసు బాబు దృష్టికి వెళ్లడంతో శుక్రవారం రోజు బాధిత యువకుడిని పిలిపించి రహస్యంగా విచారణ చేపట్టారు. నిందితుల్లో కొందరు పోలీసులకు లొంగిపోగా మరి కొందరు పరారీలో ఉన్నట్టు తెలిసింది. దీనిపై త్రీటౌన్ సీఐ బాలమద్దిలేటిని వివరణ కోరగా.. బాధిత యువకుడి పరిస్థితి ఇప్పుడు బాగానే ఉందన్నారు. ఈ దాడికి ప్రేమ వ్యవహారమే కారణం కాదని, పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామన్నారు. శివయ్య ఆర్ట్స్ కళాశాల విద్యార్థి కాదని ఆయన స్పష్టం చేశారు. -
గంభీర్ భాయ్.. ఇది నిజమా?
చెన్నై : టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ బీజేపీలో జేఎన్‌యూ నాటిన మొక్కనా? అంటూ హీరో సిద్ధార్థ్ ట్విటర్ వేదికగా ప్రశ్నించాడు. ఇటీవల జై శ్రీరాం అనాలంటూ ఓ ముస్లిం యువకుడిపై గురుగ్రామ్‌లో అల్లరిమూకలు దాడి చేసిన సంగతి తెలిసిందే. కాగా తూర్పు ఢిల్లీ నుంచి బీజేపీ ఎంపీగా గెలిచిన గంభీర్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. నరేంద్ర మోదీ సబ్కా సాత్ , సబ్కా వికాస్, సబ్ కా విశ్వాస్‌తో తనకు లౌకికవాదంపై ఆలోచనలు పుట్టుకొచ్చాయని పేర్కొన్నారు. ఇకపై కులం, మతం పేరిట జరిగే దాడులన్నింటిపై గళమెత్తుతానని ట్విటర్ వేదికగా స్పష్టం చేశారు. అయితే హిందుత్వవాదులకు ఇది రుచించలేదు. దీంతో సోషల్ మీడియా వేదికగా గంభీర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ నెటిజన్ అయితే బీజేపీలో జేఎన్‌యూ గ్రూప్ నాటిన మొక్క గంభీర్ అని ఘాటుగా ట్వీట్ చేశాడు. ‘గౌతం గంభీర్ ఇప్పుడు సూడో సెక్యూలరిస్ట్, హిందూత్వ వ్యతిరేకుల ప్రియతమ నేత. సిగ్గుండాలి గంభీర్.. మధురులో 20 మంది ముస్లింలు ఒక హిందువును చంపినప్పుడు ఎక్కడికి పోయావు. అప్పుడెందుకు ట్వీట్ చేయలేదు. ఇవన్నీ చూస్తుంటే మిమ్మల్ని బీజేపీలో జేఎన్‌యూ నాటిన మొక్కగా అనిపిస్తుంది’ అని పేర్కొన్నాడు. ఈ ట్వీట్‌ను సిద్దార్థ్ రీట్వీట్ చేస్తూ.. ‘ హహ.. గంభీర్ భాయ్ ఇది నిజమా? అతి దేశభక్తులు మిమ్మల్ని జేఎన్‌యూ గ్రూప్ బీజేపీలో నాటిన మొక్క అంటున్నారు. నూతన భారత్ కోసం మీ గుండె, వెన్నుముక చూపినప్పుడు ఇలాంటివి జరుగడం మాములే. ఆల్‌దిబెస్ట్’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. Haha! @GautamGambhir bhai, according to these hyper patriots, you've been planted by #JNU group in #BJP. This is what happens when you show a spine or a heart in #NewIndia. All the best! https://t.co/E1w6dT1c8w — Siddharth (@Actor_Siddharth) May 28, 2019 ఇక గంభీర్ తీరును బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ సైతం తప్పుబట్టాడు.‘ ఓ వర్గంలో పాపులర్ అయ్యేందుకు కొంతమంది పన్నిన కుట్రలో చిక్కుకోవద్దు. మీరు ప్రకటనలు చేయాల్సిన పనిలేదు. మీరు చేసే పనులే మాట్లాడతాయి’ అంటూ ట్వీట్ చేశాడు. -
మూకదాడిపై గంభీర్ ఆగ్రహం!
న్యూఢిల్లీ : జై శ్రీరాం అనాలంటూ ఓ ముస్లిం యువకుడిపై గురుగ్రామ్‌లో అల్లరిమూకలు చేసిన దాడిపై బీజేపీ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఈ ఘటనపై ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. ‘టోపీ తీయమని, జైశ్రీరాం నినాదం చేయమని అల్లరి మూకలు జరిపిన దాడి అత్యంత దారుణం. గురుగ్రామ్ అధికారులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. మనమంతా సెక్యులర్ దేశంలో బతుకుతున్నాం. నరేంద్రమోదీ మంత్రం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్‌తో నాకు సెక్యులరిజంపై ఆలోచనలు పుట్టుకొచ్చాయి. ఒక్క గురుగ్రామ్ ఘటనపై మాత్రమే కాదు.. కులం, మతం పేరిట జరిగే దాడులన్నిటిపై నేను గళం ఎత్తుతా’ అని ట్వీట్ చేశారు. నమాజ్‌కు వెళ్లివస్తున్న మహ్మద్ బార్కర్ అలామ్ (25)పై టోపీ ధరించాడని, జైశ్రీరాం అనలేదని నలుగురు దుండగులు దాడి చేశారు. బిహార్‌కు చెందిన అలామ్.. హర్యానాలోని గురుగ్రామ్‌లో నివాసం ఉంటున్నాడు. ఆదివారం ఈ ఘటన చోటుచేసుకోగా.. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇక తూర్పు ఢిల్లీ నుంచి గంభీర్ బీజేపీ తరఫున తొలిసారి ఎంపీగా ఎన్నికైన విషయం తెలిసిందే. చదవండి: ‘జైశ్రీరాం’ అనాలని చితక్కొట్టారు! “In Gurugram Muslim man told to remove skullcap,chant Jai Shri Ram”. It is deplorable. Exemplary action needed by Gurugram authorities. We are a secular nation where @Javedakhtarjadu writes “ओ पालन हारे, निर्गुण और न्यारे” & @RakeyshOmMehra gave us d song “अर्ज़ियाँ” in Delhi 6. — Gautam Gambhir (@GautamGambhir) May 27, 2019 My thoughts on secularism emanate from honourable PM Mr Modi’s mantra “सबका साथ, सबका विकास, सब का विश्वास”. I am not limiting myself to Gurugram incident alone, any oppression based on caste/religion is deplorable. Tolerance & inclusive growth is what idea of India is based on. — Gautam Gambhir (@GautamGambhir) May 27, 2019 -
‘జైశ్రీరాం’ అనాలని చితక్కొట్టారు!
గురుగ్రామ్ : జైశ్రీరాం నినాదం చేయాలని గుర్తు తెలియని నలుగురు యువకులు టోపీ ధరించిన ఓ ముస్లిం యువకుడిపై దాడి చేశారు. ఆదివారం హర్యానా, గురుగ్రామ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడు బిహార్‌కు చెందిన మహ్మద్ బార్కర్ అలామ్ (25).. గురుగ్రామ్‌లోని జకోబ్పురాలో నివాసం ఉంటున్నాడు. టోపీ ధరించిన అలామ్ ఆదివారం సదార్ బజార్ గల్లీలో నడుచుకుంటూ వెళ్తుండగా నలుగురు యువకులు అడ్డుకున్నారు. టోపి ధరించడంపై అభ్యంతరం తెలిపారు. ఈ ప్రాంతంలో టోపీలుపెట్టుకోవడం నిషిద్దమని, టోపీ తీసేసీ చేయిచేసుకున్నారు. భారత్‌మతాకీ జై అని నినాదాలు చేయమని బలవంతం పెట్టగా.. అలామ్ వారు చెప్పినట్లు నినాదాలు చేశాడు. అంతటి ఆగని నిందితులు.. జై శ్రీరాం అనాలని గద్దించారు. దీనికి అలామ్ ఒప్పుకోకపోవడంతో తీవ్రంగా కొట్టారు. రోడ్డుపై లాక్కెళ్లి మరి చితకబాదారు. ఏడ్చుకుంటూ సాయం చేయాలని వేడుకున్నానని, చివరకు తన కమ్యూనిటికి చెందిన వారు రావడంతో దుండగులు పరారయ్యారని అలామ్ తెలిపాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసిన అలామ్.. నమాజ్‌కు వెళ్లి ఇంటికి వస్తుండగా ఈ దాడి జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దుండగులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. -
వీడియో తీసి.. శభాష్ అనిపించుకుంది..:?
గురుగ్రామ్: హోలీ పండుగ రోజున హరియాణాలోని గురుగ్రామ్‌లో ఓ ముస్లిం కుటుంబంపై దాదాపు 25 మంది దుండగులు దాడి చేసిన సంగతి తెలిసిందే. యూపీలోని భాగ్‌పట్ జిల్లాకు చెందిన సాజిద్‌తో సహా అతని కుటుంబ సభ్యులు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మొత్తం సెల్ఫోన్లో చిత్రీకరించడం.. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. సాజిద్ కుటుంబానికి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. నిందితులను పట్టుకోవడానికి పోలీసులకు ఈ వీడియో సాయపడింది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకూ మహేశ్ కుమార్(24) అనే నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చినట్లు ఏసీపీ దినేశ్ శర్మ తెలిపారు. పరారీలో ఉన్న మిగతా వారి కోసం గాలిస్తున్నామన్నారు. మరోవైపు ఈ దాడికి పాల్పడిన దుండగుల్ని ఆదివారంలోగా అరెస్ట్ చేసి చర్యలు తీసుకోకపోతే పోలీస్ కమిషనర్‌ను ఆశ్రయిస్తామని ముస్లిమ్ ఏక్తా మంచ్ హెచ్చరించింది. (క్రికెట్ ఆడొద్దంటూ దాడి.. ఇక ఇక్కడ ఉండలేం..!) ఇక ఈ ఘటన మొత్తాన్ని సెల్ఫోన్లో చిత్రికరించిన సాజిద్ మేనకోడలు దానిష్ఠ సిద్దిఖీ (21)పై ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తోంది. దుండగులు తనవారిపై అకారణంగా దాడికి దిగుతున్న క్రమంలో ఆమె చాకచక్యంగా వ్యవహరించారు. కిందకి వెళ్లి అపాయంలో చిక్కుకోకుండా ధైర్యం కూడదీసుకుని.. తన తండ్రి సూచన మేరకు తతంగం మొత్తాన్ని సెల్పోన్లో చిత్రీకరించారు. ఇది గమనించిన దుండగులు దుర్భాషలాడుతూ ఆమెవైపు దూసుకొచ్చినా వెరవలేదు. ‘ఘటన జరిగిన సమయంలో నేను వంటగదిలో ఉన్నాను. కిందనుంచి పెద్దపెట్టున అరుపులు, కేకలు వినపించడంతో బయటికొచ్చి చూశాను. అప్పటికే మామయ్య కుటుంబ సభ్యులు, నా సోదరులపై దుండగులు కర్రలు, రాడ్లతో దాడి చేస్తున్నారు. ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రావొద్దంటూ మామయ్య హెచ్చరించాడు. దుండగుల్లో ఒకడు.. ‘మీరంతా పాకిస్తాన్ వాళ్లారా..?’ అంటూ బూతులు తిడుతున్నాడు. ఈ దౌర్జన్యకాండ 30 నిముషాలపాటు కొనసాగింది. దివ్యాంగుడైన నాన్నా, నేను టెర్రస్‌పైకి వెళ్లాం. తండ్రి సూచన మేరకు సెల్‌ఫోన్ తీసుకొచ్చి ఘటన మొత్తాన్ని వీడియో తీశాను’ అని దానిష్ఠ చెప్పారు. -
పాకిస్తాన్ వెళ్లిపోండి .. ఇక ఇక్కడ ఉండలేం..!
గురుగ్రామ్ : క్రికెట్ ఆడుతున్న ముస్లిం కుటుంబంపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి దిగిన సంగతి తెలిసిందే. ‘ఇక్కడ క్రికెట్ ఆడొద్దు. కావాలంటే పాకిస్తాన్ వెళ్లి ఆడుకోండి’ అంటూ సాజిద్ కుటుంబాన్ని హెచ్చరించడంతో పాటు కర్రలు, రాడ్లతో దాడికి దిగారు. గురుగ్రామ్‌లో హోలీ (గురువారం) రోజున ఈ ఘటన జరిగింది. సాజిద్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. అకారణంగా తమపై దాడి జరిగిందని, ఇక ఎంతమాత్రం ఇక్కడ ఉండలేమని సాజిద్ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘మా సొంతూరికి లేదా ఢిల్లీకి వెళ్లిపోదాం అనుకుంటున్నాం. అకారణంగా మాపై విచక్షణారహితంగా దాడి చేశారు. మాకు మద్దతుగా మాట్లాడానికి ఇక్కవ మాకెవరూ లేరు. చుట్టుపక్కల వారు న్యాయం మాట్లాడడానికి ముందుకురావడం లేదు. ఈ ఇల్లు నా కళ. కష్టార్జితంతో కట్టుకున్నా. అయినప్పటికీ ఇక ఇక్కడ ఉండాలనుకోవడం లేదు’ అని సాజిద్ వాపోయాడు. గురుగ్రామ్‌లోని గోస్లాలో ఆయన ఫర్నిచర్ రిపేర్ దుకాణం నిర్వహిస్తున్నాడు. (‘క్రికెట్ ఆపెయ్యండి .. కావాలంటే పాకిస్తాన్ వెళ్లిపోండి’) ‘మా ఇంటిని ఆనుకుని ఉన్న ఫ్లాట్ ఆవరణలో క్రికెట్ ఆడుతున్నాం. అక్కడికి కొందరు యువకులు వచ్చారు. ఇక్కడేం చేస్తున్నారు. ఆటలు ఆపండి. కావాలంటే పాకిస్తాన్ వెళ్లి ఆడుకోండి అని హెచ్చరించారు. మామయ్య వారితో మాట్లాడుతుండగానే ఆయనపై దాడికి దిగారు’ అని సాజిద్ మేనల్లుడు దిల్షాద్ చెప్పాడు. హోలీ సందర్భంగా మామయ్య ఇంటికి వస్తే ఇంతటి ఘోరం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తొలుత సాజిద్‌పై దాడి చేసిన దుండగులు అనంతరం మరికొంతమందితో కలిసి కర్రలు, రాడ్లతో వారి ఇంట్లోకి చొరబడి మరలా దాడికి దిగారు. సాజిద్ కుటుంబ సభ్యులను చితకబాదారు. ఫర్నీచర్, బంగ్లా అద్దాలు ధ్వంసం చేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. దాడిని ఖండిస్తూ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ ట్వీట్ చేశారు. ఇదిలాఉండగా.. తమపై దాడిచేసిన వారెవరూ స్ధానికులు కాదని, వారిని ఆ ప్రాంతంలో ఎప్పుడూ చూడలేదని సాజిద్ తెలిపారు. ‘మా వాళ్లను కొట్టొద్దని కాళ్లావేళ్లా పడి బతిమాలినా ఎవరూ కనికరించలేదు. కర్రలు, రాడ్లతో తీవ్రంగా కొట్టారు. వాళ్లను అడ్డుకునే క్రమంలో నా భుజం, మోకాలు భాగంలో గాయాలయ్యాయి’ అని సాజిద్ భార్య సమీరా చెప్పారు. భోండ్సీ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. Every Patriotic Indian is disgusted by the video of a family in #Gurugram being mercilessly beaten by hooligans. The RSS/ BJP channelises bigotry & hatred for political power. This incident serves as a warning of the dangerous consequences & the dark side of that strategy. — Rahul Gandhi (@RahulGandhi) March 23, 2019 -
‘మోదీ హిట్లర్ దారిలో నడుస్తున్నాడు’
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీని నాజీల నియంత హిట్లర్‌తో పోలుస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. గురుగ్రామ్‌లో హోలీ పండుగ నాడు క్రికెట్ ఆడిన ఓ ముస్లిం కుటుంబంపై మూక దాడి జరిగిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడయాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన కేజ్రీవాల్ ‘అధికారం కోసం మోదీ హిట్లర్ సిద్ధాంతాలను పాటిస్తున్నారు. కానీ అది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో ఆయన అనుచరులకు అర్థం కావడం లేదు. ఇలాంటి దాడులు చేయాలని ఏ గీత చెబుతుంది? ఏ రామాయణంలో రాసుంది?’ అంటూ ట్వీట్ చేశారు. హోలీ పండుగ నాడు గురుగ్రామ్‌కు చెందిన సాజిద్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులు తమ ఇంటి ఆవరణలో క్రికెట్ ఆడుతుండగా.. గుర్తు తెలియని ఓ 20 మంది వ్యక్తులు వచ్చి వారిపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ‘క్రికెట్ ఆడాలంటే పాకిస్తాన్ వెళ్లండి.. ఇక్కడ ఆటలాడకుడదంటూ బెదిరించారు. ఇందుకు సంబంధించిన మీడియా సోషల్ మీడియాలో వైరలయ్యింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేసి హత్యాయత్నం కేసు నమోదు చేశారు. -
మీ నాన్న ఓ జవాన్.. నువ్వేమో దేశ ద్రోహి..
కోల్‌కతా : ‘దేశద్రోహి చర్యలకు పాల్పడుతున్న నీ కొడుకును బయటకు తీసుకురా..’ అంటూ కొంతమంది యువకులు.. పుల్వామా ఉగ్రదాడికి అనుకూలంగా పోస్టులు పెట్టిన ఓ టీనేజర్ ఇంటిపై దాడి చేశారు. ‘మీ నాన్నేమో బీఎస్ఎఫ్లో జవానుగా పనిచేస్తుంటే.. నువ్వేమో దేశ ద్రోహ చర్యలకు పాల్పడతావా?’ అంటూ చెంప చెళ్లుమనిపించారు. అంతటితో ఆగకుండా భారత జెండాను చేతపట్టించి నడివీధుల్లో ఊరేగించారు. భారత్ మతాకీ జై.. పాకిస్తాన్ ముర్తాబాద్ అని చెప్పించారు. పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకున్నఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. పుల్వామా ఉగ్రదాడి అనంతరం పశ్చిమ బెంగాల్లో ఈ తరహా మూక దాడులు పేట్రేగిపోతున్నాయి. ‘ఓ దేశ ద్రోహి ఇంటి ముందు మేమున్నాం’ అనే క్యాప్షన్‌తో సర్బజిత్ సాహా అనే వ్యక్తి ఈ వీడియోను పోస్ట్ చేశారు. వీడియో ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌లోని కుచ్‌బెహార్ పట్టణానికి చెందిన అనిక్ దాస్(22) అనే విద్యార్థి.. పుల్వామా దాడి నేపథ్యంలో భారత్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్చేశాడు. ఈ కామెంట్స్‌ను నిరసిస్తూ కొంత మంది యువకులు అతని ఇంటిని చుట్టుముట్టారు. వీడియో స్పష్టంగా లేనప్పటికి ఆ యువకుని తల్లి కూడా అతని చెంప పగలగొట్టినట్లు తెలుస్తోంది. అందులో ఒకరు మీ నాన్న బీఎస్ఎఫ్లో పనిచేస్తుంటే నువ్వేమో దేశ ద్రోహిగా పెరుగుతావా? అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరికొంత మంది భారత ఆర్మీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన దేశద్రోహి.. నీ కొడుకు బయటకు తీసుకురా? అన్న స్లోగన్స్ వినబడుతున్నాయి. ‘నేను ఎవ్వరికి మద్దతు తెలపడంలేదు అంతే కానీ దేశద్రోహిని కాదు..’ అని ఆ టీనేజర్ వారితో అన్న మాటలు, దీనికి ఎందుకు నీ దేశాన్ని ప్రేమించవని సదరు యువకులు అడిగినట్లు స్పష్టం అవుతోంది. అతన్ని బలవంతంగా ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చి భారత ఆర్మీ జిందాబాద్, పాకిస్తాన్ ముర్తాబాద్ స్లోగన్స్ చెప్పించిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరో ఘటనలో ఓ టీచర్‌కు ఈ మూక సెగ తగిలింది. నార్త్ 24 పరగణాలలోని బోన్‌గాన్‌కు చెందిన స్థానిక టీచర్ ఇంటిపై మరో మూక గ్యాంగ్ దాడి చేసింది. అతను పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన జవాన్లకు martyr అనే పదం ఎందుకు వాడుతున్నారని సోషల్ మీడియాలో ప్రశ్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. కానీ సదరు టీచర్ మాత్రం తాను అడిగిన సందర్భం వేరని, అనవసరంగా ఈ వివాదానికి అంటగట్టి ఇబ్బందులకు గుర్తిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను భారతీయుణ్ణేనని, తన దేశభక్తిని శంకించడం ఎందుకని అసహనం వ్యక్తం చేశారు. ఇక ఈ దాడులన్నీ బీజేపీ, ఆర్ఎస్సెస్లు చేస్తున్నవేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. -
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కారుపై దాడి
-
కోళ్లు దొంగతనం చేశాడన్న అనుమానంతో..!
-
మైనారిటీలతో ఎలా ఉండాలో మోదీకి చూపిస్తాం
లాహోర్: మైనారిటీలతో ఎలా మెలగాలో మోదీ ప్రభుత్వానికి చూపెడతామని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అన్నారు. మూకహింసపై బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇమ్రాన్ స్పందించారు. మైనారిటీలకు హక్కులన్నీ దక్కేలా చర్యలు తీసుకుంటున్నామని, దేశ వ్యవస్థాపకుడు మహ్మద్ అలీ జిన్నా దార్శనికత కూడా ఇదేనన్నారు. çశనివారం లాహోర్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘మైనారిటీలతో ఎలా మెలగాలో మోదీ ప్రభుత్వానికి మేము చూపిస్తాం. భారత్‌లో మైనారిటీలను ఇతర పౌరులతో సమానంగా చూడంలేదని అందరూ అంటున్నారు. బలహీన వర్గాలకు అన్యాయం జరిగితే, అది తిరుగుబాటుకు దారితీస్తుంది’ అని ఇమ్రాన్ అన్నారు. పోలీసు హత్య కన్నా ఆవు చనిపోతేనే ప్రాధాన్యమిస్తున్నారని బులంద్‌షహర్ హింసను ఉద్దేశించిన షా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
వాట్సాప్‌లో కామెంట్లు.. అంతలోనే..
ఔరంగాబాద్ : ఓవైపు వాట్సాప్‌లో నకిలీ వార్తలతో అమాయకులపై దాడులు జరుగుతోంటే.. మరోవైపు నువ్వెంత అంటే నువ్వెంత అని కయ్యానికి కాలు దువ్విన ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాలు.. రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా పనిచేసే మోయిన్ మెహమూద్ పఠాన్ (35)పై దాదాపు 20 మంది వ్యక్తులు కత్తులు, తల్వార్లతో మూక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన హర్సూల్ ప్రాంతంలోని ఫాతిమానగర్‌లో జరిగింది. తీవ్ర గాయాలపాలైన పఠాన్‌ను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతిచెందినట్టు ఆస్పత్రివర్గాలు తెలిపాయి. రెండు వర్గాల మధ్య మాటల యుద్ధమే ఈ హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఆదివారం సాంయత్రం వాట్సాప్‌లో పఠాన్ చేసిన కామెంట్లు ప్రత్యర్థి వర్గాన్ని ఈ దాడికి ఉసిగొల్పాయని అంటున్నారు. దమ్ముంటే తనతో తేల్చుకోవాలని పఠాన్ చాలెంజ్ చేసినట్టు తెలుస్తోంది. కొన్ని గంటల వ్యవధిలోనే.. వాట్సాప్‌లో రెచ్చగొట్టే కామెంట్లు చేసిన కొన్ని గంటల్లోనే దాదాపు 20 మంది సమూహం పఠాన్‌పై దాడి చేసిందని ఆయన మేనల్లుడు ఇర్ఫాన్ షైక్ తెలిపాడు. తన మామపై జరుగుతున్న దాడిని అడ్డుకోబోయినందుకు ఇర్ఫాన్‌ను కూడా తీవ్రంగా గాయపరిచారు. ప్రస్తుతం ఇర్ఫాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, ఘటనతో ప్రమేయమున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. మిగతా వారికోసం గాలింపు చర్యలు ముమ్మురం చేశామని వెల్లడించారు. -
‘ఇది జంగిల్ రాజ్యం.. ఇక్కడ బడే పదిలం’
పాట్నా : వసతి గృహం గోడలపై పిచ్చి రాతలు రాస్తున్న యువకునికి బుద్ది చెప్పిన బాలికలపై దాదాపు 20 మంది యువకులు దాడి చేసిన సంఘటన తెలిసిందే. బిహార్‌లో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై నితీష్ కుమార్ ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో వసతి గృహంపై దాడిని ఖండస్తూ.. సదరు బాలికలకు తన మద్దతును తెలియజేస్తూ మర్య శకిల్ అనే యువతి ఓ లేఖను విడుదల చేశారు. దీనిలో ఆమె ‘మీరంతా సాధికారత సాధించినట్లు నేను భావిస్తున్నాను. మీ సైకిల్లు కార్లు, బస్సులతో పోటీ పడుతూ బిహార్ వీధుల వెంట పరుగు తీసేవి. మీ కళ్లలో ప్రపంచాన్ని జయిస్తాం అనే ధీమా కన్పించేది. ప్రతి ఒక్కరికి చదుకునే హక్కుంది. కానీ మా లాంటి తల్లులే ఆడపిల్లలకు చదువేందుకు అని ఆలోచిస్తుంటా. కానీ ఈ రోజు జరిగిన ఓ సంఘటన మీ సైకిల్ని రివర్స్ చేసింది. రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న మీ వసతి గృహం మీద ఓ పిచ్చి మూక విచాక్షణారహితంగా దాడి చేసింది. మీలో ఓ 30 మంది ఆస్పత్రి పాలయ్యారు’ అన్నారు. ఇంకా కొనసాగిస్తూ.. ‘ఇదంతా ఎందుకు జరిగింది.. ఎందుకంటే మిమ్మల్ని వేధించే వారి మీద మీరు తిరగబడ్డారు. మీ పాఠశాలలో జరిగిన సంఘటన ఒక్కటి చాలు రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం అవ్వడానికి. ఇక్కడ స్త్రీ స్వేచ్ఛకు, సాధికారతకు ఒక రకమైన తప్పుడు సరిహద్దులను నిర్ణయించారు. కానీ మీరు భయపడకండి.. పాఠశాలే మీకు అత్యంత సురక్షితమైన తావు. ఇక్కడ మిమ్మల్ని కాపాడటానికి టీచర్లు, ప్రిన్సిపాల్ ఉన్నారు. వసతి గృహం మీద దాడి కానీ, ముజఫర్‌పూర్ షెల్టర్ హోం లో జరిగిన అకృత్యాల గురించి కానీ నితీష్ కుమార్ ప్రభుత్వం కనీసం స్పందించలేదు. దీని బట్టే ఈ ప్రభుత్వం మహిళల భద్రత పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో తెలుస్తుంది’ అన్నారు. అంతేకాక ‘భూస్వామ్య వ్యవస్థ వేళ్లునుకుపోయిన బిహార్ రాష్ట్రంలో మహిళలు మద్యపాన నిషేదాన్ని సమర్థించడం జరిగింది. ఇప్పుడిప్పుడే నా రాష్ట్రంలో సాంఘీక సంస్కరణలు చోటుచేసుకుంటున్నాయి. ఇది సంతోషకర పరిణామం. ఇక మీదట బిహార్ సీఎం సైకిల్లను ఇవ్వడం ఆపి మహిళల భద్రత, రక్షణల గురించి ఆలోచిస్తే మంచిది. బిహార్ మహిళలు కులానికి అతీతంగా ఓ తటస్థ వర్గంగా మారుతున్నారు. వారు తమ హృదయంతో ఆలోచించడం ప్రారంభిస్తున్నారు. ఇప్పటికి కూడా బిహార్ ఓ జంగిల్ రాజ్యమే. ఇక్కడ స్కూల్ తప్ప మరేది సురక్షితం కాదు. జరిగిన సంఘటనలతో మీరు ధైర్యాన్ని కోల్పోకండి. ఇలాంటి సంఘటనల వల్లే మనలోని ధైర్యం బయటకు వస్తుంది. మిమ్మల్నందరిని చూస్తుంటే నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. మహిళలకు గౌరవం ఇవ్వని పురుషులతో ఇలాగే ప్రవర్తించాలి. మీరంతా మీ జీవితాల్లో ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ మీ మర్య శకిల్’ అంటూ ముగించారు. -
గోడలపై పిచ్చిరాతలు.. 30 మంది బాలికలపై దాడి
పట్నా : ప్రభుత్వ బాలికల వసతి గృహంపై మూకుమ్మడి దాడి జరిగింది. 20 మందికి పైగా యువకులు కర్రలతో బాలికల హాస్టల్‌పై దాడిచేశారు. 30 బాలికలను తీవ్రంగా గాయపరిచి వారిపై లైంగిక దాడికి యత్నించారు. ఈ ఘటన బిహార్‌లోని సుపౌల్ జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు.. సమీప గ్రామంలోని కొందరు యువకులు హాస్టల్ గోడలపై అశ్లీల రాతలు రాస్తున్నారు. విద్యార్థినిలు విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. హాస్టల్ గోడలపై అభ్యంతరకర రాతలు రాస్తున్న ఓ యువకుడికి బాలికలు శనివారం దేహశుద్ధి చేశారు. బాలికల దాడికి ప్రతీకారంగా ఆ గ్రామంలోని 20 మందికి పైగా యువకులు హాస్టల్‌పై దాడికి దిగారు. ప్లే గ్రౌండ్లో ఆడుకుంటున్న సమయంలో 30 మంది బాలికలను కర్రలతో చావబాదారు. వారిపై లైంగిక దాడికి యత్నించారు. దాదాపు గంటపాటు పిల్లలను చిత్రవధ చేశారని హాస్టల్ వార్డెన్ రయీమా రాజ్ తెలిపారు. స్కూల్లోని వస్తువులను కూడా ధ్వంసం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఘటన గురించి తెలుసుకున్న స్థానిక నాయకులు గాయపడిన బాలికలను ప్రాథమిక ఆస్పత్రికి తరలించారు. కాగా, బిహార్‌లో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై నితీష్‌కుమార్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని నెలల క్రితం ముజఫర్‌పూర్‌లోని ఓ ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో 34 మంది బాలికలు లైంగిక దాడికి గురైన ఘటన.. విద్య పేరుతో గయలో 15 మంది బాలురపై లైంగిక దాడికి యత్నించిన బౌద్ధ గురువు ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. -
చెట్టుకు కట్టేసి..దారుణంగా కొట్టారు..
-
చెట్టుకు కట్టేసి..దారుణంగా కొట్టారు..
సాక్షి, బెంగళూర్ : మతిస్ధిమితం లేని వ్యక్తిని పిల్లల్ని ఎత్తుకెళ్లేవాడిగా అనుమానిస్తూ కొందరు చితకబాదిన ఘటన చోటుచేసుకుంది. ఒడిషాకు చెందిన ఓ వ్యక్తిని వైట్‌ఫీల్డ్‌కు సమీపంలో స్ధానికులు గుర్తించి పిల్లల్ని అపహరించేందుకు వచ్చాడని భావిస్తూ దాడికి దిగారు. ఆ వ్యక్తిని చెట్టుకు తాడుతో కట్టి దారుణంగా కొట్టారు. వ్యక్తిని చితకబాదుతూ తలపై గట్టిగా కొడుతున్న వీడియో వెలుగులోకి వచ్చింది. ఐడీ కార్డు చూపాలని అతడిని హిందీలో ఓ వ్యక్తి అడగడంకనిపించింది. మరికొందరు బాధితుడిని గేలి చేస్తూ బిగ్గరగా నవ్వుతూ వీడియోలో కనిపించారు. స్ధానికుల దాడి నుంచి వ్యక్తిని కాపాడిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా రెండు నెలల కిందట ఉత్తర కర్ణాటకలో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను పిల్లలను కిడ్నాప్ చేసే వ్యక్తిగా అనుమానిస్తూ స్ధానికులు చావబాదిన ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో వదంతుల ఆధారంగా మూక హత్యలు, దాడులను నిరోధించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని గత నెలలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. -
హిందువుపైనే గోరక్షకుల దాడి!
లక్నో: ఒక వైపు మూక దాడుల పట్ల కఠినంగా వ్యవహరించాలని సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించినా అలాంటి ఘటనలు ఆగడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఓ హిందువుపైనే మూక దాడి చోటు చేసుకుంది. బ్రాహ్మణుడైన ఓ వృద్ధుడు తన ఆవును ముస్లింలకు అమ్ముతున్నాడనే అనుమానంతో గోరక్షకులు అతనిపై దాడి చేశారు. ఈ ఘటన బల్రాంపుర్ జిల్లాలోని లక్ష్మణ్పూర్లో గత ఆగస్టు 31న చోటు చేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన కైలాష్ నాథ్ శుక్లా(70) అనే బ్రాహ్మణ వృద్దుడు ఆనారోగ్యంతో బాధపడుతున్న తన ఆవును సమీప గ్రామంలోని వెటర్నరీ డాక్టర్ తీసుకెళ్తున్నాడు. దారి మధ్యలో గోరక్షకుల పేరిట ఓ మూక అతన్ని చుట్టుముట్టింది. తాను హిందువునని, బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడనని చెప్పినా పట్టించుకోకుండా కొంత మంది అతనిపై దాడి చేశారు. అంతేకాకుండా అతని మొహానికి మసి పూసి కొట్టుకుంటూ ఉరేగించారు. ఎవరైనా ఆవులను అమ్మినా, వాటిని బాధపెట్టినా వారికి ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. అనంతరం ఆ వృద్ధుడు పోలీసులను ఆశ్రయించాడు. తొలుత అతని ఫిర్యాదును పోలీసులు తీసుకోలేదు. అనంతరం ఈ ఘటన గురించి స్వయంగా తెలుసుకున్న జిల్లా ఎస్పీ రాజేశ్ కుమార్ విచారణకు ఆదేశించారు. దీంతో పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదు తీసుకోని అధికారిపై కూడా చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. ప్రస్తుతం ఆ వృద్ధుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. -
రాపూర్ పోలీస్‌స్టేషన్ దాడి కేసులో పురోగతి
-
హిందూ అమ్మాయితో ముస్లిం యువకుడు..
లక్నో: ఉత్తరప్రదేశ్, తెహ్రీ జిల్లా గన్సాలీలో సోమవారం హింసాత్మక ఘటనలు చెలరేగాయి. ఓ 18 ఏళ్ల ముస్లిం యువకుడు ఓ మైనర్ హిందూ బాలికతో హోటల్లో కనిపించడం ఉద్రిక్తతకు దారితీసింది. హిందూ సామాజిక వర్గానికి చెందిన కొందరు ఆ యువకుడిని చితక్కొట్టారు. చెప్పులు మెడలో వేసి ఉరేగించారు. అంతటితో ఆగకుండా మైనార్టీలకు సంబంధించిన షాప్‌లపై దాడి చేసి ధ్వంసం చేశారు. దీంతో అక్కడ పరిస్థితి అదుపు తప్పింది. బిజ్నోర్ జిల్లాకు చెందిన ఆ యువకుడు సెలూన్ షాప్‌లో బార్బర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం స్థానికంగా ఉండే కొందరు యువకులు అమ్మాయితో సహా ఆ యువకున్ని హోటల్లో ఉండటాన్ని చూసి పట్టుకున్నారు. ఆ వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. వారు వచ్చేలోపే అతనిపై దాడి చేశారు. పోలీసులు వారి నుంచి అతన్ని విడిపించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. యువకుడిపై కేసు నమోదు చేశామని, ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని చట్టాన్నిచేతుల్లోకి తీసుకున్న ఎవరిని వదిలిపెట్టమని పోలీసులు మీడియాకు తెలిపారు. యువకునికి వైద్య పరీక్షలు నిర్వహించామని అతని గాయాలు అంత తీవ్రమైనవి కావని పేర్కొన్నారు. ఈ ఘటనలో 10 నుంచి 12 షాప్‌లు ధ్వంసమయ్యాయని, ఆ ప్రాంతాన్ని మొత్తం పోలీసుల ఆధీనంలోకి తీసుకున్నట్లు సీనియర్ ఎస్సీ జోగిందర్ సింగ్ రావత్ తెలిపారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని సుప్రీం హెచ్చరించినా ఇలాంటి ఘటనలు ఆగడం లేదు. -
బీదర్‌లో కిరాతకం.. హైదరాబాదీలపై వందమంది దాడి!
సాక్షి, బీదర్ : కర్ణాటకలోని బీదర్‌లో దారుణం చోటుచేసుకుంది. పిల్లలను ఎత్తుకెళ్లే కిడ్నాపర్లనే అనుమానంతో హైదరాబాదీలపై స్థానికులు దాడి చేశారు. ఈ దాడిలో ఓ వ్యక్తి మృతిచెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బీదర్ జిల్లా ఔరాద్ తాలూకా ముర్కీ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ ఆజాం మృతిచెందగా.. నగరానికి చెందిన తహ్లా ఇస్మాయిల్, మహమ్మద్ సల్మాన్ గాయపడ్డారు. ఔరాద్ తాలూకా హండికేరాకు చెందిన మహమ్మద్ బషీర్ పిలుపు మేరకు వీరు అతడి స్వగ్రామాన్ని సందర్శించేందుకు నగరం నుంచి వెళ్లారు. బషీర్ హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. వారు వాహనంలో హండికేరా వెళుతుండగా.. మార్గమధ్యంలో బాల్కూట్ తండా వద్ద అల్పాహారం తీసుకునేందుకు ఆగారు. ఈ సందర్భంగా ఇటీవల కతార్ నుంచి తిరిగివచ్చిన ఇస్మాయిల్ తాను తీసుకువచ్చిన చాక్లెట్లను స్థానిక బడి పిల్లలకు పంచినట్టు తెలుస్తోంది. వారు చేసిన ఈ మంచిపనే స్థానికులకు అనుమానం కలిగించినట్టు కనిపిస్తోంది. వాట్సాప్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాలో ఇటీవల హల్చల్ చేసిన వదంతులు, పుకార్ల నేపథ్యంలో వారు పిల్లల కిడ్నాపర్లు అని స్థానికులు అనుమానించారు. అంతే విచక్షణ కోల్పోయి.. సాటి మనుషులన్న కనికరం లేకుండా మహ్మద్ ఆజాం, అతని స్నేహితులపై దాడి చేశారు. బషీర్ వారికి నిజానిజాలు వివరించేందుకు ప్రయత్నించినా.. కోపోద్రిక్తులైన స్థానికులు పట్టించుకోలేదు. దీంతో అక్కడి నుంచి వారు కారులో తప్పించుకున్నప్పటికీ.. సమీపంలోని ముర్కీ గ్రామంవద్ద రోడ్డుకు అడ్డంగా చెట్టును పడేసి.. వారిని అడ్డుకున్నారు. వారిని కారులో నుంచి బయటకు లాక్కొచ్చి.. రాళ్లతో, కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో మహ్మద్ ఆజాం మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం వారిని హైదరాబాద్‌కు తరలించారు. విచక్షణ మరిచి దాదాపు 100 మంది స్థానికులు ఆటవికంగా ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో పోలీసులు 30మందిని అరెస్టు చేశారు. -
కర్ణాటక బీదర్ జిల్లా ఉద్గిర్లో దారుణం
-
దాష్టీకంపై పోలీసుల క్షమాపణలు
చచ్చిన జంతువులను కూడా ఇలా ఈడ్చుకెళ్లటం బహుశా ఎవరూ చూసి ఉండకపోవచ్చు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఓ వ్యక్తితో పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అయ్యాయి. బహిరంగంగా దొరికిపోవటంతో ఏం చేయాలో పాలుపోని యూపీ పోలీస్ శాఖ ఎట్టకేలకు క్షమాపణలు తెలియజేసింది. లక్నో: ఉత్తర ప్రదేశ్ హపూర్‌లో జరిగిన ఘటన సంచలనం సృష్టించింది. బుధవారం పిలఖువా సమీపంలో ఓ పశువుల కొట్టం దగ్గర బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తూ కిందపడ్డారు. అయితే వారు పశువుల దొంగతనానికే వచ్చారని అనుమానించిన స్థానికులు ఇష్టమొచ్చినట్లు చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితులను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఓ వ్యక్తి ప్రాణాలు విడిచాడు. మృతుడ్ని ఖాసిం(45)గా, గాయపడిన మరో వ్యక్తిని ఖాసిం బంధువు సమీయుద్దీన్(65)గా పోలీసులు గుర్తించారు. పోలీసుల తీరు... సమాచారం అందుకున్న ముగ్గురు అధికారులు ఘటన స్థలానికి వెళ్లి స్థానికులను చెదరగొట్టారు. ఆపై బాధితులను ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో వ్యవహరించిన తీరు తీవ్రవిమర్శలకు దారితీసింది. స్థానికులు ఖాసింపై దాడి చేస్తుంటే.. నీటి కోసం ప్రాధేయపడటం, అయినా వారు అతన్ని చావబాదటం, ఇంతలో పోలీసుల రంగ ప్రవేశం.. బాధితుడ్ని పోలీసుల సమక్షంలోనే చచ్చిన గొడ్డులా ఈడ్చుకెళ్లటం... ఆ వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో తీవ్ర దుమారం చెలరేగింది. పోలీసుల తీరును ఆక్షేపిస్తూ ముఖ్యమంత్రి, డీజీపీలకు చర్యలు తీసుకోవాల్సిందిగా వినతుల మీద వినతులు వెలువెత్తాయి. దీంతో యూపీ పోలీస్ శాఖ స్పందించింది. ‘ఆ సమయంలో ఆంబులెన్స్ అందుబాటులో లేదు. దీంతో ఏం చేయాలో తెలీక బాధితులను పోలీస్ వాహనంలోనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఘటనాస్థలం నుంచి వాహనం దాకా అలా తీసుకెళ్లామని అధికారులు వివరణ ఇచ్చారు. కానీ, ఇది చాలా సున్నితమైన అంశం. అధికారులు అలా వ్యవహరించాల్సింది కాదు. ముమ్మాటికీ తప్పే. అందుకు పోలీస్ శాఖ పశ్చాత్తాపం వ్యక్తం చేస్తోంది. ఆ అధికారులను బదిలీ చేసి, విచారణకు ఆదేశించాం’ అని డీజీపీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా, ఘటనకు సంబంధించి బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో 25 మందిపై కేసు నమోదు కాగా, ఇప్పటికే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. -
ముస్లిం యువకుడిని కాపాడినందుకు..
రామ్‌నగర్: అల్లరి మూకల నుంచి ముస్లిం యువకుడిని కాపాడి హీరోగా నిలిచిన ఉత్తరాఖండ్ పోలీసు అధికారి గగన్‌దీప్ సింగ్‌కు బెదిరింపులు వచ్చినట్టు బీబీసీ తెలిపింది. మే 22న 23 ఏళ్ల ఇర్ఫాన్ అనే యువకుడు 19 ఏళ్ల యువతితో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రామ్పూర్లోని ప్రముఖ గార్జియా దేవి ఆలయానికి వచ్చారు. ఆ సమయంలో కొంత మంది హిందూ కార్యకర్తలు ఇర్ఫాన్‌పై సాముహిక దాడికి పాల్పడ్డారు. అక్కడికి చేరుకున్న పోలీసుల వారి నుంచి యువకుడ్ని కాపాడే యత్నం చేశారు. వారి చేతుల్లో పిడిగుద్దులు తిన్న ఇర్ఫాన్ ఇన్స్పెక్టర్ గగన్‌దీప్‌ను గట్టిగా హత్తుకున్నాడు. వారి దాడి నుంచి యువకుడ్ని గగన్‌దీప్ రక్షించిన వీడియో, యువకుడ్ని హత్తుకుని కాపాడిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. గగన్‌దీప్‌ను ప్రసంశిస్తూ.. చాలా మంది ఆయన ఫొటోను షేర్ చేశారు. కానీ దాడికి గురైన ఆ యువకుడ్ని రక్షించినందుకు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఆయనకు బెదింపు కాల్స్ వచ్చినట్టు బీబీసీ వెల్లడించింది. అయితే ఈ వార్తలను గగన్‌దీప్ సింగ్ తోసిపుచ్చారు. తనకు ఎటువంటి బెదిరింపులు రాలేదని తెలిపారు. ప్రస్తుతం సెలవురోజును ఆస్వాదిస్తున్నాయని, బెదిరింపుల సమస్యే లేదని వివరణయిచ్చారు. ముస్లిం యువకుడిపై దాడిని కొంత మంది బీజేపీ నాయకులు బహిరంగంగా సమర్థించారు. హిందూ యువతిని తీసుకుని ముస్లిం యువకుడు తమ ఆలయానికి రావడం తప్పని స్థానిక బీజేపీ నేత రాకేశ్ నైన్వాల్ వ్యాఖ్యానించారు. ‘మేము మసీదుకు వెళ్లలేము. ఎందుకంటే మాకు అక్కడికి వెళ్లే హక్కు లేదు. అలాంటప్పుడు ఈ ముస్లిం యువకుడు మా ఆలయానికి ఎందుకు వెళ్లాడు? హిందూ సంస్కృతిని నాశనం చేయాలన్న ఉద్దేశంతోనే అతడు ఇలా చేశాడ’ని బీజేపీ ఎమ్మెల్యే రాజ్‌కుమార్ తుక్రాల్ అన్నారు. -
గో హంతకులనే అనుమానంతో దాడి
భోపాల్ : గో హంతకులనే అనుమానంతో గ్రామస్తులు జరిపిన దాడిలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సాత్నా జిల్లా అమ్‌గారాలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పూరానా బస్తీకి చెందిన రియాజ్, షకీల్‌లు కైమూర్ నుంచి తిరిగివస్తుండగా.. వారిని గో హంతకులుగా అనుమానించిన అమ్‌గారా గ్రామ యువకులు గ్రామంలోని ఇతరులకు ఫోన్ల ద్వారా సమాచారం ఇచ్చారు. దీంతో గ్రామంలోని వారంతా.. వారిపై ఒక్కసారిగా దాడికి దిగారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని పోలీసులు సాత్నా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ రియాజ్ చికిత్స పొందుతూ మరణించాడు. టైలర్‌గా పనిచేస్తున్న రియాజ్‌కు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. దీంతో సాత్నా జిల్లాలో ఉద్రిక్త పరిస్థతులు ఏర్పడ్డాయి. ఈ ఘటనపై షకీల్ పోలీసులను ఆశ్రయించాడు. తాము గో హంతకులం కాదని ఆయన వారికి తెలిపారు. తప్పుగా అర్థం చేసుకున్న అమ్‌గారా గ్రామ ప్రజలు తమపై దాడికి దిగినట్టు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనతో సంబంధం ఉందని భావిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు కూడా దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. రియాజ్, షకీల్‌పై తాము ఎలాంటి దాడి చేయలేదని.. ఆవులను ఎత్తుకెళ్లడానికి వచ్చిన వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా వారు కిందపడి గాయపడట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. -
డాషింగ్ క్రికెటర్ సెహ్వాగ్‌పై ప్రశంసలు
సాక్షి, న్యూఢిల్లీ: మైదానంలోనే కాదు సామాజిక అంశాల్లోనూ చురుకుగా ఉండే టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌పై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. అందుకు కారణంగా కేరళలో మతి స్థిమితం లేని ఆదివాసి మధు కుటుంబానికి ఆర్థిక సాయం చేయడమే. మధు తల్లికి లక్షా యాభైవేల రూపాయల చెక్ అందించి తనది పెద్ద మనసు అని నిరూపించుకున్నాడు. ఆహారం చోరీ చేశాడని ఆరోపిస్తూ ఆగ్రహించిన కొందరు యువకులు విచక్షణారహితంగా చేసిన దాడిలో తీవ్రంగా గాయపడ్డ మధు అనంతరం చనిపోయాడు. ఇటీవల మధు తల్లి మల్లి పేరుతో ఇండస్ ఇండ్ బ్యాంకు చెక్కు సెహ్వాగ్ అందించాడని, అతడి మనసు పెద్దదంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మైదానంలో బ్యాటింగ్‌లోనే కాదు.. బాధితులను ఆదుకోవడంలోనూ సెహ్వాగ్ ముందుంటాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మధు హత్య ఘటనలో పోలీసులు 16 మంది నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కాగా, ఉబెయిద్, హుస్సేన్, అబ్ధుల్ కరీం అని నిందితులలో కొందరు పేర్లను ఇటీవల తన ట్వీట్లో సెహ్వాగ్ ప్రస్తావించాడు. మధు హత్యపై స్పందిస్తూ.. 'మనం సిగ్గుతో తల దించుకోవాలి. ఈ ఘటనపై క్షమాపణ చెబుతున్నాను. ట్వీట్ మతానికి సంబంధించినది కాదు. హింసాత్మక ప్రవృత్తిలో ఐక్యంగా ఉంటున్నారు. శాంతంగా ఉండాలని' సెహ్వాగ్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. -
క్షమాపణలు చెప్పిన సెహ్వాగ్
సాక్షి, హైదరాబాద్ : ట్వీటర్లో ప్రతి అంశంపై తనదైన శైలిలో స్పందించే భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఓ ట్వీట్ విషయంలో క్షమాపణలు చెప్పాడు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మతిస్థిమితం లేని కేరళ ఆదివాసి హత్యపై ఈ డాషింగ్ ఓపెనర్ స్పందించిన విషయం తెలిసిందే. ఈ ఘటన పట్ల సిగ్గుతో తల దించుకుంటున్నానని శనివారం ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్లో ఉబెయిద్, హుస్సేన్, అబ్ధుల్ కరీం అని కొంత మంది నిందితుల పేర్లు ప్రస్తావించాడు. ఈ ట్వీట్ చేసిన 8 గంటలనంతరం 3వేల రిప్లేలొచ్చాయి. 16 మంది నిందుతుల్లో కేవలం ముస్లిం వర్గానికి చెందిన వారే కనిపించారా అని నెటిజన్లు సెహ్వాగ్‌ను ప్రశ్నించారు. ఈ కామెంట్లకు సెహ్వాగ్ క్షమాపణలు చెప్పాడు. ‘అసంపూర్తి సమాచారంతో నిందితుల అందరి పేర్లు ప్రస్తావించలేకపోయా. దీనికి బేషరతుగా క్షమాపణలు చెబుతున్నా. కానీ ట్వీట్ మతానికి సంబంధించినది కాదు. నిందితులు మతాల ద్వారా విభజించబడ్డారు. కానీ హింసాత్మక మనస్థత్వంలో ఐక్యంగానే ఉన్నారు. శాంతంగా ఉండండి అని ట్వీట్ చేశాడు. దొంగతనం చేశాడంటూ మధు అనే 27 ఏళ్ల మతిస్థిమితంలేని ఆదివాసిని స్థానికులు దారుణంగా కొట్టి చంపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటికే పోలీసులు 16 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై పలు మానవహక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. Non acceptance of a fault is itself a 2nd fault.I apologise I missed out on more names involved in this crime bcoz of incomplete info & sincerely apologise 4 it but the tweet is not communal at all.Killers r divided by religion but united by a violent mentality. May there b peace https://t.co/2ucRSInc96 — Virender Sehwag (@virendersehwag) 24 February 2018 -
మానవత్వం మంటగలిసిన వేళ..
సాక్షి, తిరువనంతపురం : కేరళలో మానవత్వం మంటగలిసింది. మానసిక వైకల్యం ఉన్న వ్యక్తిని దొంగతనానికి పాల్పడ్డాడనే కారణంతో దారుణంగా కొట్టారు. అలా కొడుతుంటే సాటి మనుషులుగా ఆపాల్సింది పోయి దాడి జరిగే సమయంలో సెల్ఫీలకోసం పోటీ పడ్డారు. వీరిలో అధికంగా యువకులే ఉన్నారు. ఓపక్క వారిని నిలువరించకుండా పైగా దెబ్బలతో సతమతమవుతున్న ఆ వ్యక్తితో సెల్ఫీలు తీసుకున్నారు. అయితే, తీవ్రంగా గాయాలపైన ఆ యువకుడిని పోలీసులు ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలుకోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ 27 ఏళ్ల యువకుడు మతిస్థిమితం లేని వాడు. కేరళలోని పాలక్కడ్ జిల్లాలో గల అత్తపాడి అనే గ్రామానికి సమీపంలో ఉన్న అడవిలో తిరుగుతూ బతికేస్తున్నాడు. అయితే, అతడు ఆ గ్రామంలోని దుకాణాల్లో తినుబండారాలు దొంగిలించి జీవనం సాగిస్తున్నాడని నలుగురు చెబుతుండటంతో అతడిని ప్రత్యేకంగా పట్టుకున్నారు. కట్టేసి కొన్ని గంటలపాటు టార్చర్ పెట్టారు. మధ్యాహ్నం వేళ జాలి చూపిన ఓ వ్యక్తి పోలీసులకు కబురు చేయడంతో వారు వచ్చి అతడిని విడిపించారు. అప్పటికే అతడు వాంతులు చేసుకొని కుప్పకూలిపోయాడు. ఐదుగంటల ప్రాంతంలో ఆస్పత్రికి తరలించగా అతడు చనిపోయాడు. -
న్యూ ఇయర్ వేడుకల్లో కీచక పర్వాలు
-
అనుమానంతో అపార్ట్మెంట్లో రచ్చ..70కార్లు ధ్వంసం
కోల్‌కతా: అకారణంగా అనుమానంతో దక్షిణ కోల్‌కతాలో కొందరు వ్యక్తులు నానా భీభత్సం చేశారు. దాదాపు 70 కార్లను ధ్వంసం చేశారు. అపార్ట్మెంట్ అద్దాలు పగులగొట్టారు. ఓ యువకుడు చనిపోవడానికి ఆ అపార్ట్ మెంట్ లోని వ్యక్తే కారణం అని అనుమానంతో ఈ రచ్చ సృష్టించారు. ఆదివారం తెల్లవారు జామున హజ్రా ఏరియాలో 2.55గంటల ప్రాంతంలో స్కూటీపై వెళుతున్న ముగ్గురు యువకులను ఓ మెర్సిడీస్ కారు ఢీకొట్టింది. వారిని ఆస్పత్రిలో చేర్పించగా అందులో 24 ఏళ్ల యువకుడు చనిపోయాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులు, బంధువులు ఓ వందమంది అక్కడే ఉన్న ఓయాసిస్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ వద్దకు వెళ్లారు. కారు యాక్సిడెంట్ చేసిన వ్యక్తి అందులోనే ఉన్నాడని అనుమానించి అతడిని బయటకు పిలవాలని కేకలు పెడుతూ ఇటుకలు, రాళ్లు కర్రలతో దాడులు చేశారు. 70 కార్లను ధ్వంసం చేశారు. పలు ఇళ్ల అద్దాలు పగులగొట్టారు. ఇదేమిటని ప్రశ్నించినవారిపై చేయిచేసుకున్నారు. అయితే, చివరకు కారు యాక్సిడెంట్ చేసిన వ్యక్తి ఆ అపార్ట్‌మెంట్‌కు చెందినవాడు కాదని తెలిసింది. కొన్ని కార్లపై కిరోసిన్ పోసి నిప్పంటించేందుకు కూడా ప్రయత్నించారట. ఆ సమయానికి పోలీసులు రావడంతో మరింత విధ్వంసం చోటుచేసుకోకుండా అడ్డుకోగలిగారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ రచ్చ కొనసాగింది. ఈ ఘటనకు సంబంధించి నలుగురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
దాడి పాశవికం
నిందితులను కఠినంగా శిక్షిస్తాం.. సబిత, మంత్రి ప్రసాద్కుమార్ల హామీ పాస్టర్ సంజీవులుకు పరామర్శ దాడికి సర్కార్‌దే బాధ్యతన్న బ్రదర్ అనిల్ చాదర్‌ఘాట్,కవాడిగూడ,న్యూస్‌లైన్: గుర్తుతెలియని దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడి మలక్‌పేట యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌కు చెందిన పాస్టర్ సంజీవులును ఆదివారం చేనేత,జౌళిశాఖ మంత్రి ప్రసాద్‌కుమార్,మాజీహోంమంత్రి సబితారెడ్డి, మహా జన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మందకృష్ణమాదిగ తదితరులు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి ప్రసాద్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ పాస్టర్‌పై దాడి అత్యంత పాశవికమని, ప్రజాస్వామ్యంలో ఇలాంటివి తగవని సూచించారు. పాస్టర్ కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని, దాడికి పాల్పడిన దోషులను ఎంతటివారైనా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. సీఎం రిలీఫ్‌ఫండ్ కింద సంజీవులు వైద్యఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని హామీఇచ్చారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని సబితారెడ్డి రంగారెడ్డి జిల్లా ఎస్పీతో మాట్లాడారు. మందకృష్ణ మాట్లాడుతూ క్రైస్తవులపై దాడుల విషయంలో బీజేపీ తమ వైఖరిని స్పష్టంచేయాలని డిమాండ్ చేశారు. పాస్టర్‌పై దాడి అత్యంత దారుణమంటూ..ఈ విషయమై డీజీపీ,సీఎంను కలుస్తానని చెప్పారు. దాడులకు ప్రభుత్వానిదే బాధ్యత: బ్రదర్ అనిల్‌కుమార్ క్రైస్తవులపై జరుగుతున్న దాడులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ప్రముఖ మతప్రబోధకులు బ్రదర్ అనిల్‌కుమార్ డిమాండ్ చేశారు. పాస్టర్‌పై దాడిని వ్యతిరేకిస్తూ ఆదివారం ట్యాంక్‌బండ్‌పైనున్న గుర్రంజాషువా, అంబేద్కర్ విగ్రహాల వద్ద క్రిస్టియన్ సోషల్ఫోరం, ఇండియన్ దళిత్ క్రిస్టియన్ రైట్స్, ఆలిండియా క్రిస్టియన్ కౌన్సిల్ సంస్థల ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమానికి బ్రదర్ అనిల్‌కుమార్, సినీహీరో రాజా హాజరయ్యారు. బ్రదర్ అనిల్‌కుమార్ మాట్లాడుతూ క్రైస్తవులపై దాడులకు పాల్పడిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం సంజీవులు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో క్రైస్తవ సంఘాల నాయకులు పాల్దేవ్ప్రియం, బిషప్విల్స న్ సింగన్, స్టాలిన్‌బాబు, పి.వరప్రసాదరావు, మాజీ ఐఏఎస్ దానం, బిషప్ గొల్లపల్లిజాన్, టీఆర్ఎస్ క్రిస్టియన్ సెల్ ఇంచార్జ్ బి.శంకర్‌లూక్, టీడీపీ క్రిస్టియన్‌సెల్ ఇంచార్జ్ చిరంజీవి, ఎస్తేరురాణి, సాల్మన్‌రాజు తదితరులు పాల్గొన్నారు.