‘మోదీ హిట్లర్‌ దారిలో నడుస్తున్నాడు’ | Arvind Kejriwal Compared Narendra Modi To Nazi Leader Adolf Hitler | Sakshi
Sakshi News home page

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేజ్రీవాల్‌

Published Sat, Mar 23 2019 3:18 PM | Last Updated on Sat, Mar 23 2019 3:37 PM

Arvind Kejriwal Compared Narendra Modi To Nazi Leader Adolf Hitler - Sakshi

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీని నాజీల నియంత హిట్లర్‌తో పోలుస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌. గురుగ్రామ్‌లో హోలీ పండుగ నాడు క్రికెట్‌ ఆడిన ఓ ముస్లిం కుటుంబంపై మూక దాడి జరిగిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడయాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన కేజ్రీవాల్‌ ‘అధికారం  కోసం మోదీ  హిట్లర్‌ సిద్ధాంతాలను పాటిస్తున్నారు. కానీ అది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో ఆయన అనుచరులకు అర్థం కావడం లేదు. ఇలాంటి దాడులు చేయాలని ఏ గీత చెబుతుంది? ఏ రామాయణంలో రాసుంది?’  అంటూ ట్వీట్‌ చేశారు.

హోలీ పండుగ నాడు గురుగ్రామ్‌కు చెందిన సాజిద్‌ అనే వ్యక్తి కుటుంబ సభ్యులు తమ ఇంటి ఆవరణలో క్రికెట్‌ ఆడుతుండగా.. గుర్తు తెలియని ఓ 20 మంది వ్యక్తులు వచ్చి వారిపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ‘క్రికెట్‌ ఆడాలంటే పాకిస్తాన్‌ వెళ్లండి.. ఇక్కడ ఆటలాడకుడదంటూ బెదిరించారు. ఇందుకు సంబంధించిన మీడియా సోషల్‌ మీడియాలో వైరలయ్యింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఆరుగురిని అరెస్ట్‌ చేసి హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement