
అనిమేశ్ భుయాన్ (ఫైల్ )
జోర్హాత్: అస్సాంలో జరిగిన మూకదాడిలో ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్(ఆసు)నేత ఒకరు అసువులు బాశారు. జోర్హాత్ నగరంలోని ట్యాక్సీ స్టాండ్ వద్ద సోమవారం పట్టపగలు అందరూ చూస్తుండగానే ఈ దారుణం చోటుచేసుకుంది. ఆసు నేత అనిమేశ్ భుయాన్(28), మరో ఇద్దరు కార్యకర్తలు మృతుస్మంత బారువా, ప్రణయ్ దత్తాలతో కలిసి తమ వాహనం వద్ద నిలుచుని ఉండగా ఒక వృద్ధుడు స్కూటీపై వచ్చి అక్కడే పడిపోయాడు. అనిమేశ్ వాహనం ఢీకొనడం వల్లే వృద్ధుడు పడిపోయాడంటూ అతడి సంబంధీకులు వారితో గొడవకు దిగి, తీవ్రంగా కొట్టారు. చుట్టుపక్కల గుమికూడిన జనం ఈ దారుణం చూస్తూ నిలబడ్డారే తప్ప, అడ్డుకునేందుకు ఎవరూ ప్రయత్నించలేదు. సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు ఆముగ్గురితోపాటు వృద్ధుడిని కూడా ఆస్పత్రికి తరలించారు. భుయాన్ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment