మతిస్ధిమితం లేని వ్యక్తిని పిల్లల్ని ఎత్తుకెళ్లేవాడిగా అనుమానిస్తూ కొందరు చితకబాదిన ఘటన చోటుచేసుకుంది. ఒడిషాకు చెందిన ఓ వ్యక్తిని వైట్‌ఫీల్డ్‌కు సమీపంలో స్ధానికులు గుర్తించి పిల్లల్ని అపహరించేందుకు వచ్చాడని భావిస్తూ దాడికి దిగారు. ఆ వ్యక్తిని చెట్టుకు తాడుతో కట్టి దారుణంగా కొట్టారు. వ్యక్తిని చితకబాదుతూ తలపై గట్టిగా కొడుతున్న వీడియో వెలుగులోకి వచ్చింది. ఐడీ కార్డు చూపాలని అతడిని హిందీలో ఓ వ్యక్తి అడగడంకనిపించింది. మరికొందరు బాధితుడిని గేలి చేస్తూ బిగ్గరగా నవ్వుతూ వీడియోలో కనిపించారు.