child kidnap
-
గంటల వ్యవధిలోనే పాపను కాపాడి.. మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు
-
శభాష్ పోలీస్.. కమిషననర్ అభినందన!
సాక్షి, చాంద్రాయణగుట్ట: కిడ్నాప్ అయిన రెండు నెలల శిశువును ఫలక్‌నుమా పోలీసులు ఆరు గంటల్లోనే ఛేదించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఓ యువకుడితో పాటు ఇద్దరు మహిళలను గురువారం అరెస్టుచేశారు. పురానీహవేలీలోని పాత పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, దక్షిణ మండలం డీసీపీ గజరావ్ భూపాల్‌తో కలిసి కేసు వివరాలు వెల్లడించారు. షేక్ బషీర్(35), సుల్తానా (31) దంపతులు ఫారూక్‌నగర్ ఫుట్‌పాత్‌పై ఉంటూ యాచకవృత్తిని కొనసాగిస్తున్నారు. వీరికి షేక్ అబ్దుల్లా (2), కుమార్తె మరియం (రెండు నెలల వయసు) సంతానం. ఈ నెల 11న అర్ధరాత్రి ఆటోలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు రెండు నెలల పసికందును కిడ్నాప్ చేశారు. దీంతో తల్లిదండ్రులు ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫలక్‌నుమా ఇన్స్పెక్టర్ ఆర్.దేవేందర్ మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు సీసీ కెమెరాలను పరిశీలించారు. ఓ ఆటో అనుమానాస్పదంగా తిరగడం గమనించారు. సలామీ ఆసుపత్రి దగ్గరలోని ఓ ఇంటి ముందు ఆటో పార్కు చేసి ఉండడంతో వెంటనే ఇంట్లోకి వెళ్లి చూడగా పాప కనిపించింది.ఈ ఘటనకు కారణమైన ఆటోడ్రైవర్ సయ్యద్ సాహిల్(19), అతని భార్య జబీన్ ఫాతీమా(19), సోదరి ఫాతిమా (23)లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కిడ్నాప్‌ను చేధించిన పోలీసులను ఈ సందర్భంగా కమిషననర్ అభినందించారు. కమిషనర్ అంజనీకుమార్ పాపను తన చేతుల మీదుగా తల్లిదండ్రులకు అప్పగించారు. సంతానం లేనందుకే.. నిందితుడు సయ్యద్ సాహిల్‌కు సంతానం లేని కారణంగానే కిడ్నాప్‌కు పాల్పడ్డాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. -
అపహరించిన చిన్నారిని అమ్మకానికి పెట్టి..
సాక్షి, శ్రీకాళహస్తి(చిత్తూరు జిల్లా) : గుంటూరులో అపహరించిన చిన్నారిని శ్రీకాళహస్తిలో అమ్మకానికి పెట్టి అడ్డంగా దొరికిందో భిక్షగత్తె. ఒకటో పట్టణ సీఐ నాగార్జున రెడ్డి కథనం మేరకు.. గుంటూరు జిల్లా తెనాలి పాతబస్టాండు ప్రాంతానికి చెందిన పోతురాజు, లక్ష్మి దంపతుల కుమార్తె నూకాలమ్మ (3). శ్రీకాళహస్తి సంతమైదానానికి చెందిన ఆదెమ్మ భిక్షాటన చేస్తూ తెనాలికి వెళ్లింది. బస్టాండు ప్రాంతంలో ఆడుకుంటున్న ఆ చిన్నారిని జూన్ 30 తేదీన అపహరించింది. రెండు నెలల పాటు తమ కుమార్తె కోసం బాధిత తల్లిదండ్రులు తీవ్రంగా గాలించారు. లాభం లేకపోవడంతో ఆశలు వదులుకున్నారు. సోమవారం సంతమైదానం అంకాళమ్మ ప్రాంతంలో కిడ్నాప్ చేసిన నూకాలమ్మను పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేటకు చెందిన పెంచలమ్మకు రూ.10,000లకు విక్రయించేందుకు ప్రయత్నించింది. అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఆదెమ్మను సీఐ నాగార్జునరెడ్డి అదుపులోకి తీసుకున్నారు. విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పాప తల్లిదండ్రులు పోతురాజు, లక్ష్మి దంపతులకు సమాచారమిచ్చారు. నూకాలమ్మను వారికి అప్పగించారు. నిందితురాలు ఆదెమ్మను, కొనేందుకు ప్రయత్నించిన పెంచలమ్మను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. కేసును గుంటూరు జిల్లా తెనాలికి బదిలీ చేసినట్లు సీఐ పేర్కొన్నారు. కేసును ఛేదించి, చిన్నారిని తల్లిదండ్రుల వద్దకు చేర్చిన శ్రీకాళహస్తి పోలీసులకు ఎస్పీ అన్బురాజన్, డీఎస్పీ నాగేంద్రుడు రివార్డు అందించారు. రివార్డు అందుకున్న వారిలో ఎస్ఐ సంజయ్ కుమార్, ఏఎస్ఐ మణి, హెడ్ కానిస్టేబుల్ సహదేవ్, పీసీలు కృష్ణా, చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. -
పట్టపగలే చిన్నారి కిడ్నాప్
చెన్నై, తిరువొత్తియూరు: తండ్రి మద్యం మత్తులో ఉండగా చిన్నారికి బిస్కెట్టు ఇచ్చి కిడ్నాప్ చేసిన సంఘటన గురువారం శ్రీపెరంబుదూరులో సంచలనం కలిగించింది. శ్రీ పెరంబుదూరు, పాలూర్ సమీపం సేందమంగళం పొన్నియమ్మన్ కోయిల్ వీధికి చెందిన కుమరప్రశాంత్. అతని భార్య మురుగమ్మాల్. వీరి కుమారుడు కుమరగురు (5), కుమర ప్రశాంత్‌కు మద్యం తాగుడు అలవాటు ఉంది. గురువారం ఉదయం 11 గంటల సమయంలో ఓరగడం సమీపంలో ఉన్న టాస్మాక్ దుకాణానికి కుమరప్రశాంత్ తన కుమారుడితో వెళ్లాడు. చిన్నారిని బయట ఉంచి మద్యం తాగడానికి దుకాణంలోకి వెళ్లాడు. చాలా సమయం అయినప్పటికీ కుమారుడితో వెళ్లిన భర్త ఇంటికి రాకపోవడంతో మురుగమ్మాల్ అతన్ని వెతుక్కుంటూ మద్యం దుకాణం వద్దకు వచ్చారు. ఆ సమయంలో కుమరప్రశాంత్ మద్యం మత్తులో పడి ఉండగా చిన్నారి అదృశ్యమయ్యాడు. దీనిపై మురుగమ్మాల్ ఓరగడం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసు అదనపు సూపరింటెండెంట్ రాజేష్ ఖన్నా ఆదేశం మేరకు ఇన్స్పెక్టర్ నటరాజన్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మద్యం దుకాణం వద్ద ఉన్న సీసీ కెమెరాను తనిఖీ చేయగా పంచ, చొక్కా ధరించిన గుర్తు తెలియని యువకుడు చిన్నారి కుమరగురుకు బిస్కెట్టు ఇచ్చి తీసుకెళుతున్నట్టు నమోదై ఉంది. అతన్ని పట్టుకోవడానికి పోలీసులు రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. -
చెట్టుకు కట్టేసి..దారుణంగా కొట్టారు..
-
చెట్టుకు కట్టేసి..దారుణంగా కొట్టారు..
సాక్షి, బెంగళూర్ : మతిస్ధిమితం లేని వ్యక్తిని పిల్లల్ని ఎత్తుకెళ్లేవాడిగా అనుమానిస్తూ కొందరు చితకబాదిన ఘటన చోటుచేసుకుంది. ఒడిషాకు చెందిన ఓ వ్యక్తిని వైట్‌ఫీల్డ్‌కు సమీపంలో స్ధానికులు గుర్తించి పిల్లల్ని అపహరించేందుకు వచ్చాడని భావిస్తూ దాడికి దిగారు. ఆ వ్యక్తిని చెట్టుకు తాడుతో కట్టి దారుణంగా కొట్టారు. వ్యక్తిని చితకబాదుతూ తలపై గట్టిగా కొడుతున్న వీడియో వెలుగులోకి వచ్చింది. ఐడీ కార్డు చూపాలని అతడిని హిందీలో ఓ వ్యక్తి అడగడంకనిపించింది. మరికొందరు బాధితుడిని గేలి చేస్తూ బిగ్గరగా నవ్వుతూ వీడియోలో కనిపించారు. స్ధానికుల దాడి నుంచి వ్యక్తిని కాపాడిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా రెండు నెలల కిందట ఉత్తర కర్ణాటకలో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను పిల్లలను కిడ్నాప్ చేసే వ్యక్తిగా అనుమానిస్తూ స్ధానికులు చావబాదిన ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో వదంతుల ఆధారంగా మూక హత్యలు, దాడులను నిరోధించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని గత నెలలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. -
కారు చీకట్లో కంటి దీపాలు!
23.. గత 24 గంటల్లో తెలంగాణలో కిడ్నాప్ అయిన చిన్నారుల సంఖ్య ఇదీ! వారిలో పోలీసులు 9 మందిని కాపాడారు.ఇంకా 14 మంది జాడ తెలియరాలేదు. 2,283.. గత ఏడాది కాలంగా రాష్ట్రంలో తప్పిపోయిన చిన్నారుల సంఖ్య ఇది. వారిలో పోలీసులు 1,371 మందిని కిడ్నాప్ ముఠాల నుంచి కాపాడారు. ఇంకా 912 మంది చిన్నారులు ఎక్కడున్నారో.. ఎలా ఉన్నారో ఎవరికీ తెలియదు! 6,088.. పోలీసు లెక్కల ప్రకారం ఏపీ, తెలంగాణల్లో 2010–16 మధ్య కనిపించ కుండా పోయిన మహిళల సంఖ్య ఇది. వీరంతా ఎటు పోతున్నారు? ఏమై పోతున్నట్టు? సాక్షి ప్రత్యేక ప్రతినిధి–హైదరాబాద్ : యాదగిరిగుట్ట వ్యభిచార గృహాల నుంచి 11 మంది బాలికలను పోలీసులు కాపాడిన నేపథ్యంలో ఈ ప్రశ్నలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. గత కొద్ది సంవత్సరాలుగా మాయమవుతున్న చిన్నారులు, మహిళలపై ‘సాక్షి’ దృష్టి సారించగా విస్మయకర అంశాలు వెలుగులోకి వచ్చాయి. మహిళల అక్రమ రవాణాకు తెలంగాణ, ఏపీలో అనేక గ్యాంగ్‌లు పని చేస్తున్నాయి. చిన్నపిల్లలు, యుక్తవయసులో ఉన్న పేద ఆడపిల్లలు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలను గుర్తించడమే ఈ ముఠాల పని. ఇందుకు వారు పెద్ద నెట్‌వర్క్‌నే నడుపుతున్నారు. ఈజీగా వలలో పడే మహిళల వివరాలు ఇస్తే రూ.25 వేల నగదును అందజేస్తూ కిడ్నాప్‌లకు పాల్పడుతున్నారు. ఓ పోలీసు అధికారి చెప్పిన వివరాల ప్రకారం హైదరాబాద్, విజయవాడలో ఇలాంటి గ్యాంగ్‌లు వందకు పైగానే ఉన్నాయి. వీరి కింద దాదాపు ఐదు వేల మంది ఏజెంట్లు పని చేస్తుంటారు. మాయమాటలు.. కిడ్నాప్‌లు.. ఈజీ మనీకి అలవాటుపడ్డ ముఠాలు చిన్నారులు, యుక్తవయసు ఆడపిల్లలు, మహిళల అక్రమ రవాణాకు పాల్పడుతున్నాయి. ఉద్యోగాలు ఇప్పిస్తామని, చదువు చెప్పిస్తామని మాయమాటలతో నమ్మించి నట్టేట ముంచుతున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలను టార్గెట్ చేసుకుని.. విదేశాల్లో పనిమనుషులుగా మంచి వేతనాలు ఇప్పిస్తామంటూ మహిళలను వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారు. మోసపోయిన నెల, ఆరు నెలల తర్వాత బాధితుల తరఫు బంధువులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఈ విషయంలో చైతన్యం తెచ్చేందుకు ఎంతగా ప్రయత్నించినా ఫలితం ఉండటం లేదని ‘ఆపరేషన్ ముస్కాన్’లో పని చేసిన ఓ పోలీసు అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘కరీంనగర్ జిల్లాలోని ఒక గ్రామంలో పది కుటుంబాలకు చెందిన మహిళలకు ఉద్యోగాలు ఇప్పిస్తానని, నెలకు రూ.25 వేలు ఇంటికి పంపిస్తానని తల్లిదండ్రులు, భర్తలకు ఆశ చూపి తీసుకెళ్లాడు ఓ మోసగాడు. వరుసగా నాలుగు మాసాల పాటు డబ్బులు పంపాడు. తర్వాత మరో ఐదుగురు ఇంటర్ చదివే అమ్మాయిలను తీసుకెళ్లాడు. ఇది జరిగి రెండున్నర సంవత్సరాలవుతోంది. ఇప్పుడు వాళ్లు ఎక్కడ ఉన్నారో తెలియదు’’ అని ఆ పోలీసు అధికారి పేర్కొన్నారు. హుస్నాబాద్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న విషయం తెలిసి అతని సమీప బంధువు పదో తరగతి పాసైన అతని కూతురుకు నెలకు రూ.30 వేల ఉద్యోగం ఇప్పిస్తానని ముంబై తీసుకెళ్లాడు. ఏడాది దాటినా కూతురు ఆచూకీ తెలియకపోవడంతో తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. ఉద్యోగం ఇప్పిస్తానని కూతురిని తీసుకువెళ్లిన బంధువు జాడ కూడా తెలియలేదు. దాదాపు రెండేళ్ల పాటు పుణెలోని వ్యభిచార గృహాల్లో చిత్రహింసలు భరించిన ఆ బాలికను పోలీసులు కాపాడారు. ఆ అమ్మాయి బయటకు వచ్చి అసలు విషయం చెప్పేదాకా ఆమె ఎంత నరకం అనుభవించందో తెలియదు. ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకువెళ్లిన వ్యక్తి ఆమెను రూ.లక్షకు ఓ వ్యభిచార గృహానికి అమ్మేశాడు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి వెతలెన్నో కనిపిస్తున్నాయి. కిడ్నాప్ చేసి అమ్మేస్తున్నారు ఆరు నుంచి పదేళ్ల వయసున్న అమ్మాయిలను కిడ్నాప్ చేస్తున్న ముఠాలు వారిని ముంబై, పుణె, ఢిల్లీలోని వ్యభిచార గృహాలకు అమ్మేస్తున్నాయి. చిన్న పిల్లలు తప్పిపోతున్నట్లు అనేక ఫిర్యాదులు వస్తుండటంతో తెలంగాణ పోలీసు శాఖ ‘ముస్కాన్’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆపరేషన్ స్మైల్ పేరుతో పోలీసులు గడచిన మూడున్నర సంవత్సరాల్లో 25,834 మందిని కాపాడారు. వీరిలో 12,483 మంది పిల్లల్ని వారి తల్లిదండ్రులకు అప్పగించగా 13,351 మందిని సేŠట్ట్ హోమ్‌కు తరలించారు. -
పెంచుకోవడానికే కిడ్నాప్
సాక్షి, హైదరాబాద్: సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆస్పత్రి నుంచి ఆరు రోజుల చిన్నారి చేతనను కిడ్నాప్ చేసిన మహిళను సరూర్‌నగర్ సమీపంలోని ఎన్టీఆర్ నగర్‌కు చెందిన నైనా రాణిగా గుర్తించారు. ఆమెకు పిల్లలు పుట్టరనే ఉద్దేశంతో పెంచుకోవడానికే శిశువును ఎత్తుకుపోయినట్లు వెల్లడైంది. ఈ కేసుకు సంబంధించి మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని, నిందితురాలిగా తేలడంతో నైనా రాణిని అరెస్టు చేశామని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ఈస్ట్జోస్ డీసీపీ ఎం.రమేశ్, సుల్తాన్‌బజార్ ఏసీపీ డాక్టర్ ఎం.చేతన, టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ చైతన్యకుమార్‌తో కలసి గురువారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. మొదటి భర్త మరణం.. రెండుసార్లు అబార్షన్ బీదర్ సమీపంలోని ఖాసింపురకు చెందిన నైనా రాణి తండ్రి దర్జీ. తల్లి గృహిణి. ఈమెకు అన్న, తమ్ముడు ఉన్నారు. నైనాను నాలుగేళ్ల క్రితం బీదర్‌కే చెందిన రమేశ్‌కు ఇచ్చి వివాహం చేశారు. కొన్ని రోజులకే అత డు చనిపోవడంతో మూడేళ్ల క్రితం జహీరాబాద్ వాసి సీమన్తో రెండో వివాహం చేశారు. ప్రస్తుతం సీమన్ ఎన్టీఆర్ నగర్ మార్కెట్లో పండ్ల వ్యాపారం చేస్తుండగా నైనా ఇంటి పట్టునే ఉంటోంది. రెండుసార్లు గర్భస్రావం కావడంతో తనకిక పిల్లలు పుట్టరని భావించింది. ఏడు నెలల క్రితం తాను గర్భవతినని తల్లిని, భర్త సీమన్‌నూ నమ్మించింది. ఎన్టీఆర్ నగర్‌తో పాటు బీదర్, జహీరాబాద్‌లోని సోదరి ఇళ్లల్లో గడుపుతూ తాను గర్భవతినని ప్రచారం చేసుకుంది. తాను ప్రసవించానని చెప్పి శిశువుతో ఇంటికి వెళ్లే సమయం వచ్చిందని భావించిన నైనా.. నవజాత శిశువు కోసం శనివారం సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆస్పత్రికి వచ్చింది. సోమవారం ఇద్దరు చిన్నారుల్ని ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించి విఫలమైంది. చివరకు చేతనను వాక్సినేషన్ పేరుతో కిడ్నాప్ చేసింది. ఆమె మాట నమ్మని కుటుంబీకులు.. ఆస్పత్రి నుంచి చిన్నారిని ఎత్తుకువెళ్లిన తర్వాత బీదర్‌లో ఉన్న కుటుంబీకులతో తనకు జహీరాబాద్‌లోని సోదరి ఇంటి వద్ద ప్రసవం అయిందని, ఆడపిల్ల పుట్టిందని చెప్పింది. భర్తకు ఫోన్ చేసి ఇదే విషయం చేరవేసింది. ఆస్పత్రి నుంచి నేరుగా ఎంజీబీఎస్‌కు వెళ్లిన నైనా.. అక్కడి దుకాణంలో పాలు కొని ప్రతి రెండు గంటలకూ శిశువుకు పట్టిస్తూ హైదరాబాద్ నుంచి బీదర్ వెళ్లింది. నయాకమాన్ ప్రాంతంలో బస్సు దిగి.. షాగంజ్‌లో మరో వ్యక్తితో పాటు ఉంటున్న తమ్ముడి రూమ్‌కు వెళ్లింది. తాను ప్రసవించానంటూ అతడికి చేతనను చూపించింది. ఆమె మాటలు నమ్మని అతడు అన్నకు సమాచారం ఇచ్చాడు. అతడితో పాటు తల్లిదండ్రులూ షాగంజ్ చేరుకుని చిన్నారిని చూశారు. చిన్నారి బొడ్డును చూడటంతో పాటు నైనా స్థితిని పరిశీలించిన ఆమె తల్లి శిశువు విషయం అనుమానించి జహీరాబాద్‌లోని సోదరికి ఫోన్ చేసి ఆరా తీయగా అబద్ధంగా నిర్థారణ అయింది. సోమవారం రాత్రి తమ్ముడి రూమ్‌లోనే ఉండిపోయి పరిణామాలపై అంతా చర్చించారు. అరెస్టు అవుతామని భయపడి.. మంగళవారం ఉదయానికి మీడియాలో కిడ్నాప్‌పై ప్రతి 5 నిమిషాలకు అప్డేట్స్ ప్రసారమయ్యాయి. దీంతో అరెస్టు అవుతామని భయపడిన నైనా, ఆమె కుటుంబీకులు ఏం చేయాలని ఆలోచించారు. నైనా అన్న స్నేహితుడైన ఉత్తర కన్నడ పత్రిక రిపోర్టర్‌ను సంప్రదించాడు. శిశువును ప్రభుత్వాస్పత్రిలో వదిలేద్దామని సలహా ఇచ్చిన అతగాడు నైనా అన్నతో కలసి బైక్‌పై శిశువును తీసుకువెళ్లి బీదర్ ఆస్పత్రిలో వదిలేశాడు. ఈ విషయాన్ని న్యూటౌన్ ఠాణాలో పని చేసే ఎస్సైకు చెప్పాడు. అతడు బీదర్‌లో ఉన్న హైదరాబాద్ టీమ్‌కు సమాచారం ఇచ్చాడు. వీరు మంగళవారం సాయంత్రం శిశువును స్వాధీనం చేసుకుని బుధవారం హైదరాబాద్ తీసుకువచ్చారు. బీదర్ ఆస్పత్రిలోని సీసీ కెమెరాల్లో ఫీడ్‌ను పరిశీలించిన పోలీసులు ఇద్దరు వ్యక్తులు శిశువును వదిలినట్లు, ఓ సెక్యూరిటీ గార్డుతో మాట్లాడినట్లు గుర్తించారు. సెక్యూరిటీ గార్డును విచారించగా అతడు విలేకరి పేరు చెప్పాడు. ఇలా విలేకరిని, అతడి ద్వారా నైనా అన్న, తమ్ముడు, అతడి రూమ్మేట్ను పట్టుకున్నారు. వీరిచ్చిన సమాచారంతో మాలెగావ్ ప్రాంతంలోని పెద్దమ్మ ఇంట్లో తలదాచుకున్న నైనాను గురువారం తెల్లవారుజామున పట్టుకుని హైదరాబాద్ తరలించారు. పోలీసులు ఖాసింపుర వెళ్లే సమయానికి తన బిడ్డను చూసుకోవడానికంటూ ఎన్టీఆర్ నగర్ నుంచి సీమన్ సైతం అక్కడకు చేరుకున్నాడు. -
అమ్మ ఒడికి చిన్నారి
నిందితురాలి పట్టివేత కాకినాడ క్రైం : కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో అపహరణకు గురైన పసికందును పోలీసులు తిరిగి తల్లి చెంతకు చేర్చారు. వివరాల్లోకెళితే ఏజెన్సీ ప్రాంతం రాజవొమ్మంగి మండలం కిండ్ర గ్రామానికి చెందిన రెడ్డి లక్షి్మకి పురిటినొప్పులు రావడంతో ప్రసవం కోసం అక్టోబర్ 25న కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. బుధవారం తెల్లవారుజాము 3.30కు ఆడబిడ్డకు జన్మనిచ్చింది. గురువారం రాత్రి 9.50 తల్లి పక్కలో నిద్రిస్తోన్న పసికందు అదృశ్యమైంది. బిడ్డ కనిపించకపోవడంతో ఆస్పత్రి అంతా గాలించారు. ఫలితం లేకపోవంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు రోజులుగా ఏలేశ్వరం అంబేడ్కర్‌కాలనీకి చెందిన పలివెల లక్ష్మి బాధితురాలితో చనువుగా ఉంటూ, çపసికందును లాలించడం చేస్తుండేది. గురువారం రాత్రి 9.30 తల్లిపక్కలో పడుకున్న పసికందును ఎత్తుకోవడానికి ప్రయత్నిస్తుండడంతో పక్కవారు వారించారు. అనంతరం అందరూ నిద్రపోయాక ççపసికందును తీసుకుని ఉడాయించింది. అయితే గురువారం ఉదయం 9.30 , సాయంత్రం 7.30కు పక్కన ఉన్న వారి సెల్ఫో¯ŒS నుంచి ఫో¯ŒS చేసి నంబరు తీసేసింది. గురువారం రాత్రి 10.05కు బయట వ్యక్తుల నుంచి ఫో¯ŒS వచ్చింది. ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా పుటేజీలను ఒకటో పట్టణ సీఐ ఏఎస్ రావు, ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో క్షుణ్ణంగా పరిశీలించి, బిడ్డను ఎత్తుకు పోతున్న ఆ«ధారాన్ని గుర్తించి, సెల్ఫో¯ŒS నంబర్ ఆధారంగా కిర్లంపూడి మండలం ఎస్.తిమ్మాపురంలో నిందితురాలు పలివెల లక్షి్మని ఆమె పిన్ని మంజేటి పాప ఇంటి వద్ద పట్టుకుని, చిన్నారిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఏఎస్ రావు చెప్పారు. ఈ కేసును కేవలం 12 గంటల వ్యవధిలో ఛేదించిన సీఐ ఏఎస్.రావును, తల్లిదండ్రులు, వైద్యులు అభినందించారు. మమకారం చంపులేక... కడుపులో ఉండగానే ముగ్గురు పిల్లలు చనిపోవడం...భవిష్యత్‌లో పిల్లలు పుట్టే అవకాశం లేదని వైద్యులు తెలపడంతో.. పిల్లలపై మమకారం చంపుకోలేక ఏంచేయాలో తెలియని స్థితిలో పలివెల లక్ష్మి పసికందును అపహరించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో పేషెంటుగానే ఉందని, గురువారం డిశ్చార్జ్ కావాల్సి ఉందని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. ఈలోగా ఆమె ఈ పని చేసిందంటున్నారు. బిడ్డను చూస్తాననుకోలేదు నాలుగు రోజులుగా పలివెల లక్ష్మి నాతో చనువుగా ఉంటోది. నిద్ర మత్తులో ఉండగా రాత్రి వచ్చి çపక్కలో ఉన్న బిడ్డను తీసుకుంది. బిడ్డ ఏడుపు వినిపించింది. పాప దోరకదని కుమిలిపోయాం. నాకు 12 ఏళ్ల కూతురు ఉంది. రెండో కాన్పులో పాప పుట్టింది. పోలీసులకు మేము రుణపడి ఉంటాం. – రెడ్డి లక్ష్మి కానరాని భద్రత కాకినాడ వైద్యం : జిల్లా ప్రధాన కేంద్రమైన కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రిలో శిశువు అపహరణ ఘటనతో ప్రజలు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. ఈ ఆస్పత్రిలో వైద్య సేవలు పొందడానికి జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి ఏటా 8 లక్షల 16 వేల మంది రోగులు వస్తుంటారు. అంతటి ప్రాధాన్యమున్న ఆస్పత్రిలో ముఖ్యంగా మాతా, శిశు విభాగం వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాల్సి ఉంది. కేవలం సీసీ కెమెరాలమీదే కాకుండా సెక్యూరిటీ వ్యవస్థను మరింత పటిష్టం చేయాల్సి ఉంది. గతంలో మాతా, శిశువుల వార్డులో తల్లి, బిడ్డకు గుర్తింపుగా స్టిక్కర్లు వేసేవారు. కాలక్రమంలో ఈ వ్యవస్థను అధికారులు పక్కన పెట్టారు. వార్డుల్లోకి ఎంతమంది వచ్చినా పట్టించుకోవడం లేదు. దాంతో ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి. త్వరలో కలెక్టర్ అనుమతితో జియో ట్యాగింగ్ వి«ధానాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వై.నాగేశ్వరరావు తెలిపారు. -
చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం
-
చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం
హైదరాబాద్: నగరంలోని నల్లకుంట పరిధి అడిక్‌మెట్ లో కిడ్పాప్ కు గురైన చిన్నారి కథ సఖాంతమైంది. హర్షిత(5) అనే చిన్నారిని ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి ఉన్న ఓ మహిళ చాక్లెట్ ఇప్పిస్తానని చెప్పి సోమవారం ఉదయం అపహరించుకు వెళ్లింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానికంగా ఉండే సీసీ ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులు గాలింపు చేపట్టారు. కాగా చెవి దిద్దులు తీసుకుని చిన్నారిని అంబర్ పేటలో వదిలి నిందితురాలు పరారైంది. పాపను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు చిన్నారిని తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. నిందితురాలి కోసం గాలింపు చేపట్టారు. -
నగరంలో ఐదేళ్ల చిన్నారి కిడ్నాప్
-
రాజన్న సన్నిధిలో చిన్నారి కిడ్నాప్
వేములవాడ: కరీంనగర్ జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వ స్వామి సన్నిధిలో చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. ఆలయ ఆవరణలో నిద్రిస్తున్న నాలుగు నెలల బాలుని గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం తెల్లవారుజామున అపహరించుకుపోయారు. నల్గొండ జిల్లా రాజ్యంపేట మండలం బొందుగుల గ్రామానికి చెందిన కొమ్ము కల్పన(23) తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలతో కలిసి రాజన్న దర్శనార్థం సోమవారం సాయంత్రం వచ్చారు. స్వామి దర్శనార్థం ఆలయం ఆవరణలో నిద్రిస్తుండగా నాలుగు నెలల బాలుని ఎవరో కిడ్నాప్ చేశారు. ఈ విషయమై కల్పన వేములవాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొమ్ము యేసేబు ప్రసాద్‌తో 2012లో తన పెళ్లి అయిందని, కుటుంబ గొవడవల కారణంగా తన ఇద్దరు పిల్లలతో పుట్టింటిలో ఉంటున్నానని కల్పన ఫిర్యాదులో పేర్కొంది. తన తల్లిదండ్రులు మల్లయ్య, మచ్చుపెల్లిలక్ష్మితో పాటు తన ఇద్దరు పిల్లలను తీసుకుని రాజన్నస్వామి మొక్కు తీర్చుకునేందుకు వచ్చానని చెప్పింది. ఈ నేపధ్యంలో బాబును ఎవరో కిడ్నాప్ చేశారని పేర్కొంది. పోలీసులు సీసీ కెమెరా ఫుటేజిని పరిశీలించారు, కేసు నమోదు చేసుకుని దర్యార్తు చేస్తున్నారు. ఆమె భర్తే బాలున్ని కిడ్నాప్ చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. -
చెవిదిద్దుల కోసం చిన్నారి కిడ్నాప్
కుషాయిగూడ: చిన్నారిని కిడ్నాప్ చేసి.. చెవిదిద్దులు తీసుకొని వదిలేశాడో దుండగుడు. కుషాయిగూడకు చెందిన వీరబాబు కూతురు అక్షిత (8) స్థానిక పాఠశాలలో 3వ తరగతి చదువుతోంది. ఈ చిన్నారి మంగళవారం సాయంత్రం ఇంటి సమీపంలో సైకిల్‌పై ఆడుకుంటుడగా బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి మీ డాడీ తీసుకురమ్మన్నాడని మాయమాటలు చెప్పి బైక్‌పై ఎక్కించుకొని కాప్రా, భాగ్యనగర్ కాలనీ వరకు తీసుకెళ్లాడు. అక్షితను బెదిరించి చెవికి ఉన్న సుమారు 4 గ్రాముల బంగారు చెవిదిద్దులు తీసుకున్నాడు. పాపను అక్కడే వదిలి వెళ్లాడు. దీంతో అక్షిత పెద్దగా ఏడ్వడంతో స్థానికులు విషయం తెలుసుకొని పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు వచ్చి తమ వెంట తీసుకెళ్లారు. అనంతరం తల్లిదండ్రులను పిలిచి అక్షితను అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
బాలుడి కిడ్నాప్ కేసులో నిందితుడి అరెస్ట్
సికింద్రాబాద్: నగరంలో కలకలం సృష్టించిన బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. కిడ్నాప్‌కు పాల్పడిన నిందితుడు వీరాచారిని బుధవారం అరెస్ట్ చేశారు. వివరాలు.. సికింద్రాబాద్ జనరల్ బజార్లో మంగళవారం 14 నెలల బాలుడు పృథ్వి కిడ్నాప్‌కు గురయ్యాడు. ఈ విషయం పై కేసు నమోదు చేసుకున్న మహంకాళి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి ఈ రోజు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా.. బాలుడి దూరపు బంధువు బాలాచారే ఈ కిడ్నాప్‌కు పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు అతన్ని విచారించగా రూ. 5 వేలకు బాబును అమ్మేసినట్లు తెలిపాడు. బాబు మెడలో ఉన్న బంగారు గొలుసును కూడా అమ్ముకున్నట్లు చెప్పాడు. మరింత సమాచారం కోసం పోలీసులు విచారణ చేపట్టారు. -
బాలుడి కిడ్నాప్ నకు యత్నం.. మహిళ అరెస్ట్
కోల్‌సిటీ-గోదావరిఖని: అప్పుడే పుట్టిన బాలుణ్ని అపహరించేందుకు ప్రయత్నించిన మహిళను బంధువులు, ఆస్పత్రి సిబ్బంది కలిసి పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో బుధవారం జరిగింది. వివరాలు.. ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు మండలం దానపల్లి గ్రామానికి చెందిన రాజలింగం భార్య సంధ్య రెండో కాన్పులో బాలుడికి జన్మనిచ్చింది. కాగా, ఆపరేషన్ అనంతరం సంధ్యను వేరే గదికి తరలిస్తుండగా బాలుడిని సంధ్య వాళ్ల అత్త కిట్టమ్మ పట్టుకుంది. అయితే.. రామగుండం మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన ఒక మహిళ ఆశ వర్కర్‌గా కిట్టమ్మను పరిచయం చేసుకుంది. బాలుడు పుట్టినందుకు రూ.10వేలు వస్తాయని నమ్మించింది. బాలుడిని సార్‌కు చూపిస్తానని చెప్పి కిట్టమ్మ దగ్గర నుంచి తీసుకుంది. ఈ క్రమంలోనే ఆ మహిళ బాలుడిని తీసుకొని పరుగెత్తసాగింది. అనుమానం వచ్చిన బంధువులు ఆమెను పట్టుకొని ఆస్పత్రి సిబ్బంది దగ్గరకు తీసుకెళ్లారు. కాగా, ఆస్పత్రి సిబ్బంది ఆమె ఆశ వర్కర్ కాదని తేల్చడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మహిళను అదుపులోకి తీసుకొని విచారించగా, ఇద్దరు వ్యక్తుల ప్రోద్బలంతోనే తాను ఈ పని చేశానని తెలిపింది.