కుషాయిగూడ: చిన్నారిని కిడ్నాప్ చేసి.. చెవిదిద్దులు తీసుకొని వదిలేశాడో దుండగుడు. కుషాయిగూడకు చెందిన వీరబాబు కూతురు అక్షిత (8) స్థానిక పాఠశాలలో 3వ తరగతి చదువుతోంది. ఈ చిన్నారి మంగళవారం సాయంత్రం ఇంటి సమీపంలో సైకిల్‌పై ఆడుకుంటుడగా బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి మీ డాడీ తీసుకురమ్మన్నాడని మాయమాటలు చెప్పి బైక్‌పై ఎక్కించుకొని కాప్రా, భాగ్యనగర్ కాలనీ వరకు తీసుకెళ్లాడు. అక్షితను బెదిరించి చెవికి ఉన్న సుమారు 4 గ్రాముల బంగారు చెవిదిద్దులు తీసుకున్నాడు. పాపను అక్కడే వదిలి వెళ్లాడు. దీంతో అక్షిత పెద్దగా ఏడ్వడంతో స్థానికులు విషయం తెలుసుకొని పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు వచ్చి తమ వెంట తీసుకెళ్లారు. అనంతరం తల్లిదండ్రులను పిలిచి అక్షితను అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది.