రాజన్న సన్నిధిలో చిన్నారి కిడ్నాప్ | 4 months baby kidnapped in vemulawada rajarajeswari temple | Sakshi
Sakshi News home page

రాజన్న సన్నిధిలో చిన్నారి కిడ్నాప్

Published Tue, May 3 2016 8:47 AM | Last Updated on Sun, Sep 3 2017 11:20 PM

రాజన్న సన్నిధిలో చిన్నారి కిడ్నాప్

రాజన్న సన్నిధిలో చిన్నారి కిడ్నాప్

వేములవాడ: కరీంనగర్ జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వ స్వామి సన్నిధిలో చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. ఆలయ ఆవరణలో నిద్రిస్తున్న నాలుగు నెలల బాలుని గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం తెల్లవారుజామున అపహరించుకుపోయారు. నల్గొండ జిల్లా రాజ్యంపేట మండలం బొందుగుల గ్రామానికి చెందిన కొమ్ము కల్పన(23) తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలతో కలిసి రాజన్న దర్శనార్థం సోమవారం సాయంత్రం వచ్చారు. స్వామి దర్శనార్థం ఆలయం ఆవరణలో నిద్రిస్తుండగా నాలుగు నెలల బాలుని ఎవరో కిడ్నాప్ చేశారు. ఈ విషయమై కల్పన వేములవాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కొమ్ము యేసేబు ప్రసాద్‌తో 2012లో తన పెళ్లి అయిందని, కుటుంబ గొవడవల కారణంగా తన ఇద్దరు పిల్లలతో పుట్టింటిలో ఉంటున్నానని కల్పన ఫిర్యాదులో పేర్కొంది. తన తల్లిదండ్రులు మల్లయ్య, మచ్చుపెల్లిలక్ష్మితో పాటు తన ఇద్దరు పిల్లలను తీసుకుని రాజన్నస్వామి మొక్కు తీర్చుకునేందుకు వచ్చానని చెప్పింది. ఈ నేపధ్యంలో బాబును ఎవరో కిడ్నాప్ చేశారని పేర్కొంది. పోలీసులు సీసీ కెమెరా ఫుటేజిని పరిశీలించారు, కేసు నమోదు చేసుకుని దర్యార్తు చేస్తున్నారు. ఆమె భర్తే బాలున్ని కిడ్నాప్ చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement