Suspicion
-
ఆయనకు విపరీతమైన అనుమానం!
మా పెళ్ళయి పదేళ్ళయింది. ఇద్దరు పిల్లలు. మొదట్లో కొంతకాలం బాగున్నాం కానీ, తర్వాత నుంచి నా భర్తకు అనుమానం జబ్బు పట్టుకుని నన్ను మానసికంగా వేధిస్తున్నాడు. ప్రతివాళ్లతోనూ నాకు సంబంధం అంటగట్టి అనరాని మాటలతో చిత్రవధ చేస్తున్నాడు. సినిమాలకు, ఫంక్షన్లకు వెళ్ళినపుడు ఈ బాధ మరీ ఎక్కువవుతోంది. ఏం చేయాలో అర్థం కావడంలేదు. దయచేసి సలహా ఇవ్వగలరు. – ఒక సోదరి, తెనాలిమీరనుభవిస్తున్న మానసిక క్షోభను అర్థం చేసుకోగలను. వాస్తవం గాకున్నా... ఎలాంటి ఆధారం లేకున్నా ఇలా భార్యాభర్తలు ఒకరినొకరి శీలాన్ని శంకించే మానసిక రుగ్మతను ‘డెల్యూజనల్ డిజాస్ట్టర్ లేదా కాంజుగల్ ΄ారనోయియా’ అంటారు. మిగతా అన్ని విషయాల్లో వీరు మామూలుగానే ఉంటారు. ఏవేవో ఊహించుకుని ఇలాంటి భ్రమలు– భ్రాంతులకు లోనవుతూ, కేవలం జీవిత భాగస్వామిని మాత్రమే ఇలా అనుమానిస్తూ, వేధిస్తూ ఉంటారు. మానసిక రుగ్మత ఉందంటే ఒప్పుకోరు. మీరు మీ బంధువులు, ఇతర పెద్దల సహకారంతో ఆయన్ని ఏదో ఒక విధంగా ఒప్పించి, వైద్యుల దగ్గరకు వెళ్లగలిగితే, ‘యాంటీ సైకోటిక్స్’అనే మందులు, కౌన్సెలింగ్ ద్వారా చికిత్స చేసి, ఈ అనుమానాల ఊబి నుంచి పూర్తిగా బయటపడేస్తారు. మళ్ళీ మీరు ప్రశాంతంగా, సంతోషంగా జీవితాన్ని గడపగలరు. మా చుట్టాలబ్బాయి చిన్నప్పటినుంచి చదువులో టాప్! రెండు పీహెచ్‌డీలు చేశాడు. ఒక పెద్ద కంపెనీలో మంచి జీతంతో ఆఫర్ కూడా వచ్చింది. అయితే ఇటీవల ఉన్నట్టుండి అతని ప్రవర్తనలో బాగా మార్పు వచ్చింది. ఎవ్వరితోనూ మాట్లాడడు. ఒక్కడూ గదిలో తలుపులు వేసుకుని కూచుంటాడు. రోజుల తరబడి స్నానం చేయడు. తన లో తాను నవ్వుకోవడం... మాట్లాడుకోవడం. మా బంధువులందరూ చదువు ఎక్కువ అవడం వల్ల ఈ పిచ్చి వచ్చిందంటున్నారు. నిజమేనా?– కుమార్, కర్నూలుచదువుకు, తెలివితేటలకు, మానసిక జబ్బు రావడానికీ ఎలాంటి సంబంధం లేదు. ఇది కేవలం అ΄ోహ మాత్రమే. ఎక్కువ చదివిన వారందరికీ మెంటల్ రావాలని లేదు. అలాగే తెలివితేటలు లేనివారికి, ఎక్కువ చదువుకోనివారికీ మానసిక జబ్బులు రావని ఏమీ లేదు. మానసిక వ్యాధులకు వారసత్వ కారణాలు కొన్నయితే, పరిస్థితుల ప్రభావం, దిగ్భ్రాంతి కలిగించే సంఘటనలు జరగడం, ఆల్కహాల్, డ్రగ్స్ తీసుకోవడం, తీవ్రమైన ఒత్తిడులకు గురికావడం వంటివి ఇతర కారణాలు. ఆలస్యం చేయకుండా అతణ్ణి ఒకసారి సైకియాట్రిస్ట్‌కు చూపించమని చెప్పండి. స్కిజోఫ్రినియా అనే మానసిక జబ్బుకు లోను కావడం వల్ల వారికి మీరు పేర్కొన్న లక్షణాలుండే అవకాశం ఉంది. తొలిదశలోనే గుర్తించి, సరయిన చికిత్స చేయిస్తే, తొందరగా కోలుకుని తిరిగి మంచి జీవితాన్ని గడపగలడు.– డా. ఇండ్ల విశాల్ రెడ్డి సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
Akhilesh Yadav: ఎగ్జిట్ పోల్స్‌లో విశ్వసనీయత ఎంత?
లక్నో: ఎన్డీఏ కూటమి అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమంటూ ఫలితాలిచ్చిన పలు ఎగ్జిట్ పోల్స్ విశ్వసనీయతపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అనుమానం వ్యక్తంచేశారు. సోమవారం లక్నోలో పత్రికాసమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఎన్డీఏ సంపూర్ణ మెజారిటీతో విజయం సాధిస్తుందని పలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూస్తుంటే అనుమానమొస్తోంది. వీటిని ఎలా విశ్వసించాలి?. ఫలితాల వెల్లడివేళ బీజేపీ అనుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు ఎగ్జిట్ పోల్స్ ప్రయతి్నస్తున్నాయి’ అని ఆరోపించారు. -
ధ్యానం చేస్తూ ఎవరైనా కెమెరా తీసుకెళ్తారా?: మమత
బారూయ్‌పూర్(పశి్చమబెంగాల్): వివేకానంద శిలాస్మారకం వద్ద ప్రధాని మోదీ చేయబోయే ధ్యానంపై టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ అనుమానం వ్యక్తంచేశారు. మంగళవారం పశి్చమ బెంగాల్‌లోని జాదవ్‌పూర్ నియోజకవర్గంలో టీఎంసీ ఎన్నికల ప్రచార ర్యాలీలో మమత ప్రసంగించారు. ‘‘ మేం ఖచి్చతంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేస్తాం. ఆయన ధ్యానం చేసుకోవాలనుకుంటే చేసుకోమనండి. కానీ ఆయన మెడిటేషన్ చేస్తున్నపుడు టెలివిజన్‌లో ప్రత్యక్ష ప్రసారాలు చేస్తే ఒప్పుకోం. ధ్యానం చేసేందుకు వెళ్తూ ఎవరైనా కెమెరా వెంట తీసుకెళ్తారా?’’ అని అన్నారు. -
US presidential election 2024: ట్రంప్ మానసిక స్థితిపై అనుమానాలు: నిక్కీ హేలీ
కొలంబియా: అమెరికా మాజీ అధ్యక్షుడు, మళ్లీ అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ మానసిక ఆరోగ్యంపై భారత సంతతికి చెందిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి నిక్కీ హేలీ అనుమానం వ్యక్తం చేశారు. అమెరికా హౌస్ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ పేరుకు బదులుగా తన పేరును ప్రస్తావించడంపై ఆమె ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆమె న్యూహ్యాంప్‌షైర్‌లోని కీనీలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాట్లాడారు. 2021 జనవరి 6వ తేదీన క్యాపిటల్ హిల్ సెక్యూరిటీ ఇన్చార్జిగా అప్పటి అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ పేరుకు బదులుగా హేలీ పేరును ట్రంప్ పేర్కొనడంపై ఆమె స్పందించారు. మానసికంగా సరిగా లేని ట్రంప్ అధ్యక్ష పదవిలో ఒత్తిళ్లను ఎదుర్కొనగలరా అనేది అనుమానమేని పేర్కొన్నారు. -
దారుణం: సగం గుండు కొట్టించి.. మెడలో చెప్పుల దండలు వేసి..
రాంచీ: జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్‌లో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. దొంగతనం చేసి దొరికిపోయిన ఇద్దరు యువకులను స్థానికలు పట్టుకుని శిరోముండనం చేశారు. అనంతరం చెప్పుల దండలు మెడలో వేసి.. ఓ బురద గుంటలో నిల్చోబెట్టారు. ఈ దారుణ ఘటన రాజ్‌మహల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఇద్దరు యువకులు ఓ మహిళ ఇంట్లో రూ.4300 దొంగతనం చేశారు. ఇందులో ఓ బాలుడు దొరికిపోయాడు. అతన్ని పట్టుకున్న స్థానికులు మరో బాలున్ని ఇంట్లో నుంచి లాక్కొచ్చారు. ఊర్లో అందరి సమక్షంలోనే సగం గుండు కొట్టించారు. అనంతరం చెప్పుల దండలు మెడలో వేసి, ఊరేగించారు. ఈ ఘటనను కొందరు యువకులు వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఇవి కాస్త వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు.. బాధితుల ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేశారు. పిల్లలను ఆరు గంటల పాటు బురదలోనే నిల్చొబెట్టారని బాధితుల తల్లిదండ్రులు ఆరోపించారు. రూ.3000 విధించిన జరిమానా చెల్లించిన తర్వాతనే పిల్లలను వదిలిపెట్టారని పోలీసులకు చెప్పారు. దర్యాప్తు కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు. దోషులపై కఠిన శిక్షలు విధిస్తామని వెల్లడించారు. ఇదీ చదవండి: డ్రైవింగ్‌లో ‘భ్రాంతి’ ముప్పు!.. 50% రోడ్డు ప్రమాదాలకు కారణమిదే! -
20 ఏళ్లుగా ఇంట్లోనే బంధించి..
లంగర్‌హౌస్: భార్యపై అనుమానంతో 20 ఏళ్లుగా ఆమెను గదిలో పెట్టి బంధించి, నరకం చూపించాడు. ఎవరితో మాట్లాడినా అనుమానిస్తూ అనేకమార్లు ఇళ్లు మారాడు. చివరకు నాంపల్లి నుంచి లంగర్‌హౌస్ బాగ్దాద్ కాలనీకి మకాం మార్చాడు. పక్కింటి వారితో మాట్లాడిందని ఆరాతీసి భా ర్యను అతికిరాతకంగా హతమార్చాడు. ఈ సంఘటన లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం అర్ధరాత్రి జరిగింది. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీలో నివాసముండే జహంగీర్‌కు పంజగుట్టలో నివాసముండే కనీజ్బేగం(40)తో 2004లో వివాహమైంది. వీరికి ఇద్ద రు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. ఆటో నడిపించే జహంగీర్ పెళ్లైన నాటినుంచే భార్యను అనుమానిస్తూ వేధిస్తున్నాడు. చివరకు తన తల్లితో కూడా భార్యను ఎక్కువగా మాట్లాడనిచ్చేవాడు కాదు. అతను బ యటకు వెళ్లే సమయంలో భార్యను గదిలో ఉంచి బయట నుండి తాళం వేసుకొని వెళ్లిపోయే వాడు. గొడవలు చూసి ఇళ్ల యజమానులు హెచ్చరించడంతో పలుమార్లు ఇళ్లు మారాడు. 10 ఏళ్ల కిందట గొడవలు పెరగడంతో నలుగురు పిల్లలు అయ్యాక అనుమానమేంటని సర్ది చెప్పిన పెద్దలు కనీజ్ను మళ్లీ కాపురానికి పంపించారు. చిన్న కూతురును అడిగి... భార్యపై అనుమానంతో ఇళ్లు మారుతున్న జహంగీర్ పన్నెండు రోజుల క్రితం లంగర్‌హౌస్ బాగ్దాద్ కాలనీకి మకాం మార్చాడు. ఐదు రోజుల కిందట తన చిన్న కూతురుని పిలిచి అమ్మ ఇక్కడ ఎవరితో అయిన మాట్లాడిందా అని అడిగాడు. పక్కింటి వారితో మాట్లాడిందని కూతురు చెప్పడంతో.. ఊగిపోయిన జహంగీర్ భార్యను నడివీధిలో దారుణంగా కొట్టాడు. దీంతో పిల్లలను తీసుకొని ఎండీలైన్స్‌లో నివాసముండే తన అన్న గఫార్ ఇంటికి వెళ్లింది. శనివారం సాయంత్రం గఫార్ ఇంటికి వెళ్లిన జహంగీర్.. కలిసి ఉందామని నమ్మబలికి, పిల్లలను అక్కడే వదిలి భార్యను బాగ్దాద్ కాలనీలోని ఇంటికి తీసుకొచ్చారు. రాత్రి భోజనం చేశాక భార్యతో మరోమారు గొడవ పడి... చున్నీతో ఆమె గొంతును బిగించి హత్య చేశాడు. అనంతరం లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి భార్యను హత్య చేశానని చెప్పి లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించి మృతదేహాన్ని ఉస్మానియా మార్చూరీకి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ఎదురింటి వ్యక్తినే ప్రేమించి పెళ్లిచేసుకుంది.. పాపం ఇది ఊహించలేదు
తిరువణ్ణామలై(వేలూరు): వారి సంసారంలో అనుమానమే పెనుభూతమైంది. భార్యపై అనుమానంతో భార్య తాళి దారంతోనే గొంతు బిగించి హత్య చేసి పరారైన భర్త కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాల ప్రకారం..తిరువణ్ణామలై జిల్లా సెయ్యారు తాలుకా అన్న పుదూరు గ్రామానికి చెందిన రంజిత్ చెన్నైలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతను తన ఎదురింటికి చెందిన కౌసల్య(23)ను రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కౌసల్య సెయ్యారులోని షూ కంపెనీలో పనిచేస్తోంది. దంపతులకు ఏడాది వయసున్న కుమారుడున్నాడు. ఇదిలా ఉండగా భార్యపై అనుమానంతో రంజిత్ తరచూ ఘర్షణ పడేవాడు. వీటితో పాటు రంజిత్ తండ్రి రాజ, తల్లి శాంతి తరచూ వరకట్నం కోసం వేధించేవారు. గత కొద్ది నెలల క్రితం భార్య భర్తల మధ్య ఘర్షణ ఏర్పడటంతో కౌసల్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇద్దరితో చర్చించి ఇంటికి పంపి వేశారు. ఆదివారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో భార్యపై అనుమానంతో రంజిత్ ఘర్షణ పడ్డాడు. ఆ సమయంలో ఆగ్రహించిన రంజిత్ భార్య తాళి దారంతోనే గొంతు బిగించి హత్య చేసి తన కుమారుడిని తీసుకొని ఇంటి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న అనకావూరు పోలీసులు కేసు నమోదు చేసి కౌసల్య మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి రంజిత్ కోసం గాలిస్తున్నారు. -
భార్యపై అనుమానం.. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మరీ భర్త దారుణం
సాక్షి, హైదరాబాద్: అనుమానమే పెనుభూతమై కట్టుకున్న భార్యను దారుణంగా హతమార్చి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడో వ్యక్తి. ఈ సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు.. జనగాం జిల్లా కొడవటూరు గ్రామానికి చెందిన బండ రాజు (38), బండ కవిత (34) దంపతులు జవహర్‌నగర్‌లో నివాసముంటున్నారు. రాజు ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. కుమార్తె జ్యోతి ఇంటర్ చదువుతుండగా కుమారుడు పదోతరగతి చదువుతున్నాడు. కాగా కొన్ని రోజులుగా దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. భార్యపై అనుమానం పెంచుకున్న రాజు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మా ఇద్దరి శవాలను తీసుకెళ్లండి అని సమాచారం అందించాడు. భయపడ్డ కుటుంబసభ్యులు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చి ఇంటికి వచ్చారు. గడ్డపారతో డోర్ పగులగొట్టి చూసే సరికి రక్తపు మడుగులో కవిత, ఉరివేసుకుని రాజు విగతజీవులుగా కనిపించారు. భార్యను అతికిరాతకంగా కట్టర్‌తో గొంతు కోసి హత్యచేసి ఆపై తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు బావిస్తున్నారు. ఘటనా స్థలానికి మల్కాజిగిరి డీసీపీ రక్షితమూర్తి, కుషాయిగూడ ఇంచార్జ్ ఏసీపీ విజయ్ శ్రీనివాస్, సీఐ చంద్రశేఖర్, ఎస్ఐలు అనిల్‌రెడ్డి, అనిల్‌కుమార్ చేరుకుని ఆధారాలు సేకరించి, మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా తల్లిదండ్రులిద్దరూ మృతిచెందడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. పిల్లలు ఇంటికి వచ్చేసరికి తల్లి రక్తపు మడుగులో, తండ్రి ఉరివేసుకుని విగతజీవులుగా పడి ఉండడంతో పిల్లల రోదనలు మిన్నంటాయి. చదవండి: Nizam College: విద్యార్థుల నిరసన.. తలనొప్పిగా సర్కార్ ఉత్తర్వులు -
వరంగల్.. అనుమానంతో భార్యను కడతేర్చిన ఆర్ఎంపీ
సాక్షి, వరంగల్: పచ్చని సంసారంలో అనుమానం చిచ్చురేపింది. ఆ ఇల్లాలి పాలిట అదే పెనుభూతమైంది. చివరికి హతమార్చింది. అనుమానంతో వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం అమీనాబాద్‌కు చెందిన జన్ను అరుణ(38)ను భర్త నరేశ్ శుక్రవారం హత్య చేశాడు. నరేశ్ ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు. 20 ఏళ్ల క్రితం నర్సంపేట మండలం మగ్ధుంపురం గ్రామానికి చెందిన కోడూరి కట్టయ్య కూతురు అరుణతో వివాహం జరిగింది. అరుణ ఆశ కార్యకర్తగా పని చేస్తోంది. వారికి కూతురు, కుమారుడు జన్మించారు. అరుణను నిత్యం నరేశ్ అనుమానిస్తూ వేధింపులకు గురి చేసేవాడు. పెద్ద మనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయతీలు నిర్వహించి ఆమెను కాపురానికి పంపారు. సద్దుల బతుకమ్మ, దసరా పండుగకు పిల్లలను తీసుకుని దంపతులు మగ్ధుంపురం వెళ్లి గురువారం రాత్రి అమీనాబాద్‌కు తిరిగి వచ్చారు. అర్ధరాత్రి దాటాక ఆమె తల వెనుక కటింగ్ ప్లేయర్‌తో బలంగా పొడిచాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం నరేశ్ పరారయ్యాడు. శుక్రవారం ఉదయం నిద్రలేచిన కూతురు, కుమారుడు రక్తపు మడుగులో ఉన్న తల్లి మృతదేహాన్ని చూసి కేకలు వేస్తూ చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చారు. నెక్కొండ సీఐ హత్తిరాం, ఎస్సై సీమా పర్వీన్ పోలీసు సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. స్థానికులను విచారించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నర్సంపేట ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. మృతురాలి కుటుంబీకులు రోధించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. -
ప్రేమ పెళ్లి.. భార్యపై అనుమానం.. చివరికి ఊహించని ఘటన
సత్తెనపల్లి(పల్నాడు జిల్లా): మూడుముళ్ల బంధం.. అనుమానపు కత్తులకు ముక్కలైంది. ఏడడుగుల అనుబంధం.. అపోహల అగాథంలో చిక్కి విచ్చిన్నమైంది. క్షణికావేశం.. ఓ బాలిక బంగారు భవిష్యత్తును బలిపీఠం ఎక్కించింది. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త అతి కిరాతకంగా ఆమెను హతమార్చిన ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. సత్తెనపల్లి ఒకటో వార్డు అచ్చంపేట రోడ్డుకు చెందిన పసుపులేటి విజయలక్ష్మి (40), నాగరాజు దంపతులు. వీరి కులాలు వేరైనా 15 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చదవండి: విషాదంలో ఎంత ఘోరం.. రీల్స్ తీస్తుండగా.. నాగరాజు అబ్బూరు రోడ్డులోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ముఠా పనికి వెళ్తుండగా, భార్య విజయలక్ష్మి ఇంటి వద్దే టైలరింగ్ చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటుంది. కొంతకాలం వీరి కాపురం ఎంతో అన్యోన్యంగా సాగింది. వీరికి ఒక కుమార్తె, కుమారుడు జన్మిచారు. కుమారుడు ఐదేళ్ల వయస్సులోనే మరణించాడు. కుమార్తె మీనాక్షి ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతోంది. నాగరాజుకు భార్య విజయక్ష్మిపై ఐదేళ్ళ నుంచి అనుమానం ఉంది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగాయి. విభేదాలు తారాస్థాయికి చేరడంతో గతంలో నాగరాజు ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. కుమార్తెను పెట్టుకొని విజయలక్ష్మి జీవించింది. కుమార్తె భవిష్యత్తు దృష్ట్యా ఇద్దరూ కలిసి ఉండాలని రెండేళ్ల క్రితం నిర్ణయించుకున్నారు. అయితే మళ్లీ భార్యపై అనుమానం పెంచుకున్న నాగరాజు నాలుగునెలలుగా వేధిస్తున్నాడు. ఈక్రమంలో ఆదివారం ఉదయం ఇంటికి వచ్చిన నాగరాజు ఇంట్లో పనులు చేసుకుంటున్న భార్య తలపై ఇనుప బద్దెతో గట్టిగా మోదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. నాగరాజు పరారయ్యాడు. ఘటనా స్థలాన్ని సత్తెనపల్లి టౌన్ సీఐ యు.శోభన్ బాబు సందర్శించి వివరాలు సేకరించారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతురాలి సోదరి నాగేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే తల్లి విజయలక్ష్మి మృతి చెంది రక్తపు మడుగులో పడి ఉండటం, తండ్రి నాగరాజు పరారీ కావడంతో అమ్మా నాకు దిక్కెవరమ్మా.. ఒక్కసారి లేమ్మా అంటూ కుమార్తె మీనాక్షి గుండెలవిసేలా రోదిస్తున్న తీరు చూపరులను కలచి వేస్తోంది. నాగరాజు సత్తెనపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగి పోయినట్లు తెలిసింది. -
అనుమానంతో భార్యను హత్య చేసి.. అత్తమామ ఇంటికి తీసుకెళ్లి
సాక్షి, బెంగళూరు: అగ్నిసాక్షిగా తాళి కట్టిన భార్యను అనుమానించి చివరికి హత్య చేసిన ఘటన సోమవారం రాత్రి హగరిబొమ్మనహళ్లి తాలూకా బ్యాసగదేరి గ్రామంలో జరిగింది. విజయనగర జిల్లా ఎస్పీ డాక్టర్ అరుణ్ తెలిపిన మేరకు వివరాలు..బ్యాసగదేరి నివాసి రవికుమార్(32) తన బంధువు దీపా(21)తో దాదాపు ఏడాదిన్నర క్రితం పెళ్లయింది. అప్పటి నుంచి భార్యపై అనుమానపడుతూ నిత్యం గొడవ పడుతుండేవాడు. ఈక్రమంలో సోమవారం రాత్రి గొంతు నులిమి హత్య చేశాడని తెలిపారు. హత్య చేసిన అనంతరం అదే గ్రామంలో నివాసముంటున్న తన అత్తమామ ఇంటికి వద్దకు తీసుకెళ్లి మృతదేహాన్ని అక్కడ వదిలేసి వెళ్లాడని తెలిపారు. మృతురాలి తల్లి గౌరమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని రవికుమార్‌తో పాటు అతని తండ్రి షణ్ముఖప్ప, తల్లి జయమ్మ, అక్క శిల్ప, చెల్లెలు సుజాతలను బంధించి కస్టడీకి అప్పగించినట్లు తెలిపారు. చదవండి: నల్లగా ఉన్నావంటూ భార్యతో గొడవ.. గొడ్డలితో భర్తను నరికింది -
సాధువులపై దాడి...పిల్లలను ఎత్తుకుపోతున్నారనే అనుమానంతో కర్రలతో...
ముంబై: పిల్లలను ఎత్తుకుపోతున్నారనే అనుమానంతో కొంతమంది వ్యక్తులు ఆయుధాలతో సాధువులపై దాడి చేశారు. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని లవణ గ్రామంలో చోటు చేసుకుంది. ఐతే వీడియోలో ఒక కిరాణ దుకాణం వెలుపల కొందరూ సాధువులను కొట్టడం కనిపించింది. కానీ పోలీసులు మాత్రం ఈ విషయమై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. వీడియోని పరిసీలించి వాస్తవాలను వెల్లడిస్తామని చెప్పారు. ఈ మేరకు పోలీసుల విచారణలో...ఉత్తరప్రదేశ్‌కు చెందిన నలుగురు సాధువులు కర్ణాటకలో బీజాపుర్ నుంచి ఆలయ పట్టణం పండర్‌పూర్‌కు వెళ్తుండగా బాలుడిని దారి అడిగారు. వాళ్లు పిల్లలను కిడ్నాప్ చేసే ముఠాకు చెందిన వారిగా అనుమానించి స్థానికులు ఈ దాడికి పాల్పడ్డారు. వాస్తవానికి ఆ సాధువులు ఒక ఆలయం వద్ద ఆగిపోయి తిరిగి తమ ప్రయాణాన్ని పునః ప్రారంభిస్తున్నప్పుడూ ఈ ఘటన జరిగిందని. అదీకూడా ఎటువెళ్లాలని దిశ కోసం అడగడంతోనే ఈ ఘటనకు దారితీసినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే ఈ ఘటనను ఖండిస్తూ సాధువులతో ఇలాంటి అనుచిత ప్రవర్తనను రాష్ట్ర ప్రభుత్వం సహించదని అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఒక వీడియో సందేశంలో తెలిపారు. ఆయన 2020 ఘటనను ప్రస్తావిస్తూ...పాల్ఘర్లో సాధువుల హత్య కేసులో అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వ అన్యాయం చేసిందని, ప్రస్తుత మహారాష్ట్ర ప్రభుత్వం అలాంటి అన్యాయాన్ని సహించదని చెప్పారు. (చదవండి: అత్తారింటికి వెళ్లి కాల్పులు.. ఘరాన భర్త హల్చల్) -
మైనర్‌పై లైంగిక దాడి, జైలుకెళ్లి వచ్చాక పెళ్లి.. భార్యపై అనుమానంతో
సాక్షి, హైదరాబాద్: కుటుంబ కలహాలతో భార్యపై భర్త దాడి చేయడంతో త్రీవంగా గాయపడిన ఆమె మృతి చెందింది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన పరిధిలో బుధవారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... నందనవనంలో ఉండే సబా ఫాతీమా(22) మైనర్‌గా ఉన్నపుడు బైరామల్‌గూడలోని అల్లాఫ్ నగర్లో ఉంటూ కూలీ పని చేసే పాతనేరస్తుడు దాసరి సురేందర్ (30) ఆమెపై అత్యాచారం చేశాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మీర్‌పేట పోలీసులు అతడిపై ఫోక్సో తదితర కేసులు నమోదు చేసి జైలుకు పంపారు. జైలు నుంచి విడుదలైన తర్వాత బాధితురాలినే సురేందర్ కులాంతర వివాహం చేసుకున్నాడు. సురేందర్ తల్లి యాదమ్మ, భార్య సబా ఫాతీమాతో కలిసి అల్లాఫ్నగర్లో ఉంటున్నాడు. వీరికి 9 నెలల పాప ఉంది. 2021 డిసెంబర్లో బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం కేసులో మళ్లీ అరెస్టయి జైలుకు వెళ్లాడు. జైలు నుంచి వచ్చినప్పటి నుంచీ రోజూ తాగి ఇంటికి వచ్చేవాడు. కూతురు పుట్టడంతో భార్యపై అనుమానం వ్యక్తం చేస్తూ కొట్టేవాడు. ఇదే క్రమంలో బుధవారం భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవ జరిగింది. సురేందర్ భార్యపై చేయి చేసుకోవడం కింద పడి తీవ్ర రక్తస్రావమైంది. ఫాతీమా మెట్లపై నుంచి కిందపడి గాయపడిందని ఆమె తల్లిదండ్రులకు సురేందర్ సమాచారం ఇచ్చాడు. స్థానికులు వెంటనే ఫాతీమాను చికిత్స నిమిత్తం వనస్ధలిపురం ఏరియా ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె చనిపోయిందని చెప్పారు. మృతురాలి తల్లి షబానా బేగం తన కుతురును అల్లుడు సురేందర్, ఆమె తల్లి యాదమ్మ కలిసి హత్య చేశారని ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. చదవండి: నీ కుమారుడి కంటే దారణంగా చంపుతాం.. సిద్ధూ తండ్రికి బెదిరింపులు -
దొంగతనం ఆరోపణలతో.... పనిమనిషిని చిత్రహింసలకు గురిచేసి...
దొంగతనం చేసిందనే ఆరోపణలతో ఒక కుటుంబం పనిమినిషిని చిత్రహింసలు పెట్టి ఆత్మహత్య చేసుకుని చనిపోయే స్థితికి తీసుకు వచ్చింది. ఇంతలా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో కూడా ఆ కుటుంబం ఒక మంత్రగాడి మాటలు నమ్మి పనిమనిషి పట్ల అమానుషంగా ప్రవర్తించింది. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే...ఢిల్లీలో సత్‌బరిలోని అన్సల్ విల్లాలో ఉంటున్న ఒక కుటుంబం ఇంట్లో పది నెలల క్రితం ఒక దొంగతనం జరిగింది. ఐతే ఆ కుంటుంబికులు దొంగను కనిపెట్టేందుకు ఒక మంత్రగాడిని సంప్రదిస్తారు. అతను ఇంట్లో పనివాళ్లందరికీ సున్నం, అన్నం కలిపి ప్టెటమని చెప్పాడు. అది తిన్నప్పుడూ ఎవరి నోరు ఎర్రగా అవుతుందో వాళ్లే దొంగ అని చెప్పాడు. ఐతే బాధితురాలు తన కుటుంబంతో కలసి సదరు యజమాని కుంటుంబం వద్దే ఉంటుంది. వారి ఇంట్లోనే ఆమె రెండేళ్లుగా పనిమనిషిగా పనిచేస్తోంది. ఆ మాంత్రికుడు చెప్పినట్లుగానే ఇంట్లో పనిచేసే వాళ్లందరికి పెట్టారు. ఈ అన్నం తిన్న బాధితురాలి ముఖం ఎర్రగా మారింది. అంతే ఆమే దొంగ అని భావించి బట్టలు విప్పించి గదిలో బందించి కొట్టడం వంటి పనులు చేశారు. ఐతే ఆమె ఈ అవమానాన్ని భరించలేక ఎలకల మందు తిని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించింది. దీంతో సదరు కుటుంబికులు ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లడంతో ఈ విషయం వెలుగు చూసింది. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు కుటుంబం పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు. (చదవండి: మూడుముళ్లంటూ టీచర్‌కు మస్కా ) -
పచ్చనికాపురంలో చిచ్చురేపిన అనుమానం! భార్యను హతమార్చి భర్త ఆత్మహత్య..
సింథియా/మల్కాపురం(విశాఖ పశ్చిమ): జీవితంపై ఎన్నో కలలు కన్నాడు. కుటుంబంతో సంతోషంగా ఉండాలని భావించాడు. అక్క కూతురినే వివాహం చేసుకున్నాడు. కొంతకాలం పాటు సరదాగా సాగిన వీరి కాపురంలో ‘అనుమానం’ పెనుభూతంలా మారింది. జీవితాంతం తోడుంటానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసిన అతను.. విచక్షణ మరిచి డంబెల్‌తో భార్యను దారుణంగా హత్య చేశాడు. భార్య లేని లోకంలో తానెందుకు అనుకున్నాడో లేక భార్య మృతితో తీవ్రంగా ఆందోళన చెందాడో గానీ.. అతను కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పారిశ్రామిక ప్రాంతం శ్రీహరిపురంలోని గుల్లలపాలెంలో బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలివీ.. కాకినాడ ప్రాంతానికి చెందిన పోలవరపు శివనాగేశ్వరరావు(34) తన అక్క కూతురైన మాధవి(28)ని మూడేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. ఉపాధి నిమిత్తం కొంతకాలం కిందట విశాఖకు వలస వచ్చి.. శ్రీహరిపురంలోని గొల్లలపాలెం ప్రాంతంలోని కుంచుమాంబకాలనీలో నివాసం ఉంటున్నాడు. వృత్తిరీత్యా వెల్డర్ అయిన శివనాగేశ్వరరావు ఎక్కడ పని ఉండే అక్కడ చేస్తూ.. కుటుంబాన్ని పోషిస్తున్నాడు.పెళ్లయి మూడేళ్లయినా వీరికి పిల్లలు లేరు. కొంతకాలం సాఫీగా సాగిన వీరి జీవితంలో అనుమానం చిచ్చురేపింది. ఆరు నెలల నుంచి మాధవిపై శివనాగేశ్వరరావు అనుమానం పెంచుకోవడంతో వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన శివనాగేశ్వరరావు భార్యపై దాడికి తెగబడ్డాడు. వ్యాయామం కోసం ఉపయోగించే ఇనుప డంబెల్‌తో ఆమె తలపై బలంగా కొట్టాడు. ఈ ఘటనలో మాధవి అక్కడికక్కడే కుప్పకూలి మరణించింది. భార్య మృతితో తీవ్ర భయాందోళనకు గురైన శివనాగేశ్వరరావు కూడా అదే గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఆత్మహత్యకు ముందుకు తన అన్నయ్య కనకారావుకు వాట్సాప్‌లో మేసేజ్‌లు పంపించాడు. తన భార్యపై అనుమానం ఉందని, పలువురితో చనువుగా ఉంటోందని.. ఆమెకు ఎంత నచ్చజెప్పినా మాట వినలేదని అందులో పేర్కొన్నాడు. వాట్సాప్‌లో రెండు సందేశాలతో పాటు లెటర్‌పై తాను చనిపోవడానికి గల కారణాలు వివరించాడు. ఆందోళనతో కనకారావు వెంటనే తన భార్యతో కలిసి శివనాగేశ్వరరావు ఇంటికి వచ్చాడు. తమ్ముడికి ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ రావడంతో తలుపులు బలంగా తెరిచారు. గదిలోకి వెళ్లిచూడగా తమ్ముడు భార్య రక్తపు మడుగులో ఉండటం, తమ్ముడు ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఉండటంతో కేకలు వేశాడు. స్థానికులు, కుటుంబ సభ్యుల సమాచారం మేరకు మల్కాపురం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమ్తితం కేజీహెచ్‌కు తరలించారు. ఎన్నో ఆశలతో వివాహం చేసుకున్న వీరి జీవితం అనుమానం కారణంగా అర్ధాంతరంగా ముగిసిపోవడంపై కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మల్కాపురం సీఐ కూన దుర్గాప్రసాద్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఆస్తి కోసం దారుణం! తాతను హతమార్చిన మనవడు.. -
రోకలిబండతో మోది.. గొంతు కోసి
అనంతపురం: అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యనే ఓ భర్త దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనతో అనంతపురం నగరం ఉలిక్కిపడింది. నాల్గో పట్టణ సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపిన మేరకు.. అనంతపురంలోని సంగమేష్ నగర్‌కు చెందిన ఆదినారాయణకు వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వెంగమ్మ అలియాస్ లక్ష్మి (30)తో 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి నిఖిల్ (11), రామ్‌చరణ్ (8) అనే పిల్లలున్నారు. ప్రస్తుతం చంద్రబాబు కొట్టాలు ప్రాంతంలో నివాసముంటూ స్థానిక టమాట మండిలో కూలి పనులతో జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే మరో వ్యక్తితో లక్ష్మి వివాహేతర సంబంధం కొనసాగిస్తోందనే అనుమానాలు ఆదినారాయణలో బలపడ్డాయి. ఈ విషయంగానే దంపతుల మధ్య తరచూ గొడవలు చోటు చేసుకునేవి. దారుణానికి ఒడిగట్టి.. పాఠశాలకు సెలవు కావడంతో పెద్ద కుమారుడు నిఖిల్‌ను ప్రొద్దుటూరులోని తల్లిదండ్రుల వద్ద లక్ష్మి వదిలింది. ఆదివారం రాత్రి ఇంటిలో చిన్న కుమారుడు రామ్‌చరణ్ నిద్రిస్తున్నాడు. ఆ సమయంలో లక్ష్మితో ఆదినారాయణ గొడవపడ్డాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత రోకలిబండతో లక్ష్మి తలపై మోదాడు. అనంతరం కత్తి తీసుకుని అపస్మార స్థితిలో పడి ఉన్న భార్య గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె మృతి చెందిన అనంతరం అక్కడి నుంచి ఆదినారాయణ పరారయ్యాడు. సోమవారం ఉదయం ఈ విషయాన్ని గుర్తించిన స్థానికుల సమాచారం మేరకు డీఎస్పీ వీరరాఘవరెడ్డి, సీఐ కత్తి శ్రీనివాసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని, పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని రంగంలో దింపారు. -
అనుమానించాడు.. దారుణంగా హతమార్చాడు
లింగసముద్రం: వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో భార్య గొంతు కోసి కిరాతకంగా హతమార్చాడో భర్త. ఈ ఘటన మండలంలోని అన్నెబోయినపల్లెలో ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. కొటికలపూడి నరసింహం, రమణమ్మ (47) భార్యభర్తలు. నరసింహం ప్రతి రోజూ మద్యం తాగొచ్చి వివాహేతర సంబంధ పెట్టుకుంటుందనే అనుమానంతో భార్యను చిత్రవధ చేసేవాడు. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున భార్యతో గొడవకు దిగి తీవ్ర ఆగ్రహంతో ఆమె జుట్టు పట్టుకుని కత్తితో గొంతు కోశాడు. రమణమ్మ కేకలు విని చుట్టుపక్కల వారు ఇంటి వద్దకు చేరుకున్నారు. అప్పటికే ఆమె మరణించడంతో భర్త అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న కందుకూరు డీఎస్పీ కండె శ్రీనివాసులు, సీఐ శ్రీరాం, గుడ్లూరు ఎస్సై మల్లికార్జున సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పరారీలో ఉన్న నరసింహాన్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా రమణమ్మను తానే హతమార్చినట్లు ఒప్పుకొన్నాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరికి నలుగురు అబ్బాయిలు. ఇద్దరికి వివాహమవ్వగా మరో ఇద్దరు హైదరాబాద్‌లో బేల్దారి పనులు చేస్తున్నారు. -
భార్య మీద అనుమానం.. 3 నెలలుగా 30కేజీల ఇనుప చైన్‌తో..
జైపూర్: అనుమానం పెనుభూతమైతే బంధాలు అదృశ్యమవుతాయి. ఇక భార్యభర్తల మధ్య అనుమానం మొదలైతే ఆ బంధం అక్కడితో ముగిసిపోతుంది. భార్యను చిత్రహింసలకు గురి చేస్తాడు భర్త. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి రాజస్తాన్‌లో చోటు చేసుకుంది. భార్య మీద అనుమానంతో భర్త ఆమెను గత మూడు నెలలుగా ఇనుప చైనుతో బంధించి చిత్రహింసలకు గురి చేయసాగాడు. విషయం పోలీసులు దృష్టికి చేరడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు.. రాజస్తాన్ ప్రతాప్‌గఢ్ జిల్లాకు చెందిన బాధితురాలు(40), తరచుగా పుట్టింటికి వెళ్లేది. పొలం పనుల్లో తల్లికి సాయం చేసేది. భార్య ఇలా తరచుగా పుట్టింటికి వెళ్తుండటంతో భర్త ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. భార్యకు తల్లిగారి ఊరిలో ఎవరితోనే అక్రమం సంబంధం ఉందని.. అందుకే తరచుగా అక్కడకు వెళ్తుందని భావించాడు. ఈ క్రమంలో హోలీ పండగకు రెండు మూడు రోజుల ముందు ఇదే విషయమై భార్యతో గొడవపడ్డాడు. వివాదం కాస్త ముదరడంతో ఆగ్రహించిన భర్త దాదాపు 30 కేజీల బరువుండే ఇనుప గొలుసుతో ఆమెను బంధించి ఉంచి.. చిత్రహింసలకు గురి చేయసాగాడు. వృద్ధురాలైన తన తల్లికి సాయం చేయడానికే తాను పుట్టింటికి వెళ్తున్నానని భార్య చెప్పినప్పటికి అతడు వినలేదు. ఇప్పటికి మూడు నెలలుగా బాధితురాలిని కట్టేసి ఉంచాడు. దీని గురించి ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకుని బాధితురాలిని కాపాడారు. ఆమె భర్తను అరెస్ట్ చేవారు. ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ.. ‘‘పుట్టింటికి వెళ్లిన ప్రతి సారి నా భర్త అక్కడకు వచ్చి గొడవ చేసేవాడు. నా కుటుంబ సభ్యుల ముందే నన్ను కొట్టేవాడు. ఈ సారి ఏకంగా మూడు నెలల నుంచి నన్ను ఇనుప గొలుసుతో కట్టేసి.. హింసించడం ప్రారంభించాడు’’ అని తెలిపింది. చదవండి: అనుమానం; ఎలాగైన భార్యను చంపేయాలని పక్కా ప్లాన్‌తో! -
అనుమానం; ఎలాగైన భార్యను చంపేయాలని పక్కా ప్లాన్‌తో!
సాక్షి, వికారాబాద్ : ఓ వ్యక్తి అనుమానంతో భార్యను కత్తితో కిరాతకంగా పొడిచి చంపేశాడు. ఈ సంఘటన శనివారం అర్ధరాత్రి బంట్వారం మండల పరిధిలోని మద్వాపూర్‌లో చోటుచేసుకుంది. ఎస్ఐ ప్రవీణ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కె.ఆంజనేయులు, లక్ష్మి(40) దంపతులు. వీరు తమ ముగ్గురు పిల్లలతో కలిసి తాండూరులో ఉంటున్నారు. ఆంజనేయులు స్థానికంగా మున్సిపాలిటీలో కూలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. లక్ష్మి తరచూ పుట్టింటికి వెళ్తుండేది. ఈనేపథ్యంలో ఆమెకు వివాహేతర సంబంధం ఉందని అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఎలాగైనా భార్యను చంపేయాలని ఆంజనేయులు నిర్ణయించుకున్నాడు. ఈక్రమంలో లక్ష్మి కుటుంబ కలహాలతో వారంరోజుల క్రితం స్వగ్రామం మద్వాపూర్‌కు వెళ్లింది. ఆంజనేయులు పిల్లలను తాండూరులోనే వదిలేసి శనివారం సొంతూరుకు వెళ్లిపోయాడు. ఇంట్లో అర్ధరాత్రి సమయంలో లక్ష్మి నిద్రిస్తుండగా కమ్మ కత్తితో దారుణంగా పొడిచాడు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కొద్దిసేపటి తర్వాత లక్ష్మి చనిపోయింది. నిందితుడు ఆంజనేయులు ఆదివారం తెల్లవారుజామున బంట్వారం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. తన భార్యను కత్తితో పొడిచి హత్య చేసినట్లు పోలీసులకు తెలిపాడు. ధారూరు సీఐ తిరుపతిరాజు, ఎస్ఐ ప్రవీణ్‌రెడ్డి సిబ్బందితో కలిసి ఆదివారం ఉదయం మద్వాపూర్‌కు చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహానికి మర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. తల్లి హత్యకు గురవడం, తండ్రి జైలుకు వెళ్లడంతో లక్ష్మి పిల్లలు రేణుక, రాజు, నాగరాజు అనాథలయ్యారు. ఈమేరకు నిందితుడు ఆంజనేయులుపై హత్య కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు సీఐ తిరుపతిరాజు తెలిపారు. -
అనుమానాన్నే రుజువు అనలేం: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : అనుమానం..అది ఎంత బలమైనదైనప్పటికీ దానిని సాక్ష్యం స్థానంలో అనుమతించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సహేతుకమైన కారణంతో దోషిగా నిరూపించలేకపోతే నిందితుడిని నిర్దోషిగానే భావించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. ఒక చర్యకు నిందితులే కారణమని నిరూపించడానికి అందుకు దారితీసిన సంఘటనల క్రమాన్ని సాక్ష్యాలతోపాటు చూపాలని జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ హేమంత్ గుప్తాల ధర్మాసనం అభిప్రాయపడింది. ఓ హోంగార్డును కరెంటు షాకిచ్చి చంపేశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు వ్యక్తులకు విముక్తి కల్పిస్తూ ఒరిస్సా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ పైవ్యాఖ్యలు చేసింది. వనవిహారి మహాపాత్ర, అతని కొడుకు లుజా, మరికొందరితో కలిసి తన భర్త విజయ్‌కుమార్‌కు విషమిచి్చ, కరెంటు షాక్‌తో చంపేశారంటూ గీతాంజలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గీతాంజలి, ఆమె భర్త విజయ్ కుమార్ చందాబాలి పోలీస్ ఠాణాలో పనిచేస్తున్నారు. పోస్టుమార్టం నివేదికలో ఎలక్ట్రిక్ షాక్‌తోనే విజయ్‌కుమార్ చనిపోయినట్లు తేలింది. ఇది హత్యే అనేందుకు ఎలాంటి ఆధారాలు కూడా దొరకలేదు. నిందితులకు చెందిన ఒక గదిలో తన భర్త విగతజీవుడిగా పడి ఉన్నాడనీ, ఇది హత్యేనని గీతాంజలి ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలకు బలమిచ్చేలా అంతకుముందు ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోలేదని పేర్కొంటూ ఒరిస్సా హైకోర్టు నిందితులకు విముక్తి కల్పించింది. చదవండి: లాకర్ల విషయంలో భరోసా ఉండాల్సిందే -
‘నీ మరదల్ని చంపేశా.. వెళ్లి చూసుకోండి’
సాక్షి, అనంతపురం : నగరంలో ఓ మహిళ దారుణహత్యకు గురైంది. అనుమానంతో ప్రియుడే ఆమెను కడతేర్చాడు. దీంతో ఆమె ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన వివరాలను వన్‌టౌన్ సీఐ ప్రతాప్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. నగరానికి చెందిన యశోద (32)కు రాణినగర్‌కు చెందిన శంకర్ అనే రాడ్‌బెండర్‌తో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి తరుణ్‌తేజ్, యశ్వంత్ అనే కుమారులు ఉన్నారు. నాలుగేళ్ల అనంతరం భార్యాభర్తల మధ్య మనస్పర్దలు రావడంతో విడిపోయారు. పెళ్లై ఇద్దరు పిల్లలున్న బుక్కరాయసముద్రం మసీదు కొట్టాలకు చెందిన ఆటో డ్రైవర్ మల్లికార్జునతో యశోదకు పరిచయం ఏర్పడి సహజీవనం చేశారు. రెండేళ్లుగా నగరంలోని అశోక్‌నగర్‌లో నివాసముంటున్నారు. యశోద కుమారులిద్దరినీ అక్క విజయలక్ష్మి కొత్తచెరువు హాస్టల్లో చేర్పించింది. చదవండి: ఏ తల్లిని కదలించినా కన్నీటీ ధారలే.. అనుమానంతోనే కడతేర్చాడు.. యశోద మరొకరితో చనువుగా ఉన్నట్లు మల్లికార్జునకు అనుమానం వచ్చింది. ఈ విషయమై మాటామాటా పెరిగి మనస్పర్ధలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి ఇద్దరూ తీవ్రస్థాయిలో గొడవపడ్డారు. ఆవేశానికి లోనైన మల్లికార్జున రాడ్‌తో తలపై బలంగా మోదడంతో తీవ్రంగా గాయపడిన యశోద కొద్దిసేపటికే మృతి చెందింది. అనంతరం మల్లికార్జున అక్కడి నుంచి పరారయ్యాడు. చదవండి: స్నేహితుడిని చంపి సూట్‌కేస్‌లో కుక్కి.. ‘చంపేశా..వెళ్లి చూసుకోండి’ ‘నీ మరదల్ని చంపేశా. వెళ్లి దాన్ని చూసుకోండి’ అంటూ యశోద బావ (అక్క విజయలక్ష్మి భర్త) సంజీవ్‌కుమార్‌కు ఆదివారం ఉదయం మల్లికార్జున ఫోన్ చేసి చెప్పాడు. దీంతో సంజీవ్‌కుమార్ దంపతులు హుటాహుటిన అశోక్‌నగర్‌కు వెళ్లి చూడగా తలుపులు వేసి ఉన్నాయి. ఎంతసేపు పిలిచినా లోపలి నుంచి స్పందన రాలేదు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి తలుపులు బద్దలుకొట్టి చూడగా అప్పటికే యశోద మృతి చెందింది. దీంతో అక్క విజయలక్ష్మి బోరున విలపించింది. తన చెల్లిని చంపి పిల్లలిద్దరినీ అనాథల్ని చేశాడంటూ మల్లికార్జునకు శాపనార్థాలు పెట్టింది. వన్‌టౌన్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. -
తల్లిని బావి దగ్గర వదిలేశారు..
-
కరోనా వచ్చిందని తల్లిని బావి దగ్గర వదిలేశారు..
సాక్షి, వరంగల్: కరోనా మహమ్మారి మనుషుల్లో మానవత్వాన్నే కాదు, రక్త సంబంధాలను కూడా కాలరాస్తున్నాయి. రక్తం పంచి జన్మనిచ్చిన మాతృమూర్తినే కడుపున పుట్టినవాళ్లు కాదనుకున్నారు. తల్లికి కరోనా పాజిటివ్ రావడంతో ఇంట్లో నుంచి తీసుకువెళ్లి వ్యవసాయ బావి వద్ద వదిలేశారు. ఈ సంఘటన వరంగల్ అర్బన్ జిల్లా వేలేరు మండలం పీచర గ్రామంలో చోటుచేసుకుంది. మారబోయిన లచ్చమ్మ (82)కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో తల్లిని ఒంటరిగా వ్యవసాయ బావి వద్ద వదిలేసారు కన్న కొడుకులు. ఈ విషయాన్ని తెలుసుకున్న రైతులు పోలీసులకు సమాచారం అందించారు. వ్యవసాయ బావి వద్దే వృద్ధురాలు కన్నీటి పర్యంతమయ్యారు. కన్నకొడుకే ఇలా చేయడంపై వాపోతున్నారు. తనకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నట్లు చెబుతున్నారు. వృద్ధురాలి పరిస్థితిని చూసి స్థానికులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలం పనులకు వెళ్లే రైతులు ఆందోళన చెందారు. చివరకు పోలీసుల సాయంతో స్థానికులు వృద్ధురాలి కుటుంబ సభ్యులను ఒప్పించారు. ఆమె చిన్న కొడుకు ఇంటోనే లచ్చమ్మ క్వారంటైన్లో ఉండనున్నారు. (భారత్‌లో ఒక్కరోజే 90 వేల కేసులు) -
లండన్ నుంచి వచ్చిన యువకుడికి వైరస్!
సాక్షి, విశాఖపట్నం: విశాఖ జిల్లాలో మరో కరోనా కేసు నమోదైంది. పద్మనాభం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన యువకుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. లండన్‌లో ఉన్నత విద్యనభ్యసిస్తున్న యువకుడు ఈ నెల 17న విశాఖలో తన స్వగ్రామానికి వచ్చాడు. అతనికి కరోనా లక్షణాలు ఉన్న కారణంగా ఈ నెల 20న ప్రభుత్వ అంటువ్యాధుల ఆస్పత్రిలో చేరాడు. వైద్యులు ఆ యువకుడిని నమూనాలను పరీక్ష కోసం పంపించగా సోమవారం పాజిటివ్‌గా రిపోర్టు వచ్చింది. దీంతో విశాఖలో కరోనా కేసులు మూడుకు చేరాయి. కాగా బాధితుడు విశాఖ వచ్చిన తరువాత ఎవరెవరిని కలిశాడన్న విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. యువకుడి కుటుంబ సభ్యులు నలుగురితో పాటు, అతనికి సన్నిహితంగా మెలిగిన మరో 16 మందిని గుర్తించి వారిని ఐసొలేషన్ వార్డుకు తరలించారు. (కరోనాను అడ్డుకునే సామర్థ్యం భారత్ సొంతం) ఏడు గ్రామాలు దిగ్భందం పద్మనాభ మండలంలో కరోనా కేసు నమోదవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తెల్లవారుజాము నుంచే బాధితుడి నివాస ప్రాంతానికి మూడు కిలోమీటర్ల పరిధిలో పద్మనాభం మండలంలో 7 గ్రామాలను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, పోలీసులు దిగ్బంధించారు. వెంకటాపురం గ్రామంలోకి ఇతరులెవరూ ప్రవేశించకుండా మార్గాలను మూసేశారు. రేవిడి పీహెచ్సీ వైద్యాధికారిణి ఎన్.వి.సమత, ప్రపంచ ఆరోగ్య సంస్థ కన్సల్టెంట్ డాక్టర్ భవానీ, జిల్లా కరోనా నివారణ నోడల్ అధికారి పార్థ్దసారధి, ఎంపీడీవో జి.వి.చిట్టిరాజు, తహసీల్దార్ వి.త్రినాథరావునాయుడు ఆయా గ్రామాల్లో ప్రజల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. వెంకటాపురానికి మూడు కిలోమీటర్లు పరిధిలో ఉన్న రేవిడి, అన్నంపేట, రౌతులపాలెం, కోరాడ, భీమునిపట్నం మండలంలో మజ్జిపేట, మజ్జివలస గ్రామాలకు వైద్య, ఆరోగ్య శాఖకు చెందిన 60 బృందాలు ఇంటింటికి వెళ్లి స్థానికుల ఆరోగ్య వివరాలను సేకరించారు. జాగ్రత్తలను వివరించారు. స్థానికులు బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండాలని సూచించారు. (ఐటీ ఉద్యోగులకు హోం ఐసోలేషన్) ఆందోళన వద్దు.. నివారణకు చర్యలు: మంత్రి ముత్తంశెట్టి పద్మనాభం : ప్రజలు కరోనాపై ఆందోళన చెందాల్సిన పని లేదని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. వెంకటాపురంలో ఒకరికి కరోనా లక్షణాలు గుర్తించడంతో రేవిడి పీహెచ్‌సీని సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా నివారణకు ప్రభుత్వం పూర్తిగా చర్యలు తీసుకుంటుం దన్నారు. ప్రజలు స్వీయ నియంత్రణతో పాటు సామాజిక భద్రత పాటించాలన్నారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ మండల శాఖ అధ్యక్షుడు రాంబాబు, రమణ ఉన్నారు. -
అనకాపల్లిలో కరోనా కలకలం!
అనకాపల్లి/అనకాపల్లి టౌన్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ అనకాపల్లిలో కలకలం రేపింది. ఈ వ్యాధి లక్షణాలున్నట్టు భావిస్తున్న ఇద్దరు అనుమానితులను విశాఖ పట్నంలోని చెస్ట్ ఆస్పత్రికి తరలించారు. ఇటలీ, సింగపూర్ నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులకు కరోనా వైరస్ లక్షణాలున్నాయన్న అనుమానం స్థానికులకు భయాందోళనలకు గురిచేసింది. శారదా కాలనీకి చెందిన కృష్ణ భరద్వాజ్ అనే యువకుడు ఇటలీలో చదువుకుంటూ అనకాపల్లి వచ్చాడు. అతనికి ఎయిర్‌పోర్టులో స్క్రీనింగ్ టెస్ట్ చేశారు. ఎటువంటి వ్యాధి లక్షణాలు బయటపడకపోయినా దగ్గుతో బాధపడుతుండడంతో విశాఖ చెస్ట్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న జీవీఎంసీ సీఎంహెచ్వో శాస్త్రి శారదా కాలనీకి వచ్చి అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. ఆ యువకుడితో మాట్లాడినట్టు సమాచారం. కాలనీలో అన్ని ఇళ్లను సందర్శించిన పబ్లిక్ హెల్త్ విభాగం సిబ్బంది వీధుల్లో బ్లీచింగ్ ఫౌడర్ చల్లించారు. అతనికి కరోనా నిర్థారణ కాలేదని, కేవలం అనుమానం మాత్రమేనని వైద్యులు తెలిపారు. ఇటలీలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో పరిస్థితిని తెలుసుకున్న ఆ యువకుడు భయాందోళనలకు గురై ఉంటాడని పబ్లిక్ హెల్త్ విభాగం అధికారులు చెబుతున్నారు. కరోనా భయంతో ఆస్పత్రిలో చేరిక.. రావికమతం మండలానికి చెందిన ఎం. కుమార్ అనే యువకుడు సింగపూర్ నుంచి కొద్ది రోజుల కిందట విశాఖ వచ్చాడు. విశాఖ ఎయిర్‌పోర్టులో జరిపిన స్క్రీనింగ్‌టెస్ట్‌లో ఎటువంటి వ్యాధి లక్షణాలు లేకపోవడంతో కుమార్ ముందుగా పరవాడలోని తన మావయ్య ఇంటికి వెళ్లాడు. అక్కడ నాలుగు రోజులు గడిపిన కుమార్ రావికమతంలోని సొంతూరుకు వెళ్లాడు. తర్వాత వాళ్ల అమ్మమ్మ ఇంటికి వెళ్లిన కుమార్‌కు దగ్గు రావడంతో ఆందోళనకు గురైన అనకాపల్లి ఆస్పత్రికి తరలించారు. దగ్గు తీవ్రంగా రావడంతో అనకాపల్లి ఆస్పత్రిలో కరోనా వార్డులో చికిత్స అందించారు. కుమార్‌కు కరోనా లేదని కేవలం భయంతోనే ఆస్పత్రిలో చేరాడని వైద్యులు తెలిపారు. కుమార్‌కు పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహించి వైద్య పరీక్షలు చేసే నిమిత్తం విశాఖ చెస్ట్ ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా, వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల సమన్వయకర్త డాక్టర్ నాయక్ కుమార్ ఎయిర్‌పోర్టు నుంచి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడికి వెళ్లాడో తెలుసుకొని అతనితో దగ్గరగా మెలిగిన వ్యక్తుల వివరాలను తెలుసుకొనే పనిలో పడ్డారు. కాగా అనకాపల్లిలో ఇద్దరు వ్యక్తులకు కరోనా అనుమానిత లక్షణాలున్నట్టు ప్రచారం జరగడంతో పట్టణవాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ అంశంపై వైద్య శాఖ అధికారులు ఆచితూచి మాట్లాడుతున్నారు. -
కేరళకు పాకిన కరోనా?
కొచ్చి: చైనాలో విస్తరిస్తున్న కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. చైనా వుహాన్ నగరం నుంచి వచ్చిన కొచ్చికి చెందిన ఒక యువకుడు తీవ్రమైన జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలతో ఆసుపత్రిలో చేరడం కలకలం రేపుతోంది. ప్రాణాంతకమైన నిపా వైరస్‌తో ఇబ్బందులు పాలైన కేరళవాసుల్లో తాజాగా కరోనా మహమ్మారి మరింత గుబులు రేపుతోంది. ఇటీవల చైనానుంచి తిరిగి వచ్చిన యువకుడు, కరోనా వైరస్ బాగా వ్యాపించడం, ప్రపంచవ్యాప్తంగా అలర్ట్ జారీ చేయడంతో అనారోగ్యంతో ఉన్న అతను తొలుత ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుడిని సంప్రదించాడు. కరోనా వైరస్‌ను పోలిన అనునామానాస్పద లక్షణాలు కనిపించడంతో ఆ తరువాత అతడిని కలమసేరి వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతనికి కరోనా వైరస్ సోకినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎర్నాకుళం అదనపు జిల్లా వైద్య అధికారి డాక్టర్ ఎస్ శ్రీదేవి మాట్లాడుతూ విద్యార్థి శరీర ద్రవాల నమూనాలను పరీక్షల కోసం పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించినట్టుతెలిపారు. మరోవైపు చైనా నుండి తిరిగి వచ్చిన ఎట్టుమన్నూర్ కు చెందిన మరో విద్యార్థినికి కూడా కరోనా సోకిందనే ఆందోళన చెలరేగింది. అయితే ఆమె ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే వుందని, డాక్టర్ల అబ్జర్వేషన్లో ఉందని వైద్యులు తెలిపారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా వున్నామని జిల్లా వైద్యాధికారి ప్రకటించారు. మరోవైపు కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో కఠినమైన స్క్రీనింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. చైనానుంచి వచ్చిన వారిని నిశితంగా పరిశీలిస్తున్నారు. ఫ్లూ లాంటి లక్షణాలు ఏమాత్రం కనిపించినా వారిని హుటా హుటిన ఎర్నాకుళం ఆసుపత్రికి తరలించి సంబంధిత పరీక్షలు నిర్వహిస్తున్నారు. అటు చైనానుంచి ముంబైకి తిరిగి వచ్చిన ఇద్దరికి కరోనా సోకినట్టుగా అనుమానాలు వ్యక్తమైనాయి. ప్రస్తుతం వీరు చిన్చ్‌పోకలిలోని కస్తూర్బా సివిల్ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో వున్నారు. అయితే ప్రమాదకరమైన వైరస్‌కి సంబందించి ఎలాంటి కేసు నమోదు కాలేదని ముంబై వైద్యులు తెలిపారు. జనవరి 24 నాటికి, 96 విమానాల ద్వారా వచ్చిన 20,844 మంది ప్రయాణికులకు కరోనా వైరస్ స్క్రీనింగ్ చేశామని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఒక్కరోజే 19 విమానాలలో వచ్చిన 4082 మందిని పరీక్షించామని, ఇప్పటివరకు కరోనా వైరస్‌కు సంబంధించి ఎలాంటి కేసు నమోదుకాలేదని తెలిపింది. అయితే, ముగ్గురిని పరిశీలనలో ఉంచినట్టు తాజాగా ప్రకటించింది. Ministry of Health&Family Welfare: As on 24 Jan, 20,844 passengers from 96 flights have been screened for Novel #coronavirus symptoms. Today, 4082 passengers were screened in 19 flights. No case detected in the country so far. However, 3 persons have been put under observation. pic.twitter.com/zMfNHGzyaR — ANI (@ANI) January 24, 2020 చదవండి : ‘కరోనా’ బారిన తొలి భారతీయురాలు అచ్చం ఆ సినిమా తరహాలోనే చనిపోతున్నారు! -
కోడెల మృతిపై బంధువుల అనుమానం
-
మా ఆవిడ మాట్లాడదు
మగాళ్లు గమ్మత్తుగా ఉంటారు. ఊ..హు. మగాళ్లు కాదు.. మొగుళ్లు గమ్మత్తుగా ఉంటారు. పోట్లాడుకోడానికి మాటలు కావాలి కానీ.. మాట్లాడుకోడానికి మాటలెందుకు అనుకుంటారు! అలాంటి మొగుడితో మాట్లాడకుండానే పోట్లాడిన ఒక భార్య కథ ఇది. ‘అమ్మా... డాక్టర్ దగ్గరకు తీసుకెళ్దామనుకుంటున్నాను వినీతను’ అన్నాడు మురళి తల్లితో.తల్లి ఒక్క క్షణం ఏం మాట్లాడలేదు.కొడుకు వైపు అక్కరగా, సమర్ధింపుగా చూసింది.‘భూత వైద్యుడు నయమేమోరా’ అంది.‘దానికి దెయ్యమేమో అని అనుమానం. నా చిన్నప్పుడు మా ఊళ్లో ఆడవాళ్లకు మూగ దెయ్యం పట్టేది. వాళ్లు ఇలాగే ప్రవర్తించేవారు’ మళ్లీ అంది.మురళికి భార్య దగ్గర డాక్టర్ ప్రస్తావన తేవడమే కష్టంగా ఉంది. ఇక భూతవైద్యుడంటే ప్రళయం వచ్చేస్తుంది.‘డాక్టరే బెటరేమోనమ్మా’ అని లేచాడు.మురళికి పెళ్లయ్యి ఒకటిన్నర సంవత్సరం. వినితను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ వాక్యాన్ని ఇటు వైపు నుంచి చెప్తే మురళి దయదలిచినట్టు అనిపిస్తుందిగాని వినీత వైపు నుంచి చెప్తే తన అందచందాలకు, రూపానికి వినీతే మురళిని కటాక్షించి పెళ్లి చేసుకుందని చెప్పవచ్చు.మురళికి ఉద్యోగం ఉంది. వినీత ఉద్యోగం వద్దనుకుంది. మురళి తల్లిదండ్రులు ఇంట్లో ఉంటారు. టూ బెడ్రూమ్ ఫ్లాట్ అది. ఒక రూమ్ తల్లిదండ్రులకు, ఒక రూమ్ వీరిద్దరికీ.ఒక సంవత్సరం గడిచింది. కాని వినీతలో ఊహించని మార్పు వచ్చింది. సంఘటన 1:రైతుబజార్ నుంచి మురళి కూరగాయలు తెచ్చాడు. వినీత: అర కిలో వంకాయలు తెమ్మంటే కిలో తెచ్చారేం? మురళి: చీప్‌గా వచ్చాయ్. కిలో అయితే ఏం పోయిందిలే. వినీత: వంకాయ మీ ఇంట్లో ఎవరూ తినరు. నా కోసం తెమ్మన్నాను. నేనెంత తింటానని. ఇవి కదలవు. ఫ్రిజ్‌లో అడ్డం. ఇక నా నెత్తి మీద పోసుకోవాల్సిందే.మురళి: అంతైతే కొన్ని పనిమనిషికి ఇవ్వు.వినీత: మనం పెద్ద మహరాజులమా దానధర్మాలు చేయడానికి. నేను మామూలు హౌస్‌వైఫ్‌ని. పొదుపు చేయాల్సింది పోయి పారబోస్తుంటే అందరూ నవ్వుతారు.అంతవరకూ ఏ భార్యాభర్తలైనామాట్లాడుకుంటారు.కాని వినీత వెంటనే ఆ వంకాయల కవర్ వరకూ తీసుకెళ్లి బాల్కనీ నుంచి నేరుగా రోడ్డు మీదకు విసిరేస్తుంది. ఇక అలుగుతుంది. మాట్లాడదు. జవాబివ్వదు. బదులు పలకదు. కోపంగా బుసలు కొడుతూఉంటుంది.చిన్నదానికి ఇంత కోపమా. మురళికి హడలు. మురళి తల్లిదండ్రులకు కూడా హడలు. సంఘటన 2:చీపురు పట్టుకున్న వినీత మెయిన్ డోర్ దగ్గర నిలబడి ‘ఏమండీ’ అని గావుకేక పెట్టింది.మురళి ఉలిక్కిపడి పరిగెత్తాడు.‘ఏంటి’‘చూడండి చెప్పులు ఎలా విడిచారో. ఒకటి బోర్లా పడి ఉంది. చెప్పు బోర్లా పడితే దరిద్రమని తెలియదూ?’‘దాందేముంది... సరిచేయరాదా?’‘ఆ... నాకు ఇదే పని. మీరు దరిద్రాన్ని ఇంటికి తేండి. నేను చిమ్మి అవతల పారేస్తుంటాను’ అరిచింది.‘మీ అమ్మ మాసిన బట్టల్ని బాత్రూమ్లోనే విడిచేస్తుంది. వాషింగ్ మెషీన్ వరకూ తెచ్చి పడేయదు. అదొక దరిద్రం. మీ నాన్న షేవింగ్ చేసుకుని మగ్‌లోని నీళ్లు పారబోయరు అదొక దరిద్రం. మీరు బెడ్ కాఫీ తాగడానికి ముందు పళ్లుతోమరు. అదొక దరిద్రం. ఈ దరిద్రపు కొంపలోకి వచ్చి పడ్డాను’ అరుస్తూనే ఉంది. ఆ తర్వాత కనీసం ఒకరోజు మూగనోము పడుతుంది.చిన్నదానికి ఇంత రాద్ధాంతమా?ఇల్లు ఇల్లంతా వికలమైన మనసులతో కూచుంది. సంఘటన 3:వినీత: ఉదయాన్నే ఎక్కడికెళ్లారు? మురళి: కారు సర్వీసుకివ్వడానికి వెళ్లాను. వినీత: నాకు చెప్పొచ్చుగా. మురళి: నువ్వు బాత్రూమ్లో ఉన్నావు. వినీత: వెళ్లాక కాల్ చేయొచ్చుగా. మురళి: తొందరగా వచ్చేస్తాననుకున్నాను.ఆ టైమ్‌లో అతడు బ్రేక్‌ఫాస్ట్ కోసం డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నాడు. అతని తల్లిదండ్రుల్లో హాల్లో కూచుని ఉన్నారు. చిన్న సౌండ్‌లో టీవీ ఆన్ అయి ఉంది. కాని ‘ఠాప్’ అని పెద్ద సౌండ్‌లో పింగాణి ప్లేట్ కింద పడి ముక్కచెక్కలైంది. ఉప్మా ఉండలుగా ఫ్లోర్‌కు అంటుకుపోయింది. ప్లేట్‌ను విసిరికొట్టిన వినీత దెయ్యం పట్టినట్టు కోపంగా రొప్పుతూనే ఉంది. ‘డాక్టర్... ఇదీ పరిస్థితి’ అన్నాడు మురళి లేడీ సైకియాట్రిస్ట్‌తో.‘మీరు బయటకు వెళ్లండి’ అందామె.వినీతతో మాట్లాడటం మొదలెట్టింది. మొదటి రోజు బాల్యం. రెండవ రోజు కాలేజీ రోజులు. మూడో రోజు పెళ్లి రోజులు.ఐదోరోజుకు కాని వినీత మాట్లాడటం మొదలెట్ట లేదు.‘నావి చిన్న చిన్న కోరికలు కూడా తీరడం లేదండీ. నా మనసును అతడు అర్థం చేసుకోడు’ అంది.‘అంటే?’ అని అడిగింది సైకియాట్రిస్ట్.‘పెళ్లయిన కొత్తల్లో ఇనార్బిట్ మాల్ వెళ్దామన్నాను. నా ఉద్దేశం మేమిద్దరం మాత్రమే వెళ్లాలని. మురళి ఆ కోరిక వద్దనడు. కాని అందరినీ ఇన్వాల్వ్ చేస్తాడు. తల్లిదండ్రులనో దగ్గరలోనే ఉన్న అక్క వాళ్లనో లేదంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీలనో. నేను వద్దు అని చెప్పలేను. అతనికి అర్థం కాదు. రాత్రి పూట భోజనం అయ్యాక టెర్రస్ మీదకు వెళ్దాం అంటాను. కాసేపు కబుర్లు చెప్పుకుందామని. అలాగే అని ఫోన్ తెచ్చుకుంటాడు. నేనుచందమామను చూస్తాను. అతడు ఫోన్ చూస్తాడు. నేను చేయి పట్టుకుంటాను. అతడు ఫోన్ పట్టుకుంటాడు. స్నానానికి వెళితే టవల్ అడగడు. బ్రేక్‌ఫాస్ట్ సమయంలో కాఫీ అడగడు. వాళ్ల అమ్మనుఅడుగుతాడు. లేదంటే తనే ఏర్పాటు చేసుకుంటాడు. పెళ్లయ్యాక అందరూ హనీమూన్‌కు వెళతారు. మురళి ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకుని శ్రీశైలం బయల్దేరాడు...’‘అంతేనా?’ ‘అంతేనా.. అంటే’ నసిగింది.‘చెప్పండి..పర్లేదు’..‘రాత్రి పూట కూడా ఏదో డ్యూటీ చేసినట్టు ఉంటాడు. ఇష్టం, ప్రేమ, మోహం... అవన్నీ చూపాలనిగాని నాకు అవసరం అనిగాని అనుకోడు’‘ఇవన్నీ మనసులో పెట్టుకొని చిన్నచిన్న వాటికి రాద్ధాంతం చేస్తున్నారు’‘అవును’‘మీకు ఏ దెయ్యమూ లేదు. ఉంటే గింటే కమ్యూనికేషన్ సరిగ్గా చేయలేని జబ్బు మాత్రం ఉంది’‘అంటే డాక్టర్’‘చెప్తాను’ అని అతణ్ణి కూడా లోపలికి పిలిచింది.∙∙ ‘చూడండి... కొందరు ప్రతిదీ చెప్తారు. కొందరు ఏదీ చెప్పరు. మీ వైఫ్ రెండో టైప్. ఇక కొందరు చెప్పకపోయినా తెలుసుకుంటారు. కొందరు చెప్తే తప్ప తెలుసుకోలేరు. మీరు రెండో టైప్. ఈ రెండు టైప్లు కలవడం వల్ల ప్రాబ్లమ్. ఇక మీదట మీ భార్య మీకు ఏది ఇష్టమో అది చెప్తుంది. నోటితో చెప్తుంది. లేదంటే మెసేజ్ పెడుతుంది. లేదంటే నోట్‌బుక్‌లో రాసి చూపిస్తుంది. మీరు దానిని వినాలి. సీరియస్‌గా తీసుకోవాలి. ఆ కోరిక సబబైనదైతే తీర్చాలి. వీలుకానిది ఎందుకు వీలుకాదో చెప్పండి. (ఆమె వైపు తిరిగి) మీరు కూడా అతడు చెప్పినది అర్థం చేసుకోవాలి. చూడండి... మీ ఇద్దరూ లైఫ్‌ను మీ ఇద్దరి కోసం మొదట జీవించండి. ఒకరి కోసం ఒకరు టైమ్ పెట్టాలి అని గ్రహించండి. మురళీ... దీనిని మీకు ఎక్కువ చెప్తున్నాను. రోజూ ఏదో ఒక సమయంలో మాట్లాడుకోండి. సరిగ్గా మాట్లాడుకోకపోతే అనుమానాలు, సందేహాలు, దూరాలు పెరుగుతాయి. మాటకు మించిన ట్యాబ్లెట్ కానీ సంభాషణకు మించిన సర్జరీగానీ లేవు. మీరు ఈ రెంటినీ అందుకుంటే నా వంటి సైకియాట్రిస్ట్ అవసరమే రాదు’ సైకియాట్రిస్ట్ చెప్పడం ముగించింది.బయటికొచ్చిన వినీత, మురళి కారులో కూర్చున్నారు.‘ఐస్‌క్రీమ్ తిందామా’ వినీత అడిగింది. ‘మనిద్దరం మాత్రమే’ మురళి నవ్వాడు.కథ కంచికి. కొందరు ప్రతిదీ చెప్తారు. కొందరు ఏదీ చెప్పరు. మీ వైఫ్ రెండో టైప్. ఇక కొందరు చెప్పకపోయినా తెలుసుకుంటారు. కొందరు చెప్తే తప్ప తెలుసుకోలేరు. మీరు రెండో టైప్. ఈ రెండు టైప్లు కలవడం వల్ల ప్రాబ్లమ్. – కథనం: సాక్షి ఫ్యామిలీ ఇన్పుట్స్: పద్మ పాల్వాయి, సైకియాట్రిస్ట్ -
చెట్టుకు కట్టేసి..దారుణంగా కొట్టారు..
-
చెట్టుకు కట్టేసి..దారుణంగా కొట్టారు..
సాక్షి, బెంగళూర్ : మతిస్ధిమితం లేని వ్యక్తిని పిల్లల్ని ఎత్తుకెళ్లేవాడిగా అనుమానిస్తూ కొందరు చితకబాదిన ఘటన చోటుచేసుకుంది. ఒడిషాకు చెందిన ఓ వ్యక్తిని వైట్‌ఫీల్డ్‌కు సమీపంలో స్ధానికులు గుర్తించి పిల్లల్ని అపహరించేందుకు వచ్చాడని భావిస్తూ దాడికి దిగారు. ఆ వ్యక్తిని చెట్టుకు తాడుతో కట్టి దారుణంగా కొట్టారు. వ్యక్తిని చితకబాదుతూ తలపై గట్టిగా కొడుతున్న వీడియో వెలుగులోకి వచ్చింది. ఐడీ కార్డు చూపాలని అతడిని హిందీలో ఓ వ్యక్తి అడగడంకనిపించింది. మరికొందరు బాధితుడిని గేలి చేస్తూ బిగ్గరగా నవ్వుతూ వీడియోలో కనిపించారు. స్ధానికుల దాడి నుంచి వ్యక్తిని కాపాడిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా రెండు నెలల కిందట ఉత్తర కర్ణాటకలో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను పిల్లలను కిడ్నాప్ చేసే వ్యక్తిగా అనుమానిస్తూ స్ధానికులు చావబాదిన ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో వదంతుల ఆధారంగా మూక హత్యలు, దాడులను నిరోధించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని గత నెలలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. -
ప్రేయసిపై అనుమానం.. పళ్లు ఊడకొట్టాడు
అహ్మదాబాద్ : వివాహం అయ్యి, పిల్లలు పుట్టాక మరోక వ్యక్తిని ప్రేమించింది గీతాబేన్. అతనికి కూడా వివాహం అయ్యింది, పిల్లలున్నారు. అయినా కూడా వారిద్దరు తమ మొదటి జీవిత భాగస్వాములని, పిల్లలను వదిలి వచ్చి, సహజీవనం చేస్తున్నారు. ఇప్పటికి దాదాపు పదిహేనేళ్లు అవుతోంది. ఇంతకాలం బానే వుండేవాడు కానీ ఇప్పుడు తనపై అనుమానం పెంచుకుని హింసిస్తున్నాడని తెలిపింది. ‘ఇన్నాళ్లు సంతోషంగానే ఉన్నాను. కానీ ఒక ఏడాది నుంచి నా జీవితం నరకంగా మారిందం’టూ విలపిస్తోంది గీతాబేన్. వివరాల ప్రకారం.. అహ్మదాబాద్‌కు చెందిన గీతాబేన్(55) పెళ్లైన తర్వాత పదిహేనేళ్ల క్రితం మరో వ్యక్తిని ప్రేమించింది. అతని కోసం భర్త, పిల్లలను వదిలి పెట్టి వచ్చి మరి ఆ వ్యక్తితో జీవిస్తోంది. అతను(57) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూంటాడని తెలిపింది. ఇన్నాళ్లు అతను నన్నుబాగానే చూసుకున్నాడని, కానీ గత ఏడాది నుంచి అతని ప్రవర్తనలో మార్పు వచ్చిందని, నరకం చూపిస్తున్నాడని వివరించింది. ‘ఒక ఏడాది నుంచి నా భాగస్వామి నన్ను అనుమానించడం ప్రారంభించాడు. నన్ను పనికి పంపించడం మానేశాడు. అప్పటి నుంచి నేను ఇంట్లోనే ఉంటున్నాను. అయినా అతనికి అనుమానం తగ్గలేదు. బయట నుంచి ఎవరైనా నన్ను చూస్తున్నారేమోనని కిటికిలను ప్లాస్టిక్ షీట్‌తో కప్పేశాడు. అనుక్షణం నన్ను అనుమానిస్తూండేవాడు. చివరకు ఆ పిచ్చి ఎంత దాకా చేరిందంటే నన్ను అందవికారంగా మార్చడం కోసం నా ముందు పళ్లు రెండు ఊడగొట్టాడు. ఇప్పుడు ఇంట్లో కూడా ఉంచకుండా తనతో పాటే ఆటోలో నన్నూ తీసుకెళ్తున్నాడు. ఇంకా అతన్ని భరించడం నా వల్ల కాలేదు. అందుకే ఆటోలో నుంచి దూకి పారిపోయి వచ్చాను’ అంటూ పోలీసులకు వివరించింది. ప్రస్తుతం పోలీసులు గీతాబేన్ ప్రేమించిన వ్యక్తిని పిలిపించి కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నారు. ఆమెకు ఎటువంటి హానీ తలపెట్టనని రాత పూర్వక హామీ ఇస్తేనే గీతాబేన్ను అతనితో పంపిస్తామని తెలిపారు.. -
సనా ఇక్బాల్ జీవితం విషాదాంతం..
‘సనాతో మాట్లాడినతరువాత ఆ ఆలోచన విరమించుకున్నా. ఏమైనా సరే జీవించి సాధించాల్సిందే..’ అంటూ ఎంతోమంది ఆమె ఫేస్బుక్ పేజీకి పోస్టు చేసేవారు. మన దేశంమహిళలకు ఎంతోసురక్షితమైంది.నా పర్యటనలో ప్రతి చోటా సముచితమైన గౌరవం, మర్యాద లభించాయి. ఎంతో ఆదరణ పొందాను. ‘సూసైడ్ ఈజ్ నాట్ ద సొల్యూషన్’ అంటూ దేశానికి చాటిచెప్పిన సనా ఇక్బాల్ జీవితం విషాదాంతమైంది. ఆత్మహత్యాయత్నాల నుంచి వేలాది మందికి విముక్తి కల్పించిన ఆమె మంగళవారం అనుమానాస్పదంగా మృతిచెందడం అభిమానులను కలవరపరచింది. జీవించే హక్కు కోసం మరణించేవరకూ పోరాడిన స్ఫూర్తి ప్రదాత. ఆత్మహత్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం నడిపిన ధీరవనిత ఆమె. మరణం అంచుల్లో ఉన్న ఎంతోమందికి జీవితపు లోగిళ్లలో వెలుగులు నింపింది. తాను స్వయంగా తీవ్రమైన ఆందోళన, డిప్రెషన్, ఆత్మహత్యా సదృశమైన పరిస్థితులను జయించి ఫీనిక్స్‌లా పైకెగిసింది. తనలాగే డిప్రెషన్‌తో బాధడేవాళ్లను కలిసి ఆ బాధల నుంచి విముక్తి కల్పించింది. సనా స్ఫూర్తితో ఎంతోమంది ఆత్మహత్యాయత్నం నుంచి బయటపడ్డారు. జీవితాన్ని ఉత్సాహభరితం చేసుకున్నారు. కానీ సనా...మూడు పదుల వయసులోనే మంగళవారం నాటి దుర్ఘటనలో కన్నుమూశారు. సాక్షి, సిటీబ్యూరో : ఆత్మహత్యలు చేసుకోవద్దంటూ పిలుపునిచ్చి దేశవ్యాప్తంగా బైక్‌రైడ్ చేసి స్పూర్తి నింపిన హైదరాబాదీ అమ్మాయి సనా ఇక్బాల్ అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆత్మహత్యో, హత్యో, రోడ్డు ప్రమాదమో తెలియదు. కానీ ఆత్మహత్యల విజేత మాత్రం ఇక లేరు. ఆమె అభిమానులకు, డిప్రెషన్లో ఉన్న ఎంతోమందికి విషాదాన్ని మిగిల్చారు. ఆమె ఒక సాహసి.. సనా జీవితం ఆద్యంతం సాహసోపేతం. నిట్టూర్పులకు, నిరుత్సాహానికి తావు లేకుండా, నిరాశా నిస్పృహలను దరిచేరనీయకుండా గడిపారామె. చిన్న వయసులోనే చుట్టిముట్టిన కుంగుబాటును అధిగమించారు. ‘ఇక ఇంతేలే..జీవితం’ అనుకున్న నిస్సహాయ పరిస్థితుల్లో నలిగిపోయి ఫినిక్స్‌లా పైకెగిశారు. నగరంలోని టోలిచౌకీకి చెందిన సనా ఇక్బాల్ భౌతికంగా లేకపోయినా ఆమె అందించిన స్ఫూర్తి మాత్రం దేశంలోని అన్ని నగరాల్లో సజీవంగానే ఉంటుంది. ఆమె బైక్‌పై ఒంటరిగా దేశమంతా పయనించారు. 2015 నవంబర్ 23వ తేదీ నుంచి 2016 జూన్ 13వ తేదీ వరకు ఆమె చేసిన సాహసోపేత బైక్ రైడింగ్ ఒక సంచలనం. దేశంలోని 111 నగరాలు, 29 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాలలో సనా పర్యటించారు. ఆత్మహత్యలకు వ్యతిరేకంగా స్ఫూర్తిని రగిలించారు. ఆరున్నర నెలల పాటు, 38 వేల కిలోమీటర్ల దూరం సాగిన ఈ మహా యాత్రలో వేలాదిమంది ఆమె అభిమానులయ్యారు. ఆత్మహత్యాయత్నం నుంచి బయటపడ్డారు. ‘సూసైడ్ ఈజ్ నాట్ ద సొల్యూషన్’ అనే ఒకే ఒక్క నినాదమై సాగించిన యాత్రలో ఆమె వేలాది మందిని స్వయంగా పలికరించారు. ‘నాకు డిప్రెసివ్‌గా ఉందంటూ’ రాత్రి, పగలు తేడా లేకుండా ఆమె మొబైల్ ఫోన్‌కు ఎవరు సందేశాలు పంపించినా వెంటనే అప్రమత్తమయ్యేవారు. స్వతహాగా సైకాలజిస్ట్ అయిన సనా వారితో గంటలతరబడి మాట్లాడి ఆత్మహత్యా పరిస్థితుల నుంచి క్రమంగా బయటకు తీసుకొచ్చేవారు. ఆమె మాటలు వారిలో ధైర్యాన్ని నింపేవి. ఎంతో ఊరట కలిగించేవి. ‘సనాతో మాట్లాడిన తరువాత ఆ ఆలోచన విరమించుకున్నా. ఏమైనా సరే జీవించి సాధించాల్సిందే..’ అంటూ ఎంతోమంది ఆమె ఫేస్బుక్ పేజీకి పోస్టు చేసేవారు. కృతజ్ఞతలు చెప్పేవారు. ఇప్పటికీ ఆ సందేశాలు కనిపిస్తాయి. సైకాలజీలో ఎంఏ చేసిన సనా పలు కార్పొరేట్ విద్యా సంస్థల్లోనూ స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలిచ్చారు. ఇదీ సనా ప్రస్తానం ...... సనా బైక్‌రైడింగ్ సాహసయాత్ర నాటికి ఆమె కొడుకు ఐదు నెలల పసికందు. ఆ చిన్నారి బాబును ఇంట్లోనే వదిలి పెట్టి ఈ యాత్ర చేపట్టారు. అందుకు బలమైన కారణాలే ఉన్నాయి. ‘ఆత్మహత్య దేనికీ పరిష్కారం కాదు’ అనే సందేశంతో చేపట్టిన ఆ సాహసయాత్ర వెనుక ఎంతో విషాదంఉంది. సనా తల్లి షాహీన్ అడ్వొకేట్. తండ్రి కొన్నేళ్ల క్రితమే చనిపోయారు. సనా 2014 డిసెంబర్లో అబ్దుల్ నదీం అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఎంతో సంతోషంగా సాగుతుందనుకున్న దాంపత్య జీవితంలో ఒక్కసారిగా భయాందోళనలు అలుముకున్నాయి. నదీం వేధింపులతో సనాకు జీవితంపైనే విరక్తి కలిగింది. అతని నుంచి బయటకు వచ్చింది. కానీ అప్పటికే ఆమె గర్భిణి. ‘ఇక ఈ జీవితం బతకడానికి పనికిరానిదంటూ’ ఆమె తరచుగా ఆవేదన వ్యక్తం చేసేది. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు ఆమెను తీవ్రంగా వేధించాయి. సరిగ్గా ఆ సమయంలోనే సనా వాస్తవంలోకి వచ్చారు. డిప్రెషన్‌ను, విషాదాన్ని జయించి యాత్ర చేపట్టారు. తనలాంటి ఎంతోమందిని కాపాడాలనే సత్సంకల్పానికి అలా శ్రీకారం చుట్టారు. రైడ్‌లోనే మృత్యువును జయించారు... ఆ సాహసోపేతమైన బైక్‌రైడింగ్ ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో సాగిందంటే .... రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ముఖం పూర్తిగా దెబ్బతిన్నది. ఒకరకంగా సనా అప్పుడే మృత్యుముఖంలోంచి బయటపడ్డారు. కానీ తన సాహసయాత్రకు ఈ ప్రమాదం ఆటంకం కాలేదు. తన యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకొని హైదరాబాద్‌కు వచ్చిన తరువాత సనాఏమన్నారంటే...‘మన దేశం మహిళలకు ఎంతో సురక్షితమైంది. నా పర్యటనలో ప్రతి చోట సముచితమైన గౌరవం, మర్యాద లభించాయి. ఎంతో ఆదరణ పొందాను. ఉత్తరప్రదేశ్‌లోని ఒక ప్రాంతంలో యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగిలి ముఖం బాగా పాడయింది. టూర్‌కి ముందు ఇలాంటి ప్రమాదం జరిగి ఉంటే తప్పకుండా డిప్రెషన్లోకి వెళ్లెదాన్ని. కానీ ఇప్పుడు ఆ యాక్సిడెంట్ వల్ల పాడైన ముఖం నన్ను బాధ పెట్టలేదు. నాలాంటి ఎంతోమందికి స్ఫూర్తిని ఇచ్చిన ఈ రైడ్‌ను చివరి వరకు కొనసాగించాలనే పట్టుదలతోనే పూర్తిచేశాను’. రైడ్‌లో భాగంగా ఆమె కాలేజీలకు వెళ్లి విద్యార్ధులను కలిశారు. విషాదఛాయలు గోల్కొండ: సనా ఇక్బాల్ మృతితో టోలిచౌకి అల్‌హస్నాత్ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాలనీలో తెలిసినవారితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడే అమ్మాయి మృతి చెందిందన్న విషయం స్థానికులను షాక్‌కు గురిచేసింది. ఆమె ఉపయోగించే ద్విచక్ర వాహనం ఇంటి ముందు పార్క్ చేసి ఉంది. వాహనాన్ని చూసిన వారు సనా ఇక్బాల్‌ను గుర్తు చేసుకుంటూ కన్నీళ్ల పర్యంతమయ్యారు. అనుమానంగా ఉంది మంగళవారం తెల్లవారు జామున 2.30 గంటలకు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన సనా కారు పార్క్ చేస్తూ నాకు కాల్ చేసింది. అప్పటికే ఆమె భర్త నదీం కూడా అక్కడ ఉన్నాడు. ఆమె కోసమే అతడు వచ్చినట్లు నాకు అర్ధమైంది. ఆ సమయంలో అతనితో గొడవ పడడం మంచిది కాదని, తాను అతనితో కలిసి వెళ్తానని తన కొడుకును, లాప్‌టాప్‌ను తీసుకెళ్లాలని అక్క నాతో చెప్పింది, నేను అలాగే బాబును తీసుకొని ఇంట్లోకి వచ్చాను. సనా ఆమె భర్తతో కలిసి బయటకు వెళ్లింది. ఉదయం 7 గంటలకు సనా ప్రమాదానికి గురైనట్లు నదీం ఫ్రెండ్ అద్నాన్ వచ్చి చెప్పాడు. ఆసుపత్రికి కెళ్లాం. అక్క తీవ్రంగా గాయపడింది. అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్ చెప్పాడు. కానీ నదీం మాత్రం క్షేమంగా కనిపించాడు. నదీం మా అక్కను చంపేశాడని అనుమానంగా ఉంది. గతంలోనూ నదీంపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. – సబ, సనా చెల్లెలు ఫియర్లెస్.. తను చాలా ధైర్యవంతురాలు. సనాను వాండరర్ గ్రూప్‌కి నేను పరిచయం చేశాను. మొదటి రోజు నుంచి తాను చాలా బాగా రైడ్ చేసేది. ఒంటరిగా దేశమంతా తిరిగింది. భయం అన్నది తెలియదు. అసలు తను లేదనే విషయాన్ని నమ్మలేకపోతున్నా. – రాహుల్ సక్సేనా, (సనా మిత్రుడు) డేర్ డెవిల్... నాకు కూతుళ్లు లేరు. ఆ లోటు సనాని చూసినప్పుడు తీరిందనిపించేది. ఎవరికి పరిచయం చేసినా నా కూతురు అనే చెప్పేవాడిని. ఎంతో గౌరవంగా మెలిగేది. ఆల్ ఇండియా టూర్లో మగవాళ్లు కూడా రైడ్ చేయలేని దారుల్లో, పరిస్థితుల్లో ఒంటరిగా పయనించింది. ఆమెకి నా సెల్యూట్. ఆమె లేకపోవటం మా రైడర్స్‌కి తీరని లోటు – లలిత్‌జైన్, వాండరర్స్ రైడర్ గ్రూప్ ఓ కళాశాలలో సనా...(ఫైల్) , సాహసయాత్రకు వెళ్తూ..(ఫైల్) -
అనుమానం పెనుభూతమై..
భార్యను బండతో కొట్టి చంపిన భర్త గంపలగూడెం (తిరువూరు) : వేరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో భార్యను భర్త కిరాతకంగా హత్య చేసిన ఘటన మండలంలోని పెనుగొలనులో సోమవారం జరిగింది. ఘటనపై మృతురాలి తల్లి దుబ్బాకు నాగేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామానికి చెందిన ఇనపనూరి లక్ష్మణ్ తన భార్య కమలకుమారి (27)ని పచ్చడిబండతో బలంగా కొట్టి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరువూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్సై శివరామకృష్ణ సంఘటన వివరాలు తెలిపారు. విస్సన్నపేట మండల పుట్రేలకు చెందిన తన అక్క కుమార్తె కమలకుమారిని లక్ష్మణ్ పన్నెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. అనుమానంతో లక్ష్మణ్ రోజూ తన భార్యను వేధించేవాడు. పెద్ద మనషులు మందలించినా మార్పు రాలేదు. వేధింపులు తాళలేక ఏడాది కిందట కుమారి పుట్టింటికి వెళ్లిపోయింది. తిరిగి తొమ్మిది నెలల కిందట పెనుగొలను వచ్చింది. కొన్నిరోజులుగా మళ్లీ తన కూతురుని వేధించడం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలో సోమవారం లక్ష్మణ్ అతని అన్న సర్వేశ్వరరావు సహకారంతో కమలకుమారిని హత్యచేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
అనుమానంతో భార్య గొంతు కోసి..
-
అనుమానంతోనే కడతేర్చాడు
►భార్య హత్య కేసులో భర్త అరెస్ట్ నెల్లూరు (క్రైమ్) : మరొకరితో సన్నిహితంగా ఉందన్న అనుమానంతో భార్యను హత్య చేసిన ఘటనలో భర్తను ఐదో నగర పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. పోలీసుల సమాచారం మేరకు... ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పాతపాడుకు చెందిన మార్తాల సుమలత (28)కు అదే ప్రాంతానికి చెందిన రవీంద్రబాబుతో వివాహమైంది. వివాహానంతరం వారు పడారుపల్లి చలపతినగర్‌లో నివసిస్తున్నారు. వీరికి పవన్, మదన్ కుమారులు. రవీంద్రబాబు పలురకాల వ్యాపారం చేసి ఆర్థికంగా స్థిరపడ్డాడు. 2012లో ఆయన అనారోగ్యంతో మతి చెందాడు. ఇది జరిగిన కొద్దిరోజులకే రవీంద్రబాబు సోదరుడు శ్రీకాంత్‌తో ఆమె వివాహమైంది. కొద్దిరోజులు వారి కాపురం సజావుగా సాగింది. శ్రీకాంత్ హైదరాబాద్‌లోని కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ అప్పుడప్పుడు భార్య వద్దకు వచ్చి వెళ్తుండేవాడు. వ్యసనాలకు బానిసైన అతను సంపాదించిన మొత్తాన్ని ఖర్చు చేయసాగాడు. అప్పుల పాలయ్యాడు. ఈ నేపథ్యంలో చలపతినగర్‌లోని ఇంటిని అమ్మేందుకు భార్యపై ఒత్తిడి తెచ్చాడు. భార్య ససేమిరా అంది. అప్పటి నుంచి ఆమెపై ద్వేషం పెంచుకున్నాడు. ఈ క్రమంలో సుమలత తన ఇంటి పక్కనే ఉంటున్న ఆటో డ్రైవర్‌తో సన్నిహితంగా ఉండటాన్ని గమనించి అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై జూలై 25న దంపతుల నడుమ తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన శ్రీకాంత్ ఆమెను తీవ్రంగా కొట్టడంతో మతి చెందింది. ఆమెపై కిరోసిన్ పోసి నిప్పటించి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించాడు. అప్పట్లో బాధిత కుటుంబ సభ్యుల ఐదోనగర ఇన్స్పెక్టర్ జి. మంగారావుకు ఫిర్యాదు చేశారు. హత్య కేసు నమోదు చేసిన ఇన్స్పెక్టర్ గురువారం నిందితుడు శ్రీకాంత్‌ను అరెస్ట్ చేశారు. -
భార్యను కడతేర్చాడు
అనుమానమే కారణం సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కడప అర్బన్ : అతనికి కట్టుకున్న భార్యపై అనుమానం మొదలైంది. అదికాస్తా ముదిరింది. చివరకు ఆమెను కర్కశంగా మచ్చుకత్తితో నరికి చంపాడు. కడప నగర శివార్లలోని రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి శ్రీరాం నగర్లో నివసిస్తున్న చిన్నాయపల్లె గంగాదేవి(29)ని, భర్త నారాయణ మచ్చుకత్తితో దారుణంగా హత్య చేసిన సంఘటన నగరంలో సంచలనం కల్గించింది. ఈ సంఘటనకు సంబంధించి రిమ్స్ పోలీసులు, మృతురాలి బంధువుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎర్రగుంట్లకు చెందిన గంగాదేవికి, పెండ్లిమర్రి మండలం పైడికాల్వకు చెందిన నారాయణ కు 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి సంధ్యారాణి (4) అనే కుమార్తె ఉంది. నారాయణ బేల్దారి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వివాహ మైనప్పటి నుంచి వివిధ కారణాలతో భార్యతో గొడవపడుతుండేవాడు. దీనికితోడు ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం నుంచి వీరు కడప నగర శివార్లలోని శ్రీరాం నగర్ కాలనీలో నివసిస్తున్నారు. ప్రతి రోజూ లాగానే మంగళవారం రాత్రి మద్యం సేవించి వచ్చి భార్యతో గొడవపడ్డాడు. తర్వాత ఆమెను మచ్చు కత్తితో విచక్షణా రహితంగా నరికి దారుణంగా హత్య చేశాడు. గంగాదేవి అలాగే మంచంలోనే కుప్పకూలి మృతి చెందింది. సంఘటన స్థలాన్ని కడప డీఎస్పీ ఈజీ అశోక్ కుమార్, రిమ్స్ సీఐ మోహన్ ప్రసాద్, ఎస్ఐ రామాంజనేయులు తమ సిబ్బందితో పరిశీలించారు. మృతురాలి సోదరుడు శివగంగాధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల అదుపులో నిందితుడు తన భార్య గంగాదేవిని దారుణంగా మచ్చు కత్తితో నరికి చంపిన నారాయణ పోలీసుల అదుపులో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. -
అనుమానంతో ఆలి అంతం
♦ కమలాపురంలో ఘటన ♦ స్టేషన్లో లొంగిపోయిన భర్త కమలాపురం (ముదిగొండ): అనుమానం పెనుభూతమైంది. కమలాపురానికి చెంది న గురిజాల ఉప్పలమ్మ(38)ను ఆమె భర్త శ్రీను మంగళవారం అర్ధరాత్రి గొంతు నులిమి చంపేశాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కమలాపురానికి చెందిన రాయబారపు వెంకయ్య పెద్ద కుమార్తె ఉప్పలమ్మకు 20 ఏళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన గురిజాల శ్రీనుతో వివాహమైంది. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. గత కొంతకాలంగా భార్య(ఆలి)ని అనుమానంతో వేధిస్తున్నాడు. పెద్దమనుషుల వద్దకు పిలిపించగా..ఇకపై మంచిగా చూసుకుంటానని ఇంటికి తీసుకెళ్లేవాడు. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఆమెను గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత ఇంటినుంచి బయల్దేరి 13 కిలోమీటర్లు నడిచివెళ్లి ముందిగొండ చేరుకొని..తహసీల్దార్ కార్యాలయం వద్ద పడుకున్నాడు. బుధవారం ఉదయం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి..తన భార్యను హత్యచేసినట్లు చెప్పి లొంగిపోయాడు. కుటుంబ సభ్యులు ఉప్పలమ్మ చనిపోయిందని గుర్తించి..మృతురాలి తండ్రి వెంకయ్య కూడా శ్రీనుపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఖమ్మం డీఎస్పీ కొల్లు సురేష్‌కుమా ర్, ఖమ్మం రూరల్ సీఐ ఆంజనేయులు, ఎస్ఐ టి.కరుణాకర్ కమలాపురానికి వచ్చి మృతదేహాన్ని పరిశీవలించారు. పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఖమ్మం రూరల్ సీఐ ఆంజనేయులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఉసురు తీసిన అనుమానం
భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త పొదిలి మండలం గోగినేనివారిపాలెంలో ఘటన.. గోగినేనివారిపాలెం (పొదిలి) : అనుమానపు భర్త చేతిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటన మండలంలోని గోగినేనివారిపాలెం ఎస్సీ కాలనీలో బుధవారం వేకువ జామున జరిగింది. హతురాలి బంధువుల క థనం ప్రకారం.. వివరాలు.. గ్రామానికి చెందిన దాసరి తిరుపతమ్మ(30)కు అదే గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లుతో సుమారు 14 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. వెంకటేశ్వర్లు లారీ డ్రైవర్‌కాగా తిరుపతమ్మ ఇంటి వద్ద పనులకు వెళ్తుంటుంది. భార్యపై అనుమానం పెంచుకున్న వెంకటేశ్వర్లు.. రెండేళ్ల నుంచి ఆమెను మానసికంగా.. శారీరకంగా హింసిస్తున్నాడు. ఈ క్రమంలో కొంతకాలం బెంగళూరు తదితర ప్రాంతాల్లో బేల్దారి పనులకు కూడా వెళ్లి వచ్చారు. ఇటీవల భర్త నుంచి హింస ఎక్కువ కావటంతో పెద్దలు జోక్యం చేసుకుని దంపతులకు సర్ది చెప్పారు. అయినా పరిస్థితి మారకపోవటంతో తిరుపతమ్మ కొన్ని రోజులుగా పుట్టింట్లోనే ఉంటోంది. ఈ నేపథ్యంలో పుట్టింట్లో ఉన్న తిరుపతమ్మ బహిర్భూమి కోసం తెల్లవారు జామున ఒంటరిగా బయటకు వెళ్తుండగా వెంకటేశ్వర్లు ఆమెను అనుసరించి కత్తితో అతి కిరాతకంగా పొడిచి చంపాడు. ఆ వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. విడాకుల కోసం నోటీసులిచ్చి.. కాపురానికి రాకపోవడంతో విడాకులు ఇవ్వాలని వెంకటేశ్వర్లు ఇటీవల తన భార్య తిరుపతమ్మకు నోటీసులు కూడా పంపాడు. నోటీసుల విషయమై ఆమె గ్రామపెద్దల దృష్టికి తీసుకెళ్లగా మళ్లీ ఒకసారి సర్ది చెప్తామని, వ్యవహారం నోటీసుల వరకు ఎందుకని అన్నారని, ఇంతలోనే దారణం జరిగిందని బంధువులు కన్నీటిపర్యంతమవుతున్నారు. కోడిపిల్ల కోసేందుకని కత్తి.. కోడిపిల్లను కోసుకునేందుకు కత్తి కావాలని పొరుగింటి వారిని వెంకటేశ్వర్లు అడిగాడు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో కోడిపిల్లను కోసుకోవటమేమిటని వారు ప్రశ్నించగా ఇప్పుడు దొరికితే ఇప్పుడు కోస్తాను.. లేదంటే తెల్లారి దొరికినా కోస్తానని నమ్మబలికాడు. వారు నిజమేననుకుని కత్తి ఇచ్చారు. ఆ కత్తితోనే భార్యను హత్య చేసినట్లుగా భావిస్తున్నారు. సంఘటన స్థలాన్ని సీఐ శ్రీనివాసరావు, ఎస్సై శశికుమార్‌లు పరిశీలించారు. బంధువుల నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
అనుమానం లేదు... డౌట్ ఉంది...
సతిబాధ నా ఫోన్ మీద నిఘా. బయట నుంచి వచ్చాక బట్టలకు అంటిన పెర్ఫ్యూమ్ల మీద నిఘా. కారులో పొడవైన వెంట్రుకలు ఏమైనా దొరుకుతాయేమోనని కూంబింగ్. ఆధార్ కార్డులో అరవై ఏళ్లు పైబడ్డాయని గవర్నమెంట్ ప్రూఫ్ దొరికితే తప్ప పని మనిషిగా అపాయింట్మెంట్ లెటర్ హాండోవర్ చేయదు. ‘మీకు నీలిమా అంటే ఇష్టం కదండీ’... ‘అవును.’ ‘ఎంతిష్టం?’ ‘ఇప్పటి వరకూ ఉన్న ఎక్స్‌పీరియన్స్‌ను బట్టి నీలిమాయే బెస్ట్ అనుకుంటున్నాను’... ‘హు. అనుకున్నా. నన్నెప్పుడు పట్టించుకున్నార్లేండి. ఆ నీలిమా వెంటే పడి ఛావండి’.... లేచెళ్లిపోయింది. ఇప్పుడు తప్పేం మాట్లాడానని? సిటీలో ఏ రెస్టరెంట్‌కు వెళ్లినా మూసీ నుంచి గ్రాస్ తెచ్చి వండి పెడుతున్నారు. నీలిమాలో అయితే కనీసం చికెన్ అడిగితే కెచిన్నో, మటన్ అడిగితే టమన్నో సర్వ్ చేస్తున్నారు. అందుకే అది ఇష్టం అని చెప్పాను. కాని కాదట. మా ఆవిడ ప్రస్తావించింది ఆ నీలిమా కాదట. ఫోర్ నాట్ టూ నీలిమా అట. అసలు మా కాంప్లెక్స్‌లో ఫోర్త్ ఫ్లోర్ ఎక్కడ ఉందో నాకు తెలియదు. నాట్ ఒన్ కానీ నాట్ నాట్ టూ కానీ అంతకన్నా తెలియదు. ఇక సదరు నీలిమా అనే ఆ సంప్రదాయబద్ధ స్త్రీమూర్తి అంతకన్నా తెలియదు.మరి నన్ను అనుమానించడం తగునా? నాకు ఈ బాధ ఏంటి మదనా? ‘పెళ్లయిన కొత్తలో అడిగింది- మీకు ఏ హీరోయిన్ అంటే ఇష్టమండీ... సౌందర్య?’ ‘ఊహూ’. ‘సిమ్రాన్?’ ‘అ..హ...హూ’. ‘అలాగైతే వాణీ విశ్వనాథ్ అయి ఉంటుందిలేండి. మలయాళీలు చాలా చక్కగా ఉంటారని ఒకసారి అన్నారుగా’... ‘అ....హా..... హో...నో’... ‘మరెవరూ ఇష్టం లేదా’? ‘సావిత్రి’. ‘ఎవరూ? స్టూడెంట్ నం.1లో గజాలా పక్కన ఉంటుంది. ఆ అమ్మాయేనా’? ‘అయ్యో. పాత సినిమాల్లో ఉంటుందే ఆ సావిత్రే’. అంతే. ఎప్పుడు టీవీలో పాత సినిమాలొచ్చి సావిత్రి కనిపించినా ఒక డ్రై క్లాత్ తీసుకొని అడ్డం నిలబడి టీవీని తుడవడానికి రెడీ అయిపోతుంది. ఒక్కోసారి సావిత్రి చేయి కనిపిస్తుంది. ఒక్కోసారి సావిత్రి ముక్కు. సమస్త సావిత్రిని చూసే భాగ్యం ఆ రోజు నుంచి నాకు తుర్రుమంది. ఆ రోజు ఉదయం ఫోన్ మోగింది. అప్పటికి సరదాగా వంట చేద్దామని వంట గదిలో ఉన్నా. ‘బెండకాయ చేయనా’ అంటే ‘వద్దు... అవి లేడీస్ ఫింగర్స్... బంగాళదుంప చేయండి’... అంటే తొక్క తీసి తీరిగ్గా తరుగుతూ ఉన్నా. ఫోన్ మోగింది. చేయి ఖాళీ లేక ‘ఎవరో చూడు’ అనంటే ఫోన్ తీసింది. అవతల మా బాస్ పి.ఏ. ఉత్త హడావిడి మేళం. ఫోన్ ఎత్తింది మా మణిమకుటం అని తెలియక- ‘ఈవెనింగ్ సిక్స్‌కి’ అని పెట్టేసింది. ‘ఈవెనింగ్స్ సిక్స్కేమిటి? అది మీ ఆఫీస్ అయిపోయే టైమ్ కదా. ఎంతకాలంగా సాగుతోంది ఈ భాగోతం’ అంది. ‘అయ్యో. అది మీటింగ్ టైమే. మా బాస్ ఆ టైమ్‌లోనే మీటింగ్ పెడతాడు’ అనంటే వింటేగా. చివరకు ఆ రోజు మీటింగ్‌లో కూచున్నాక ఫోన్ ఆన్ చేసి పెట్టి మా ఆవిడకు మీటింగ్‌లో మా బాస్ ఎలా కామెడీగా కొరుక్కు తింటాడో అర్థం చేయిస్తే తప్ప నన్ను వదల్లేదు. ఒకరోజు ఢిల్లీ మిఠాయివాలా దగ్గర కిలో స్వీట్స్ కొని, సౌతిండియా షాపింగ్‌మాల్‌లో తనకిష్టమైన నిమ్మకాయరంగు వర్క్శారీ కొని తీసుకెళ్లి కానుకగా ఇచ్చి రాత్రి భోజనం అయ్యాక సోఫాలో తన అనుమతితో పక్కన కూచుని మంచి మూడ్‌లో ఉందని కన్ఫమ్ చేసుకున్నాక అడిగాను- నా మీద నీకంత డౌట్ ఎందుకు? ’ఊహూ.. చెప్పను’. ‘మా బంగారం కదూ’ ‘ఊహూ...’ ‘మా జోస్ అలూకాస్ కదూ’ ‘మరీ... మరీ... పెళ్లయిన రాత్రి గదిలోకొచ్చాక- నేను పక్కన కూచుంటే- చనువుగా చేయి పట్టుకున్నారు కదా- అందుకు. మీరెంత ముదుర్లయితే ఒక ఆడపిల్ల చేయి అంత చనువుగా పట్టుకోగలరు చెప్పండి.’.... ‘ఓసి నీ అనుమానం కట్టప్ప తోలుకెళ్ల... అసలే ముప్పయ్యేళ్లకు పెళ్లయ్యింది. అందాకా దారిన పోయే ఏ ఆడపిల్ల చెయ్యి చనువుగా పట్టుకున్నా గుడ్లు పీకి వాసన్కూ పళ్లు పీకి పార్థాకు పంపిస్తుంది. ఇన్నాళ్లకు పెళ్లాం వచ్చింది కదా కాదనే ధైర్యం ఎవరికుంది అని చేయి పట్టుకుంటే ఇదా నువ్విచ్చే సర్టిఫికెటు. వేసే ఐ.ఎస్.ఐ బ్రాండు’.... ‘ఏమో. ఎవరు చూడొచ్చారు. మీ మగాళ్లను నమ్మకూడదు’ ఇంత డౌట్ ఉన్నాక ఇక ఏ సిప్లా మందులు పని చేస్తాయి కనక? మా ఆవిడ బంగారం. నేనంటే భలే ఇష్టం. నాతోడిదే జీవితం. కాని ఈ డౌట్ ఉంది చూశారూ... దాంతోనే ప్రాబ్లమ్. స్త్రీ కదా సాటి స్త్రీతోనే విరుగుడు సాధిద్దాం అని సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకువెళదామంటే... ససేమిరా ససే సక్కుబాయి... లేడీ డాక్టర్ అయితే మీరు లైనేస్తారు... మగడాక్టర్ దగ్గరకు తీసుకెళ్లండి అంది. రాసిన చాలామందులు గులాబీ పూలకుండి మింగుతూ ఉంది. నా ఫోన్ మీద నిఘా. బయట నుంచి వచ్చాక బట్టలకు అంటిన పెర్ఫ్యూమ్ల మీద నిఘా. కారులో పొడవైన వెంట్రుకలు ఏమైనా దొరుకుతాయేమోనని కూంబింగ్. ఆధార్ కార్డులో అరవై ఏళ్లు పైబడ్డాయని గవర్నమెంట్ ప్రూఫ్ దొరికితే తప్ప పనిమనిషిగా అపాయింట్మెంట్ లెటర్ హాండోవర్ చేయదు. ఇంత డౌట్ చేసేస్తోంది కదా నిజం చేసేద్దామా అని ఒక్కోసారి అనిపిస్తుంది. బాబోయ్. అంత ధైర్యమా. డౌట్‌తో చస్తున్నాను. అనుమానంతో చచ్చిపోనూ? - భా.బా (భార్యా బాధితుడు) తా.క: దయచేసి నా ఫోన్ నంబర్ ఇవ్వొద్దని మనవి. నా ఏడుపు నాకుంది. సాటి మగవాళ్ల ఏడుపు వినలేను. సారీ... హెల్ప్ ప్లీజ్: ఇది అచ్చయిన రోజు పేపర్ మా ఇంటికి రాకుండా చూడగలరా. కొంచెం భయంగా ఉంది. -
చేతబడి చేస్తోందని కాల్చేశారు
-
చేతబడి చేస్తోందని కాల్చేశారు
చేతబడి అనుమానంతో ఒక మహిళను గుర్తుతెలియని వ్యక్తులు సజీవ దహనం చేశారు. ఈ ఘనట విశాఖపట్టణం జిల్లా డుమ్రిగూడ మండలం రాంసింగ్ గూడలో జరిగింది. మానవుడు అభివృద్ధి వైపు దూసుకుపోతున్నా.. మూడనమ్మకాలు ప్రజలను మూర్ఖులుగా మారుస్తుందని ఈ ఘటన నిరూపించింది. వివరాల్లోకి వెళితే.. గూడేనికి చెందిన రాజమ్మ (45) అనే మహిళ చేతబడి చేస్తోందన్న అనుమానంతో ఆమెను శనివారం సాయంత్రం ఇంట్లో సజీవ దహనం చేశారు. ఆమె ఉంటున్న గుడిసెకు నిప్పు పెట్టడంతో ఆమె మంటల్లో పడి మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
అనుమానంతో భార్యను నరికేశాడు..
మహబూబ్‌నగర్: అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యను కడతేర్చాడు ఓ కసాయి భర్త. మహబూబ్‌నగర్ జిల్లా మానవపాడు మండలంలో ఆదివారం రాత్రి జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పల్లెపాడు గ్రామానికి చెందిన ఆంజనేయుడు, పద్మ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. కొన్ని రోజులుగా భార్య ప్రవర్తనపై ఆంజనేయులు అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం అర్థరాత్రి నిద్రిస్తున్న భార్యను గొడ్డలితో నరికి చంపాడు. సోమవారం ఉదయం ఈ దారుణం వెలుగులోకి రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించనున్నారు. పోలీసులు ముందు జాగ్రత్తగా గ్రామంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. పరారీలో ఉన్న ఆంజనేయులు, అతని తల్లి కోసం గాలింపు చేపట్టారు. -
మళ్లీ ఇంజక్షన్ సైకో కలకలం!
-
భార్యను నరికి చంపిన భర్త
అనుమానంతో అమానుషం... అత్తాపూర్: అనుమానం పెనుభూతమైంది. భార్యపై అనుమానంతో ఓ కిరాతకుడు కత్తితో నరికి చంపాడు. రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం ఈ ఘటన జరిగింది. ఇన్స్పెక్టర్ ఉమేందర్ కథనం ప్రకారం... సిక్చౌహాని ప్రాంతానికి చెందిన షఫియాబేగం(25), గౌస్ భార్యాభర్తలు. తొమ్మిదేళ్ల క్రితం వీరికి పెళ్లైంది. నలుగురు పిల్లలు ఉన్నారు. కొద్ది రోజులుగా భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఇదే విషయమై భార్యతో ఐదురోజులుగా గొడవపడుతున్న గౌస్ ఎలాగైన ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. సోమవారం సాయంత్రం ఇంట్లో ఒంటరిగా ఉన్న షఫియాతో గొడపడి, కత్తితో మెడపై నరికి చంపి పారిపోయాడు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీ సులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి, గౌస్ కోసం గాలిస్తున్నారు. -
అనుమానంతో భార్యను కడతేర్చాడు
* మావోయిస్టు ప్రాంతంలో సంచలనం *ఆలస్యంగా వెలుగులోకి పాడేరు(జి.మాడుగుల) : అనుమానంతో కట్టుకున్న భార్యను అతికిరాతకంగా కత్తితో పొడిచి భర్త హతమార్చిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జి.మాడుగుల మండలంలోని మావోయిస్టు ప్రభావిత బొయితిలి పంచాయతీ దిగరాపల్లిలో సోమవారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది. మారుమూల ప్రాంతం కావడం, మంగళవారం సాయంత్రం మృతురాలి సోదరుడు ఏసేబు జి.మాడుగుల పోలీసుకు ఫిర్యాదు చేసే వరకు ఇది వెలుగులోకి రాలేదు. గ్రామానికి చెందిన బట్టి సత్యారావు(40) భార్యపై అనుమానంతో తరచూ తగాదా పడేవాడు. పలుమార్లు గ్రామ పెద్దలు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చినప్పటికి ఫలితం లేకపోయింది. సోమవారం సాయంత్రం భార్య బట్టి ముత్యమ్మ(34)తో ఘర్షణ పడిన సత్యారావు ఇంటిలో ఉన్న కత్తిని తీసుకొని ఆమె ఛాతి భాగంలో పొడిచాడు. అక్కడికక్కడే మృతి చెందింది. నిందితుడు పరారయ్యాడు. మృతురాలి సోదరుడు ఏసేబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ శేఖరం కేసు నమోదు చేశారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతం కావడంతో పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లలేకపోయారు. బుధవారం ఉదయాన్నే పోలీసు బలగాలతో సంఘటన స్థలానికి వెళతామని ఎస్ఐ తెలిపారు.