ముంబై: పిల్లలను ఎత్తుకుపోతున్నారనే అనుమానంతో కొంతమంది వ్యక్తులు ఆయుధాలతో సాధువులపై దాడి చేశారు. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని లవణ గ్రామంలో చోటు చేసుకుంది. ఐతే వీడియోలో ఒక కిరాణ దుకాణం వెలుపల కొందరూ సాధువులను కొట్టడం కనిపించింది.
కానీ పోలీసులు మాత్రం ఈ విషయమై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. వీడియోని పరిసీలించి వాస్తవాలను వెల్లడిస్తామని చెప్పారు. ఈ మేరకు పోలీసుల విచారణలో...ఉత్తరప్రదేశ్‌కు చెందిన నలుగురు సాధువులు కర్ణాటకలో బీజాపుర్ నుంచి ఆలయ పట్టణం పండర్‌పూర్‌కు వెళ్తుండగా బాలుడిని దారి అడిగారు. వాళ్లు పిల్లలను కిడ్నాప్ చేసే ముఠాకు చెందిన వారిగా అనుమానించి స్థానికులు ఈ దాడికి పాల్పడ్డారు.
వాస్తవానికి ఆ సాధువులు ఒక ఆలయం వద్ద ఆగిపోయి తిరిగి తమ ప్రయాణాన్ని పునః ప్రారంభిస్తున్నప్పుడూ ఈ ఘటన జరిగిందని. అదీకూడా ఎటువెళ్లాలని దిశ కోసం అడగడంతోనే ఈ ఘటనకు దారితీసినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే ఈ ఘటనను ఖండిస్తూ సాధువులతో ఇలాంటి అనుచిత ప్రవర్తనను రాష్ట్ర ప్రభుత్వం సహించదని అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఒక వీడియో సందేశంలో తెలిపారు. ఆయన 2020 ఘటనను ప్రస్తావిస్తూ...పాల్ఘర్‌లో సాధువుల హత్య కేసులో అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వ అన్యాయం చేసిందని, ప్రస్తుత మహారాష్ట్ర ప్రభుత్వం అలాంటి అన్యాయాన్ని సహించదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment