ఇటీవలి కాలంలో వీధికుక్కలు చిన్నపిల్లలపై దాడిచేస్తూ స్వైరవిహారం చేస్తున్న వార్తలు చదివి చాలా ఆందోళన చెందాం కదా. విశ్వాసానికి మారుపేరైన పెంపుడు కుక్కలు కూడా స్వయంగా యజమానిపై దాడి ఘటనలూ చేశాం. కానీ సాధారణంగా కుక్కలు యజమానులను ప్రేమిస్తాయి. ఆ మాటకొస్తే కాస్త గంజి పోయినా చాలు బోలెడంత విశ్వాసాన్ని ప్రదర్శిస్తాయి. చిన్న పిల్లలంటే ఇంకా మక్కువ చూపిస్తాయి. అవసరమైతే తమ ప్రాణాలకు తెగించి మరీ మనుషులను ఆదుకుంటాయి. తాజాగా కుక్కల మీద మనుషులకు విశ్వాసాన్ని పెంచే ఘటన ఒకటి మహరాష్ట్రలోని ముంబై చోటు చేసుకుంది
అత్యాచారానికి యత్నించిన వ్యక్తినుంచి 32 ఏళ్ల మహిళను వీధి కుక్క రక్షించిన ఘటన జూన్ 30న ముంబైలోని వసాయ్‌లో జరిగింది. మాణిక్‌పూర్ సందులో నడుచుకుంటూ వెళ్తున్న మహిళపై సందీప్ ఖోట్ అనే వ్యక్తి అత్యాచారానికి ప్రయత్నించాడు. అకౌంటెంట్ అయిన మహిళ ఇంటికి వస్తుండగా సందీప్ ఆమె వెంబడించాడు. నిర్మానుష్య ప్రదేశానికి వచ్చాక చంపేస్తాని బెదిరించి, నోరు నొక్కి కిందపడేశాడు. ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని ప్రయత్నించాడు. ఇంతలో ప్రమాదాన్ని పసిగట్టిన ఓ వీధికుక్క గట్టిగా అరవడం మొదలు పెట్టింది. దెబ్బకి భయపడిన అతగాడు, లేచి అక్కడినుంచి ఉడాయించాడు. అయితే పోతూ పోతూ ఆమె ఐఫోన్‌ను లాక్కొని పారిపోయాడు. దీంతో బాధిత మహిళ తప్పించుకుంది.
అనంతరం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆ ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజీని ఆధారంగా నిందితుడిని గుర్తించారు. అతడిని అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment