అమాయకులైన మైనర్‌బాలికలను మభ్యపెట్టి అత్యంత అమానుషంగా అత్యాచారాలకు పాల్పడుతున్న వైనానికి అద్దం పట్టిన ఘటన ఇది. అంతేకాదు సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తులను నమ్మడం, ప్రయాణాల్లో అపరిచితుల మాటలకు మోసపోవడం వల్ల జరిగే అనర్థాలకు నిదర్శనం కూడా. అసలు స్టోరీ ఏంటంటే..!
వివరాలు ఇలా ఉన్నాయి
అది 2021, అక్టోబరు 18.. ఒక టీనేజ్ బాలికను మాయ చేసి, నీచాతి నీచంగా అత్యాచారానికి పాల్పడిన ఘటనకు మౌన సాక్ష్యంగా నిలిచిన రాత్రి అది. ఈ కేసులో నేరస్తుడు పేరు 35 ఏళ్ల మహమ్మద్ సాదిక్ ఖత్రీ. ఏడు నెలలకు తనతో షేర్ చాట్‌లో మాట్లాడుతున్న స్నేహితుడిని కలవడానికి ముంబై బయలుదేరింది 16 ఏళ్ల బాధిత బాలిక. వల్సాద్‌లోని పార్డి తాలూకాలో నివసిస్తుంది . మహారాష్ట్రలోని భివాండికి చెందిన అబ్బాయితో షేర్‌చాట్‌లో పరిచయమైంది. ఇద్దరూ ఏడు నెలల పాటు మాట్లాడుకున్నారు. తనను కలవాలని పట్టుబట్టడంతో ముంబైకి బయలుదేరింది. ఇక్కడే అమాయకంగా, బెరుకు బెరుకుగా కనిపించిన ఆ ‘లేడిపిల్ల’ పై కన్నేశాడు సాదిక్. ఆమెతో మాట కలిపి మాయ చేశాడు. బాలికను నమ్మించాడు.
వసాయ్ రైలు స్టేషన్‌లో ఆగినప్పుడు, అతను ఆమెను బలవంతంగా రైలు నుండి దింపేశాడు. ముంబైకి తాను దగ్గరుండి తీసుకెడతానంటూ హామీ ఇచ్చాడు. వెనుకా ముందూ ఆలోంచకుండా అతగాడిని నమ్మడమే ఆమె జీవితంలో తీరని బాధను మిగిల్చింది. ఖత్రీ బాలికను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లాడు. సెక్స్ ఉద్దీపన మాత్రలు వేసుకొని మరీ అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఐదు గంటల్లో మూడుసార్లు అత్యాచారం చేశాడు. ఆ తరువాత బాలికను అక్కడే వదిలేసి పారి పోయాడు. చివరకు ఆమె తన బంధువుకు సమాచారం ఇవ్వడంతో విషయం పోలీసులదాకా వెళ్లింది. ఫిర్యాదు అందిన వెంటనే నవ్‌సారి రూరల్ పోలీసులు అక్టోబర్ 24న ఖత్ర్ అరెస్టు చేశారు. ఆ సమయంలో అతని దగ్గర సిల్డెనాఫిల్ డ్రగ్స్ దొరికాయి. అతని దుస్తులపై రక్తపు మరకలను పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఘటనా స్థలంలో పోలీసులు ఫోరెన్సిక్ బృందం బాలిక జుట్టుతో పాటు ,హెయిర్‌పిన్ తదితర కీలక సాక్ష్యాలను కూడా సేకరించింది. దీంతో ప్రాసిక్యూషన్ సాదిక్‌ను నేరస్తుడిగా తేల్చింది.
తన కామాన్ని నెరవేర్చుకోవడానికి ఈ కేసు నిస్సహాయులను లేదా మైనర్లను వేటాడే వికృత మనస్తత్వాన్ని ప్రదర్శించిన వైనమని విచారణ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. సాదిక్‌కు చివరి శ్వాసదాకా జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. ఇలాంటి కేసుల (మైనర్ బాలికపై అత్యాచారం కేసు) విచారణ సందర్భంగా న్యాయస్థానం శిక్షాస్మృతిలో మెతక వైఖరిని అవలంబించకూడదని కోర్టు పేర్కొంది. అంతేకాదు బాధితురాలు తరచూ తల్లిదండ్రులకు, పోలీసులకు, న్యాయవాదులకు, కోర్టుకు తాను పడిన శారీరక బాధను, కష్టాన్ని అనేకసార్లు వివరించవలసి వస్తుంది, ఇది ఆమెకు తీవ్ర మనోవేదనకు గురిచేస్తుందని కూడా, సున్నితంగా వ్యవహరించాలని కూడా కోర్టు సూచించింది. సమాజంలో మైనర్లపై లైంగిక వేధింపుల కేసులు పెరుగు తున్నప్పుడు, బాధితుల బాధను, ఆవేదనను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment