
ముంబై: విమానంలో ఓ మహిళ.. తోటి ఇద్దరు ప్రయాణికులు, సీఐఎస్‌ఎఫ్ సిబ్బందిపై దాడికి తెగపడ్డారు. ఈ ఘటన శనివారం పుణెలోని లోహెగావ్ ఎయిర్‌పోర్టులో చోటు చేసుకుంది. ఉదయం 7. 45 గంటలకు పుణె నుంచి ఢిల్లీకి బయలుదేరే.. ఓ ప్రైవేటు విమానంలో బోర్డింగ్ ప్రాసెస్ సమయంలో ఓ మహిళ దాడికి తెడపడ్డారు. మొదట ఆ మహిళ ముందు సీట్లో ఉన్న ఇద్దరు ప్రయాణికులపై దాడి చేశారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి చోటుచేసుకుంది. వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి విమాన సిబ్బంది, సీఐఎస్‌ఎఫ్ కానిస్టెబుల్స్ ఆమె వద్దకు వచ్చారు.
దీంతో ఆమె మరింత రెచ్చిపోయి.. సీఐఎస్‌ఎఫ్ సిబ్బందిపై దాడి చేసింది. అనంతరం ఆ మహిళను, ఆమె భర్తను విమానం నుంచి దింపేశారు. ఆ మహిళను ఎయిర్ పోర్టు పోలీసులకు అప్పగించగా.. కేసు నమోదు చేశారు.
సీనియర్ ఇన్‌స్పెక్టర్ అజయ్ సంకేశ్వరి మాట్లాడుతూ.. విచారణ కోసం సదరు మహిళకు నోటీసు ఇచ్చి విడిచిపెట్టాం. ఎయిర్‌లైన్ సిబ్బంది, సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది,సహ ప్రయాణీకులు వాంగ్మూలాలను రికార్డు చేశాం’ అని చెప్పారు. వ్యక్తిగత అత్యవసర పరిస్థితి కారణంగా ఆమె తీవ్రమైన బాధలో ఉన్నట్లు గమనించామని, అందుకే ఆమె తోటి ప్రయాణికులతో వాగ్వాదానికి దిగారని ఓ సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment