
ప్రతీకాత్మక చిత్రం
రాంచీ: జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్‌లో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. దొంగతనం చేసి దొరికిపోయిన ఇద్దరు యువకులను స్థానికలు పట్టుకుని శిరోముండనం చేశారు. అనంతరం చెప్పుల దండలు మెడలో వేసి.. ఓ బురద గుంటలో నిల్చోబెట్టారు. ఈ దారుణ ఘటన రాజ్‌మహల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.
ఇద్దరు యువకులు ఓ మహిళ ఇంట్లో రూ.4300 దొంగతనం చేశారు. ఇందులో ఓ బాలుడు దొరికిపోయాడు. అతన్ని పట్టుకున్న స్థానికులు మరో బాలున్ని ఇంట్లో నుంచి లాక్కొచ్చారు. ఊర్లో అందరి సమక్షంలోనే సగం గుండు కొట్టించారు. అనంతరం చెప్పుల దండలు మెడలో వేసి, ఊరేగించారు. ఈ ఘటనను కొందరు యువకులు వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఇవి కాస్త వైరల్‌గా మారాయి.
ఈ ఘటనపై స్పందించిన పోలీసులు.. బాధితుల ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేశారు. పిల్లలను ఆరు గంటల పాటు బురదలోనే నిల్చొబెట్టారని బాధితుల తల్లిదండ్రులు ఆరోపించారు. రూ.3000 విధించిన జరిమానా చెల్లించిన తర్వాతనే పిల్లలను వదిలిపెట్టారని పోలీసులకు చెప్పారు. దర్యాప్తు కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు. దోషులపై కఠిన శిక్షలు విధిస్తామని వెల్లడించారు.
ఇదీ చదవండి: డ్రైవింగ్‌లో ‘భ్రాంతి’ ముప్పు!.. 50% రోడ్డు ప్రమాదాలకు కారణమిదే!
Comments
Please login to add a commentAdd a comment