
గంభీర్, సిద్ధార్థ్
చెన్నై : టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ బీజేపీలో జేఎన్‌యూ నాటిన మొక్కనా? అంటూ హీరో సిద్ధార్థ్ ట్విటర్ వేదికగా ప్రశ్నించాడు. ఇటీవల జై శ్రీరాం అనాలంటూ ఓ ముస్లిం యువకుడిపై గురుగ్రామ్‌లో అల్లరిమూకలు దాడి చేసిన సంగతి తెలిసిందే. కాగా తూర్పు ఢిల్లీ నుంచి బీజేపీ ఎంపీగా గెలిచిన గంభీర్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. నరేంద్ర మోదీ సబ్‌కా సాత్ , సబ్‌కా వికాస్, సబ్ కా విశ్వాస్‌తో తనకు లౌకికవాదంపై ఆలోచనలు పుట్టుకొచ్చాయని పేర్కొన్నారు. ఇకపై కులం, మతం పేరిట జరిగే దాడులన్నింటిపై గళమెత్తుతానని ట్విటర్ వేదికగా స్పష్టం చేశారు. అయితే హిందుత్వవాదులకు ఇది రుచించలేదు. దీంతో సోషల్ మీడియా వేదికగా గంభీర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఓ నెటిజన్ అయితే బీజేపీలో జేఎన్‌యూ గ్రూప్ నాటిన మొక్క గంభీర్ అని ఘాటుగా ట్వీట్ చేశాడు. ‘గౌతం గంభీర్ ఇప్పుడు సూడో సెక్యూలరిస్ట్, హిందూత్వ వ్యతిరేకుల ప్రియతమ నేత. సిగ్గుండాలి గంభీర్.. మధురులో 20 మంది ముస్లింలు ఒక హిందువును చంపినప్పుడు ఎక్కడికి పోయావు. అప్పుడెందుకు ట్వీట్ చేయలేదు. ఇవన్నీ చూస్తుంటే మిమ్మల్ని బీజేపీలో జేఎన్‌యూ నాటిన మొక్కగా అనిపిస్తుంది’ అని పేర్కొన్నాడు. ఈ ట్వీట్‌ను సిద్దార్థ్ రీట్వీట్ చేస్తూ.. ‘ హహ.. గంభీర్ భాయ్ ఇది నిజమా? అతి దేశభక్తులు మిమ్మల్ని జేఎన్‌యూ గ్రూప్ బీజేపీలో నాటిన మొక్క అంటున్నారు. నూతన భారత్ కోసం మీ గుండె, వెన్నుముక చూపినప్పుడు ఇలాంటివి జరుగడం మాములే. ఆల్‌దిబెస్ట్’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.
Haha! @GautamGambhir bhai, according to these hyper patriots, you've been planted by #JNU group in #BJP. This is what happens when you show a spine or a heart in #NewIndia. All the best! https://t.co/E1w6dT1c8w
— Siddharth (@Actor_Siddharth) May 28, 2019
ఇక గంభీర్ తీరును బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ సైతం తప్పుబట్టాడు.‘ ఓ వర్గంలో పాపులర్ అయ్యేందుకు కొంతమంది పన్నిన కుట్రలో చిక్కుకోవద్దు. మీరు ప్రకటనలు చేయాల్సిన పనిలేదు. మీరు చేసే పనులే మాట్లాడతాయి’ అంటూ ట్వీట్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment