న్యూఢిల్లీ: 1994లో దారుణ హత్యకు గురైన ఐఏఎస్ అధికారి జి.కృష్ణయ్య సతీమణి ఉమ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో దోషి, మాజీ ఎంపీ ఆనంద్ మోహన్‌ను బిహార్ ప్రభుత్వం జైలు నుంచి ముందస్తుగా విడుదల చేయడాన్ని ఆమె సవాల్ చేశారు. ఉరిశిక్షకు బదులు యావజ్జీక కారాగార శిక్ష పడిన వ్యక్తి జైల్లో ఉండాలని, కానీ బిహార్ ప్రభుత్వం నిబంధలనలు మార్చి విడుదల చేయడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఈమె ఇప్పటికే ప్రధాని మోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే.
తెలంగాణకు చెందిన ఐఏఎస్ అధికారి జి.కృష్ణయ్యను 1994లో బిహార్‌లో మూకదాడి చేసి దారుణంగా హత్య చేశారు. వీరికి ఆనంద్ మోహన్ నేతృత్వం వహించారు. ఈ కేసులో న్యాయస్థానం అతడ్ని దోషిగా తేల్చి కఠిన యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
అయితే బిహార్ ప్రభుత్వం ఏప్రిల్ 10న జైలు నిబంధలను మార్చింది. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని హత్య చేసిన వారిని కూడా విడుదల చేసేలా సవరణలు చేసింది. దీంతో 14 ఏళ్ల శిక్ష పూర్తి చేసుకున్న మోహన్ జైలు నుంచి విడుదల అయ్యేందుకు మార్గం సుగమం అయ్యింది. ఈయన విడుదలను ప్రతిపక్షాలు సహా ఐఏఎస్ అధికారులు సమాఖ్య తీవ్రంగా వ్యతిరేకించింది. బిహార్ ప్రభుత్వం మాత్రం వీటిని పట్టించుకోలేదు.
చదవండి: బీజేపీ ఎమ్మెల్యే హత్య కేసు.. బీఎస్పీ ఎంపీకి షాక్.. గ్యాంగ్‌స్టర్‌కు పదేళ్ల జైలు శిక్ష
Comments
Please login to add a commentAdd a comment