release from jail
-
భర్తను చంపిన వ్యక్తి విడుదల.. సుప్రీంకోర్టుకు ఐఏఎస్ అధికారి భార్య
న్యూఢిల్లీ: 1994లో దారుణ హత్యకు గురైన ఐఏఎస్ అధికారి జి.కృష్ణయ్య సతీమణి ఉమ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో దోషి, మాజీ ఎంపీ ఆనంద్ మోహన్‌ను బిహార్ ప్రభుత్వం జైలు నుంచి ముందస్తుగా విడుదల చేయడాన్ని ఆమె సవాల్ చేశారు. ఉరిశిక్షకు బదులు యావజ్జీక కారాగార శిక్ష పడిన వ్యక్తి జైల్లో ఉండాలని, కానీ బిహార్ ప్రభుత్వం నిబంధలనలు మార్చి విడుదల చేయడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఈమె ఇప్పటికే ప్రధాని మోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. తెలంగాణకు చెందిన ఐఏఎస్ అధికారి జి.కృష్ణయ్యను 1994లో బిహార్‌లో మూకదాడి చేసి దారుణంగా హత్య చేశారు. వీరికి ఆనంద్ మోహన్ నేతృత్వం వహించారు. ఈ కేసులో న్యాయస్థానం అతడ్ని దోషిగా తేల్చి కఠిన యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అయితే బిహార్ ప్రభుత్వం ఏప్రిల్ 10న జైలు నిబంధలను మార్చింది. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని హత్య చేసిన వారిని కూడా విడుదల చేసేలా సవరణలు చేసింది. దీంతో 14 ఏళ్ల శిక్ష పూర్తి చేసుకున్న మోహన్ జైలు నుంచి విడుదల అయ్యేందుకు మార్గం సుగమం అయ్యింది. ఈయన విడుదలను ప్రతిపక్షాలు సహా ఐఏఎస్ అధికారులు సమాఖ్య తీవ్రంగా వ్యతిరేకించింది. బిహార్ ప్రభుత్వం మాత్రం వీటిని పట్టించుకోలేదు. చదవండి: బీజేపీ ఎమ్మెల్యే హత్య కేసు.. బీఎస్పీ ఎంపీకి షాక్.. గ్యాంగ్‌స్టర్‌కు పదేళ్ల జైలు శిక్ష -
పది నెలల తర్వాత జైలు నుంచి విడుదలైన నవజ్యోత్ సింగ్ సిద్ధూ
ఛండీగఢ్: టీమిండియా మాజీ క్రికెటర్, పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. పది నెలల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు. 34 ఏళ్ల కిందటి నాటి ఓ కేసులో.. కిందటిఏడాది ఆయనకు జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాటియాలా జైలు నుంచి బయటకు రాగానే తాను మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం అప్రజాస్వామికమన్నారు. వాస్తవానికి ఈ కేసులో నవజ్యోత్ సింగ్ సిద్ధూకి ఏడాది శిక్ష విధించింది సుప్రీం కోర్టు. దాని ప్రకారం మే నెలలో ఆయన విడుదల కావాల్సి ఉంది. కానీ, శిక్షాకాలంలో సత్ప్రవర్తన కారణంగానే ఆయన ముందుగా విడుదల అవుతున్నట్లు జైలు అధికారులు వెల్లడించారు. ఆదివారాలు పోనూ, సత్ప్రవర్తన కింద 48 రోజుల్ని మినహాయించి.. ముందుగానే సిద్ధూను రిలీజ్ చేయబోతున్నారట. ఈ విషయాన్ని సిద్ధూ న్యాయవాది హెచ్‌పీఎస్ వర్మ కూడా ధృవీకరించారు. Will address the media outside patiala jail around noon.. — Navjot Singh Sidhu (@sherryontopp) April 1, 2023 1988, డిసెంబర్ 27వ తేదీన పాటియాలలో పార్కింగ్ విషయంలో జరిగిన ఓ గొడవలో నవజ్యోత్ సింగ్ సిద్ధూ, అతని స్నేహితుడు రూపిందర్ సింగ్సంధూలు.. ఓ వ్యక్తిని చితకబాదారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ బాధితుడు 65 ఏళ్ల గురునమ్ సింగ్ మరుసటిరోజు కన్నుమూశాడు. దీంతో బాధిత కుటుంబం కోర్టును ఆశ్రయించింది. సిద్ధూ, గురునమ్ తలపై బలంగా కొట్టాడని, ఆ గాయం కారణంగానే అతను చనిపోయాడని బాధిత కుటుంబం వాదించింది. ఈ మేరకు ప్రత్యక్ష సాక్షులు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. అయితే.. 2018లో సుప్రీం కోర్టు సిద్ధూ నేరాన్ని సాధారణమైందిగా ప్రకటిస్తూ.. వెయ్యి రూపాయల జరిమానా విధించింది. చివరకు బాధిత కుటుంబం మరోసారి కోర్టును ఆశ్రయించడంతో కిందటి ఏడాది తీర్పును సమీక్షించేందుకు అంగీకరించింది. ఈ క్రమంలో.. నేర తీవ్రత దృష్ట్యా సిద్ధూకి జైలు శిక్ష తప్పనిసరి అని అభిప్రాయపడ్డ కోర్టు, ఏడాది జైలు శిక్షను ఖరారు చేసింది. Telangana: కేంద్ర మంత్రి గడ్కరీ కీలక ప్రకటన -
తేల్తుంబ్డే విడుదల
ఎల్గార్ పరిషత్ కేసులో అరెస్టయిన విద్యావేత్త, సామాజిక కార్యకర్త ఆనంద్ తేల్తుంబ్డే (73) ఎట్టకేలకు జైలు నుంచి శనివారం విడుదలయ్యారు. ఆయనకు బాంబే హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలన్న ఎన్ఐఏ అభ్యర్థనను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టేసిన నేపథ్యంలో ముంబైలోని తలోజ కేంద్ర కారాగారం నుంచి తుంబ్డే విడుదలయ్యారు. ఆయన రెండున్నళ్లుగా జైలులోనే గడిపారు. ఈ కేసులో 16 మందిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. -
11 మంది జీవిత ఖైదీలు విడుదల... షాక్‌లో బాధితులు
సాక్షి అహ్మదాబాద్: గుజరాత్ అల్లర్ల సమయంలో ఒక కుటుంబంపై దాడి చేసి ఏడుగురుని హతమార్చి, ఒక మహిళపై సాముహిక అత్యాచారం చేసిన 11 మంది జీవిత ఖైదీలను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విషయం తెలిసిన బాధిత కుటుంబం ఆశ్చర్యపోయింది. ఈ మేరకు బాధిత కుటుంబం బిల్కిస్ బానో, ఆమె భర్త రసూల్ ఈ విషయమై మాట్లాడే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు. ఈ ఘోర సంఘటన జరిగి దాదాపు 20 ఏళ్లు అయ్యిందని తాను తన భార్య, ఐదుగురు కుమారులకు ఇప్పటి వరకు ఉండేందుకు ఇల్లు కూడా లేదని చెప్పాడు. గుజరాత్ ప్రభుత్వం తన రిమిషన్ పాలసీ ప్రకారం 11 మంది జీవిత ఖైదీలు విడుదల చేసేందుకు అనుమతివ్వడంతో వారు గోద్రా సబ్ జైలు నుంచి విడుదలయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం దేన్ని పరిగణలోని తీసుకుని వారిని విడుదల చేసిందనేది తమకు తెలియదని రసూల్ చెబుతున్నాడు. ఆ ఘటనలో తన కుమార్తెతో సహా చనిపోయిన వారి కోసం ప్రార్థనలు చేయడం తప్ప తాను ఇంకేమీ చేయలేనని ఆవేదనగా చెప్పాడు రసూల్. అసలేం జరిగిందంటే మార్చి 3, 2002న గోద్రా అనంతరం అల్లర్ల సమయంలో దాహుద్ జిల్లాలోని లిమ్ఖేడా తాలూకాలోని రంధిక్పూర్ గ్రామంలో బిల్కిస్ బానో కుంటుంబంపై ఒక గుంపు దాడి చేసింది. ఆ సమయంలో ఐదు నెలల గర్భిణి అయిన బిల్కిస్ పై సాముహిక అత్యాచారానికి పాల్పడటమే కాకుండా ఆ కుటుంబంలోని ఏడుగురిని పొట్టనబెట్టుకుంది ఆ దుండగుల గుంపు. దీంతో ముంబైలోని ప్రత్యేక సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కోర్టు జనవరి 21, 2008న ఆ నిందితులకు జీవిత ఖైదు విధించింది. ఐతే నిందితుల్లో ఒకరు విచారణ సమయంలో మరణించారు. ఆ తర్వాత బాంబే హైకోర్టు మే 3, 2017న సీబీఐ కోర్టు శిక్షను సమర్థించింది. అలాగే ఇదే కేసుకి సంబంధించి ఆధారాలను తారుమారు చేసే ప్రయత్నం చేసిన ఐదుగురు పోలీసులు, ఇద్దరు డాక్టర్లకు కూడా బాంబే హైకోర్టు శిక్ష విధించింది. అంతేకాదు 2019 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు బిల్కిస్ కుటుంబానికి దాదాపు రూ. 50 లక్షల పరిహారం, ఉద్యోగం, వసతి కల్పించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. బిల్కిస్ భర్త రసూల్ సుప్రీం కోర్టు రూ. 50 లక్షలు పరిహారం ఇచ్చిందని వాటితోనే కొడుకుని చదివించుకుంటున్నట్లు తెలిపాడు. కానీ ఉద్యోగం ఇల్లు ఇప్పించలేదని రసూల్ చెబుతున్నాడు. ఈ కేసుకు సంబంధించి నిందితులు... జస్వంత్‌భాయ్ నాయ్, గోవింద్‌భాయ్ నాయ్, శైలేష్ భట్, రాధేశ్యామ్ షా, బిపిన్ చంద్ర జోషి, కేసర్‌భాయ్ వోహానియా, ప్రదీప్ మోర్ధియా, బకాభాయ్ వోహానియా, రాజుభాయ్ సోనీ, మితేష్ భట్, రమేశ్ చందనా అనే 11 మంది ఖైదీలను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ఆ నిందితులు మాట్లాడుతూ...తాము దోషులుగా నిర్థారింపబడి సుమారు 14 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాము. విడుదల చేయమని సుప్రీం కోర్టుని ఆశ్రయించాం. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు గుజరాత్ ప్రభుత్వ మమ్మలని విడుదల చేసింది. ప్రస్తుతం మేము మా కుటుంబాలను కలుసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తామని ఆనందంగా చెబుతున్నారు. (చదవండి: బస్సుని ఢీ కొట్టిన ఆయిల్ ట్యాంకర్... 20 మంది సజీవ దహనం) -
సుధా భరద్వాజ్.. జైలు నుంచి విడుదల
ముంబై: ఎల్గార్ పరిషత్–మావోయిస్టులతో సంబంధాల కేసులో అరెస్టయిన ప్రముఖ మహిళా న్యాయవాది, సామాజిక కార్యకర్త సుధా భరద్వాజ్(60) గురువారం జైలు నుంచి విడుదలయ్యారు. మూడేళ్లకు పైగా ఆమె జైలు జీవితం గడిపిన ఆమెకు బాంబే హైకోర్టు డిసెంబర్ 1న డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ కండీషన్‌తో పాటు ఆమెను ఎప్పుడు విడుదల చేయాలన్నది ఎన్ఐఏ ప్రత్యేక కోర్టే నిర్ణయిస్తుందని తెలిపింది. హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎన్ఐఏ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఎన్ఐఏ అప్పీల్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కాగా, రూ. 50 వేల పూచీకత్తుతో సుధా భరద్వాజ్‌ను విడుదల చేయాలని ప్రత్యేక కోర్టు బుధవారం ఆదేశించింది. ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత, భరద్వాజ్ గురువారం మధ్యాహ్నం బైకుల్లా మహిళా జైలు నుంచి విడుదలయ్యారు. కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సాగించిన కుట్రలో భాగస్వామిగా మారారని ఆరోపిస్తూ వరవరరావు, సుధా భరద్వాజ్ సహా 16 మంది సామాజిక కార్యకర్తలు, మేధావులను 2018 ఆగస్టులో ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. (Nagaland Firing: డ్రెస్ మార్చి, మృతదేహాల దగ్గర ఆయుధాలు పెట్టబోయారు) -
జైలు నుంచి ఆర్యన్ ఖాన్ విడుదల
-
ఆర్యన్ ఖాన్ విడుదల.. ఇప్పటివరకు ఏం జరిగిందంటే?
Aryan Khan Released from Arthur Road Jail: డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్ జైలు నుంచి విడుదలయ్యారు. ఇప్పటికే ఆర్థర్ రోడ్ జైలు వద్దకు చేరుకున్న షారుక్ ఖాన్ కొడుకును ఇంటికి తీసుకురానున్నారు. దీంతో మన్నత్‌లో సందడి వాతావరణం నెలకొంది. 28రోజుల జైలు జీవితం అనంతరం ఆర్యన్ బయటకు వచ్చారు. దీంతో ఆయనకు స్వాగతం పలికేందుకు షారుక్ అభిమానులు భారీగా మన్నత్‌కు చేరుకున్నారు. 'వెల్కం ఆర్యన్' అంటూ పోస్టర్లు పట్టుకొని బాణసంచా కాల్చుతూ ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. కాగా ఈ నెల అక్టోబర్ 2వ తేదీన క్రూయిజ్ ఓడరేవులో జరుగుతున్న డ్రగ్స్ పార్టీలో పోలీసులు ఆకస్మిక దాడి జరపగా, అందులో ఆర్యన్‌తో పాటు మరో 8మందిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి దాదాపు 23 రోజుల అనంతరం ఆర్యన్‌కు షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది. దీని ప్రకారం ప్రతి శుక్రవారం ఎన్సీబీ ముందు ఆర్యన్ హాజరుకావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆర్యన్ దేశం వదిలి వెళ్లకూడదని కూడా బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఏం జరిగిందంటే.. ► అక్టోబర్ 2: ముంబై తీరంలోని గోవాకు చెందిన కొర్డెలియా క్రూయిజ్‌లో రేవ్‌పార్టీపై ఎన్సీబీ దాడులు చేసి షారూక్‌ఖాన్ కుమారుడు ఆర్యన్‌తో సహా 14 మందిని అదుపులోనికి తీసుకుంది. ► అక్టోబర్ 4: ఆ 14 మందిలో ఆర్యన్ సహా ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్టు ఎన్సీబీ ప్రకటించింది. అక్టోబర్ 7 వరకు నిందితులు ఎన్సీబీ కస్టడీలోనే ఉన్నారు ► అక్టోబర్ 7: ఎన్సీబీ ఇక కస్టడీ అవసరం లేదని చెప్పడంతో కోర్టు వారికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ► అక్టోబర్ 8: ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలుకి ఆర్యన్‌ని తరలించారు. మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది ► అక్టోబర్ 11: ఎన్డీపీఎస్ యాక్ట్ కింద ఏర్పాటైన ముంబై ప్రత్యేక కోర్టులో బెయిల్ పిటిషన్ సమర్పించారు ► అక్టోబర్ 13–20: ఆ కోర్టులోనూ బెయిల్ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. చివరికి 20వ తేదీన ఆర్యన్‌కు బెయిల్ తిరస్కరించింది. ► అక్టోబర్ 21: ఆర్థర్ రోడ్డు జైలులో ఉన్న ఆర్యన్‌ను షారూక్‌ఖాన్ కలుసుకున్నారు. ఆర్యన్ జ్యుడీషియల్ కస్టడీని అక్టోబరు 30 వరకు పొడిగించారు ►అక్టోబర్ 26–28: బాంబే హైకోర్టులో బెయిల్ పిటిషన్‌పై వాదనలు ► అక్టోబర్ 28: ఆర్యన్‌ఖాన్, ఇద్దరు సహ నిందితులకు బెయిల్ మంజూరు చదవండి: ఆర్యన్ బెయిల్ కోసం చట్టపరమైన బాధ్యత తీసుకున్న ప్రముఖ నటి -
19 ఏళ్ల తర్వాత స్వేచ్ఛ: ‘బతికుండగా బయటకు వస్తాననుకోలేదు’
వాషింగ్టన్: 19 సంవత్సరాల నుంచి ఎటువంటి నేరారోపణలు లేకుండా గ్వాంటినామో బేలోని నిర్బంధ కేంద్రంలో ఉన్న మోరాకో వ్యక్తిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ యంత్రాంగం సోమవారం విడుదల చేసింది. బైడెన్ యంత్రాంగం విడుదల చేసిన ఈ మొదటి వ్యక్తి పేరు అబ్దుల్ లతీఫ్ నాజీర్(56). ఎలాంటి నేరం చేయకపోయినప్పటికి అబ్దుల్ గత 19 ఏళ్లుగా జైల్లోనే మగ్గుతున్నాడు. చనిపోయేంత వరకు విముక్తి లభించదని భావించిన లతీఫ్.. జైలు నుంచి విడుదల కావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నాడు. బైడెన్ యంత్రాగానికి కృతజ్ఞతలు తెలియజేశాడు. అబ్దుల్ లతీఫ్ విడుదల సందర్భంగా డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఓ ప్రకటన చేసింది. ‘‘2016లో ది పిరియాడిక్ రివ్యూ బోర్డ్ ప్రక్రియ ప్రకారం యుద్ధ నిర్బంధ చట్టం కింద అరెస్ట్ అయిన అబ్దుల్ లతీఫ్ నాసిర్ వల్ల అమెరికా జాతీయ భద్రతకు ఎలాంటి ముప్పు లేదని తేల్చడం జరిగింది. కనుక అతడిని ఇంకా నిర్బంధంలో ఉంచాల్సిన అవసరం లేదని ప్రభుత్వ నిర్ణయించింది’’ అని తెలిపింది. జైలు జనాభాను తగ్గించేందకు అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగా సత్ప్రవర్తిన కలిగిన వారిని, ఎలాంటి నేరారోపణ లేకుండా జైలులో ఉన్న వారిని విడుదల చేసి.. తమ స్వస్థాలాలకు పంపి.. వారిపై నిఘా ఉంచాలని తెలిపారు. అబ్దుల్ లతీఫ్ విడుదల బైడెన్ ప్రయత్నానికి మొదటి సంకేతంగా నిలిచింది. అబ్దుల్ లతీఫ్ నాజర్ 19 ఏళ్ల క్రితం అఫ్గనిస్తాన్‌లో అమెరికా సైన్యానకి పట్టుబడ్డాడు. అధికారులు ఇతడిని తాలిబన్ సభ్యుడని.. అల్ ఖైదాలో శిక్షణ పొందాడని ఆరోపిస్తూ.. అరెస్ట్ చేసి.. జైలులో ఉంచారు. అయితే నాజీర్‌ను ఐదేళ్ల క్రితమే గ్వాంటనామో బే నుంచి విడుదల చేసేందుకు ఆమోదం లభించింది. జూలై 2016లోనే సమీక్ష బోర్డు అబ్దుల్ని స్వదేశానికి పంపాలని సిఫార్సు చేసింది. కానీ అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించడంతో అబ్దుల్ గ్వాంటనామోలోనే ఉండి పోవాల్సి వచ్చింది. బైడెన్ నిర్ణయం వల్ల అబ్దుల్‌కు 19 సంవత్సరాల తర్వాత విముక్తి లభించింది. -
నేడు శశికళ విడుదల
బెంగళూరు: తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఆప్తురాలు వీకే శశికళ ఈ రోజు జైలు నుంచి విడుదల కానున్నారు. ప్రస్తుతం ఆమె కోవిడ్ బారిన పడటంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే బుధవారం ఆమెకు పూర్తి విడుదల కలుగుతుందని, దానికి సంబంధించిన తంతు అంతా ఆస్పత్రిలోనే పూర్తి చేస్తామని అధికారులు ప్రకటించారు. ఈ నెల 20న ఆమెకు కరోనా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఆస్పత్రి నుంచి ఎప్పుడు విడుదలవుతారనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతం ఆమెకు కరోనా లక్షణాలేమీ లేవని, చికిత్స కొనసాగుతోందని వైద్యులు ప్రకటించారు. కోవిడ్ నిబంధనల ప్రకారం ఆమె మరో 10 రోజుల పాటు ఆస్పత్రిలో కొనసాగే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు. -
రహస్యంగా మసూద్ విడుదల
ఇస్లామాబాద్: పాకిస్తాన్ తన వక్రబుద్ధిని మరోసారి చాటుకుంది. 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్న పుల్వామా దాడుల అనంతరం వాటికి బా«ధ్యత వహించిన జైషే మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ సహా ఎందరినో అదుపులోకి తీసుకున్నట్టు ప్రకటించిన పాక్ ఇప్పుడు తన దారి మార్చుకుంది. అజర్‌ని మూడో కంటికి తెలీకుండా రహస్యంగా జైలు నుంచి విడుదల చేసింది. అజర్ ప్రస్తుతం పాక్ జైల్లో లేడని, భవల్పూర్లో జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయంలో ఉన్నట్టుగా భారత్ ఇంటెలిజెన్స్‌కి సమాచారం అందింది. కశ్మీర్లో అల్లకల్లోలం సృష్టించడానికి, భారత్‌లో భారీగా దాడులకు పాక్ కుట్ర పన్నుతున్నట్టు భద్రతా అధికారులు వెల్లడించారు. కశ్మీర్లోకి చొరబడడం, ఈ ఉగ్రవాద కార్యకలాపాలను పర్యవేక్షించడం, కశ్మీర్లో ఘర్షణలు రేగేలా ఉగ్రవాదులకు దిశానిర్దేశం చేయడం వంటి వాటి కోసం పాక్ అజర్‌ను విడుదల చేసినట్టుగా తెలుస్తోంది. జైషేప్రధాన కార్యాలయంలో అజర్, ఆయన సోదరులు, సంస్థకి చెందిన ఇతర సభ్యులు దాడులకు వ్యూహాలను రచిస్తున్నట్టు భారత్‌కు ఉప్పందింది. అజర్‌ను ఇటీవల భారత్ ఉగ్రవాది ప్రకటించిన విషయం తెలిసిందే. -
మతతత్వ శక్తులను తరిమికొడతా.. లాలూ హెచ్చరిక
మతతత్వ శక్తులను తరిమికొడతానని ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ హెచ్చరించారు. దాణా కుంభకోణం కేసులో రెండున్నర నెలల కిందట జైలు పాలైన ఆయన, సోమవారం బెయిలుపై విడుదలయ్యారు. రాంచీలోని బిర్సాముండా జైలు నుంచి బయటకు వస్తూనే మతతత్వ శక్తులపై విరుచుకుపడ్డారు. ఢిల్లీలో అధికారం కోసం నరేంద్ర మోడీ, బీజేపీ, ఆరెస్సెస్‌లు కంటున్న కలలను సాకారం కానివ్వబోమని అన్నారు. జైలు వద్ద మీడియాతో మాట్లాడుతూ, ‘మతతత్వ శక్తులు ఢిల్లీపై పట్టు బిగించాలని కోరుకుంటున్నాయి. నేను బయటకు వచ్చాను. వాటిని తరిమికొడతాను. లౌకిక శక్తుల బలోపేతానికి దేశమంతటా పర్యటిస్తాను’ అని అన్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీ గురించి మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా, ‘నరేంద్ర మోడీ కానీ, మరే మోడీ అయినా కానీ... ఇప్పుడు నేను బయటకు వచ్చా... నేను రెడీ’ అని వ్యాఖ్యానించారు. ‘జబ్ తక్ రహేగా ఆలూ...’: జైలు నుంచి విడుదలైన తర్వాత తామార్లోని దేవరీ ఆలయం వద్ద విలేకర్లతో మాట్లాడారు. ‘నేను జైలుకు వెళ్లినపుడు నా పని అయిపోయిందని కొందరు అనుకున్నారు. కానీ వాళ్లు ఒకటి గుర్తుంచుకోవాలి. జబ్ తక్ రహేగా ఆలూ.. తబ్ తక్ రహేగా లాలూ (బంగాళదుంపలు ఉన్నంత వరకు లాలూ ఉంటాడు)’ అని వ్యాఖ్యానించారు.