Aryan Khan Released from Arthur Road Jail: డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్ జైలు నుంచి విడుదలయ్యారు. ఇప్పటికే ఆర్థర్ రోడ్ జైలు వద్దకు చేరుకున్న షారుక్ ఖాన్ కొడుకును ఇంటికి తీసుకురానున్నారు. దీంతో మన్నత్‌లో సందడి వాతావరణం నెలకొంది. 28రోజుల జైలు జీవితం అనంతరం ఆర్యన్ బయటకు వచ్చారు. దీంతో ఆయనకు స్వాగతం పలికేందుకు షారుక్ అభిమానులు భారీగా మన్నత్‌కు చేరుకున్నారు. 'వెల్‌కం ఆర్యన్' అంటూ పోస్టర్లు పట్టుకొని బాణసంచా కాల్చుతూ ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు.
కాగా ఈ నెల అక్టోబర్ 2వ తేదీన క్రూయిజ్ ఓడరేవులో జరుగుతున్న డ్రగ్స్ పార్టీలో పోలీసులు ఆకస్మిక దాడి జరపగా, అందులో ఆర్యన్‌తో పాటు మరో 8మందిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి దాదాపు 23 రోజుల అనంతరం ఆర్యన్‌కు షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది. దీని ప్రకారం ప్రతి శుక్రవారం ఎన్సీబీ ముందు ఆర్యన్ హాజరుకావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆర్యన్ దేశం వదిలి వెళ్లకూడదని కూడా బాంబే హైకోర్టు స్పష్టం చేసింది.
ఇప్పటివరకు ఏం జరిగిందంటే..
► అక్టోబర్ 2: ముంబై తీరంలోని గోవాకు చెందిన కొర్‌డెలియా క్రూయిజ్‌లో రేవ్‌పార్టీపై ఎన్‌సీబీ దాడులు చేసి షారూక్‌ఖాన్ కుమారుడు ఆర్యన్‌తో సహా 14 మందిని అదుపులోనికి తీసుకుంది.
► అక్టోబర్ 4: ఆ 14 మందిలో ఆర్యన్ సహా ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్టు ఎన్‌సీబీ ప్రకటించింది. అక్టోబర్ 7 వరకు నిందితులు ఎన్‌సీబీ కస్టడీలోనే ఉన్నారు
► అక్టోబర్ 7: ఎన్‌సీబీ ఇక కస్టడీ అవసరం లేదని చెప్పడంతో కోర్టు వారికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
► అక్టోబర్ 8: ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలుకి ఆర్యన్‌ని తరలించారు. మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది
► అక్టోబర్ 11: ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద ఏర్పాటైన ముంబై ప్రత్యేక కోర్టులో బెయిల్ పిటిషన్ సమర్పించారు
► అక్టోబర్ 13–20: ఆ కోర్టులోనూ బెయిల్ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. చివరికి 20వ తేదీన ఆర్యన్‌కు బెయిల్ తిరస్కరించింది.
► అక్టోబర్ 21: ఆర్థర్ రోడ్డు జైలులో ఉన్న ఆర్యన్‌ను షారూక్‌ఖాన్ కలుసుకున్నారు. ఆర్యన్ జ్యుడీషియల్ కస్టడీని అక్టోబరు 30 వరకు పొడిగించారు
►అక్టోబర్ 26–28: బాంబే హైకోర్టులో బెయిల్ పిటిషన్‌పై వాదనలు
► అక్టోబర్ 28: ఆర్యన్‌ఖాన్, ఇద్దరు సహ నిందితులకు బెయిల్ మంజూరు
చదవండి: ఆర్యన్ బెయిల్ కోసం చట్టపరమైన బాధ్యత తీసుకున్న ప్రముఖ నటి
Comments
Please login to add a commentAdd a comment