
బెంగళూరు: తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఆప్తురాలు వీకే శశికళ ఈ రోజు జైలు నుంచి విడుదల కానున్నారు. ప్రస్తుతం ఆమె కోవిడ్ బారిన పడటంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే బుధవారం ఆమెకు పూర్తి విడుదల కలుగుతుందని, దానికి సంబంధించిన తంతు అంతా ఆస్పత్రిలోనే పూర్తి చేస్తామని అధికారులు ప్రకటించారు. ఈ నెల 20న ఆమెకు కరోనా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఆస్పత్రి నుంచి ఎప్పుడు విడుదలవుతారనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతం ఆమెకు కరోనా లక్షణాలేమీ లేవని, చికిత్స కొనసాగుతోందని వైద్యులు ప్రకటించారు. కోవిడ్ నిబంధనల ప్రకారం ఆమె మరో 10 రోజుల పాటు ఆస్పత్రిలో కొనసాగే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment