
ఎల్గార్ పరిషత్ కేసులో అరెస్టయిన విద్యావేత్త, సామాజిక కార్యకర్త ఆనంద్ తేల్‌తుంబ్డే (73) ఎట్టకేలకు జైలు నుంచి శనివారం విడుదలయ్యారు.
ఆయనకు బాంబే హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలన్న ఎన్‌ఐఏ అభ్యర్థనను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టేసిన నేపథ్యంలో ముంబైలోని తలోజ కేంద్ర కారాగారం నుంచి తుంబ్డే విడుదలయ్యారు. ఆయన రెండున్నళ్లుగా జైలులోనే గడిపారు. ఈ కేసులో 16 మందిని ఎన్‌ఐఏ అరెస్ట్ చేసింది.